పారిశ్రామిక ఖాయిలా అంటే ఏమిటి..?
పారిశ్రామిక రంగం ఎదుర్కొంటున్న సమస్యల్లో పారిశ్రామిక ఖాయిలా (Industrial sickness) ప్రధానమైనది. 1983 నాటి సికా(sica) చట్టం నిర్వచనం ప్రకారం ఏదేని ఆర్థిక సంవత్సరానికి ఒక మధ్య తరహా లేదా భారీ పరిశ్రమలో పేరుకుపోయిన నష్టాలు ఆ కంపెనీ ఆస్తుల విలువను దాటితే దానిని ఖాయిలాపడిన పరిశ్రమ అంటారు. రిజిస్ట్రేషన్ చేసి ఏడేండ్లు పూర్తయిన కంపెనీకి వర్తిస్తుంది.
-ఇది చిన్నతరహా పరిశ్రమలకు కూడ స్వల్ప మార్పులతో వర్తిస్తుంది. ఖాయిలా పరిశ్రమలలో 99శాతం వరకు చిన్నతరహా పరిశ్రమలే ఖాయిలా పడ్డాయి.-2007 మార్చి నాటికి దేశంలో 1,71, 376 ఖాయిలా పరిశ్రమల్లో 3,396 యూనిట్లు తప్ప మిగిలినవి చిన్నతరహా పరిశ్రమలే.
కారణాలు
-బాహ్యకారణాలు: విద్యుత్ కోత, ప్రభుత్వ విధానాలలో ఆకస్మిక మార్పులు, ఉత్పాదకాల పంపిణీ సరిగా లేకపోవడం, డిమాండ్ కొరత.
-అంతర్గత కారణాలు: నాణ్యతలేని యంత్రపరికరాలు, నిర్వహణ సామర్థ్యం కొరవడటం, మార్కెటింగ్ వ్యూహాలు లేకపోవడం, వనరుల దుర్వినియోగం,
కార్మిక సమస్యలు
-ఖాయిలా సమస్య అధ్యయనానికి ఓంకార్ గోస్వామి కమి టీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ 1993 జూలైలో తన నివేదికను సమర్పించింది.
కమిటీ చేసిన సూచనలు
-ఖాయిలా పరిశ్రమలను తొలిదశలోనే గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలి.
-ఖాయిలాకు ప్రధాన కారకులు ప్రమోటర్లుగా గుర్తించారు.
-ఇలాంటి పరిశ్రమల పునరావాసం కంటే వాటిని మూసివేయడమే లాభం అని సూచించింది. ఫలితంగా ప్రభుత్వ ధనం దుర్వినియోగాన్ని రక్షించవచ్చు.
ప్రభుత్వ చర్యలు
-ఖాయిలా పరిశ్రమ పునరుద్ధరణ లక్ష్యంతో ప్రభుత్వం భారత పారిశ్రామిక పునర్నిర్మాణ కార్పోరేషన్ (IRCI) ను ఏర్పాటు చేసింది. 1985 IRCIను చట్టబద్ద కార్పొరేషన్‌గా రూపొందించి ఇండస్ట్రియల్ రీకన్స్ట్రక్షన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (IRBI) అని పేరు మార్చారు. తిరిగి 1997లో IRBIని పూర్తిస్థాయి ఆర్థిక సంస్థగా ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (IIBI)గా మార్చారు.
-ఖాయిలా పరిశ్రమలను ఆదుకునేందుకు ప్రభుత్వం తివారి కమిటీ సిఫారసుల మేరకు 1985లో పారిశ్రామిక ఖాయి లా కంపెనీల చట్టం (Sick industrial companies act- sica)ను రూపొందించింది.
-ఖాయిలా పరిశ్రమలను ఆదుకునేందుకు 1987 లో బోర్డ్ ఫర్ ఇండస్ట్రియల్ అండ్ ఫైనాన్సియల్ రీకన్స్ట్రక్షన్ (BIFA)ను ఏర్పాటు చేశారు.
-ఖాయిలా సమస్య పరిష్కారానికి ఆర్థిక సంస్కరణలో భాగంగా ఎగ్జిట్ పాలసీని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. పునరావాస చర్యలు తీసుకున్నా తిరిగి ఖాయిలాపడే అవకాశాలుంటే వాటిని మూసివేయడానికి ఎగ్జిట్ విధానం ఉపయోగపడింది.
-పరిశ్రమకు భారమైన ఉద్యోగులను తగ్గించుటకు స్వచ్ఛంద పదవీ విరమణ (VRS) పథకాన్ని తెచ్చారు. దీన్నే గోల్డెన్ షేక్‌హ్యండ్ పథకం అంటారు.
-ఖాయిలాపడ్డ ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగులకు పునరావసం కల్పించేందుకు 1992లో ప్రభుత్వం జాతీయ పునరుజ్జీవ నిధి (National renewal fund)ని ఏర్పాటు చేసింది.
కంపెనీల (రెండో సవరణ) చట్టం 2002:
సికా చట్టాన్ని రద్దు చేసి BIFR స్థ్ధానంలో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ను ఏర్పాటు చేయాలని బాలకృష్ణ ఏరాడి కమిటీ సిఫారసు చేసింది. సికా చట్టం స్థానంలో 2002 డిసెంబర్లో కంపెనీల(2వ సవరణ) చట్టం-2002 ను ఆమోదించారు.
-ఈ చట్టం ప్రకారం ఏదేని ఆర్థిక సంవత్సరానికి ఒక కంపెనీలో పేరుకుపోయిన నష్టాలు ఆ ఆర్థిక సంవత్సరానికి ముందు 4సంవత్సరాల కాలంలో ఆ కంపెనీ సగటు నికర విలువలో 50శాతం లేదా అంతకన్నా మించినప్పుడు ఆ కంపెనీని ఖాయిలా పడిన కంపెనీ అంటారు.
-రుణాలు డిమాండ్ చేసిన 9నెలల్లోగా వారికి రుణాన్ని చెల్లించలేని కంపెనీని ఖాయిలా కంపెనీ అంటారు.
-కంపెనీల (2వసవరణ) చట్టం కింద BIFRను రద్దుచేసి దాని స్థానంలో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT) ఏర్పాటు చేశారు. దీనికి ఒక అధ్యక్షుడు, 62 మంది వరకు సభ్యులను ప్రభుత్వం నియమిస్తుంది.
-ఒకవేళ ఖాయిలా కంపెనీ పునరుద్ధరణ అసాధ్యమని భావించిన ఆ కంపెనీలను మూసివేయించేందుకు ట్రిబ్యునల్‌కు అధికారాలున్నాయి. ఖాయిలా పరిశ్రమలను అమ్మివేసి రుణదాతలకు పంపిణీ చేసే అధికారం కూడా ఈ ట్రిబ్యునల్‌కు ఉంది.
పారిశ్రామిక పనితీరుకు ప్రోత్సాహం
-ప్రభుత్వం అనేక ఆర్థిక, పారిశ్రామిక సంస్కరణలను చేపట్టింది. ఫలితంగా ప్రపంచ బ్యాంకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 2018 నివేదికలో……
-మేక్ ఇన్ ఇండియా: భారతదేశాన్ని మ్యానుఫ్యాక్చరింగ్, రిసెర్చ్ & ఇన్నోవేషన్లకు ప్రపంచ హబ్‌గా తయారుచేయడం, ప్రపంచ సప్లయ్ చైన్‌లో అంతర్భాగంగా మార్చడం లక్ష్యంగా 2014 సెప్టెంబర్ 25న ఈ కార్యక్రమాన్ని ఆవిష్కరించారు.
-ఈ రంగాలను మేకిన్ ఇన్ ఇండియా 2.0 వెర్షన్ కింద కేంద్రీకరించిన రంగాలు క్యాపిటల్ గూడ్స్, ఆటో & ఆటో కంపోనెట్స్, రక్షణ, ఏరోస్పేస్, బయోటెక్నాలజీ, ఫార్మాసూటికల్స్, వైద్యపరికరాలు, రసాయనాలు, ఎలక్ట్రానిక్ సిస్టమ్ డిజైనర్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్, తోలు, పాదరక్షలు, టెక్స్టైల్స్ & అపెరల్స్, ఫుడ్ ప్రాసెసింగ్, రత్నాలు, ఆభరణాలు, నూతన, పునరుద్ధరణ ఇంధన వనరులు, నిర్మా ణం, షిప్పింగ్ & రైల్వేలు.
-మేధో సంపత్తి హక్కుల విధానం: మేధో హక్కులకు భవిష్యత్ మార్గాన్ని నిర్ధేశించేందుకు ప్రభుత్వం మే 2016లో మొదటిసారిగా ఒక సమగ్ర మేధోసంపత్తి హక్కుల విధానాన్ని చేపట్టింది.
-భారతీయ మేధో ఆవరణ వ్యవస్థను మెరుగుపరచడం. దేశంలో ఒక నవీకరణ ఉద్యమాన్ని తీసుకొచ్చే విశ్వాసాన్ని కలిగించడం క్రియేటివ్ ఇండియా, ఇన్నోవేటివ్ ఇం డియా దిశగా ముందుకు నడిపించడం ఈ విధాన లక్ష్యం.
-ఈ విధానాన్ని ఆమోదించడం, మేధోసంపత్తి హక్కుల ప్రోత్సాహక నిర్వహణ విభాగాన్ని (Cell for Intellectual property Rights promotion &management-CIPAM) ఏర్పాటు చేసిన తర్వాత మేథోసంపత్తి హక్కు, పేటెంట్ విషయాల్లో గణనీయమైన మార్పు కనిపించింది.
-కాపీరైట్స్‌ను మంజూరు చేశారు.
-స్టార్టప్ ఇండియా: మన దేశంలో యువ పారిశ్రామికవేత్తల్లో నవీకరణను, పారిశ్రామిక పోటీని ప్రోత్సహించే క్రమంలో 2015 ఆగస్టు 15న స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండి యా కార్యక్రమాన్ని ప్రకటించారు.
-స్టార్టప్ (అంకుర సంస్థ)ల స్థాపన, అభివృద్ధి కోసం ఒక మం చి వాతావరణాన్ని ఏర్పాటు చేయడం, ఆయా సంస్థలకు అవసరమైన సహాయ సహకారాలను అందించడం దీని ఉద్దేశం.
-19 కార్యాచరణ సూత్రాలతో స్టార్టప్ ఇండియా కార్యాచరణ ప్రణాళికను 2016 జనవరి 16న ఆవిష్కరించారు.
-స్టార్టప్ ఇండియా హబ్ మొత్తం స్టార్టప్ ఆవరణ వ్యవస్థకు ఏకైక కేంద్రబిందువుగా అభివృద్ధి చేశారు. నిధుల సమీకరణకు తోడ్పడటంతో పాటు విజ్ఞాన మార్పిడిని కూడా ప్రోత్సహిస్తుంది.
-స్టార్టప్‌లకు ఆర్థిక సహకారం కోసం రూ.10 వేల కోట్ల కార్పస్‌తో ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఫర్ స్టార్టప్ (FFS)ను ఏర్పాటు చేశారు. దీన్ని SIDBI నిర్వహిస్తుంది.
-బయో ఎంట్రప్రెన్యూర్షిప్, బయోక్లస్టర్స్, బయోఇంక్యూబేటర్స్, టెక్నాలజీ ట్రాన్స్ఫర్, ఆఫీసెస్ (TTO) బయోకనెక్ట్లను ప్రోత్సహించి వాటికి వసతి కల్చించే లక్ష్యంతో పరిశోధనా సంస్థలు, విశ్వవిద్యాలయాల్లో, కార్యాలయాలను స్థాపించారు.
-ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్: వాగ్ధాన పూర్వక పెట్టుబడి కేంద్రంగా భారతదేశ ప్రతిష్ట ప్రపంచవ్యాప్తంగా 2017-18లో
-డూయింగ్ బిజినెస్ బృందం మదింపు చేసిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రిపోర్ట్ 2019లో 190 దేశాలలో భారతదేశం 77వ ర్యాంకు సాధించింది. 2018లో 190 దేశాలలో భారతదేశం 100వ ర్యాంకులో ఉంది. ఏడాదిలో 23 ర్యాంకులు ఎగబాకింది.
-ఇందులో 10 సూచికలంటే నిర్మాణ అనుమతులు,రుణం పొందడం, మైనారిటీ ఇన్వెస్టర్లను పరిరక్షించడం, పన్నులు చెల్లింపు, కాంట్రాక్టులను అమలు చేయడం, ఇన్సాల్వెన్సీని పరిష్కరించడంలో భారత్ మెరుగుదలను చూపించింది.
పై సూచికల పెరుగుదలకు కింది అంశాలు దోహదపడ్డాయి.
-వస్తుసేవల పన్ను(GST), ఇన్సాల్వెన్సీ బ్యాంక్ రప్ట్స్ కోడ్ (IBC) వంటి నిర్మాణాత్మక సంస్కరణలతో పాటు ప్రభు త్వ సంస్కరణల చర్యలు, డీమానిటైజేషన్, ద్రవ్య విధానం ద్వారా ద్రవ్యోల్బణం లక్ష్యంగా ఏర్పాటు చేసిన యంత్రాం గం, ఆధార్ నమోదులో పురోగతి ప్రయోజనాలను లక్ష్యాలకు అనుగుణంగా వినియోగించడం, ప్రభుత్వ బ్యాంకుల రీక్యాపిటలైజేషన్ ప్రకటన వంటివి.
-ఇప్పటికే అనేక సంస్కరణలు, సరళీకరణలు పూర్తయినప్పటికీ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ బృందం వాటిని గుర్తించాలి. వాటిలో కొన్ని
1. నిర్మాణ అనుమతులు: ముంబై, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లలో ప్రొసీజర్లు కొన్ని తగ్గించారు. భవన నిర్మాణ సమయంలో అనుమతుల సమయ చట్టాన్ని 60 రోజులకు తగ్గించాలి.
2.సరిహద్దుల వెంబడి వర్తకం: వర్తకాన్ని సరళీకృతం చేయడానికి అనేక చర్యలు చేపట్టారు. వ్యవసాయ సరుకుల దిగుమతి క్లియరెన్సుల కోసం ఆన్లైన్ మెసేజ్ ఎక్సేంజ్ సంస్థ, దిగుమతి, ఎగుమతి డాక్యుమెంట్ల సంఖ్యను మూడుకు పరిమితం చేయడం, దిగుమతుల చెల్లింపు, సమర్ధవంతమైన పర్యవేక్షణ డేటా ప్రాసెసింగ్ కోసం ఇంపోర్ట్ డేటా ప్రాసెసింగ్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ (IDPMS)ను ఏర్పాటు చేయడం వంటి చర్యలు.
3. కాంట్రాక్టులను అమల్లోకి తేవడం: కాంట్రాక్టుల అమలును మెరుగుపరచడం కోసం పలు సంస్కరణలను చేపట్టడం జరిగింది. మహారాష్ట్ర, ఢిల్లీ, హైకోర్టులు కమర్షియల్ డివిజన్ బెంచ్‌లు ఏర్పాటు చేశాయి.
4. రుణాలు పొందడం: అందరు రుణగ్రహీతల కంటే సెక్యూర్డు క్రెడిటర్లకే ప్రాధాన్యత ఇవ్వాలని సవరించబడ్డ చట్టం సూచిస్తుంది. కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం లేదా స్థాని క సంస్థలకు చెల్లించవలసిన అన్ని రాబడులు, పన్నులు, సెస్‌లు, ఇతర రేట్లకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచిస్తుంది.
5. పన్నులు చెల్లించడం: పన్ను పరిధిని విస్తరించడం లక్ష్యంగా పన్ను విధానాలు మరింత పన్ను చెల్లింపుదారులకు అనుకూలంగా ఉండే విధంగా పన్ను సంస్కరణలను చేపట్టడం కోసం ప్రభుత్వం ర్యాపిడ్ (RAPID-revenue, accounttability, probity& information and digitalization) ప్రాజెక్టును ప్రవేశపెట్టింది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు