Heated Money | హీటెడ్ మనీ అంటే?
ద్రవ్య పరిణామం
– ద్రవ్యం అనే పదం మానేటా అనే పదం నుంచి వచ్చింది. రోమన్ దేవత మానేటా ఆలయంలో నాణేలు ముద్రించేవారు.
– సమాజంలో ప్రజలు పలు రకాలైన లావాదేవీల కోసం ద్రవ్యాన్ని ఉపయోగిస్తారు.
– ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యం వాడుకలోకి రాకముందు వస్తు మార్పిడి విధానం అమల్లో ఉండేది. ఈ విధానంలోని ఇబ్బందులను తొలగించడానికి ద్రవ్యం కనుగొనబడింది.
– మొదటి దశలో ద్రవ్యం స్థానంలో జంతువులను ఉపయోగించారు.
– రెండో దశలో బంగారం, వెండి, రాగి, నికెల్ వంటివి లోహ ద్రవ్యంగా వచ్చాయి.
– మూడో దశలో నాణేలు ద్రవ్యంగా ఉపయోగించగా, ఆ తదుపరి కరెన్సీ నోట్లు ద్రవ్యంగా చెలామణిలోకి వచ్చాయి.
– ప్రస్తుతం కరెన్సీ నోట్లతో పాటు వాణిజ్య బ్యాంకులు సృష్టించే డ్రాఫ్ట్‌లు, చెక్కులు, డెబిట్, క్రెడిట్ కార్డులు కూడా ద్రవ్యంగా చెలామణి కావడం చూస్తున్నాం.
ద్రవ్య నిర్వచనాలు
– రాబర్ట్సన్ అభిప్రాయంలో ద్రవ్యం వస్తు క్రయ విక్రయ చెల్లింపుల్లో, ఇతర వ్యవహారాల పరిష్కారాల్లో అధికంగా జనామోదం పొందింది.
– దేనికైతే సర్వజనాంగీకారం కలిగి ఉన్నదో అదే ద్రవ్యం అని సెలిగ్మన్ పేర్కొన్నాడు.
– సాధారణంగా వినిమయ సాధనంగా అందరూ అంగీకరించేదే, అంతేకాకుండా విలువల కొలమానంగా, విలువ నిధిగా ఉపయోగపడేది ద్రవ్యం అని క్రౌథర్ అన్నారు.
– ద్రవ్యం ఏ పనులను నిర్వహిస్తుందో దాన్నే ద్రవ్యం అని వాకర్ అన్నారు.
– ద్రవ్యమంటే ఒక దేశ సరిహద్దులోనూ, వెలుపల సర్వజనామోదం పొందిన ఒక వినిమయ సాధనం, విలువ నిధి, ఆర్థిక లావాదేవీలను నిర్వహించే సాధనం అని పేర్కొనవచ్చు.
ద్రవ్యం రకాలు
– వస్తుద్రవ్యం: వస్తు ద్రవ్యంలో లోహ ద్రవ్యం కూడా ఒక భాగం వస్తు ద్రవ్య అంతర్గత విలువకు సమానంగా దాని ముఖ విలువ ఉంటుంది.
– ప్రాతినిధ్య ద్రవ్యం: ఈ ద్రవ్య ముఖ విలువ దాని అంతర్గత విలువ కంటే చాలా తక్కువగా ఉంటుంది.
– చట్టబద్ధ ద్రవ్యం: చెలామణిలో ఉండే ద్రవ్యం న్యాయబద్ధ త ఆధారంగా రెండు రకాలుగా అంటే చట్టబద్ధమైన ద్రవ్యం, ఐచ్ఛిక ద్రవ్యంగా ఉంటుంది. వివిధ వస్తుసేవల కొనుగోళ్ల కు ప్రభుత్వం కేంద్ర బ్యాంకు ద్వారా జారీచేసిన ద్రవ్యాన్ని చట్టబద్ధమైన ద్రవ్యం అంటారు.
– ఐచ్ఛిక ద్రవ్యం: వాణిజ్య బ్యాంకులు సృష్టించే చెక్కులు, డ్రాఫ్ట్‌లు మొదలైనవి ఐచ్ఛిక ద్రవ్యంగా పిలుస్తారు.
– లోహ ద్రవ్యం: లోహద్రవ్యం వెండి, రాగి వంటి లోహాల ద్వారా రూపొందినవి.
– కాగితపు ద్రవ్యం: వివిధ విలువలను సూచిస్తూ కేంద్ర ప్రభుత్వంగాని, కేంద్ర బ్యాంకు గాని జారీచేసే కరెన్సీ నోట్లను కాగితపు ద్రవ్యం అంటారు.
ఉదా: 2000, 500, 100, 50, 20, 10, 5 రూపాయల నోట్లు.
– చిల్లర ద్రవ్యం: చిన్న చిన్న లావాదేవీలకు ఉపయోగించేందుకు వీలుగా ప్రమాణ ద్రవ్య యూనిట్‌ను విభజించి, చిల్లర ద్రవ్యాన్ని ప్రభుత్వం జారీచేస్తుంది.
ఉదా: ఉపయోగంలో వీలుగా ఉండేందుకు భారతదేశం అర్ధ, ఒకటి, 2, 5, 10 రూపాయల నాణేలను జారీచేసింది.
– ప్రామాణిక ద్రవ్యం: ప్రామాణిక ద్రవ్యపు ముఖ విలువ దాని అంతర్గత విలువకు సమానంగా ఉంటుంది.
– పరపతి ద్రవ్యం: వాణిజ్య బ్యాంకుల్లోని డిమాండ్ డిపాజిట్లు మొదలైన వాటిని చెక్కులు, డ్రాఫ్ట్‌ల ద్వారా లావాదేవీలు జరపవచ్చు. ఆధునిక సమాజంలో ఇంచుమించు అన్ని వ్యవహారాలు వీటితో పరిష్కరించడం సాధ్యం. వీటినే పరపతి ద్రవ్యంగా చెప్పవచ్చు.
– సాధికారిక ద్రవ్యం లేదా ఫియట్ మనీ: ప్రభుత్వం తన అధికారంతో కరెన్సీ నోట్లను ముద్రించి చెలామణి చేసే ద్రవ్యం.
– పిలుపు ద్రవ్యం: వాణిజ్య బ్యాంకులు పరస్పరం ఇచ్చుపుచ్చుకునే అతి స్వల్పకాలిక రుణాలను కాల్‌మనీ అంటారు.
– సులభ ద్రవ్యం: దేశంలో సప్లయ్ పెరిగి ద్రవ్య విలువ పడిపోవడాన్ని సులభ ద్రవ్యం అంటారు.
– హీటెడ్ మనీ: ఏదైనా దేశంలో వడ్డీరేట్లు అధికంగా ఉంటే ఇతర దేశాల నుంచి ఆ దేశానికి మూలధనం బదిలీలు పెరుగుతాయి. ఇలా వచ్చిన ద్రవ్యాన్ని హీటెడ్ మనీ అంటారు.
– డియర్ మనీ: సులభంగా రుణాలు లభించని ఆర్థిక వ్యవస్థలోని ద్రవ్యం.
– సమీప ద్రవ్యం: హుండీలు, ట్రెజరీ బిల్లులు, బాండులు.
– హార్డ్ మనీ: దేశంలో ద్రవ్యం సప్లయ్ తగ్గి ద్రవ్యం విలువ పెరగడాన్ని హార్డ్ మనీ అంటారు.
ద్రవ్యం విధులు ప్రాథమిక విధులు
– వినిమయ మాధ్యమం: ద్రవ్యం వినిమయ మాధ్యమంగా పనిచేయడంవల్ల అమ్మకాలు, కొనుగోళ్లు సులభమవుతా యి. ప్రతి వస్తువు విలువను ద్రవ్యరూపంలో చెప్పడంవల్ల ధర ఏర్పడి వ్యక్తులు ఎక్కడైనా, ఎప్పుడైనా, ఏ వస్తువునై నా కొనుగోలు చేసే వీలు కలుగుతుంది.
– విలువ కొలమానం: ద్రవ్యం వస్తువు సేవల కొలమానంగా పనిచేస్తుంది. వస్తుసేవల విలువలు ద్రవ్యరూపంలో తెలియడంతో వినియోగదారులు, ఉత్పత్తిదారులు తమకు కావాల్సిన వస్తుసేవలను కొలవడానికి వీలు కలుగుతుంది.
ద్వితీయ శ్రేణి విధులు
– విలువ నిధి: కీన్స్ ప్రకారం ఇది ప్రధాన విధి. ద్రవ్యంవల్ల మాత్రమే ప్రస్తుత ఆదాయంతో భవిష్యత్‌లో వినియోగం సాధ్యపడుతుంది. ద్రవ్యం భూత, భవిష్యత్, వర్తమాన కాలాల మధ్య వారధిగా పనిచేస్తుంది. కొన్ని వస్తువులు నశించే (నశ్వర) రూపంలో ఉంటాయి. కాబట్టి వీటిని ద్రవ్యరూపంలోకి మార్చుకుంటే విలువలో తేడా రాదు.
– వాయిదాల చెల్లింపుల ప్రామాణికం: ఆధునిక ఆర్థిక వ్యవస్థలో వ్యవహారాలన్నీ అరువు లేదా వాయిదాల చెల్లింపుల పద్ధతిలోనే జరుగుతాయి. ఈ విధి వల్ల వ్యక్తులు వస్తువులను కొనుగోలు చేయడం, బ్యాంకులు ఇతర ద్రవ్య సంస్థల నుంచి రుణాలు పొందడం బాండ్లు, షేర్లు, డిబెంచర్లు కొనుగోలు, అమ్మకాలు సులభతరమయ్యాయి.
– విలువ బదిలీ: ద్రవ్యం ఉన్న వ్యక్తి దాన్ని ఏ సమయంలోనైనా, ఏ ప్రదేశంలోనైనా, ఎవరికైనా బదిలీ చేయవచ్చు.
అనుషంగిక విధులు (Contingent Fuctions)
– జాతీయాదాయ మదింపు, పంపిణీ: ఒక ఏడాది కాలంలో ఒక దేశంలో ఉత్పత్తి చేసిన వస్తుసేవల విలువలను అంచ నా వేయవచ్చు. జాతీయాదాయాన్ని వివిధ ఉత్పత్తి కారకాల ప్రతిఫలాలైన భాటకం, వేతనం, వడ్డీ, లాభాల చెల్లింపులు ద్రవ్యం ద్వారా సాధ్యపడుతుంది
– ఉపాంత ప్రయోజనాలు: వినియోగదారులు తాము కొనుగోలుచేసే వివిధ వస్తువుల నుంచి పొందే ఉపాంత ప్రయోజనాలను ద్రవ్యం లేదా ధర ఆధారంగా సమానం చేయ డం ద్వారా ప్రయోజనాలను గరిష్టం చేసుకోగలుగుతారు.
– పరపతి వ్యవస్థకు మూలం: ఆర్థిక లావాదేవీలకు ద్రవ్యం ప్రాతిపదిక. ద్రవ్య రిజర్వ్ లేనిదే పరపతి సృష్టి జరగదు.
– ద్రవ్యత్వం ఆపాదించడం: ద్రవ్యానికి అత్యధిక ద్రవ్యత్వం ఉంటుంది. ద్రవ్యత్వం అంటే వెంటనే కొనుగోలు చేసే శక్తి. ద్రవ్యం ద్వారా భూమి, యంత్రాలు, పనిముట్లు, భవనాలు లాంటి ఆస్తులకు ద్రవ్యత్వం చేకూరుతుంది.
– ద్రవ్య సరఫరా అంతర్భాగాలు లేదా కొలమానాలు: ఆర్థిక వ్యవస్థలో చెలామణిలో ఉన్న అన్ని రకాల ద్రవ్యం, ద్రవ్య సరఫరాలో అంతర్భాగాలు. ద్రవ్య సరఫరాలో కింది అంతర్భాగాలు ఉంటాయి.
– కేంద్ర బ్యాంకు జారీచేసిన కరెన్సీ: సాధారణంగా ఒక దేశపు కేంద్ర బ్యాంకు ఆ దేశ కరెన్సీని జారీచేస్తుంది. కరెన్సీలో కాగితం ద్రవ్యం, నాణేలు ఉంటాయి. దేశంలో రిజర్వ్ బ్యాంకు 2000, 500, 200, 100, 50, 20, 10, 5, 2 రూపాయల నోట్లను ముద్రిస్తుంది. ఒక రూపాయి, చిల్లర నాణేలను ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీచేస్తుంది.
– వాణిజ్య బ్యాంకులు సృష్టించిన డిమాండ్ డిపాజిట్లు: ద్రవ్య సరఫరాలో వాణిజ్య బ్యాంకులు సృష్టించే సమీప ద్రవ్యం కూడా ద్రవ్య సరఫరాలో అంతర్భాగం. వాణిజ్య బ్యాంకులు ఖాతాదారుల నుంచి సేకరించిన ప్రాథమిక డిపాజిట్ల ద్వారా సమీప ద్రవ్యాన్ని సృష్టిస్తాయి. అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ ద్రవ్యపు వాటా దాదాపు 80 శాతం ఉన్నది.
ద్రవ్యం భావనలు
– కరెన్సీ: కేంద్రప్రభుత్వం, కేంద్ర బ్యాంకుల ఆధ్వ ర్యంలో ముద్రించి ఆర్థిక వ్యవస్థలో చెలామణిలోకి తెచ్చిన నాణే లు, పేపర్ నోట్లను కరెన్సీ అంటారు. ద్రవ్యంలో కరెన్సీ ఒక భాగం మాత్రమే. కరెన్సీతో పాటు డిమాండ్, టైం డిపాజిట్లు కూడా ద్రవ్యం కిందకు వస్తాయి.
– ద్రవ్యత్వం: ద్రవ్యత్వం అంటే వెంటనే కొనుగోలు చేసే శక్తి. ఒక వస్తువును విలువ తగ్గకుండా సులభంగా తక్కువ కాల వ్యవధిలో ద్రవ్యంగా మార్చగల గుణాన్ని ద్రవ్యత్వం అంటారు. అందుకే ద్రవ్యత్వాన్ని పరిపూర్ణ ద్రవ్యం గల ఆస్తి అంటారు.
– సమీప ద్రవ్యం: ద్రవ్యంగా గుర్తింపుపొందన అతి తక్కువ కాలంలో సులభంగా మార్చుకునే వీలుం డే అత్యధిక ద్రవ్యత్వంగల ఆస్తులను సమీప ద్రవ్యం అంటారు.
– ద్రవ్యత్వంలో ద్రవ్యానికి దగ్గరలో ఉన్నవాటిని సమీప ద్రవ్యం లేదా కృత్రిమ ద్రవ్యం అంటారు.
ఉదా: వాణిజ్య బ్యాంకుల్లోని పొదుపు డిపాజిట్లు, డిమాండ్ డిపాజిట్లు, పోస్టాఫీసు పొదుపు డిపాజిట్లు, బాండ్లు, ఉమ్మడి వ్యాపార సంస్థల స్టాకు లు, షేర్లు, UTI యూని ట్లు, పొదుపు బాండ్లు, పత్రాలు, ట్రెజరీ బిల్లులు, వినిమయ బిల్లులు, ప్రభుత్వ సెక్యూరిటీలు, ప్రభుత్వం హామీ ఇచ్చిన సెక్యూరిటీలు.
ద్రవ్య కొలమానాలు
– ద్రవ్య సప్లయ్ లేదా కొలమానాలు అంటే ప్రస్తుతం దేశంలో ఇప్పటివరకు ఆర్బీఐ నాలుగు రకాల ద్రవ్య సరఫరా భావనలను ప్రవేశపెట్టిం ది. వీటిని ద్రవ్యనిల్వ కొలమానాలు లేదా ద్రవ్య సమిష్టిలు (Money Aggregates) అంటారు. అవి..
– M1= C+DD+OD
M1= మొదటిరకం ద్రవ్యం లేదా సంకుచిత ద్రవ్యం
C= ప్రజల దగ్గర ఉన్న నాణేలు, కరెన్సీ నోట్లు
DD= సహకార బ్యాంకులు, వాణిజ్య బ్యాంకుల డిపాజిట్లు
OD= కేంద్ర బ్యాంకు ఇతర డిపాజిట్లు
– M2= రెండో రకం ద్రవ్యం
M2 మొదటి రకం ద్రవ్యం + పోస్టాఫీసు వద్దగల పొదుపు డిపాజిట్లు
– M3= మూడో రకం ద్రవ్యం లేదా విశాల ద్రవ్యం
M3= M1 + బ్యాంకుల వద్దగల టైం డిపాజిట్లు
– M4= నాలుగో రకం ద్రవ్యం
M4= M3 + పోస్టాఫీసు వద్దగల అన్నిరకాల డిపాజిట్లు
M4= ప్రస్తుతం దీన్ని తొలగించారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు