ఆర్థికశాఖ నాణాలు-ఆర్బీఐ కరెన్సీ నోట్లు
- ఆధునిక కాలంలో స్వతంత్ర సార్వభౌమ దేశాలన్నింటిలోను కేంద్ర బ్యాంకు అనేది ముఖ్యమైన ద్రవ్య సంస్థగా చెప్పవచ్చు.
- ఆయా దేశాల్లో బ్యాంకింగ్ కార్యకలాపాలన్నింటిని, దేశ ఆర్థిక విధానాలను అమలు చేయడంలో కేంద్ర బ్యాంకు ప్రముఖ పాత్ర పోషిస్తుంది.
- అగ్ని, చక్రానికి దీటుగా ప్రపంచంలోని మూడో ముఖ్య సంస్థగా ‘విల్‌రోజర్స్’ అనే ప్రముఖుడు కేంద్ర బ్యాంకును అభివర్ణించాడు.
- భారతదేశంలో ఉన్న కేంద్ర బ్యాంకు ‘రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా’గా ప్రసిద్ధి చెందింది.
- భారతదేశంలో బ్యాంకింగ్ వ్యవస్థను పరిచయం చేసింది ఆంగ్లేయులే కాబట్టి ఇంగ్లండ్‌లోని ‘బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్’ నమూనాలోనే ఆర్బీఐ ఏర్పడింది.
భారతీయ రిజర్వుబ్యాంకు -విధులు (Functions of RBI)
- రిజర్వుబ్యాంకు విధులు రెండు విధాలుగా చెప్పవచ్చు.
1. సాధారణ / సంప్రదాయ విధులు
2. అభివృద్ధి పరమైన / ప్రోత్సాహక విధులు
1) సాధారణ / సంప్రదాయ విధులు
- ఆర్బీఐ సాధారణ విధులు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ విధులను పోలి ఉన్నాయి.
ఎ) కరెన్సీ నోట్ల ముద్రణ, జారీచేయడం - భారతదేశంలో ద్రవ్యాన్ని ముద్రించే అధికారం ఆర్బీఐ, భారత ప్రభుత్వం కలిగి ఉన్నాయి.
- భారత దేశంలోని ద్రవ్యం కరెన్సీ నోట్లు, నాణాల రూపంలో ఉంటాయి.
- ఒక రూపాయి నోటును, అన్ని నాణేలను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ముద్రిస్తుంది. కానీ వాటిని పంపిణీ చేసే బాధ్యత ఆర్బీఐకి అప్పగించింది.
- ఒక రూపాయి నోటుపైన కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంతకం ఉంటుంది. ప్రస్తుతం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి టి.వి. సోమనాథన్
- భారతదేశంలో ఈ నాణాలను ముద్రించే కేంద్రాలను టంకశాలలుగా పిలుస్తారు.
- భారతదేశంలో ఈ నాణాలను ముద్రించే కేంద్రాలు నాలుగు ప్రదేశాల్లో ఉన్నాయి.
1) ముంబై
2) కోల్‌కతా
3) హైదరాబాద్
4) నోయిడా - 1906, 2011 కాయినేజ్ చట్టం ప్రకారం నాణాలు ముద్రించే అధికారం ప్రభుత్వానికి ఉంది. ఈ నాణాలు రెండు రకాలుగా ఉంటాయి.
స్మాల్ కాయిన్స్ : 50 పైసల లోపు నాణాలు
రూపి కాయిన్స్ : ఒక రూపాయి పైన గల నాణాలు - భారతదేశంలో మొట్టమొదటి సారిగా నాణాలను రూపొందించింది షేర్షా (1542-16వ శతాబ్దం). రూపీయా పేరుతో ప్రవేశ పెట్టారు. 1834లో రూపీ అనే పేరుతో బ్రిటిష్ ప్రభుత్వం కరెన్సీని ప్రవేశపెట్టింది.
- 1861లో రూపీని దేశ వ్యాప్తంగా బ్రిటిష్ ప్రభుత్వం ప్రామాణిక కరెన్సీగా ప్రవేశ పెట్టింది.
- కరెన్సీ నోట్ల ముద్రణ, జారీలో ఆర్బీఐకి గుత్తాధిపత్యం కలదు.
- 1934 చట్టం. 22వ సెక్షన్ కింద ఒక రూపాయి నోటు, నాణాలు తప్ప మిగతా కరెన్సీ నోట్లను ఆర్బీఐ ముద్రిస్తుంది.
- ఆర్బీఐ జారీచేసే ద్రవ్యం/ కరెన్సీ నోట్లు కొన్ని లక్షణాలు కలిగి ఉంటాయి.
- ఆర్బీఐ జారీచేసే ద్రవ్యం, చట్టబద్ధమైన ద్రవ్యం (Legal Tender Money) ఆర్బీఐ జారీ చేసే ద్రవ్యాన్ని IOU అని అంటారు. IOU అంటే I Owe You ‘నేను నీకు రుణ పడి ఉన్నాను’ అని అర్థం.
- ఆర్బీఐ ముద్రించే ద్రవ్యంపై ఆర్బీఐ గవర్నర్ సంతకం ఉంటుంది.
- ప్రస్తుతం ఆర్బీఐ గవర్నర్ శక్తి కాంత దాస్
- గతంలో ఆర్బీఐ 2, 5, 10, 20, 50, 100, 200, 500, 1000, 2000, 5000,10,000 నోట్లు ముద్రించేది.
- ప్రస్తుతం 10, 20, 50, 100, 200, 500, 2000 రూపాయల నోట్లు మాత్రమే ముద్రిస్తుంది.
- ఈ నోట్లపై 17 భాషలు ముద్రించి ఉంటాయి.
- నూతనంగా జారీచేసిన కరెన్సీ నోట్లపైన గాంధీజీ బొమ్మ (గాంధీసిరీస్) స్వచ్ఛభారత్ మిషన్ లోగో (గాంధీజీ కళ్ళజోడు)
- స్వచ్ఛ భారత్ మిషన్ నినాదం (ఏక్ కదం స్వచ్ఛతాకే ఓర్) ముద్రించి ఉంటాయి.
- భారతదేశంలో కరెన్సీ నోట్లను ముద్రించే కేంద్రాలు నాలుగు ఉన్నాయి.
1) నాసిక్ (మహారాష్ట్ర)
2) దేవాస్ ( మధ్యప్రదేశ్)
3) మైసూర్ (కర్ణాటక)
4) సాల్బణి (పశ్చిమ బెంగాల్ - ఆర్బీఐ నూతనంగా ద్రవ్యాన్ని జారీ చేసేటపుడు కొంత మొత్తాలను బంగారం, విదేశీ కరెన్సీ రూపంలో నిల్వలగా ఉంచాలి. అందులో ప్రధానంగా
2 పద్ధతులు ఉంటాయి.
1) అనుపాత నిల్వల పద్ధతి (Proportional Reserve System)
2) కనీస నిల్వల పద్ధతి (Minimum Reserve System) - 1956 కు ముందు అనుపాత నిల్వల పద్ధతి ఆధారంగా కరెన్సీ ముద్రణ జరిగేది.
- ఈ పద్ధతిలో ముద్రణ జారీ చేసిన కరెన్సీలో 40 శాతానికి సమానమైన బంగారం, విదేశీ కరెన్సీ రూపంలో ఆర్బీఐ వద్ద నిల్వ ఉంచాలి.
- ఈ పద్ధతిలో పెరిగే జనాభాకు అనుగుణంగా ద్రవ్య సప్లయి పెంచడం వీలుకాక పోవడం వల్ల 1956లో ఈ పద్ధతిని రద్దు చేశారు.
- ఆర్బీఐ చట్టం 1934ను 1956లో సవరించి కనీస నిల్వల పద్ధతిని 1956 నుంచి ప్రవేశ పెట్టారు.
- ఈ పద్ధతిలో ముద్రణ, జారీ చేసిన కరెన్సీలో 400 కోట్ల రూ.లకు సమానమైన బంగారం, విదేశీ కరెన్సీ నిల్వల రూపంలో ఆర్బీఐ వద్ద నిల్వ ఉంచాలి.
- 1957లో దీనిని సవరించి 200 కోట్ల రూ.కు తగ్గించారు. ఇందులో 115 కోట్ల రూ.కు సమానమైన బంగారం, 85 కోట్ల విదేశీ కరెన్సీ రూపంలో ఉంటుంది.
భారత్‌లో కరెన్సీ ముద్రణాలయాలు
- నాసిక్ సెక్యూరిటీ ప్రెస్ – మహారాష్ట్రలోని నాసిక్‌లో ఉంది. 1928లో దీన్ని స్థాపించారు. ఇక్కడ మొదట్లో 1 రూ. నుంచి 10. రూ. వరకు ముంద్రించారు. 2009 నుంచి 100 రూ. వరకు ముద్రిస్తున్నారు.
- నాసిక్ ఇండియన్ సెక్యూరిటీ ప్రెస్‌ను 1998లో మహారాష్ట్రలోని నాసిక్‌లో స్థాపించారు. ఇక్కడ పోస్టల్ మెటీరియల్, పోస్టల్ స్టాంపులు ఉత్పత్తి చేస్తారు.
- దేవాస్ బ్యాంక్ నోట్ ప్రెస్‌ను 1974లో మధ్యప్రదేశ్‌లోని దేవాస్‌లో స్థాపించారు. ఇక్కడ 20. రూ.లనుంచి 500 రూ. వరకు ముద్రిస్తారు.
- మైసూర్ బ్యాంక్ నోట్ ప్రెస్‌ను 1995లో కర్ణాటకలోని మైసూర్లో స్థాపించారు. ఇక్కడ 2005 నుంచి 500, 1000, 2000 రూ. నోట్లను ముద్రిస్తున్నారు. నోట్ల రద్దు తర్వాత 1000 నోట్ల ముద్రణ నిలిచిపోయింది.
- సాల్బణి కొత్త కరెన్సీ నోట్లను 1995 లో పశ్చిమబెంగాల్లో 500. 1000 రూ.ల నోట్లను, 2016 నుంచి 500, 2000 రూ.ల నోట్లను ముద్రిస్తున్నారు.
- హైదరాబాద్ సెక్యూరిటీ ప్రింటింగ్‌ప్రెస్‌ను 1982లో హైదరాబాద్‌లో స్థాపించారు. ఇక్కడ ఎక్సైజ్ డ్యూటీ స్టాంప్, దక్షిణాది రాష్ర్టాలకు పోస్టల్ మెటీరియల్‌ను, చెక్కులు, పత్రాలు పంపిణీ చేస్తారు.
- సెక్యూరిటీ పేపర్మిల్స్ను మధ్యప్రదేశ్‌లోని హొషంగాబాద్లో 1967-68 లో స్థాపించారు. ఇక్కడ కరెన్సీ నోట్లకు వాడే పేపర్‌ను ఉత్పత్తి చేస్తారు. 500, 1000, 2000 నోట్లకు వాడే పేపర్‌ను జర్మనీ నుంచి దిగుమతి చేసుకుంటారు.
- దేవాస్ ఇంక్ ఫ్యాక్టరీని మధ్యప్రదేశ్‌లోని దేవాస్‌లో స్థాపించారు. ఇక్కడ కరెన్సీ నోట్ల ముద్రణకు వాడే ఇంక్‌ను ఉత్పత్తి చేస్తుంది.
- ప్రపంచంలో తమ కరెన్సీకి సంకేతం కలిగిన దేశాలు 5 మాత్రమే
1) బ్రిటన్ – పౌండ్ –
2) యూఎస్ఏ – డాలర్- $
3) జపాన్ -యెన్-
4) యూరోపియన్ యూనియన్ –
యూరో-
5) భారతదేశం -రూపాయి-
2016 నవంబర్ 8న ప్రకటించిన డిమానిటైజేషన్ అనంతరం ఆర్బీఐ నూతనంగా జారీ చేసే కరెన్సీ నోట్లు వాటి జారీ, తేదీ, రంగు చిత్రాలు కింది విధంగా ఉన్నాయి.
- 2000 రూ. నోటును 2016 నవంబర్ 8న మెజంటా రంగులో మంగళయాన్ చిత్రంతో రూపొందించారు.
- 500 రూ.ల నోటును 2016 నవంబర్ 10న స్టోన్ గ్రే రంగులో ఎర్రకోట చిత్రంతో రూపొందించారు.
- 200 రూ.ల నోటును 2017 ఆగస్టు 25న బ్రైట్ ఎల్లో రంగులో సాంచీ స్థూపం చిత్రంతో రూపొందించారు.
- 100 రూ.ల నోటును 2018 నవంబర్ 20న లావెండర్ రంగులో రాణీ కా వావ్ చిత్రంతో రూపొందించారు.
- 50 రూ.ల నోటును 2017 నవంబర్ 10న ఫ్లోరోసెంట్ రంగులో హంపీ రథాలు చిత్రంతో రూపొందించారు.
- 20 రూ.ల నోటును 2019 ఏప్రిల్ 26న ఆరెంజ్ రెడ్ రంగులో ఎల్లోరా గుహలు చిత్రంతో రూపొందించారు.
- 10రూ.ల నోటును 2018 జనవరి 5న చాక్లెట్ రంగులో కోణార్క్ సూర్యదేవాలయం చిత్రంతో రూపొందించారు.
- 1953 నుంచి కరెన్సీ నోట్లపైన ఆశోక చక్రం భారత పార్లమెంటు బొమ్మలు ముద్రించేవారు.
- 1996 నుంచి వీటి స్థానంలో గాంధీజీ బొమ్మతో గాంధీ సిరీస్ నోటులు ముద్రించారు.
ప్రాక్టీస్ బిట్స్
1. అగ్ని, చక్రానికి దీటుగా ప్రపంచంలోని మూడో ముఖ్య సంస్థగా కేంద్రబ్యాంకును అభివర్ణించినది ఎవరు?
ఎ) విల్ రోజర్స్ బి) కిచ్ & ఎల్కిన్
సి) కెంట్ డి) ఆర్.ఎఫ్ సేయర్స్
2. భారతదేశంలోని ఆర్బీఐ ఏ దేశ బ్యాంక్ నమూనా ఆధారంగా రూపొందింది?
ఎ) బ్యాంక్ ఆఫ్ ఇటలీ
బి) బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్
సి) బ్యాంక్ ఆఫ్ జర్మనీ
డి) బ్యాంక్ ఆఫ్ అమెరికా
3. భారతదేశంలో ఒక రూపాయి నోటును ఎవరు ముద్రిస్తారు.
ఎ) ఆర్బీఐ
బి) కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ
సి) రాష్ట్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ
డి) భారత ప్రభుత్వం
4. భారతదేశంలో నాణాలను ముద్రించే కేంద్రాలను ఏమంటారు?
ఎ) టంకశాల (Mints)
బి) ముద్రణాలయాలు (Printing Press)
సి) ఎ, బి డి) ఆఫ్సెట్ ప్రింటర్
5. భారతదేశంలో నాణాలను ముద్రించే కేంద్రాలు కానివి ఏవి?
ఎ) ముంబై, కోల్‌కత
బి) హైదరాబాద్, నోయిడా
సి) మద్రాస్, ముంబై డి) ఎ, బి
6. స్మాల్ కాయిన్స్ అంటే
ఎ) 50 పైసల లోపు నాణాలు
బి) ఒక రూపాయి పైనగల నాణాలు
సి) ఎ, బి
డి) 50 పైసలపైన గల నాణేలు
7. భారతదేశంలో మొట్టమొదటిసారిగా నాణాలను రూపొందించినది ఎవరు?
ఎ) షేర్షా బి) అక్బర్
సి) ఔరంగజేబ్ డి) షాజహాన్
8. ప్రస్తుతం కరెన్సీ నోట్లపై ఎన్ని భాషలు ముద్రించి ఉంటాయి?
ఎ) 9 బి) 12 సి) 15 డి) 17
Previous article
మానవ రక్తంలో ప్లాస్మా ఎంత శాతం ఉంటుంది?
Next article
భూ ఆకర్షణకు లోబడి వచ్చే ఖగోళ పదార్థాలను ఏమంటారు?
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం