What does Iksh mean | ఇక్షు అంటే అర్థం?
1. కింది వారిలో శాతవాహన రాజ్యస్థాపకుడు ఎవరు?
1) గౌతమీపుత్ర శాతకర్ణి 2) శాతకర్ణి – I
3) శ్రీముఖుడు 4) శాతకర్ణి – II
2. కింది వాటిలో సరికానిది?
1) హాలికులు – వ్యవసాయదారులు
2) కోలికులు – నేత పనివారు
3) కులరికులు – కుమ్మరులు
4) కమారులు – కమ్మరలు
3. అత్యధిక కాలం పాలించిన శాతవాహన రాజు?
1) యజ్ఞశ్రీ శాతకర్ణి 2) గౌతమీపుత్ర శాతకర్ణి
3) శాతకర్ణి – I 4) పులోమావి – I
4. కింది వాటిలో సరైనది?
1) హాలుడు – గాథాసప్తశతి
2) శర్వవర్మ – కాతంత్య్ర వ్యాకరణం
3) గుణాఢ్యుడు – బృహత్కథ
4) పైవన్నీ
5. గౌతమీపుత్ర శాతకర్ణి బిరుదు కానిది?
1) నవనగర స్వామి
2) క్షత్రియ దర్పమాన మర్దనుడు
3) త్రిసముద్రతోయ పీతవాహన
4) ఏక బ్రాహ్మణ
6. నహపాణుని నాణేలను (వెండి నాణేలు) తన పేరుతో తిరిగి ముద్రించిన శాతవాహన రాజు?
1) మొదటి శాతకర్ణి 2) గౌతమీపుత్ర శాతకర్ణి
3) రెండో శాతకర్ణి 4) యజ్ఞశ్రీ శాతకర్ణి
7. శాతవాహన చక్రవర్తుల గరించి సరైనవి?
1) శ్రీముఖుడు మొదట జైనమతస్తుడు, తర్వాత వైదిక మతాభిమాని
2) శాతవాహనుల్లో శాసనాలు వేయించిన మొదటి రాజు – కృష్ణుడు
3) ఉత్తరభారత్లో రాజ్య విస్తరణ చేసిన మొదటి దక్షిణ భారతదేశ రాజు – రెండో శాతకర్ణి
4) పైవన్నీ
8. దక్షిణాది అశోకుడని ఏ ఇక్ష్వాక రాజును అంటారు?
1) వీరపురుష దత్తుడు
2) రుద్రపురుష దత్తుడు
3) శ్రీశాంతమూలుడు
4) ఎహువల శాంతమూలుడు
9. దక్షిణ భారతదేశంలో హైందవ దేవాలయాలను నిర్మించిన మొదటి రాజు?
1) వాశిష్టీపుత్ర శాంతమూలుడు
2) ఎహువల శాంతమూలుడు
3) హాలుడు 4) వీరపురుష దత్తుడు
10. ఇక్షు అంటే అర్థం?
1) అరటి 2) చెరకు 3) సింహం 4) ఏనుగు
11. స్వతంత్ర ఇక్ష్వాక రాజ్యస్థాపకుడు?
1) వాశిష్టీపుత్ర శాంతమూలుడు
2) వీరపురుష దత్తుడు
3) వాశిష్టీపుత్ర ఎహువల శాంతమూలుడు
4) రుద్రపురుష దత్తుడు
12. దక్షిణ భారతదేశంలో మేనత్త కూతుళ్లను వివాహం చేసుకునే సంప్రదాయాన్ని ప్రవేశపెట్టిన రాజు?
1) పులోమావి – I 2) వీరపురుష దత్తుడు
3) రుద్రపురుష దత్తుడు 4) హాలుడు
13. చూలదర్మగిరి కొండపై ఒక బౌద్ధ విహారం, చైత్యం నిర్మించినది?
1) ఉపాసిక భోదిశ్రీ 2) శాంతిశ్రీ
3) కొడబలి శ్రీ 4) భట్టి మహాదేవి
14. కింది వాటిని జతపర్చండి.
ఎ. నాసిక్ శాసనం 1. దేవి నాగానిక
బి. నానాఘాట్ శాసనం 2. గౌతమి బాలశ్రీ
సి. జునాగఢ్ శాసనం 3. పల్లవ సింహవర్మ
డి. మంచికల్లు శాసనం 4. రుద్రదాముడు
1) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
2) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
3) 1-బి, 2-సి, 3-ఎ, 4-డి
4) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి
15. ఉజ్జయిని పట్టణ గుర్తుతో నాణేలను ముద్రించిన శాతవాహన రాజు?
1) గౌతమీపుత్ర శాతకర్ణి 2) మొదటి శాతకర్ణి
3) పూర్ణోత్సంగుడు 4) హాలుడు
16. కింది వాటిలో సరైనది?
1) రెండో శాతకర్ణి సాంచీ స్థూపానికి దక్షిణ తోరణం నిర్మించాడు
2) యుగ పురాణం ప్రకారం ఇతను మగధ, కళింగ ప్రాంతాలను పాలించాడని తెలుస్తున్నది.
3) 1 మాత్రమే సరైనది 4) 1, 2 సరైనవి
17. శాతవాహనుల కాలంలో నిగమ సభలు అంటే?
1) నగరపాలక సంస్థలు 2) గ్రామీణ పాలక సంస్థలు
3) వర్తక సంఘాలు 4) న్యాయస్థానాలు
18. శాతవాహనుల కాలంలో కులాంతర వివాహాలు జరిగినట్లు తెలిపే గ్రంథం?
1) గాథాసప్తశతి 2) బృహత్కథ
3) కథాసరిత్సాగరం 4) లీలావతి పరిణయం
19. పాశీగాం బౌద్ధ స్థూపాన్ని ఏ బౌద్ధ పండితుడు నిర్మించినట్లు తెలుస్తుంది?
1) చెన్నపూస 2) ఆర్యదేవుడు
3) నాగార్జునుడు 4) దర్మకీర్తి
20. అజంతా గుహల్లో ఏ సంఖ్యగల గుహలు శాతవాహనులకు చెందినవి?
1) 10, 11 2) 9, 8 3) 12, 13 4) 9, 10
21. హాలుని గాథాసప్తశతి గురించి సరైనది?
1) ఇది 700 పద్యాల శృంగార సంకలనం
2) ఇది శివస్తోత్రంతో ప్రారంభమై గౌరీ స్తోత్రంతో ముగుస్తుంది
3) దీనిలో గోపికలు, యశోద ప్రస్తావన ఉంది
4) పైవన్నీ
22. నవనగర పట్టణ నిర్మాత ఎవరు?
1) యజ్ఞశ్రీ శాతకర్ణి 2) రెండో పులోమావి
3) కుంతల శాతకర్ణి 4) మొదటి శాతకర్ణి
23. త్రిసముద్రాధిపతి బిరుదుగల శాతవాహన రాజు?
1) గౌతమీపుత్ర శాతకర్ణి 2) రెండో శాతకర్ణి
3) యజ్ఞశ్రీ శాతకర్ణి 4) హాలుడు
24. రాజధానిని ప్రతిష్టానపురం నుంచి ధాన్య కటకానికి (అమరావతి) మార్చిన శాతవాహన రాజు?
1) వాశిష్టీపుత్ర పులోమావి 2) మొదటి పులోమావి
3) యజ్ఞశ్రీ శాతకర్ణి 4) గౌతమీపుత్ర శాతకర్ణి
25. రాజ ఖంఖేట అంటే?
1) రాజ్య ఆదాయం 2) రాజ్య సైన్యం
3) రాజు సొంత భూమి 4) రాజు అంగరక్షక దళం
26. ఇక్ష్వాకుల రాజ చిహ్నం?
1) వరాహం 2) సింహం 3) వ్యాఘ్రం 4) గరుడ
27. ఉజ్జయినిలోని స్కంద కార్తికేయుని (మహాసేనుడు) భక్తుడైన ఇక్ష్వాక రాజు?
1) వాశిష్టీపుత్ర శ్రీశాంతమూలుడు
2) వీరపురుష దత్తుడు
3) రుద్రపురుష దత్తుడు
4) ఎహువల శాంతమూలుడు
28. ఉదక యంత్రాలు అంటే?
1) వస్ర్తాలను నేసేవి 2) భూమిని దున్నేవి
3) నీటిని తోడేవి 4) ఏదీకాదు
29. శాతవాహనుల కాలంలో భూమి శిస్తు?
1) 1/8 2) 1/6 3) 1/4 4) 1/12
30. వృత్తి పన్నులు విధించినట్లు తెలిపే శాసనం?
1) విళవట్టి శాసనం 2) నాసిక్ శాసనం
3) నానాఘాట్ శాసనం 4) మంచికల్లు శాసనం
31. ఇక్ష్వాకుల రాజధాని?
1) అమరావతి 2) పైఠాన్
3) శ్రీపర్వతం/విజయపురి 4) వేంగి
32. రెండో పులోమావిని దక్షిణాపథేశ్వరుడుగా పేర్కొన్న శాసనం?
1) నాసిక్ శాసనం 2) భట్టిప్రోలు శాసనం
3) నానాఘాట్ శాసనం 4) జున్నార్ శాసనం
33. తెరచాప ఓడగల నాణేలను ముద్రించిన శాతవాహన రాజు?
1) గౌతమీపుత్ర శాతకర్ణి 2) యజ్ఞశ్రీ శాతకర్ణి
3) రెండో శాతకర్ణి 4) శివశ్రీ శాతకర్ణి
34. ఏ శాసనం ప్రకారం ఇక్ష్వాకులు శాతవాహనుల సామంతులని తెలుస్తుంది?
1) ఆల్లూరి శాసనం 2) నాగార్జునకొండ శాసనం
3) మైదవోలు శాసనం 4) ఎలిశ్రీ శాసనం
35. ఏ ఇక్ష్వాక రాజు కాలం నుంచి సంస్కృతంలో శాసనాలు రాసే సంప్రదాయం ప్రారంభమైంది?
1) రుద్రపురుష దత్తుడు 2) శ్రీశాంతమూలుడు
3) వీరపురుష దత్తుడు 4) ఎహువల శాంతమూలుడు
36. ద్విభాష (ప్రాకృతం, తమిళం) నాణేలను ముద్రించిన శాతవాహన రాజు?
1) వాశిష్టీపుత్ర శివశ్రీ శాతకర్ణి 2) పులోమావి
3) యజ్ఞశ్రీ శాతకర్ణి 4) కుంతల శాతకర్ణి
37. బాలశ్రీ నాసిక్ శాసనం ప్రకారం శాతవాహనులు ఏ వర్ణానికి చెందినవారు?
1) బ్రాహ్మణ 2) క్షత్రియ
3) శూద్ర 4) మిశ్రమ కులం
38. చినగంజాం శాసనం వేయించిన శాతవాహన రాజు?
1) శివశ్రీ శాతకర్ణి 2) యజ్ఞశ్రీ శాతకర్ణి
3) రెండో పులోమావి 4) విజయశ్రీ శాతకర్ణి
39. గుహపతులు అంటే?
1) కుల పెద్దలు 2) కుటుంబ పెద్దలు
3) శ్రేణి నాయకులు 4) అధికారులు
40. వీరపురుష దత్తుడు వేయించిన శాసనాలు?
1) ఆల్లూరి శాసనం 2) ఉప్పుగుండూరు శాసనం
3) అమరావతి శాసనం 4) పైవన్నీ
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు