To soften a tough feeling | కఠినమైన భావాన్ని మృదువుగా చెప్పడమే?
అర్థ పరిణామం
-విపరిణామం అంటే మార్పు భాషలో వర్ణాలు, ధ్వనులు, వాక్య నిర్మాణం, వ్యాకరణ నిర్మాణం ఒకటేమిటి ప్రతిదీ మారిట్లుగానే అర్థాలు కూడా మారుతుంటాయి. కాలానికి అనుగుణంగా ఒక పదానికి ఉన్న అర్థంలో మార్పు సంభవించడం సహజం. ఈ మార్పును అర్థ విపరిణామం అంటారు. తెలుగులో మొదటిసారిగా అర్థవిపరిణామం గురించి తెల్పినవారు ఆచార్య జీఎన్ రెడ్డి. ఈయన రాసిన గ్రంథం A Study of Telugu Semantics
అర్థ పరిణామం-రకాలు
-1897లో ఫ్రెంచి భాషావేత్త మైఖేల్ బ్రెయిల్ La Semantique అనే గ్రంథాన్ని ప్రచురించాడు. అర్థ విజ్ఞానానికి సంబంధించిన మొదటి గ్రంథం ఇది. అర్థపరిణామంలోని రకాలను మైఖేల్ బ్రెయిల్ స్థూలంగా 11 రకాలుగా విభజించారు. అవి..
అర్థవ్యాకోచం
-అర్థంవ్యాకోచం అవడమే అర్థవ్యాకోచం. అంటే మొదట పరిమితార్థాన్ని బోధించే ఒక పదం కాలక్రమంలో విస్తృతార్థాన్ని బోధిస్తే అది అర్థవ్యాకోచం.
ఉదా: ఐష్టెశ్వర్యాలు, ధర్మరాజు, మహారాజు, కమ్మ, చెంబు, గంగ, భీముడు, గ్లాసు, నూనె, తైలం, అవధాని, నారదుడు, రాక్షసులు, అష్టకష్టాలు.
అర్థసంకోచం
-అర్థంసంకోచం చెందడమే అర్థసంకోచం. అంటే విశాలమైన అర్థాన్ని బోధించే ఒకపదం సంకుచితార్థాన్ని లేదా తక్కువ అర్థాన్ని బోధిస్తే అది అర్థ సంకోచం.
ఉదా: సాహెబు, పెద్ద, సాంవత్సరికం, శార్థం, ఆరాధ్యుడు, చీర, కోక, సంభావన, నెయ్యి, మధుపర్కాలు, తద్దినం, ఉద్యోగం, చాడీ, పత్రం, సందూక, మృగం, వ్యవసాయం, వస్తాదు.
అర్థసౌమ్యత
-నిందార్థం నుంచి గౌరవార్థంలోకి రావడం. ప్రాచీన కాలంలో నిందార్థంలో వాడబడిన పదాలు, సామన్య అర్థంలో వాడబడిన పదాలు కొన్ని నేడు గౌరవార్థాన్ని సంతరించుకున్నాయి. ఇలా మారడాన్ని అర్థ సౌమ్యత లేక అర్థోత్కర్ష లేక అర్థగౌరవం అంటారు.
ఉదా: వైతాళికుడు, అదృష్టం, అంతస్తు, సభికులు
అర్థగ్రామ్యత
-గౌరవార్థం నుంచి నిందార్థంలోకి రావడం. జన వ్యవహారంలో ఉన్న మౌలిక అర్థానికి నష్టం కలిగి లేదా బాధ కలిగి పరిహాసార్థంలో కానీ, నిందార్థంలోకానీ, నిమ్నార్థంలోకానీ పదం వాడితే దాన్ని అర్థగ్రామ్యత లేదా అర్థాపకర్ష అంటారు.
ఉదా: కళావంతులు, గ్రహచారం, కర్మ, చాందసుడు, కంపు, అసహ్యం, ఘటం, సాని, విధవ, సన్యాసి, శనిగ్రహం, ముండ, వ్యంగ్యం, పూజ్యం, స్వాహా, కైంకర్యం, దేవదాసి.
అలంకారిక ప్రయోగం
-అలంకార ప్రియత్వంతో అలంకారికంగా చెప్పడం. పోలికలు చేర్చడంవల్ల కూడా అర్థ పరిణామం జరుగుతుంది.
ఉదా: ఆమె రంభ, అతడు మన్మథుడు, వాడు సిసింద్రీ, కుండపోత వర్షం, ఎండనిప్పులు చెరుగుతుంది, కందిరీగ నడుము.
మృదూక్తి
-మనస్సులో కఠినమైన భావాన్ని మృదువుగా చెప్పడాన్నే మృదూక్తి అంటారు.
ఉదా: దీపం కొండెక్కింది- దీపం ఆరిపోయింది
సూత్రం పెరిగిపోయింది- తెగిపోయింది
నల్లపూసలు పెరిగిపోయాయి- తెగిపోయాయి
సభ్యోక్తి
-సభలో గాని, సమావేశంలో గాని మాట్లాడే మాటలు సభ్యోక్తితో కూడుకున్నవి.
ఉదా: చనిపోవు, మూత్రవిసర్జన, మల విసర్జన, మలం, మల విసర్జన ప్రదేశం, కడుపులో ఉంది, కులాల పేర్లు
లక్ష్యార్థ సిద్ధి
-భాషలోని అనేక పదాలు లక్ష్యార్థాల్లో రూఢికెక్కడం సహజం. ఈ లక్ష్యార్థాలకు అనేక మూలాలు ఉంటాయి. ఆధారం-ఆదేయం, కార్యం-కారణం, కార్యం-కర్త, ఉపమానం-ఉపమేయం, అంగం-అంగి, ఏకదేశం-అన్యదేశ్యం మొదలైన జంటల్లో ఒకటి ఇంకొకదానికి వాచకమై కాలక్రమేణా వ్యవహరించబడుతుంటాయి.
ఉదా: ముష్టి, దాహం, సూది
ముష్టి { పిడికిలి (ప్రసిద్ధి)
భిక్షం (రూఢ్యార్థం)
-ముష్టి అనే పదానికి ప్రసిద్ధమైన అర్థం పిడికిలి. కాని ముష్టి అనే పదానికి ఆధారాదేయ సంబంధం వల్ల భిక్షం అనే అర్థం వచ్చింది.
దాహం { దహించడం, తపించడం (ప్రసిద్ధి)
దప్పిక, పానీయం (రూఢ్యార్థం)
సూది { బట్టలు కుట్టే సూది
డాక్టర్లు పేషెంట్లకు ఉపంయోగించేది
కేవల సంకేతార్థాలు
-ఒక పదం జనవ్యవహారంలో ఒక అర్థమిస్తూ ఉండగా, ఏదో ఒక వృత్తినో, విజ్ఞానరంగాన్నో అంటిపెట్టుకున్న వారికి ఆ పదం ఒక ప్రత్యేక అర్థాన్నిస్తే దాన్ని అర్థసంకేతం అని అంటారు.
ఉదా: వాయువు, ద్రవ్యం, ఇంధనం
-వాయువు అంటే గాలి అని సామాన్యమైన అర్థం. ఇదే పదానికి పశువైద్య శాస్త్రంలో పశువులకు వచ్చే వ్యాధి.
-ద్రవ్యం అంటే ధనం, డబ్బు అని సామాన్యమైన అర్థం. దీనికి ఆధునిక విజ్ఞాన శాస్త్రంలో పదార్థం అని అర్థం.
-ఇంధనం అంటే చిదుగు, వంట చెరకు అని సామాన్యమైన అర్థాలున్నాయి. దీనికే ఉష్ణశక్తినిచ్చే చమురు, బొగ్గు, కట్టె మొదలైన అర్థాలున్నాయి.
వస్తుపరిణామం
-ఒక పదం అది సూచించే వస్తురూపం, నిర్మాణం మొదలైన వాటిలో కాలక్రమేణా వ్యవహారంలో ఎంతో భేదాన్ని సంతరించుకుంది. దీన్నే ఇంగ్లిష్లో Subreption అని అంటారు.
ఉదా: లక్కపిడతలు, ఆయుధం
-లక్కపిడతలు= పూర్వం లక్కతో చేసిన బొమ్మలను లక్కపిడతలు అనేవారు. ఇప్పుడు కర్రతో చేసిన వాటిని కూడా ఆ పేరుతో వ్యవహరిస్తున్నారు.
-ఆయుధం= విల్లు, గద, కత్తి మొదలైనవి ప్రాచీన ఆయుధాలు తుపాకి, రైఫిల్, ఫిరంగి మొదలైనవి నేటి ఆయుధాలు.
లోక నిరుక్తి
-కొంతమంది తనకు బాగా పరిచయమైన పదాలను తనకు పరిచయంలేని పదాల స్థానంలో చేర్చి వ్యవహరిస్తారు. తర్వాత అపరిచితమైన పదమే సామాన్య జనవ్యవహారంలో బహుళ ప్రాచుర్యాన్ని పొందుతుంది. ఇలాంటి మార్పుని లోకనిరుక్తి అని అంటారు. దీన్నే జననిరుక్తి అని కూడా అంటారు.
ఉదా: నారద సింహాచలం, మక్కజొన్న, ఓవరాయిలింగ్, మధురవాడ, బోరన్మిఠాయి, చక్కెరకేళి, ఆకాశరామన్న, ఆరంజోతి, శ్రీమంతం, అనిరుద్రుడు, రుషికేశవా, కార్చిచ్చు.
ప్రాక్టీస్ బిట్స్
1. చీర, కోక ….?
1) అర్థవ్యాకోచం 2) అర్థసంకోచం
3) అర్థసౌమ్యత 4) అర్థగ్రామ్యత
2. తెలియని పదం స్థానంలో తెలిసిన పదాన్ని చేర్చి పలకడం వల్ల ఆ పదం అలానే స్థిరపడిపోవడాన్ని ఏమంటారు?
1) లక్ష్యార్థ సిద్ధి 2) మృదూక్తి
3) జననిరుక్తి 4) వస్తువిపరిణామం
3. కింది వాటిలో లక్ష్యార్థ సిద్ధికి ఉదాహరణ పదం కానిది?
1) ముష్టి 2) దాహం 3) సూది 4) ఆయుధం
4. ధర్మరాజు ….?
1) అర్థసౌమ్యత 2) అర్థగ్రామ్యత
3) అర్థవ్యాకోచం 4) అర్థసంకోచం
5. ముహూర్తం, అదృష్టం?
1) అర్థోత్కర్ష 2) అర్థాపకర్ష
3) అర్థసౌమ్యత 4) లక్ష్యార్థ సిద్ధి
6. చందమామ, అరుంధతి, చక్కెరకేళి?
1) వస్తువిపరిణామం 2) జననిరుక్తి
3) లక్ష్యార్థసిద్ధి 4) అలంకారిక ప్రయోగం
7. స్వయంవరం ….?
1) అర్థసంకోచం 2) అర్థవ్యాకోచం
3) అర్థగ్రామ్యత 4) అర్థసౌమ్యత
8. చనిపోయాడు అనకుండా శివైక్యం పొందాడు అనడం?
1) మృదూక్తి 2) లోకనిరుక్తి
3) సభ్యోక్తి 4) అర్థాపకర్ష
9. కుండలు నిండుకున్నాయి ….?
1) జన నిరుక్తి 2) లోకనిరుక్తి
3) అలంకారిక ప్రయోగం 4) లక్ష్యార్థ సిద్ధి
10. కళాకారుడు అనే పదం?
1) అర్థ వ్యాకోచం 2) అర్థ సంకోచం
3) అర్థ సౌమ్యత 4) అర్థ గ్రామ్యత
11. గంగ, అంతస్థు ….?
1) అర్థ వ్యాకోచం, అర్థ సంకోచం
2) అర్థ సంకోచం, అర్ధ గ్రామ్యత
3) అర్థ వ్యాకోచం, అర్థ సౌమ్యత
4) అర్థ గ్రామ్యత, అర్థ సౌమ్యత
12. మక్కజొన్న, ఇల్లు?
1) జననిరుక్తి, లక్ష్యార్థసిద్ధి
2) లోకనిరుక్తి, వస్తువిపరిణామం
3) అలంకారిక ప్రయోగం, అర్థసౌమ్యత
4) అర్థగ్రామ్యత, అర్థ సౌమ్యత
13. ప్రాచీనకాలంలో నిందార్థంలో ఉన్నపదం, నేటి కాలంలో గౌరవార్థంలోకి రావడాన్ని ఏమంటారు?
1) అర్థ గ్రామ్యత 2) జననిరుక్తి
3) అర్థసౌమ్యత 4) ఏదీకాదు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు