తుఫాన్ల వల్ల ఎక్కువగా నష్టపోయే రాష్ట్రం ఏది?
వేసవికాలం (మార్చి, ఏప్రిల్, మే)
-దేశంలో వేసవికాలం సంభవించడానికి ప్రధాన కారణం సూర్యుడు. సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించడం.
-ఉత్తరాయణకాలం (డిసెంబర్ 23-జూన్ 21)లో దేశంలో కర్కటరేఖపై సూర్యకిరణాలు నిట్టనిలువుగా పడతాయి.
-ఈ సమయంలో ఉత్తరార్ధగోళం సూర్యునికి అతిదగ్గరగా వస్తుంది. దీనివల్ల ఈ సమయంలో ఉత్తరార్ధగోళంలో పగటి సమయం అధికంగా ఉంటుంది.
నైరుతి రుతుపవన కాలం (జూన్ నుంచి సెప్టెంబర్ వరకు)
-సూర్యుడు జూన్ నెలలో కర్కటరేఖ ప్రాంతంలో ఉన్నప్పుడు ఆసియా ఖండం మీద ఉష్ణోగ్రత పెరుగుతుంది. అప్పుడు సైబీరియా ప్రాంతంలో అల్పపీడన కేంద్రం ఏర్పడుతుంది. అదే సమయంలో దిగువన ఉన్న హిందూ మహాసముద్రంపై అధిక పీడనం కేంద్రీకృతమై ఉంటుంది. కాబట్టి నీటి ఆవిరితో కూడిన పవనాలు హిందూమహాసముద్రంపై నుంచి సైబీరియా వైపు పయనిస్తూ దారిలో ప్రథమ దేశంగా ఉన్న భారతదేశానికి అధిక వర్షానిస్తాయి. మే నెల చివరి వారంలో లేదా జూన్ మొదటి వారంలో భూమధ్య రేఖను దాటి నైరుతి పవనాలుగా మారిన ఆగ్నేయ వ్యాపార పవనాలు హిందూ మహాసముద్రంపై నుంచి వీస్తూ కన్యాకుమారిఅగ్రం వింతైన ఆకారం వల్ల రెండు పాయలుగా విడిపోతాయి. అవి…
1.అరేబియా శాఖ పాయ
2. బంగాళాఖాతం శాఖ పాయ
-అరేబియా శాఖ ద్వారా రుతుపవనాలు జూన్ మొదటివారంలో పాల్ఘాట్ కనుమ ద్వారా కేరళ (మలబారు తీరం)లో ప్రవేశించి, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, మధ్యప్రదేశ్ మొదలైన రాష్ర్టాలపై పయనిస్తూ దక్కన్ పీఠభూమి మీదుగా వింద్య, సాత్పురా పర్వతాలను దాటి ఆరావళికి సమాంతరంగా ప్రయాణిస్తాయి. ఫలితంగా రాజస్థాన్‌లో అల్పవర్షపాతం నమోదవుతుంది.
గమనిక: రాజస్థాన్‌లో అల్ప వర్షపాతం నమోదయ్యే ప్రాంతం- జైసల్మీర్
-అదే సమయంలో బంగాళాఖాతం శాఖ ద్వారా రుతుపవనాలు మొదటగా భారత్‌లోని అండమాన్ నికోబార్ దీవుల్లోకి ప్రవేశిస్తాయి. ఈ శాఖ రుతుపవనాలు అండమాన్ నికోబార్ దీవుల నుంచి ఉత్తరానికి జరుగుతూ ఉన్నప్పు డు, ఆంధ్రప్రదేశ్ తీరం, ఒడిశా, పశ్చిమబెంగాల్ తీరాల మీదుగా మయన్మార్‌లోని ఆర్కాన్ యోమ పర్వతాల వద్ద అడ్డగించబడి ఈశాన్య రాష్ర్టాల్లోకి ప్రవేశిస్తాయి.
-ఈశాన్య రాష్ర్టాల్లో ఈ శాఖను అడ్డగించే కొండలు- ఖాసీ కొండలు (మేఘాలయా). ఖాసీ కొండలు అడ్డగించడం వల్ల అధిక పర్వతీయ వర్షపాతానికి గురయ్యే ప్రాంతాలు 1) మాసిన్రామ్ 2) చిరపుంజి (సొహ్రా).
-బంగాళాఖాతం శాఖ పవనాలు ఈశాన్యరాష్ర్టాల నుంచి గంగా మైదానం మీదుగా (బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, హర్యానా, ఢిల్లీ) పయనిస్తూ వర్షాన్నిస్తాయి. అయితే రెండు శాఖల పవనాలు చివరగా పంజాబ్‌లోని (అరేబియా, బంగాళాఖాతం శాఖలు) లూథియానాను చేరుతాయి. ఈ సమయానికి పవనాల్లో ఉన్న నీటిఆవిరి క్రమక్రమంగా తగ్గుముఖం పట్టడంతో వర్షపాత పరిమాణం తగ్గడం కన్పిస్తుంది. మొత్తంమీద జూన్ నెలతో ప్రారంభ మై ఈ రుతుపవనాల కదలిక సెప్టెంబర్ నాటికి ముగుస్తుంది.
-నైరుతి రుతుపవనాలవల్ల భారత్‌లో దాదాపు 3/4వ వంతు వర్షపాతం అంటే సుమారు 75 శాతం వర్షపాతం నమోదవుతుంది.
నైరుతి రుతుపవనాల వల్ల ఏర్పడిన వర్షాచ్ఛాయ ప్రాంతా లు..
1. రాయలసీమ (ఆంధ్రప్రదేశ్)
2విదర్భ (మహారాష్ట్ర)
3.మరట్వాడా (గుజరాత్)
నైరుతి రుతుపవనాల వల్ల వర్షపాతం పొందని ప్రముఖరాష్ట్రం- తమిళనాడు
-తమిళనాడులో వర్షపాతం సంభవించకపోవడానికి కారణాలు
1. బంగాళాఖాతం శాఖ ద్వారా వీచే పవనాలు తమిళనాడు తీరానికి సమాంతరంగా కదులుతాయి.
2. రుతుపవన గాలులు తమిళనాడు రాష్ట్ర భూభాగాన్ని చేరేనాటికి పొడి పవనాలుగా మారిపోతాయి.
రాజస్థాన్‌లో వర్షపాతం సంభవించకపోవడానికి కారణాలు
1. ఆరావళి పర్వతాలకు పశ్చిమోత్తర భాగాన రాజస్థాన్ ఉండటం. ఆరావళి పర్వతాలకు సమాంతరంగా రుతుపవన గాలులు ప్రయాణించడం.
2. రుతుపవనాలు రాజస్థాన్ భూభాగం చేరే సమయానికి వాటిలో ఉన్న తేమశాతం తగ్గి పొడి పవనాలుగా మారడం.
3. హిమాలయ వ్యవస్థ రాజస్థాన్ భూభాగానికి దూరంగా ఉండటం.
ఈశాన్య రుతుపవన కాలం (అక్టోబర్, నవంబర్, డిసెంబర్)
-దీనినే తిరోగమన రుతుపవనకాలం (Retreating mon-soon season) అంటారు.
-అక్టోబర్ నెల ప్రారంభంలో హిందూమహాసముద్రం మీద అల్పపీడనం, ఆసియా ఖండం పై (సైబీరియాపై) అధిక పీడ నం కేంద్రీకృతమవుతుంది. అందువల్ల ఈశాన్య వ్యాపార పవనాలు (Northcost trade windes) ఈశాన్య రుతుపవనాలుగా మారి సైబీరియా (అధిక పీడన ప్రాంతం) నుంచి హిందూ మహాసముద్రం (అల్పపీడన ప్రాంత్రం) వైపు వీస్తాయి. ఆ సమయంలో ఇండియాలోని ఉత్తరభారతదేశం మీద చల్లని మేఘాలు సముద్రాల మీదకు తరలిపోతాయి. ఫలితంగా ఉత్తరభారతదేశంలో ఆకాశం నిర్మలంగా ఉండి అకస్మాత్తుగా ఉత్తరభారతదేశంలో ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఈ స్థితిని అక్టోబర్ Heat అని పిలుస్తారు.
కారణం: ఈ నెలలో వాతావరణంలో తేమశాతం అధికంగా ఉన్నందున అక్కడి పరిసరాలు వేడిగా, ఉక్కగా ఉంటాయి.
-ఇవి పొడిపవనాలు. అందువల్ల అధిక వర్షాన్ని ఇవ్వవు.
-సముద్రాల మీదకు భూభాగం నుంచి చేరిన గాలులు అల్పపీడన ప్రాంతాన్ని ఆక్రమించుకొనే ప్రయత్నంలో వాయుగుండంగా మారతాయి.
-ఈ వాయుగుండం క్రమేపి ఉష్ణమండల చక్రవాతంగా మారి తుఫాను లేదా చక్రవాతం (cyclone) అనే పేరుతో భారత తీరప్రాంతాన్ని తాకి వర్షాన్నిస్తుంది.
-నైరుతి రుతుపవనాల వలె ఈశాన్యరుతుపవనాలు దేశమంతటా అధిక వర్షం ఇవ్వకపోయినప్పటికి, తమిళనాడు రాష్ట్రంతో పాటు రాయలసీమ ప్రాంతాలు (తూర్పుతీరం) దీని వల్ల మంచి వర్షం పొందుతున్నాయి.
-ఈశాన్య రుతుపవనాలను తమిళనాడులో అడ్డగించే కొండ లు.. షెవరాయ్ కొండలు. ఫలితంగా తమిళనాడులో ఈశాన్య రుతుపవనాల వలన అధిక వర్షాన్ని పొందుతుంది.
-ఈశాన్య రుతుపవనాల వలన సుమారు 13శాతం వర్షం కురుస్తుంది.
-నైరుతి రుతుపవనాలు తడిపవనాలు కాగా, ఈశాన్య రుతుపవనాలు పొడి పవనాలు అందుకు గల కారణం, నైరుతి రుతుపవనాలు జలభాగం నుంచి భూభాగం వైపు కదలడం, ఈశాన్య రుతుపవనాలు భూభాగం నుంచి జలభాగం వైపు కదలడం.
-భారత్‌లో తుఫానులు ఎక్కువగా వచ్చే నెలలు- అక్టోబర్, నవంబర్
-భారత్‌లో తుఫానులు వచ్చే ప్రాంతం- బంగాళాఖాతం
-తుఫానుల వలన ఎక్కువగా నష్టపోయే రాష్ట్రం- ఒడిశా
-చక్రవాతం/ సైక్లోన్ (cyclone) సైక్లోన్ అనే గ్రీకు పదం నుంచి ఆవిర్భవించింది. ఈ మాటకు అర్థం- పాము చుట్ట (Coil of snake) ఈ పదాన్ని తొలిసారిగా 1948లో హెన్రీపెడ్డింగ్టన్ అనే కొల్కతా నావికుడు ఉపయోగించినట్లు తెలుస్తుంది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు