సౌరకుటుంబంలో ఏమేం ఉంటాయి..?
భూమి కక్ష్యను ఆధారంగా చేసుకుని సౌరకుటుంబంలోని గ్రహాలను 2 వర్గాలుగా విభజించారు. అవి..
1. నిమ్న గ్రహాలు: బుధుడు, శుక్రుడు, భూమి
2. వుచ్ఛగ్రహాలు: కుజుడు (అంగారకుడు), బృహస్పతి (గురుడు), శని, వరణుడు, నెప్ట్యూన్.
-సౌరకుంటుంబంలోని గ్రహాల అవరోహణ క్రమం (పరిమాణం ఆధారంగా)..
1. బృహస్పతి (గురుడు) 2. శని 3. యురేనస్
4. నెప్ట్యూన్ 5. భూమి 6. శుక్రుడు 7. కుజుడు
(అంగారకుడు) 8. బుధుడు
గ్రహాలు-ఉపగ్రహాల విశేషాలు
బుధుడు
-ఇది సూర్యుని నుంచి 58 మిలియన్ కి.మీ. దూరంలో ఉంది.
-దీని భ్రమణకాలం 58 రోజుల 15 గం. 30 నిమిషాలు (సుమారు 59 రోజులు), పరిభ్రమణ కాలం 88 రోజులు (అత్యంత పరిభ్రమణ కాలం కలిగిన గ్రహం).
-దీన్ని వాణిజ్య, నైపుణ్య దేవత అని పిలుస్తారు.
-అత్యంత వేగవంతమైన, సూర్యునికి దగ్గరగా ఉన్న గ్రహం.
-పరిమాణం ప్రకారం గ్రహాలన్నింటిలో చిన్నది. దీన్ని ఉపగ్రహ గ్రహం, అపోలో అని పిలుస్తారు.
శుక్రుడు
-సూర్యుని నుంచి 108 మి.కి.మీ. దూరంలో ఉంది.
-దీని భ్రమణ కాలం 243 రోజులు. ఇది అత్యధిక భ్రమణ కాలం కలిగిన గ్రహం. దీని పరిభ్రమణ కాలం 225 రోజులు.
-దీన్ని మార్నింగ్ స్టార్, ఈవినింగ్ స్టార్, వేగు చుక్క, ఎల్లో ప్లానెట్ అని పిలుస్తారు.
-ఇది అత్యంత ఉష్ణోగ్రత (వేడి), ప్రకాశవంతమైన, గ్లోబల్ వార్మింగ్ అధికంగా ఉన్న గ్రహం.
-దీన్ని భూమికి కవల గ్రహం అని పిలుస్తారు. ఇది భూమికి అతిసమీపంలో ఉన్నది.
-ఈ గ్రహంపై పగటి సమయం అధికంగా ఉంటుంది.
-సౌరకుటుంబంలో అత్యంత ఆల్బిడో కలిగిన గ్రహం (70 శాతం). భూమి ఆల్బిడో (35 శాతం).
భూమి
-ఇది సూర్యుని నుంచి 149.5 మిలియన్ కి.మీ. దూరంలో ఉంది.
-దీని భ్రమణ కాలం 23 గం. 56 నిమిషాలు. పరిభ్రమణానికి 365 1/4 రోజులు పడుతుంది.
-దీని ఉపగ్రహం చంద్రుడు.
-దీన్ని బ్లూ ప్లానెట్, జలయుత గ్రహం అని పిలుస్తారు.
-ఇది జీవమున్న ఏకైక గ్రహం.
-ఎక్కువ సాంద్రత కలిగిన గ్రహం అయిన భూమి సూర్యుని నుంచి దూరాన్ని బట్టి చూస్తే మూడోది. పరిమాణంలో ఐదోది.
కుజుడు (అంగారకుడు)
-ఇది సూర్యునికి 228 మి.కి.మీ. దూరంలో ఉంది.
-దీని భ్రమణ కాలం 24 గంటల 37 నిమిషాలు. పరిభ్రమణ కాలం 686 రోజులు.
-దీనికి రెండు ఉపగ్రహాలు ఉన్నాయి. అవి ఫోబోస్, డిమోస్.
-దీన్ని ఎర్రని గ్రహం, అరుణ గ్రహం, ధూళి గ్రహం, గాడ్ ఆఫ్ వార్ అని పిలుస్తారు.
బృహస్పతి (గురుడు)
-ఇది సూర్యుని నుంచి 778 మి.కి.మీ. దూరంలో ఉంది.
-దీని భ్రమణ కాలం 9 గంటల 1 నిమిషం. పరిభ్రమణ కాలం 12 ఏండ్లు (4332 రోజులు).
-దీనికి 63 ఉపగ్రహాలు ఉన్నాయి. అవి.. గనిమెడ, యూరో పా క్యాలిస్టో మీటిస్, ధేబ్ హిమాలియా.
-సౌర కుటుంబంలోని ఉపగ్రహాల్లో పెద్దది గనిమెడ.
-దీన్ని రూలర్ ఆఫ్ గాడ్స్, గైనీ ప్లానెట్ అని పిలుస్తారు.
-ఇది అత్యల్ప భ్రమణ కాలం కలిగిన, అత్యల్ప పగలు, రాత్రి ఉండే గ్రహం.
-పరిమాణం పరంగా అతిపెద్దది, లోతైన మహా సముద్రం గల గ్రహం.
-ఈ గ్రహం ఉపరితలంపై అగ్ని పర్వత సరస్సులు (క్రీటర్స్) అధికంగా కన్పిస్తాయి.
-ఎక్కువ ద్రవ్యరాశి ఉంటుంది.
-ఉల్కలు ఎక్కువగా ఢీ కొట్టడంతో దీన్ని ఎర్రని మచ్చలు కలిగిన గ్రహం అని, తోక చుక్కల విధ్వంసకారి, నక్షత్ర గ్రహం అని అంటారు.
-1994లో షూమేకర్ లెవీ అనే తోకచుక్క ఈ గ్రహాన్ని ఢీకొట్టింది.
శని
-ఇది సూర్యుని నుంచి 1427 మి. కి.మీ. దూరంలో ఉంది.
-దీని భ్రమణ కాలం 10 గంటల 40 నిమిషాలు. పరిభ్రమణ కాలం 29.5 ఏండ్లు (10760 రోజులు).
-దీని ఉపగ్రహాలు 61, టైటాన్, అట్లాస్, థిథైస్, కాలిప్సో, పాన్, పండోరా
-దీన్ని గాడ్ ఆఫ్ అగ్రికల్చర్, Ringed planet అంటారు.
-ఇది సౌరకుటుంబంలో పరిమాణంపరంగా రెండో పెద్ద గ్రహం.
-అత్యధిక వలయాలు ఉన్న, అందమైన గ్రహం అని అంటారు.
-గ్రహాలలో తేలికైన (నీటి మీద తేలే) గ్రహం. దీన్ని గెలీలియో కనుగొన్నారు.
యురేనస్ (వరణుడు)
-ఇది సూర్యునికి 2870 మి.కి.మీ. దూరంలో ఉంది.
-దీని భ్రమణ కాలం 16 గంటలు, పరిభ్రమణ కాలం 84 ఏండ్లు (30684 రోజులు).
-దీని ఉపగ్రహాలు 27 మిరిండా, జాలిట్, ఏరియల్, పోర్షియా, టైటానియా.
-దీన్ని గ్రీన్ప్లానెట్, గాడ్ ఆఫ్ హెవెన్స్ అని పిలుస్తారు.
-ఇది వ్యతిరేక పరిభ్రమణ, భ్రమణం గల గ్రహం. (సూర్యుని చుట్టూ తిరిగేటప్పుడు, తన చుట్టూ తాను తిరిగేటప్పుడు తూర్పు నుంచి పడమరకు తిరుగుతుంది)
-దీన్ని హర్షెల్ కనుగొన్నారు.
నెప్ట్యూన్ (ఇంద్రుడు)
-ఇది సూర్యునికి 4496 మి. కి.మీ. దూరంలో ఉంది.
-దీని భ్రమణ కాలం 18 గంటలు, పరిభ్రమణ కాలం 165 ఏండ్లు (60190 రోజులు).
-దీని ఉపగ్రహాలు 13, ట్రిటాన్, తలస్సా, గలాతియా, ప్రోటియస్.
-దీన్ని బేబీ బ్లూ ప్లానెట్, గాడ్ ఆఫ్ ద సీ అని పిలుస్తారు.
-ఇది సూర్యునికి అత్యంత దూరంలో ఉన్నది. అతి శీతల గ్రహం.
గ్రహశకలాలు (ఆస్టరాయిడ్స్/ప్లానిటాయిడ్స్)
-కుజుడు (అంగారకుడు), గురు గ్రహాల మధ్య సూర్యుని చుట్టూ దీర్ఘవృత్తాకారంలో పరిభ్రమించే చిన్న చిన్న శిలాశకలాలనే ఆస్టరాయిడ్స్ అంటారు.
-రెండు గ్రహాల మధ్య ఒక గ్రహం శిథిలమై సూర్యుని చుట్టూ నిర్ణీత కక్ష్యలో తిరిగే గ్రహ శకలాలను ఆస్టరాయిడ్స్ అంటారు.
-వీటిని గుసెప్పీ పియాజీ అనే శాస్త్రవేత్త కనుగొన్నారు.
-పెద్ద శకలాలను కేసెస్ అని, చిన్న శకలాలను హెర్మస్ అని పిలుస్తారు.
-మొదటి, అతిపెద్ద ఆస్టరాయిడ్ సెరిస్, అతి చిన్న ఆస్టరాయిడ్ హెర్మస్, ప్రకాశవంతమైన ఆస్టరాయిడ్ వెస్టా.
తోకచుక్కలు (Comets)
-Comet గ్రీకు పదమైన కొమెట్ నుంచి ఉద్భవించింది.
-దుమ్ము, ధూళి కణాలు వేడి వాయువులతో కూడుకుని సూర్యుని చుట్టూ దీర్ఘవృత్తాకార కక్ష్యలో తిరిగే ఖగోళ వస్తువులను తోకచుక్కలు అంటారు.
-వీటిని సౌర బాంధవులు, అతిథిగ్రహాలు అంటారు.
-తోకచుక్కలు తమ కక్ష్యామార్గంలో పరిహేళి స్థానంలో ఉన్నప్పుడు దాని దేహంలో మూడు భాగాలు కన్పిస్తాయి. అవి.. 1) కేంద్రకం 2) తల/కోమా 3) తోక
-తోకచుక్కలు తమ కక్ష్యామార్గంలో అపహేళి స్థానంలో ఉన్నప్పుడు దాని దేహంలో రెండు భాగాలు కన్పిస్తాయి. అవి.. 1) కేంద్రకం 2) కోమా
-ఇప్పుటివరకు గుర్తించిన తోకచుక్కల్లో ముఖ్యమైనది- హేలీ తోకచుక్క
-దీన్ని గుర్తించినది- ఎడ్మండ్ హేలీ
-ఈ తోకచుక్క ప్రతి 76 ఏండ్లకోసారి భూమికి సమీపంగా వస్తుంది. చివరగా 1986లో భూమికి దగ్గరగా వచ్చింది. తిరిగి మళ్లీ భూమికి సమీపంలోకి 2062లో వస్తుంది.
-అతి ప్రకాశవంతమైన తోకచుక్క- హేలీబాప్
-ముఖ్యమైన తోకచుక్కలు- 1) ఓల్బర్స్
2) దివికోస్ 3) టట్టెల్స్
బ్లూమూన్ (Blue Moon)
-ఒకే నెలలో వచ్చే రెండో పౌర్ణమిన చంద్రుడిని బ్లూమూన్ అంటారు.
-2007, జూన్ నెలలో బ్లూమూన్ స్థితి సంభవించినది.
-చంద్రుని భ్రమణ, పరిభ్రమణ కాలాన్ని రెండు విధాలుగా లెక్కిస్తారు.
1) చాంద్రనక్షత్ర మాసం (Sidereal Month)
2) చాంద్రమాన మాసం (Senodic Month)
-చాంద్ర నక్షత్ర మాసం: స్థిర నక్షత్రాల ఆధారంగా చంద్రుడు తన చుట్టూ తాను, భూమి చుట్టూ తిరిగి రావడానికి పట్టే సమయాన్ని చాంద్ర నక్షత్ర మాసం అంటారు.
-ఆ సమయం- 27 రోజుల 7 గంటల 43 నిమిషాలు (27 1/3 రోజులు)
-చాంద్రమాన మాసం: సూర్యుని సాపేక్ష స్థానాన్ని ఆధారంగా చేసుకుని తన చుట్టూ తాను తిరుగుతూ, భూమి చుట్టూ తిరిగి రావడానికి పట్టే సమయాన్ని చాంద్రమాన మాసం అంటారు.
-ఆ సమయం- 29 1/2 రోజులు.
-చంద్రుని భ్రమణ, పరిభ్రమణ కాలాలు సమానంగా ఉండటంవల్ల మనకు చంద్రుని ఒకే ముఖం కనిపిస్తుంది (అంటే చంద్రుడు తన చుట్టూ తాను భ్రమించడానికి, తన కక్ష్యపై పరిభ్రమించడానికి పట్టే కాలం సమానం కాబట్టం).
నోట్: చంద్రుని కాంతి భూమిని చేరడానికి పట్టే సమయం- 1.3 సెకన్లు. చంద్రుని అధ్యయనాన్ని సెలినాలజీ అంటారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు