fundamental rights | ప్రాథమిక హక్కుల వర్గీకరణ
సమానత్వపు హక్కు (ప్రకరణలు 14-18)
-14-చట్టం దృష్టిలో సమానత్వం, చట్టం అందరిని సమానంగా రక్షిస్తుంది.
-15(1)- జాతి, మత, కుల, లింగ లేక జన్మస్థలం ఆధారంగా రాజ్యం ఏ వ్యక్తి పట్ల వివక్షత చూపకూడదు.
-15(2)- జాతి, మత, కుల, లింగ, జన్మస్థల ప్రాతిపదికపై ఏ వ్యక్తిని బహిరంగ ప్రదేశాల్లోకి రానివ్వకుండా ఉంచరాదు.
-15(2)(ఎ)-దుకాణాలు, హోటళ్లు, వినోదపు ప్రదేశాల్లో వివక్ష చూపరాదు.
-15(2)(బి) – ప్రభుత్వ ధన సహాయంతో ప్రజలందరి ఉపయోగానికి నిర్దేశించిన బావులు, చెరువులు, స్నానపుఘట్టాలను అందరూ సమానంగా వాడుకోవచ్చు.
-15(3)- స్త్రీ, శిశు సంక్షేమం కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టవచ్చు.
-15(4)-సాంఘికంగా వెనుకబాటుకు గురైన వారు, ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి కోసం ప్రత్యేక నిబంధనలు జారీ చేయవచ్చు.
-15(5)- మైనార్టీ విద్యా సంస్థలను మినహాయించి మిగతా ఎయిడెడ్, ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు కల్పించే నిబంధనలు పార్లమెంట్ చేయవచ్చు. (93 సవరణ-2005)
-16(1)-ప్రభుత్వ ఉద్యోగాల్లో పౌరులందరికీ సమానావకాశాలు
-16(2)-మతం, వర్గం, కులం, లింగం, వంశం, జన్మస్థలం నివాస స్థలం ప్రాతిపదికపై ఏ పౌరుని పట్ల ప్రభుత్వ ఉద్యోగాల్లో వివక్ష చూపరాదు.
-16(3)-కొన్ని ప్రాంతాల ఉద్యోగాలను కొన్ని ప్రాంతాల వారికే పరిమితం చేయాలి అనే నిబంధన చేయవచ్చు.
-16(4)- ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించవచ్చు.
-16(4ఎ) – ఎస్సీ, ఎస్టీలకు పదోన్నతుల్లో రిజర్వేషన్ల సదుపాయం కల్పించబడింది.
-16(4బి)- ఎస్సీ, ఎస్టీ ఉద్యోగాలు క్యారీ ఫార్వర్డు అవకాశం ఉంటుంది. ఈ సందర్భంలో 50 శాతం రిజర్వేషన్లు దాటవచ్చు.
-16(5) – ఒక మత విశ్వాసానికి సంబంధించిన శాఖలో ఆ మతానికి చెందినవారినే నియమించవచ్చు.
-17- అస్పృశ్యత నేరంగా ప్రకటించబడి రద్దు చేయబడింది.
-18-బిరుదులు
-18(1)- సైనిక, విద్యా సంబంధమైన బిరుదులు మాత్రమే ప్రకటించవచ్చు.
-18(2)- విదేశాలు ఇచ్చే బిరుదులను భారత పౌరులెవరూ స్వీకరించరాదు.
-18(3)- భారత పౌరుడు కానప్పటికీ భారత ప్రభుత్వం కింద ఉద్యోగం చేస్తుంటే బిరుదును స్వీకరించరాదు.
-18(4) – ఒక వ్యక్తి భారత పౌరుడు కానప్పటికీ భారత ప్రభుత్వం కింద ఏ పదవిని నిర్వహిస్తున్నా ఆ వ్యక్తి రాష్ట్రపతి అనుమతి లేనిదే ఇతర దేశాల నుంచి ఎలాంటి బహుమతిని, ఉద్యోగాన్ని, పదవిని స్వీకరించరాదు.
స్వేచ్ఛా స్వాతంత్య్రపు హక్కు (ప్రకరణలు 19-22)
-19- వివిధ రకాలైన స్వేచ్ఛా హక్కులు
-19(1)(ఎ) – వాక్, భావ ప్రకటనా స్వాతంత్య్రం
-19(1)(బి) – శాంతియుతంగా, ఆయుధాలు లేకుండా సమావేశం జరుపుకొనే స్వాతంత్య్రం
-19(1)(సి) – సంస్థలు, సంఘాలు ఏర్పాటు చేసుకొనే హక్కు
-19(1)(డి) – దేశవ్యాప్తంగా సంచరించే హక్కు
-19(1)(ఇ) – దేశంలో ఎక్కడైనా నివసించడానికి స్థిర నివాసం ఏర్పాటు చేసుకొనే హక్కు
-19(1)(ఎఫ్) – ఆస్తిని సంపాదించడం, దాన్ని అన్యాక్రాంతం చేయడం గురించి తెలిపేది. దీన్ని 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 1978లో తొలగించారు.
-19(1)(జి) – ఏ వృత్తినైనా, వ్యాపారాన్నయినా చేసుకోవచ్చు.
-20(1) – ఒక వ్యక్తి గత కాలంలో చేసిన నేరానికి ప్రస్తుత కాలంలో చేసిన చట్టప్రకారం శిక్షను విధించరాదు. కాని ఇది క్రిమినల్ నేరాలకు మాత్రమే వర్తిస్తుంది. సివిల్ నేరాలను గత కాలం నుంచి వర్తించేవిధంగా చట్టం చేయవచ్చు.
-20(2) – నేరం ఆరోపించబడ్డ వ్యక్తిని తనకు తానే వ్యతిరేకంగా సాక్షం చెప్పాల్సిందిగా బలవంతం చేయరాదు.
-21- ప్రతి వ్యక్తికి జీవించేహక్కు ఉంది. చట్టం నిర్దారించిన పద్ధతిలో తప్ప మరేవిధంగా కూడా వ్యక్తి ప్రాణాలకు హాని కల్గించరాదు.
-21(ఎ) – 6-14 ఏండ్ల మధ్య గల బాలలకు ఉచిత ప్రాథమిక నిర్బంధ విద్య హక్కు కల్పించబడుతుంది.
-21(1) – ఒక వ్యక్తిని అరెస్టు చేసినప్పుడు అతనికి ఆ అరెస్టుకు సంబంధించిన కారణాలను వీలైనంత త్వరగా తెలియజేయాలి.
-22(2) – అరెస్ట్ అయ్యి నిర్బంధంలో ఉన్న ఏ వ్యక్తినైనా 24 గంటల్లోపు న్యాయస్థానం ముందు హాజరుపర్చాలి. ప్రయాణ కాలాన్ని మినహాయిస్తారు.
-22(3) – అరెస్ట్ అయిన వ్యక్తి శత్రుదేశానికి చెందినవాడైనా, ముందస్తు నిర్బంధం కింద అరెస్టు అయినా 22(1), 22(2)లు వర్తించవు.
-22(4) – ముందస్తు నిర్బంధం కింద అరెస్ట్ అయిన వ్యక్తిని మూడు నెలల కన్నా మించి నిర్బంధంలో ఉంచరాదు. కానీ పార్లమెంట్ ఏదైనా శాసనం చేసి గరిష్ట పరిమితిని పెంచవచ్చు.
-22(5) – ముందస్తు నిర్బంధం కింద అరెస్టు చేసిన వ్యక్తికి అతని అరెస్టుకు సంబంధించిన కారణాలు తెలియజేయాలి.
-22(6) – ప్రజా శ్రేయస్సు దృష్ట్యా ముందస్తు నిర్బంధం కింద అరెస్టయిన వ్యక్తికి అరెస్టుకు సంబంధించిన కారణాలు చెప్పాల్సిన అవసరం లేదు.
-22(7) – ముందస్తు నిర్బంధ విధాన కాలపరిమితికి సంబంధించిన శాసనాలను చేసే అధికారం కేవలం పార్లమెంట్‌కు ఉంది.
పీడనాన్ని నిరోధించే హక్కు (ప్రకరణలు 23-24)
-23(1) – మనుషుల క్రయ విక్రయాలను, బలవంతపు వెట్టిచాకిరీ నిషేధించింది. వెట్టిచాకిరీని బేగార్ అంటారు.
-23(2) – 23(1) కొన్ని మినహాయింపులు ఇవ్వవచ్చు. ఉదాహరణకు డాక్టర్లను విద్య పూర్తయిన తర్వాత కచ్చితంగా గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే నిబంధనను పెట్టవచ్చు.
-23(1) – 24-14 ఏండ్లలోపు పిల్లలచేత ప్రమాదకరమైన పరిశ్రమల్లో పనిచేయించరాదు.
మత స్వాతంత్య్రపు హక్కు (ప్రకరణలు 25-28)
-25(1) – భారతదేశంలోని ప్రజలందరు తమకు నచ్చిన మతాన్ని, విశ్వాసాన్ని స్వీకరించవచ్చు. అచరించవచ్చు. ఇతర మతాలవారిని బలవంతంగా తమ మతంలోకి మార్చరాదు.
-25(2) – మత కార్యకలాపాలతో సంబంధం ఉన్న ఆర్థిక, రాజకీయ లేక ఇతర సంక్షేమ కార్యకలాపాలను పరిమితం చేయడం, నియంత్రణ చేయడం కోసం ప్రభుత్వం చట్టాలను రూపొందించవచ్చు.
-26 – ప్రజా శాంతి, ఆరోగ్యకరమైన నైతికతలకు లోబడి మత సంస్థలు మత ధార్మిక సంస్థలను స్థాపించుకోవచ్చు. వీటికి సంబంధించిన ఆస్తులను సేకరించవచ్చు. వీటి కార్యకలాపాలను తమకు తామే నిర్వహించవచ్చు.
-27 – ఏదేని ఒక మతవ్యాప్తికి లేదా మత పోషణకు పౌరుల నుంచి పన్నులు వసూలు చేయడంపై నిషేధం విధిస్తుంది.
-28(1) – ప్రభుత్వ నిధులు పొందుతున్న విద్యాలయాల్లో మత బోధన నిషేధించింది.
-28(2) – ప్రభుత్వ నిధులు కాకుండా తమ సొంత నిధులతో నిర్వహిస్తున్న విద్యాసంస్థల్లో మత బోధన జరుపవచ్చు.
-28(3) – ప్రభుత్వం గుర్తించిన లేదా ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం పొందిన విద్యాసంస్థల్లో మతపరమైన ప్రార్థనలు, కార్యకలాపాలు ఉన్నప్పటికీ అక్కడ చదివే విద్యార్థులు వాటిలో పాల్గొనవచ్చు. లేదా పాల్గొనకపోవచ్చు. వారిని ఆ కార్యకలాపాల్లో పాల్గొనమని బలవంతం చేయరాదు.
సాంస్కృతిక విద్యా విషయపు హక్కు (ప్రకరణలు 29-30)
-29(1) – భారతదేశంలో ఏ వర్గానికి చెందిన ప్రజలైనా తమ భాషను, లిపిని, సంస్కృతిని కాపాడుకొనే హక్కు కలిగి ఉన్నారు.
-29(2) – ప్రభుత్వం సహాయం పొందే విద్యాసంస్థల్లో జాతి, మతం, కులం, భాష వంటి వాటిల్లో ప్రవేశం నిరాకరించరాదు.
-30 – విద్యాసంస్థలు స్థాపించడానికి మతప్రాదిక లేదా భాషా ప్రాదిక మైనారిటీ వర్గాల వారికి హక్కు ఉంది.
-30(2) – ప్రభుత్వం ఆర్థిక సహాయం ఇచ్చేటప్పుడు అది అల్పా సంఖ్యాకులు నడిపే విద్యాసంస్థల పట్ల ఎలాంటి వివక్ష చూపకూడదు.
రాజ్యాంగ పరిహారపు హక్కు (32వ ప్రకరణ)
-ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు సుప్రీంకోర్టు 32వ అధికరణ ప్రకారం హైకోర్టు 226 అధికరణ ప్రకారం రిట్లను జారీ చేస్తుంది.
-రిట్ అంటే కచ్చితంగా పాటించాల్సిన కోర్టు ఆజ్ఞ
-32- ప్రాథమిక హక్కుల సంరక్షణకు రాజ్యాంగం ద్వారా పరిహారం పొందడానికి అవకాశం ఉంది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు