భారత రాష్ట్రపతి తన రాజీనామా పత్రాన్ని ఎవరికి సమర్పించాలి?
భారత ఎన్నికల వ్యవస్థ
(డిసెంబర్ 31 తరువాయి)
36. కింది వాటిలో సరికానిది ఏది?
1. అధికరణ 326 వయోజన ఓటు హక్కు
2. ఓటింగ్ వయోపరిమితిని 61వ సవరణ ద్వారా తగ్గించారు
3. మొదటి మధ్యంతర ఎన్నికలు 1977లో నిర్వహించారు
4. ఇప్పటివరకు అన్ని సాధారణ ఎన్నికల్లో 14వ లోక్‌సభ ఎన్నికల్లోనే అధిక శాతం పోలింగ్ నమోదైంది
1) 4 2) 3, 4
3) 3 4) 1, 3, 4
37. సీఐటీయూ ఏ ప్రధాన రాజకీయ పార్టీకి అనుబంధంగా ఉంది?
1) భారత జాతీయ కాంగ్రెస్
2) సీపీఐ (ఎం)
3) బీజేపీ 4) సీపీఐ
38. ఉపరాష్ట్రపతి పదవికి సంబంధించి కింది వాటిలో సరికానిది ఏది?
1) 35 ఏళ్లు నిండి ఉండాలి
2) పార్లమెంటుకు ఎన్నిక కావొద్దు
3) రాజ్యసభకు ఎన్నిక కావడానికి అర్హతలు ఉండాలి
4) భారతీయ పౌరుడై ఉండాలి
39. భారత్‌లో రాజకీయ పార్టీలకు సంబంధించి కింది అంశాలు పరిశీలించండి.
1. 1951 ప్రజాప్రాతినిథ్య చట్టం ప్రకారం రాజకీయ పార్టీలను రిజిస్ట్రేషన్ చేయించాలి
2. రాజకీయ పార్టీల రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది
3. జాతీయ పార్టీగా ఒక రాజకీయ పార్టీ గుర్తింపు పొందాలంటే నాలుగు రాష్ర్టాల్లో రాష్ట్ర పార్టీగా గుర్తింపు పొందాలి
4. 1999 సాధారణ ఎన్నికల సమయంలో ఎన్నికల సంఘంచే రిజిస్టర్ చేసిన ప్రాంతీయ పార్టీలు 48, జాతీయ పార్టీలు 6 ఉన్నాయి
1) 1, 2, 4 2) 1, 3
3) 2, 4 4) 1, 2, 3, 4
40. కింది వాటిని జతపరచండి.
అధికరణ అంశం
1. 325 అధికరణ ఎ) కుల, మత, వర్గ, వర్ణ భేదం ఆధారంగా ఓటు హక్కు నిరాకరించొద్దు
2. 326 అధికరణ బి) సార్వత్రిక వయోజన ఓటు హక్కు
3. 327 అధికరణ సి) శాసనసభ ఎన్నికల చట్టాలు
1) 1-బి, 2-ఎ, 3-సి
2) 1-బి, 2-సి, 3-ఎ
3) 1-ఎ, 2-బి, 3-సి
4) 1-సి, 2-బి, 3-ఎ
41. కింది వాటిలో ద్విపార్టీ వ్యవస్థకు చేకూరే అతి ముఖ్యమైన ప్రయోజనం ఏది?
1) ఎన్నికల వ్యయం తగ్గుతుంది
2) ఈ వ్యవస్థలో ప్రభుత్వాలు మరింత స్థిరంగా ఉంటాయి
3) పార్టీ క్రమశిక్షణా రాహిత్యం కనీస స్థాయికి తగ్గిపోతుంది
4) పత్రికలు, పార్టీ కార్యకలాపాలను పూర్తిగా నివేదిస్తాయి
42. అధికారంలో ఉన్న పార్టీ, సాధ్యమైనన్ని ఎక్కువ స్థానాలు చేజిక్కించుకోవడానికి సరిహద్దులను మార్చడాన్ని ఏమంటారు?
1) కాలయాపన చేయడం
2) కుతంత్ర పన్నాగం
3) గిల్లెటిన్ 4) లాగ్ రోలింగ్
43. కింది వాటిని జరిగా జత చేయండి
సంఘటనలు సంవత్సరం
ఎ) భారతీయ జనతా 1. 1990
పార్టీ ఏర్పాటు
బి) మండల్ కమిషన్ 2. 1980 అంగీకారం
సి) భారతీయ రాష్ట్రంలో 3.1967
మొదట కమ్యూనిస్టు పార్టీ ప్రభుత్వం ఏర్పాటు
డి) 42వ సవరణ బిల్లు 4.1976
5. 1947
1) ఎ-1, బి-2, సి-4, డి-5
2) ఎ-1, బి-2, సి-3, డి-4
3) ఎ-2, బి-1, సి-3, డి-4
4) ఎ-2, బి-1, సి-4, డి-5
44. కింది విధానాల్లో రాజకీయ పార్టీకి మాత్రమే చెందేది, ప్రాబల్య వర్గానికి చెందని విధి ఏది?
1) సంస్థ కోసం డబ్బు వసూలు చేయడం
2) సొంత చిహ్నంతో రాజకీయ ఎన్నికల్లో పోటీ చేయడం
3) బహిరంగ సమావేశాలు, ర్యాలీలు
నిర్వహించడం
4) కరపత్రాలు ప్రచురించడం
45. ఏకసభ్య నియోజకవర్గం కంటే బహుసభ్య నియోజకవర్గం శ్రేష్ఠమవడానికి కారణం?
1) ఎన్నికల్లో పోటీ చేయడానికి బలహీన వర్గాల వారికి మంచి అవకాశాలు కల్పించడం
2) ఉప ఎన్నికలు నిర్వహించడం సులభం కావడం
3) మరింత స్థిరమైన ప్రభుత్వాన్ని
ఏర్పరచడం
4) తమ ప్రతినిధులను ఎన్నుకోవడంలో ప్రజలకు మరింత స్వేచ్ఛ ఇవ్వడం
46. ఎన్నికల విధానానికి పార్టీ వ్యవస్థకు మధ్య సంబంధాన్ని ఏర్పరిచే సిద్ధాంతాన్ని ఏమంటారు?
1) మోస్కా సిద్ధాంతం
2) రాబర్ట్ మైకేల్ సిద్ధాంతం
3) వెబర్ సిద్ధాంతం
4) డవెర్గర్ సిద్ధాంతం
47. భారతదేశంలో అన్ని రాజకీయ పార్టీలకు మూలం ఎందులో ఉంది?
1) పార్లమెంట్ 2) లోక్‌సభ
3) ప్రజలు 4) రాజ్యాంగం
48. కింది వాటిలో భారత ఎన్నికల సంఘం విధులు కానివి ఏవి?
1. లోక్‌సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికలను
నిర్వహించడం
2. రాష్ట్ర శాసనసభలకు ఎన్నికలు నిర్వహించడం
3. ఎన్నికలకు సంబంధించిన అన్ని అనుమానాలపై వివాదాలపై నిర్ణయాలు తీసుకోవడం
1) 1, 2 2) 1, 3
3) 2, 3 4) 2
49. కింది వాటిలో ఏ ఎన్నికల వ్యవస్థలను పలు భారత ఎన్నికల్లో అనుసరించలేదు.
1. వయోజనుల ఓట్ల ద్వారా ప్రత్యక్ష
ఎన్నికల వ్యవస్థ
2. ఏక ఓటు బదిలీ ద్వారా నైష్పత్తిక ప్రాతినిథ్య వ్యవస్థ
3. జాబితా ద్వారా నైష్పత్తిక ప్రాతినిథ్య వ్యవస్థ
4. క్యుములేటివ్ ద్వారా పరోక్ష ఎన్నికలు
1) 1, 2 2) 1, 3
3) 2, 3, 4 4) 3, 4
50. కింది వాటిని సరిగా జత చేయండి.
పార్టీలు కార్మిక సంఘాలు
ఎ) భారత జాతీయ 1. సీఐటీయూ
కాంగ్రెస్
బి) భారతీయ 2. ఏఐటీయూసీ జనతా పార్టీ
సి) భారత కమ్యూనిస్టు పార్టీ 3. బీఎంఎస్
డి) భారత కమ్యూనిస్టు
(మార్క్సిస్ట్) పార్టీ 4. ఐఎన్టీయూసీ
5. బీకేఎస్
1) ఎ-3, బి-4, సి-2, డి-1
2) ఎ-4, బి-3, సి-1, డి-5
3) ఎ-3, బి-4, సి-1, డి-5
4) ఎ-4, బి-3, సి-2, డి-1
కేంద్ర ప్రభుత్వం
1. భారత రాష్ట్రపతి తన రాజీనామా పత్రాన్ని ఎవరికి సమర్పించాలి
1) ప్రధానమంత్రి
2) సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
3) ఉపరాష్ట్రపతి
4) లోక్‌సభ స్పీకర్
2. కింది వాటిలో సరైనవి ఏవి?
1. రాష్ర్టాల ఎన్నికల కమిషనర్లను గవర్నర్లు నియమిస్తారు, రాష్ట్రపతి తొలగిస్తారు
2. రాష్ర్టాల ఎన్నికల కమిషనర్‌ను రాష్ట్ర గవర్నర్ తొలగిస్తారు
3. రాష్ర్టాల ఎన్నికల కమిషనర్లను గవర్నర్ నియమిస్తారు, గవర్నర్ తొలగిస్తారు
1) 1 2) 2 3) 3 4) 2, 3
3. ఒకవేళ ఉపరాష్ట్రపతి తన పదవికి రాజీనామా చేయాలనుకుంటే తన రాజీనామా పత్రాన్ని ఎవరికి సమర్పించాలి?
1) రాష్ట్రపతికి 2) లోక్‌సభ స్పీకర్‌కు
3) రాజ్యసభ డిప్యూటీ చైర్‌పర్సన్‌కు
4) ప్రధానమంత్రికి
4. రాష్ట్రపతి పాలనకు సంబంధించి సరికానిది ఏది?
1) ఒక రాష్ట్రంలో విధించబడిన రాష్ట్రపతి పాలన కాలపరిమితి 6 నెలలు
2) రాష్ట్రపతి పాలన గరిష్ఠ కాలపరిమితి 5 సంవత్సరాలు
3) పార్లమెంటు సాధారణ తీర్మానం ద్వారా రాష్ట్రపతి పాలన రద్దు చేయవచ్చు
4) రాష్ట్రపతి సాధారణ ప్రకటన ద్వారా రద్దు చేయవచ్చు
5. కింది వాటిని జత పరచండి
జాబితా-1 జాబితా-2
ఎ) ముఖ్యమంత్రి 1. జాతి అధినేత
బి) భారత రాష్ట్రపతి 2. రాష్ట్ర ప్రభుత్వ
అధినేత
సి) ఉప రాష్ట్రపతి 3. రాష్ట్ర
రాజ్యాంగాధినేత
డి) గవర్నర్ 4. రాజ్యసభ చైర్మన్
1) ఎ-4, బి-2, సి-3, డి-4
2) ఎ-2, బి-1, సి-4, డి-3
3) ఎ-3, బి-4, సి-2, డి-1
4) ఎ-1, బి-2, సి-3, డి-4
6. కింది వాటిలో అత్యవసర పరిస్థితిలో సరైనవి ఏవి?
1. రాష్ట్రపతి 20, 21 అధికరణంలో పొందుపర్చబడిన హక్కులు మినహాయించి మిగిలిన ప్రాథమిక హక్కులను 368వ అధికరణం
ద్వారా తాత్కాలికంగా సస్పెండ్ చేయవచ్చు
2. 353వ అధికరణం ప్రకారం కేంద్రం జారీ చేసే ఆదేశాలను రాష్ర్టాలు తప్పనిసరిగా అమలు చేయాలి
1) 1 2) 2 3) 1, 2 4) ఏవీ కావు
7. భారత ప్రధాని విషయంలో కింది వాటిలో ఏది సత్యం?
1) రాష్ట్రపతి ప్రధానమంత్రిని నియమిస్తాడు
2) పార్లమెంటు ప్రధానిని ఎన్నుకుంటుంది
3) ప్రధానిని లోక్‌సభ ఎన్నుకుంటుంది
4) ప్రధాని లోక్‌సభలో పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా పని చేస్తాడు
8. రాష్ట్రపతి వీటో చేయని అంశాలు కింది వాటిలో ఏవి?
1. ఆర్థిక బిల్లులు
2. రాష్ర్టాల పునర్వ్యవస్థీకరణ బిల్లులు
3. రాజ్యాంగ సవరణ బిల్లులు
1) 1, 2 2) 2, 3
3) 1, 3 4) 1, 2, 3
9. పార్లమెంటును నిరవధికంగా వాయిదా వేసే అధికారం ఎవరికి ఉంది?
1) భారత రాష్ట్రపతికి 2) సభాపతికి
3) సభలో అధిక సంఖ్యాబలం గల పక్షాన్ని నడిపే నాయకుడికి
4) పై వారిలో ఎవరికీ లేదు
10. కింది వాటిని జతపర్చుము
ఎ) పార్డన్ 1. శిక్ష అమలును
వాయిదా వేయడం
బి) రెమిషన్ 2. పెద్ద శిక్షను చిన్న
శిక్షగా మార్చడం
సి) కమ్యూటేషన్ 3. శిక్షా కాలంలో
మార్పు
డి) రిప్రైల్ 4. క్షమాభిక్ష
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-2, బి-1, సి-3, డి-4
3) ఎ-4, బి-3, సి-2, డి-1
4) ఎ-4, బి-3, సి-1, డి-2
11. కింది వారిలో తక్కువ కాలం నుంచి ఎక్కువ కాలం ప్రధానులుగా పని చేసిన వారిని వరుస క్రమంలో అమర్చుము
1. వీపీ సింగ్ 2. ఐకే గుజ్రాల్
3. దేవెగౌడ 4. చంద్రశేఖర్
1) 1, 2, 3, 4 2) 4, 3, 2, 1
3) 3, 2, 1, 4 4) 4, 1, 3, 2
12. కింది ఎవరి ఎన్నికల్లో నైష్పత్తిక ప్రాతినిథ్య ఏక ఓటు బదిలీ పద్ధతిని ఉపయోగిస్తారు?
1) లోక్‌సభ సభ్యులు
2) భారత ఉపరాష్ట్రపతి
3) రాష్ట్ర విధాన సభ సభ్యులు
4) లోక్‌సభ స్పీకర్
13. కింది వాటిని జత పర్చుము
అధికరణ అప్పీళ్లు
ఎ) 132వ 1. రాజ్యాంగ బద్ధమైనవి
బి) 133వ 2. సివిల్
సి) 134వ 3. క్రిమినల్
డి) 136వ 4. ప్రత్యేకమైన
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-2, బి-1, సి-4, డి-3
3) ఎ-3, బి-2, సి-4, డి-1
4) ఎ-4, బి-3, సి-2, డి-1
14. భారతరత్న అవార్డు పొందని రాష్ట్రపతి ఎవరు?
1) జాకీర్‌హుస్సేన్ 2) వీవీ గిరి
3) డాక్టర్ అబ్దుల్ కలాం
4) ఆర్ వెంకట్రామన్
15. భారత రాష్ట్రపతి ఎన్నిసార్లు తిరిగి ఎన్నిక కావడానికి అర్హుడు?
1) రెండుసార్లు 2) మూడుసార్లు
3) నాలుగుసార్లు 4) ఎన్నిసాైర్లెనా
16. కింది వాటిలో రాష్ట్రపతి పదవికి ఉండాల్సిన అర్హత కానిది ఏది?
1) స్పీకర్‌గా ఎన్నిక కావాలి
2) 35 ఏళ్ల వయస్సు ఉండాలి
3) భారతదేశ పౌరుడై ఉండాలి
4) లాభసాటి పదవుల్లో ఉండరాదు
17. కింది పదవుల్లో దేనితో ప్రధానమంత్రి పదవిని పోల్చి చూడొచ్చు?
ఎ) కేబినెట్ అధినేత
బి) విదేశీ సంబంధాల విషయాలపై ముఖ్య ప్రతినిధి
సి) రాజ్య అధిపతి
డి) పార్లమెంట్ నాయకుడు
సరైన జవాబును ఎంపిక చేయండి
1) ఎ, సి 2) సి, డి
3) ఎ, బి, సి 4) ఎ, బి, డి
18. ఉప రాష్ట్రపతి గురించి రాజ్యాంగంలోని ఏ భాగంలో పేర్కొన్నారు?
1) 5వ భాగం 2) 4వ భాగం
3) 6వ భాగం 4) 7వ భాగం
19. సాధారణంగా ఉప రాష్ట్రపతి పదవీకాలం?
1) 5 ఏళ్లు 2) 6 ఏళ్లు
3) రాజ్యాంగం నిర్ణయించలేదు
4) పైవేవీ కావు
20. ప్రధానమంత్రి పదవీ కాలం ఎంత?
1) 5 సంవత్సరాలు
2) ఎన్నికలు జరిగే వరకు
3) రాజ్యాంగం నిర్ణయించలేదు
4) రాష్ట్రపతి సంతృప్తి మేరకు
21. కింది వారిలో ఎవరిని జాతి నాయకుడు అంటారు?
1) రాష్ట్రపతి 2) ప్రధానమంత్రి
3) లోక్‌సభ స్పీకర్ 4) ఉప రాష్ట్రపతి
టాపర్స్ ఇన్స్టిట్యూట్,
మేడిపల్లి, హైదరాబాద్ 9652578639
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు