What causes Dead Sea salinity | మృత సముద్ర లవణీయతకు కారణం?
– భూభాగాల/పర్వతాల వాలు
– ఉత్తరార్ధగోళంలోని భూభాగాల/పర్వతాల దక్షిణ వాలులు సూర్యునికి ఎదురుగా ఉన్నందున ఆ ప్రాంతంలో ఎక్కువ సూర్యపుటం చేరి అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. అయితే ఉత్తర వాలు సూర్యునికి వ్యతిరేక దిశలో ఉన్నందున అక్కడ తక్కువ సూర్యపుటం చేరి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. అందువల్ల ఉత్తరార్ధగోళంలో కానీ, తేయాకు పంటలను పొగమంచు బారినుంచి పరరక్షించడానికి భూభాగాల దక్షిణ వాలులో మాత్రమే సాగుచేస్తారు.
– అయితే దక్షిణార్ధగోళంలో దీనికి భిన్నమైన పరిస్థితులు ఉంటాయి.
ఊర్థ ఉష్ణోగ్రత విస్తరణ
– సముద్ర మట్టం నుంచి ఎత్తు వెళ్లేకొద్దీ ఉష్ణోగ్రతలో కలిగే మార్పే ఊర్థ ఉష్ణోగ్రతా విస్తరణ. సాధారణంగా అన్ని భౌగోళిక ప్రాంతాల్లో ఎత్తుకు వెళ్లేకొద్ది ఉష్ణోగ్రత తగ్గుతుంది. దీన్నే ఉష్ణోగ్రతా క్షీణతాక్రమం అని పిలుస్తారు. కానీ కొన్ని ప్రత్యేక భౌగోళిక ప్రాంతాల్లో, ప్రత్యేక రుతువుల్లో ఎత్తుకు వెళ్లేకొద్దీ ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఈ ప్రక్రియనే ఉష్ణోగ్రతా విలోమం అంటారు.
– ఉష్ణోగ్రతా విలోమం జరిగే ప్రాంతాలు..
ఎ. పర్వత నదీలోయ ప్రాంతాలు
బి. పారిశ్రామిక పట్టణ ప్రాంతాలు
– ఉష్ణోగ్రతా విలోమ ప్రక్రియ జరగడానికి అనుకూల పరిస్థితులు
– శీతాకాలమై ఉండాలి.
– దీర్ఘరాత్రులై ఉండాలి.
– వాతావరణంలో తేమ శాతం తక్కువగా ఉండాలి.
– గాలుల వేగం తక్కువగా ఉండాలి.
– పర్వత నదీలోయ ప్రాంతాల్లో నివసించే ప్రజలు వారి నివాసాలను, పంటల సాగును పర్వత వాలుల వెంట చేపడుతారు. కారణం ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రత మరీ ఎక్కువ కాకుండా, మరీ తక్కువ కాకుండా మధ్యస్థంగా ఉండటమే.
ఉష్ణ సమతుల్యం
– హ్రస్వ తరంగాల రూపంలో భూమి గ్రహించే సౌర వికిరణానికి, దీర్ఘ తరంగాల రూపంలో భూమి కోల్పోయే భౌమ వికిరణానికి గల నిష్పత్తే ఉష్ణ సమతుల్యం.
– భూమివైపు ప్రసరించే మొత్తం సౌర వికిరణం 100 యూనిట్లు అనుకుంటే, అందులో వాతావరణంలోని మేఘాలు 24 యూనిట్లు. దుమ్ము, ధూలి కణాలు 6 యూనిట్లు.
– భూమిపైగల మంచు ప్రాంతాలు 5 యూనిట్ల సౌరశక్తిని భూమిని చేరకుండా పరావర్తనం చెందించగా మిగిలిన 65 యూనిట్ల సౌరశక్తిలో 14 యూనిట్లు వాతావరణంలోని నీటి ఆవిరి గ్రహించుకోగా, మిగిలిన 51 యూనిట్ల సౌరశక్తి భూ ఉపరితలాన్ని చేరి వివిధ రకాల భౌగోళిక వ్యవస్థలు, జీవవైవిధ్యత కొనసాగడానికి వినియోగించబడుతున్నది. దీన్నే నిర్వహణా సౌరశక్తి అని అంటారు.
– భూ ఉపరితలం, భూ వాతావరణం కలిసి గ్రహించే సౌరశక్తి పరిమాణం – 65 యూనిట్లు
– భూమి సగటు ఆల్బిడో – 35 శాతం
– భూ ఉపరితలంపై ఆల్బిడో పరిమాణం ఎక్కువగాగల ప్రాంతాలు – మంచు ప్రాంతాలు
– ఆల్బిడో పరిమాణం తక్కువగాగల ప్రాంతాలు – జల భాగాలు
– ఆల్బిడో అంటే భూ వాతావరణం నుంచి పరావర్తనం చెందించబడే సౌరశక్తి పరిమాణం.
– భూమిపై ఒకే ఉష్ణోగ్రతగల ప్రదేశాలను కలుపుతూ గీసిన ఊహారేఖలు – సమోష్ణోగ్రతారేఖలు (ఐసో థర్మ్లు)
– భారత్‌లో వార్షిక సగటు ఉష్ణోగ్రతలు అత్యధికంగా గల ప్రాంతాలను తెలిపే ఐసోథర్మ్ -240 సమోష్ణోగ్రతా రేఖ
– భారత్‌లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతం – జైసల్మేర్ (రాజస్థాన్) -560C
– ప్రపంచంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతం – అల్ అజీజియా -5-0C (లిబియా-సహారా ఎడారి)
– భారత్‌లో అతి తక్కువ ఉష్ణోగ్రతలు – ద్రాస్, కార్గిల్ ప్రాంతాలు (లఢఖ్)
– ప్రపంచంలో అతి తక్కువ ఉష్ణోగ్రతలు – వోస్టోక్ (అంటార్కిటికా)
సముద్ర జల లవణీయత
(8/00: ప్రతి 1000 ml నీటిలో 8 గ్రా. ఖనిజ లవణాలు)
– సముద్ర జలానికున్న ఉప్పదనాన్ని లవణీయత అంటారు.
– సముద్ర జల లవణీయతకు కారణం అందులో కరిగి ఉన్న అనేక ఖనిజ లవణాలు.
– సముద్ర జలాల్లో అధికంగా కరిగి ఉన్న ఖనిజ లవణం 1. సోడియం క్లోరైడ్ (71 శాతం), 2. మెగ్నీషియం క్లోరైడ్ (10 శాతం).
– సముద్ర జలాల్లో అధికంగా లభ్యమయ్యే మూలకం – అయోడిన్
– సముద్ర జలాల సగటు లవణీయత 35 శాతం, అంటే 35 గ్రా/00.
– సముద్ర జల లవణీయత కింది కారణాలతో ప్రభావితమై ప్రాంతాన్ని బట్టి మారుతుంది.
1. ఉష్ణోగ్రత: ఉష్ణోగ్రత అధికంగాగల ప్రాంతాల్లో నీరు ఆవిరయ్యే రేటు ఎక్కువగా ఉండి, సముద్ర జల లవణీయత కూడా అధికంగా ఉంటుంది.
2. వర్షపాతం: అధిక వర్షపాతంగల ప్రాంతాల్లో లవణీయత తక్కువగా ఉంటుంది. కారణం వర్షం ద్వారా మంచినీరు సముద్రాల్లో చేరడంతో అందులోని లవణాల గాఢత తగ్గుతుంది.
3. సముద్రాల్లో కలిసే నదుల్లోని మంచినీరు: నదీ ముఖద్వారాల వద్ద నదుల్లోని మంచినీరు సముద్రాల్లో కలవడంవల్ల అక్కడ లవణీయత తక్కువగా ఉండి, నదీ ముఖద్వారాల నుంచి సముద్రాల లోపలికి వెళ్లేకొద్దీ లవణీయత పెరుగుతుంది.
4. సముద్రాల లోతు: సముద్రజల ఉపరితలం నుంచి 200 పాథమ్స్ లోతువరకు లవణీయత క్రమంగా పెరిగి, ఆపై లోతులో క్రమంగా తగ్గుతుంది. కారణం సూర్య కిరణాలు 200 పాథమ్స్ లోతువరకే ప్రసరిస్తాయి.
5. భూమధ్యరేఖ ప్రాంతంతో పోలిస్తే ఉప అయన రేఖా ప్రాంతంలో లవణీయత అధికంగా ఉండటానికి కారణం అధిక ఉష్ణోగ్రత, అల్ప వర్షపాతం.
6. ఉప అయన రేఖ ప్రాంతంతో పోలిస్తే భూమధ్య రేఖ ప్రాంతంలో లవణీయత తక్కువగా ఉండటానికి అధిక వర్షపాతమే కారణం.
7. అక్షాంశాలను బట్టి పరిశీలిస్తే భూరేఖ నుంచి ఉప అయనరేఖా ప్రాంతం వరకు లవణీయత క్రమంగా పెరిగి, ఆపైన ధ్రువాల వరకు క్రమంగా తగ్గుతుంది.
– ఒకే లవణీయతగల ప్రదేశాలను కలుపుతూ గీసిన ఊహారేఖలే ఐసోహ్లైన్స్.
– అత్యంత లవణీయతగల సముద్రం
– మృత సముద్రం, 228 శాతం (జోర్డాన్, పాలస్తీనా, ఇజ్రాయెల్ సరిహద్దుల్లో)
కారణం
– అధిక ఉష్ణోగ్రత ప్రాంతంలో ఉండటం
– అల్ప వర్షపాతంగల ప్రాంతం
– ఈ సముద్రంలో కలిసే నదులేవీ లేకపోవడం
– అతి తక్కువ లవణీయతగల సముద్రం
– బాల్టిక్ సముద్రం (8 శాతం)
– అల్ప ఉష్ణోగ్రత ప్రాంతం
– ఈ సముద్రంలో అనేక నదులు కలవడం
సముద్ర ప్రవాహాలు
– సముద్రజలం అధిక మొత్తంలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి స్థిరంగా నిర్ణీత దిశలో కదలడాన్ని సముద్ర ప్రవాహాలు అని పిలుస్తారు.
– ఇవి ఏర్పడే భౌగోళిక ప్రాంతాన్ని అనుసరించి వీటిని 2 రకాలుగా విభజించవచ్చు.
1. ఉష్ణ సముద్ర ప్రవాహాలు
– భూమధ్య రేఖ ప్రాంతంలో జనించి ఎల్లప్పుడూ ఖండాల తూర్పుతీరాల వెంబడి ఉపరితల ప్రవాహంగా ధృవాలవైపు కదులుతాయి.
– వీటి కారణంగా ఖండాల తూర్పుతీర ప్రాంత భూభాగాల్లో వర్షపాతం పశ్చిమ ప్రాంత భూభాగాల కంటే అధికంగా ఉంటుంది.
2. శీతల సముద్ర ప్రవాహాలు
– ఇవి ధ్రువ ప్రాంతాల్లో జనించి ఎల్లప్పుడూ ఖండాల పశ్చిమ తీరం వెంబడి అంతర ప్రవాహంగా భూమధ్యరేఖవైపు కదులుతాయి.
– వీటి కారణంగా ఈ ప్రాంత భూభాగాల్లో వర్షపాతం తక్కువగా ఉంటుంది.
అట్లాంటిక్ మహాసముద్ర ప్రవాహ వ్యవస్థ
– ప్లాంక్టాన్స్ – వృక్ష ప్లవకాలు (ఆల్గే మొదలైనవి)
– నెక్టాన్స్ – ఉపరితలంపైగల కీటకాలు (జంతు ప్లవకాలు)
ఉత్తర అట్లాంటిక్ సముద్ర ప్రవాహ వ్యవస్థ
ఉష్ణ ప్రవాహాలు
– ఉత్తర అట్లాంటిక్ భూమధ్య రేఖా సముద్ర ప్రవాహం
– ఏంటలీన్ ప్రవాహం
– గల్ఫ్ స్ట్రీమ్
– ఉత్తర అట్లాంటిక్ డ్రిఫ్ట్ ప్రవాహం
శీతల ప్రవాహాలు
– గ్రీన్లాండ్/ఇరమింజల్ ప్రవాహం
– లాబ్రడార్ ప్రవాహం
– కెనరీ ప్రవాహం (సహారా ఏర్పడటానికి కారణం)
– ప్రపంచంలో చేపల ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న ప్రాంతం: కెనడా తూర్పుతీరంలోని న్యూపౌండ్ఐలాండ్ దీవిలోని గ్రాండ్ బ్యాంక్ ప్రాంతం.
– గ్రీన్లాండ్/ఇరమింజల్ ప్రవాహం
– లాబ్రడార్ ప్రవాహం
– కెనరీ ప్రవాహం (సహారా ఏర్పడటానికి కారణం)
– ప్రపంచంలో చేపల ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న ప్రాంతం: కెనడా తూర్పుతీరంలోని న్యూపౌండ్ఐలాండ్ దీవిలోని గ్రాండ్ బ్యాంక్ ప్రాంతం.
కారణం
– ఖండతీరపు అంచు అత్యధిక వెడల్పుగా ఉండటం.
– గల్ఫ్ ఉష్ణప్రవాహాలు, లాబ్రడార్ శీతల ప్రవాహాలు ఈ ప్రాంతంలో కలుస్తున్నందున చేపలకు ఆహారంగా ఉపయోగపడే ప్లాంక్టాన్స్, నెక్టాన్స్ అనే నిమ్నజాతికి చెందిన సముద్రపు జీవులు ఎక్కువగా పెరగడం.
– బ్రిటన్, నార్వే తీరాలను ఆనుకుని ఉన్న డాగర్ బ్యాంక్ ప్రాంతంలో చేపల ఉత్పత్తి అధికంగా (2వ స్థానం) ఉండటం
– ఖండతీరపు అంచు వెడల్పుగా ఉండటం
– ఉత్తర అట్లాంటిక్ డ్రిఫ్ట్ అనే ఉష్ణ ప్రవాహం, గ్రీన్‌ల్యాండ్ శీతల ప్రవాహాలు ఈ ప్రాంతంలో మిశ్రమం కావడంవల్ల చేపలకు ఆహారంగా ఉపయోగపడే ప్లాంక్టాన్స్, నెక్టాన్స్ జీవులు ఎక్కువగా పెరగడం.
దక్షిణ అట్లాంటిక్ సముద్ర ప్రవాహ వ్యవస్థ
ఉష్ణ ప్రవాహాలు
– దక్షిణ అట్లాంటిక్ భూమధ్య రేఖ ప్రవాహం
– బ్రెజీలియన్ ఉష్ణ ప్రవాహం
శీతల ప్రవాహాలు
– పశ్చిమ పవన డ్రిఫ్ట్
– ఫాక్లాండ్ శీతల ప్రవాహం
– బెనిగ్వులా శీతల ప్రవాహం (కలహారి ఎడారి ఏర్పడటానికి కారణం)
– ఉత్తర అట్లాంటిక్ సముద్ర ప్రవాహ వ్యవస్థ సవ్యదిశలోనూ, దక్షిణ అట్లాంటిక్ ప్రవాహ వ్యవస్థ అపసవ్య దిశలోనూ కదులుతాయి.
– పశ్చిమ పవన డ్రిఫ్ట్
– ఫాక్లాండ్ శీతల ప్రవాహం
– బెనిగ్వులా శీతల ప్రవాహం (కలహారి ఎడారి ఏర్పడటానికి కారణం)
– ఉత్తర అట్లాంటిక్ సముద్ర ప్రవాహ వ్యవస్థ సవ్యదిశలోనూ, దక్షిణ అట్లాంటిక్ ప్రవాహ వ్యవస్థ అపసవ్య దిశలోనూ కదులుతాయి.
పసిఫిక్ సముద్ర ప్రవాహ వ్యవస్థ
డ్రిఫ్ట్ – నెమ్మదిగా కదిలే ప్రవాహం, కరెంట్ – వేగంగా కదిలే ప్రవాహం
ఉత్తర పసిఫిక్ సముద్ర ప్రవాహ వ్యవస్థ
ఉష్ణ ప్రవాహాలు
– ఉత్తర పసిఫిక్ భూమధ్య రేఖా ప్రవాహం
– కురుషివో ప్రవాహం
– కురుషివో ఎక్స్టెన్షన్ ప్రవాహం
శీతల ప్రవాహాలు
– ఉత్తర పసిఫిక్ డ్రిఫ్ట్
– ఓయాషియా/కాంచెట్కా ప్రవాహం
– కాలిఫోర్నియన్ ప్రవాహం (సోనరాన్ ఎడారి ఏర్పడటానికి కారణం)
– ఉత్తర పసిఫిక్ డ్రిఫ్ట్
– ఓయాషియా/కాంచెట్కా ప్రవాహం
– కాలిఫోర్నియన్ ప్రవాహం (సోనరాన్ ఎడారి ఏర్పడటానికి కారణం)
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు