Made the emblem of the state | రాష్ట్ర అధికార చిహ్నాన్ని తయారుచేసిన ప్రముఖ చిత్రకారుడు?
తెలంగాణ చరిత్ర
1. నిజాం ప్రభుత్వం మొదటగా భూ మారకపు నిబంధనను ఎప్పుడు తీసుకొచ్చింది?
1) 1936 2) 1937 3) 1940 4) 1944
2. హైదరాబాద్‌లో మొదటిసారి రేడియో కేంద్రాన్ని మహబూబ్ అలీ ఎప్పుడు ఏర్పాటుచేశారు?
1) 1920 2) 1925 3) 1930 4) 1933
3. మొదటి గిరిజన రైతు కూలీ సంఘం మహాసభను ఎప్పుడు నిర్వహించారు?
1) 1980 మే 20 2) 1981, ఏప్రిల్ 18
3) 1984, మార్చి 5 4) 1988, ఏప్రిల్ 4
4. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థను స్థాపించిన ముఖ్యమంత్రి?
1) ఎన్టీ రామారావు 2) జలగం వెంగళరావు
3) మర్రి చెన్నారెడ్డి 4) టీ అంజయ్య
5. కింది వాటిని జతపర్చండి.
ఎ. వైజయంతీ విలాసం
1. మరింగంటి సింగనాచార్యుడు
బి. లైలా మజ్ను 2. అద్దంకి గంగాధరుడు
సి. తపతీసంవరణోపాఖ్యానం 3. సారంగ తమ్మయ్య
డి. దశరాజ నందన చరిత్ర 4. మీర్జా మహ్మద్ అమీన్
1) ఎ-1, బి-4, సి-3, డి-2
2) ఎ-3, బి-4, సి-2, డి-1
3) ఎ-3, బి-2, సి-4, డి-1
4) ఎ-1, బి-4, సి-2, డి-3
6. ఆంధ్రప్రదేశ్ విభజన ద్వారా ఉత్పన్నమయ్యే సమస్యలను పరిగణనలోకి తీసుకొని వాటి పరిష్కారానికి తగు సూచనలు ఇచ్చే నిమిత్తం కేంద్ర ప్రభుత్వం ఏకే ఆంటోని అధ్యక్షతన ఒక కమిటీని నియమించింది. ఆ కమిటీలోని సభ్యులు?
1) దిగ్విజయ్‌సింగ్, అహ్మద్‌పటేల్, మల్లికార్జున ఖర్గే 2) దిగ్విజయ్‌సింగ్, వీరప్ప మొయిలీ, గులాం నబీ ఆజాద్
3) దిగ్విజయ్‌సింగ్, వీరప్ప మొయిలీ, అహ్మద్ పటేల్ 4) దిగ్విజయ్‌సింగ్, అహ్మద్ పటేల్, చిదంబరం
7. కాళోజీ నారాయణరావు రచించిన తెలంగాణ విముక్తి ఉద్యమకవితా సంపుటి?
1) తెలంగాణ 2) నా గొడవ
3) వజ్రాయుధం 4) త్వమేవాహం
8. జూరాల ప్రాజెక్టుకు సంబంధించి కింది వాటిలో సరైనది?
1) ఈ ప్రాజెక్టును 1956లో ప్రతిపాదించి 1962లో ప్రకటించారు
2) 1784 టీఎంసీల నీటి వినియోగం-500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి
3) ఈ ప్రాజెక్టు మహబూబ్‌నగర్, గద్వాల ప్రాంతాలకు నీరందిస్తుంది
4) పైవన్నీ సరైనవే
9. భువనగిరి సభకు హాజరైన బహుజన్ రిపబ్లిక్ పార్టీ అధ్యక్షుడు?
1) ఆకుల భూమయ్య 2) కేజీ సత్యమూర్తి
3) రాపోలు ఆనందభాస్కర్ 4) వీ ప్రకాష్
10. కింది వాటిలో సరికానిది.
1) ఓ నిజాము పిశాచమా.. కానరాడ నిను పోలిన రాజు మాకెన్నడేని- దాశరథి రంగాచార్యులు
2) మా నిజాం రాజ్యం కల్తీలేని మధ్యయుగపు భూస్వామ్య వ్యవస్థ- రావి నారాయణరెడ్డి
3) తెలంగాణ రైతుదే.. ముసలి నక్కకు రాచరికం దక్కునే..- దాశరథి కృష్ణమాచార్యులు
4) పగలెయ్ నిజాం కోట… ఎగరేయ్ ఎర్రబావుటా- బండ్ల యాదగిరి
11. హైదరాబాద్‌లోని వివేకవర్ధిని పాఠశాలలో నిజాం రాష్ట్ర సంఘ సంస్కార మహాసభ ఎప్పుడు జరిగింది?
1) 1921, నవంబర్ 10 2) 1921, నవంబర్ 11 3) 1921, నవంబర్ 12 4) 1921, నవంబర్ 13
12. 1943 మే నెలలో హైదరాబాద్‌లోని రెడ్డి హాస్టల్లో నిర్వహించిన మహాసభ ఎన్నవది?
1) 9 2) 10 3) 11 4) 12
13. దగా పడ్డ తెలంగాణ పుస్తక రచయిత?
1) ఆకుల భూమయ్య 2) నాగారం అంజయ్య
3) సత్యనారాయణ 4) గాదె ఇన్నయ్య
14. బహమనీ రాజ్యం విచ్ఛిన్నం వలన ఏర్పడిన దక్కన్ రాజ్యాలు, వాటి వంశాలను జతపర్చండి.
ఎ. బీదర్ 1. నిజాంషాహీ
బి. గోల్కొండ 2. ఆదిల్షాహీ
సి. అహ్మద్‌నగర్ 3. కుతుబ్‌షాహీ
డి. బీజాపూర్ 4. బీదర్షాహీ
1) ఎ-1, బి-3, సి-2, డి-4
2) ఎ-4, బి-3, సి-2, డి-1
3) ఎ-4, బి-1, సి-3, డి-2
4) ఎ-4, బి-3, సి-1, డి-2
15. ఉద్యోగరంగంలో తెలంగాణ ప్రాంతానికి ముల్కీరూపంలో కల్పించిన రక్షణలు 1980 డిసెంబర్ చివరి వరకు అమల్లో ఉంటాయి. కానీ హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల్లో మాత్రం 1977 డిసెంబర్ చివరి వరకు మాత్రమే అమల్లో ఉంటాయని తెలిపే పథకం?
1) ఆరుసూత్రాల పథకం 2) అష్టసూత్ర పథకం
3) అఖిలపక్ష ఒప్పందం 4) పంచసూత్ర పథకం
16. 1955 జూలైలో జరిగిన తెలుగు భాషా సమితి సమావేశానికి అధ్యక్షత వహిస్తూ సాంస్కృతికంగా విశాలాంధ్ర ఒక భావనగా ఇప్పటికే రుజువైంది అని వ్యాఖ్యానించింది?
1) కొండా వెంకటరంగారెడ్డి
2) బూర్గుల రామకృష్ణారావు
3) మాడపాటి హనుమంతరావు
4) మందుముల నర్సింగరావు
17. తెలంగాణ సాంస్కృతిక వేదిక ఎప్పుడు ఏర్పాటయ్యింది?
1) 1996 2) 1997 3) 1998 4) 1999
18. 1923లో కాకినాడలో ఎవరి అధ్యక్షతన అఖిల భారత కాంగ్రెస్ మహాసభ జరిగింది?
1) మౌలానా మహమ్మద్ అలీ 2) వామన్ నాయక్ 3) రామకృష్ణ దూత్ 4) రావి నారాయణరెడ్డి
19. మెదక్ జిల్లా జోగిపేటలో 1930లో జరిగిన నిజాం రాష్ట్ర ప్రథమాంధ్ర మహాసభకు అధ్యక్షత వహించినవారు?
1) మాడపాటి హనుమంతరావు
2) సురవరం ప్రతాపరెడ్డి 3) వెంకట్రామారెడ్డి
4) ఎవరూకాదు
20. 1931 బూర్గుల రామకృష్ణారావు అధ్యక్షతన రెండో ఆంధ్ర మహాసభ ఎక్కడ నిర్వహించారు?
1) దేవరకొండ 2) హన్మకొండ
3) వనపర్తి 4) కోటిలింగాల
21. 1997లో జై తెలంగాణ పార్టీని స్థాపించినవారు?
1) పటోళ్ల ఇంద్రారెడ్డి 2) మర్రి చెన్నారెడ్డి
3) చిన్నారెడ్డి 4) మిత్రా
22. తెలంగాణకు రక్షణలు అమలైతే చాలంటూ భావ సమైక్యత ప్రజా సంఘటన అనే సంస్థను ప్రారంభించింది?
1) స్వామి రామానందతీర్థ
2) సురవరం ప్రతాపరెడ్డి
3) కాసు బ్రహ్మానందరెడ్డి
4) కాళోజీ నారాయణరావు
23. కింది వాటిని జతపర్చండి.
ఎ. థింసా 1. బబ్బన్ ఖాన్
బి. అద్రక్ కే పంజే 2. గోండులు
సి. పేరిణి నృత్యం 3. వేగవంతమైన నృత్యం
డి. పిట్టలదొర 4. బుడిగ జంగాలు
1) ఎ-2, బి-1, సి-3, డి-4
2) ఎ-1, బి-2, సి-3, డి-4
3) ఎ-3, బి-1, సి-2, డి-4
4) ఎ-4, బి-3, సి-1, డి-2
24. 1969, జనవరి 18-19 తేదీల్లో అఖిలపక్ష సమావేశ ఏర్పాటుకు పిలుపునిచ్చింది?
1) కాసు బ్రహ్మానందరెడ్డి 2) చెన్నారెడ్డి
3) రామచంద్రారెడ్డి 4) శ్రీధర్‌స్వామి
25. 1969లో ఏ రోజున తెలంగాణ మృతవీరుల దినాన్ని పాటించారు?
1) మే 15 2) మే 17 3) మే 19 4) మే 21
26. సాలార్జంగ్ సుంకాల శాఖలో సంస్కరణలు ఎప్పుడు చేశారు?
1) 1862 2) 1864 3) 1866 4) 1868
27. ఆచార్య వినోబా భావే పోచంపల్లి గ్రామాన్ని సందర్శించింది ఎప్పుడు?
1) 1951 2) 1952 3) 1953 4) 1954
28. కింది వాటిలో సరికాని వాక్యం ఏది?
1) మొదటి విశాలాంధ్ర మహాసభ వరంగల్‌లో హయగ్రీవాచారి అధ్యక్షతన జరిగింది
2) రెండో విశాలాంధ్ర మహాసభ హైదరాబాద్‌లో శ్రీశ్రీ అధ్యక్షతన జరిగింది
3) విశాలాంధ్ర ఏర్పాటును వ్యతిరేకించింది మర్రి చెన్నారెడ్డి, కేవీ రంగారెడ్డి
4) దేవులపల్లి రామానుజరావు విశాలాంధ్రను వ్యతిరేకించారు
29. తెలంగాణ రాష్ట్ర అధికార చిహ్నాన్ని తయారుచేసిన ప్రముఖ చిత్రకారుడు ఎవరు?
1) ఏలే లక్ష్మణ్ 2) చుక్కా సత్తయ్య
3) కాపు రాజయ్య 4) లింగమూర్తి
30. ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాన్ని విభజించే సమయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎవరు?
1) నర్సింగరావు 2) పీకే మహంతి
3) రాజీవ్ శర్మ 4) కృష్ణారావు
31. తెలంగాణ బిల్లు రాజ్యసభలో ప్రవేశపెట్టినప్పుడు సీపీఎం పక్ష నాయకుడు?
1) ప్రకాష్ కారత్ 2) బృందా కారత్
3) సీతారాం ఏచూరి 4) మధు
32. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన రోజు?
1) 2014, జూన్ 2 2) 2014, జూన్ 4
3) 2014, జూన్ 6 4) 2014, జూన్ 8
33. ట్రాజెడీ ఆఫ్ హైదరాబాద్ గ్రంథ రచయిత?
1) వెల్లోడి
2) కేఎం మున్షీ 3) జేఎన్ చౌదరి 4) లాయక్ అలీ
34. హైదరాబాద్ నగర వాస్తుశిల్పి ఎవరు?
1) షోయబుల్లాఖాన్
2) మీర్ మోయిన్ అస్రబాది
3) సుల్తాన్ కులీ 4) మీర్ ఖాసీం అలీ
35. హైదరాబాద్ అంబేద్కర్గా ప్రసిద్ధి చెందింది?
1) భాగ్యరెడ్డి వర్మ 2) శ్యాం సుందర్
3) బీఎస్ వెంకట్రావ్ 4) ఎవరూ కాదు
36. కింది వాటిని జతపర్చండి.
ఎ. మెట్పల్లి 1. ఇత్తడి సామాను
బి. పెంబర్తి 2. ఖాదీ
సి. గద్వాల 3. గాజులు
డి. హైదరాబాద్ 4. చేనేత చీరలు
1) ఎ-2, బి-1, సి-4, డి-3
2) ఎ-4, బి-2, సి-1, డి-3
3) ఎ-1, బి-3, సి-2, డి-4
4) ఎ-3, బి-4, సి-2, డి-1
37. కుతుబ్‌షాహీల కాలంలో గోల్కొండ రాజ్యంలో ప్రసిద్ధిచెందిన పరిశ్రమ?
1) వస్త్ర 2) పింగాణీ 3) గాజు 4) వజ్ర
38. ఆర్థిక సంస్కరణల్లో భాగంగా, ప్రపంచ బ్యాంకు సూచనలకు అనుగుణంగా అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర విద్యుచ్ఛక్తి బోర్డును మూడు సంస్థలుగా విభజించింది. అవి ఏవి?
1) ఉత్పత్తి, సరఫరా, నిర్మాణం
2) ఉత్పత్తి, సరఫరా, పంపిణీ
3) జలవిద్యుత్, సోలార్ విద్యుత్, థర్మల్ విద్యుత్
4) పంపిణీ, నిర్మాణం, సరఫరా
39. తెలంగాణ ప్రజలు సమర్థిస్తేనే విశాలాంధ్ర స్థాపన జరుగుతుందన్నది ఎవరు?
1) జేబీ పంత్ 2) నెహ్రూ
3) ఎస్కే పాటిల్ 4) రాజగోపాలచారి
40. తెలంగాణలో వలసపాలన ఎన్నేళ్లు కొనసాగింది?
1) 600 2) 624 3) 630 4) 650
41. ఆంధ్రప్రదేశ్ అవతరణ అనంతరం 1959లో మునగాల సంస్థానం ఏ జిల్లాలో కలిసిపోయింది?
1) ఖమ్మం 2) మెదక్ 3) నల్లగొండ 4) వరంగల్
42. కింది వారిలో తెలంగాణ జాగృతి సంస్థను స్థాపించినవారు?
1) వనం ఝాన్సీ 2) కల్వకుంట్ల కవిత
3) విమలక్క 4) విజయశాంతి
43. అమెరికాలోని తెలంగాణ ఎన్ఆర్ఐలు స్థాపించిన సంస్థ?
1) తెలంగాణ ప్రజాఫ్రంట్
2) తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ 3) తెలంగాణ జేఏసీ 4) తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?