కర్పూరాన్ని శుద్ధి చేయడానికి అనువైన ప్రక్రియ?
పదార్థం
1. ఏ స్థితిలో అణువుల మధ్య ఆకర్షణబలాలు అత్యల్పం?
ఎ) వాయుస్థితి బి) ద్రవస్థితి
సి) ఘనస్థితి
డి) అన్నింటిలో సమానం
2. వాయువులకు సంబంధించి సరికాని వాక్యం ఏది?
ఎ) వాయు అణవుల మధ్య ఖాళీ ప్రదేశం అత్యధికంగా ఉంటుంది
బి) వాయువును తేలికగా సంపీడనం చెందించవచ్చు
సి) వాయువుపై పీడనం కలిగిస్తే ఘనపరిమానం తగ్గుతుంది
డి) వాయువులకు నిర్దిష్టమైన ఆకృతి ఉంటుంది
3. పదార్థపు నాలుగో రూపంగా దేన్ని పరిగణిస్తారు?
ఎ) సూపర్ ద్రవం బి) ద్రవస్ఫటికాలు
సి) ప్లాస్మా డి) మెత్తని స్ఫటికం
4. కింది వాటిలో భౌతిక చర్యలు ఏవి?
1. మంచు నీరుగా మారడం
2. గ్లాసులోని నీరు బాష్పీభవనం(ఆవిరి)
చెందడం
3. ఇనుము తుప్పు పట్టడం
4. నీరు మంచుగా మారడం
ఎ) 1, 2, 3 బి) 2, 3, 4
సి) 1, 2, 4 డి) 1, 3, 4
5. వేడిచేసినప్పుడు ఘనపదార్థం ద్రవరూపంలోకి మారకుండా నేరుగా వాయు రూపంలోకి మారడాన్ని ఏమంటారు?
ఎ) బాష్పీభవనం బి) ఘనీభవనం
సి) ఉత్పతనం డి) ప్లవనం
6. ఉత్పతనం చెందే ధర్మం ఉన్న పదార్థాలు ఏవి?
1. కర్పూరం 2. నాఫ్తలిన్
3. అమ్మోనియం క్లోరైడ్ 4. అయోడిన్
ఎ) 1 బి) 1, 2
సి) 1, 2, 3 డి) అన్నీ
7. ప్లేటులో ఉంచిన కర్పూరం కొన్ని గంటల తరువాత చిన్నదిగా కావడానికి కారణం?
ఎ) మండిపోవడం
బి) కరిగి పోవడం
సి) ఉత్పతనం చెందడం
డి) ద్రవీభవనం చెందడం
8. సినిమాల్లో, స్టేజీ షోల్లో కృత్రిమ పొగను సృష్టించడానికి డ్రై ఐస్‌ను ఉపయోగిస్తారు.
పొగలు ఏర్పడటంలోని ప్రక్రియ?
ఎ) ద్రవీభవనం బి) బాష్పీభవనం
సి) ఘనీభవనం డి) ఉత్పతనం
9. మూతతీసిన పాత్రలోగల పెట్రోల్ కనిపించకుండా పోవడానికి కారణం?
ఎ) ఉత్పతనం బి) ద్రవీభవనం
సి) బాష్పీభవనం డి) ఘనీభవనం
10. మెగ్నీషియం తీగను గాలిలో మండించినప్పుడు మిరుమిట్లు గొలిపే కాంతితో మండి ఏర్పరిచే తెల్లని బూడిదను ఏమంటారు?
ఎ) మెగ్నీషియం ఆక్సైడ్
బి) మెగ్నీషియం కార్బైడ్
సి) మెగ్నీషియం సల్ఫైడ్
డి) మెగ్నీషియం కార్బొనేట్
11. వడపోత ద్వారా వేరు చేయగలిగే మిశ్రమం?
ఎ) చక్కెర జలద్రావణం
బి) బ్రైన్ ద్రావణం
సి) ఉప్పు జల ద్రావణం, ఇసుక
డి) పాలు, నీరు
12. కర్పూరాన్ని శుద్ధి చేయడానికి అనువైన ప్రక్రియ?
ఎ) బాష్పీభవనం బి) వడపోత
సి) ద్రవీభవనం డి) ఉత్పతనం
13. పెట్రోలియంలోని సాధారణ అనుఘటకాలను వేరు చేసే ప్రక్రియ?
ఎ) ఉత్పతనం బి) స్వేదనం
సి) అంశికస్వేదనం డి) క్రొమటోగ్రఫీ
14. సెంటు సీసా మూత తీస్తే వాసన గది అంతా వ్యాప్తి చెందడంలో ఇమిడి ఉన్న ప్రక్రియ?
ఎ) అధిశోషణం బి) వ్యాపనం
సి) పొర్లిపోవడం డి) అభిశోషణం
15. వేడిచేసినప్పుడు వాయువుల ఘనపరిమాణం?
ఎ) తగ్గుతుంది బి) పెరుగుతుంది
సి) మార్పులేదు
డి) వాయుస్వభావంపై ఆధారపడుతుంది
16. వాయువును ద్రవీకరించడానికి అనుకూల పరిస్థితులు?
1. సంపీడనం చెందించడం
2. అత్యల్ప ఉష్ణోగ్రతలు
3. వ్యాకోచింప చేయడం
4. అత్యధిక ఉష్ణోగ్రతలు
ఎ) 1, 2 బి) 1, 4
సి) 2, 1 డి) 2, 3
17. పరమ శూన్య కెల్విన్ (00K) ఉష్ణోగ్రతకు సమానమైనది?
ఎ) 00C బి) 2730C
సి) -2730C డి) 370C
18. కింది వాటిలో కొల్లాయిడ్కు ఉదాహరణ ?
ఎ) పాలు బి) చక్కెర ద్రావణం
సి) బురద నీరు డి) నీటిలో నూనె
19. సబ్బును ఉపయోగించి నీటితో శుభ్రం చేసి వెన్న, గ్రీజు వంటి పదార్థాలను తొలగించవచ్చు. ఈ ప్రక్రియలో జరిగేది ?
ఎ) ఎమల్సీకరణం బి) సస్పెన్షన్
సి) ఆస్మాసిస్ డి) ద్రవీకరణం
20. రక్తం అనేది ఏ విధమైన కొల్లాయిడ్?
ఎ) నీరు, కార్బోహైడ్రేట్లు
బి) నీరు అల్బుమినాయిడ్ కణాలు
సి) నీరు, కొవ్వుకణాలు
డి) నీరు, క్లోరోఫిల్
21. చీకటి గదిలోకి చిన్న రంధ్రం ద్వారా కాంతి వచ్చినప్పుడు కాంతి మార్గం కనిపించడానికి కారణం?
ఎ) టిండాల్ ప్రభావం
బి) బ్రౌనియన్ చలనం
సి) క్రాంప్టన్ ప్రభావం
డి) కాంతి విద్యుత్ ఫలితం
22. కొల్లాయిడ్ల ప్రత్యేక ధర్మమైన టిండాల్ ప్రభావానికి కారణం?
ఎ) కాంతి పరిక్షేపణం
బి) కాంతి విశ్లేషణ
సి) కాంతి పరావర్తనం
డి) కాంతి వక్రీభవనం
23. ఒకదానిలో ఒకటి కలవని ద్రవయానకంలో ద్రవం ప్రావస్థగా గల కొల్లాయిడ్‌ను ఏమని పిలుస్తారు?
ఎ) సాల్ బి) జెల్
సి) ఏరోసాల్ డి) ఎమల్షన్
24. కింది వాటిలో ఎమల్షన్ రూపంలోని కొల్లాయిడ్లు ఏవి?
1. రక్తం 2. పెయింట్
3. పాలు 4. వెన్న
5. ఐస్‌క్రీం
ఎ) 4, 5 బి) 2, 3
సి) 1, 2, 3 డి) 1, 2, 3, 4, 5
25. ఏరోసాల్కు ఉదాహరణ?
ఎ) పొగ బి) వెన్న
సి) జున్ను డి) రక్తం
26. నూనె, నీరు అమిశ్రణీయాలు, కానీ కొంచెం సబ్బు కలిపి గిలకరిస్తే కలిసిపోతాయి. ఇది కింది వాటిలో ఏ ప్రక్రియ?
ఎ) స్కంవనం బి) ఎమల్సీకరణం
సి) ద్రవాభిసరణం డి) జలీకరణం
27. కింది వాటిలో మిశ్రమం ఏది?
ఎ) సున్నం బి) టేబుల్ సాల్ట్
సి) చక్కెర డి) సముద్రపు నీరు
28. కింది వాటిలో దేని రసాయన చర్యల వల్ల ఇంకా విచ్ఛిత్తి చేయడం కుదరదు?
ఎ) వెండి బి) సుక్రోజ్
సి) నీరు డి) గాలి
29. గాలి ఒక మిశ్రమం. గాలిలో ఉండని వాయువు ఏది?
ఎ) కార్బన్ డై ఆక్సైడ్ బి) క్లోరిన్
సి) హీలియం డి) నియాన్
30. కింది వాటిలో ఏది రసాయన చర్య?
ఎ) గ్లాసులోని నీటిలో మంచుముక్క
కరిగిపోవడం
బి) అత్యధిక వేడికి అల్యూమినియం పాత్ర కరిగిపోవడం
సి) బ్లీచింగ్ వల్ల టీషర్టు రంగు మారిపోవడం
డి) చలికాలంలో కొబ్బరినూనె గడ్డ కట్టడం
31. పాలను కింది విధమైన కొల్లాయిడ్గా పరిగణించవచ్చు?
ఎ) కొవ్వు విస్తరించి ఉన్న నీరు
బి) కొవ్వు విస్తరించి ఉన్న రక్తం
సి) నీరు విస్తరించి ఉన్న కొవ్వు
డి) నీరు విస్తరించి ఉన్న నూనె
32. కింది వాటిలో సమ్మేళనం కానిది ఏది?
ఎ) కోక్ బి) చక్కెర
సి) నీరు డి) ఉప్పు
33. మూత్రపిండాలు పాడైపోతే కృత్రిమ పద్ధతిలో రక్తాన్ని శుద్ధిచేసే డయాలిసిస్‌లో ఇమిడి ఉన్న ప్రక్రియ?
ఎ) క్రొమటోగ్రఫీ బి) కేశనాళికీయత
సి) ద్రవాభిసరణం
డి) సాధారణ వడపోత
34. ఉప్పు నీటి నుంచి స్వచ్ఛమైన జలం పొందే ప్రక్రియ?
ఎ) ద్రవాభిసరణం
బి) తిరోగామి ద్రవాభిసరణం
సి) వ్యాపనం డి) వడపోత
35. గాలితో నింపిన బెలూన్ను వేడినీటిలో పెడితే దాని పరిమాణం?
ఎ) తగ్గుతుంది బి) పెరుగుతుంది
సి) మార్పుండదు డి) చెప్పడం కష్టం
36. పర్వతారోహకులు ఎక్కువ ఎత్తుపై గురయ్యే ‘ఉత్థాన అస్వస్థత’కు కారణం?
ఎ) ఎక్కువ ఆక్సిజన్ అందడం
బి) తక్కువ ఆక్సిజన్ అందడం
సి) అలసిపోవడం
డి) ఎక్కువ కార్బన్ డై ఆక్సైడ్
37. వేడి చేసినప్పుడు నూనె?
ఎ) స్నిగ్ధత పెరగడం వల్ల చిక్కబడుతుంది
బి) స్నిగ్ధత తగ్గడం వల్ల పలుచబడుతుంది
సి) అలాగే ఉంటుంది
డి) నూనె స్వభావంపై ఆధారపడుతుంది
38. గాలి అనేది?
ఎ) మూలకం బి) సమ్మేళనం
సి) మిశ్రమం డి) సంయోగ పదార్థం
39. 00C కంటే తక్కువ ఉష్ణోగ్రత కోసం మంచు ముక్కలకు కలిపేది?
ఎ) సోడియం క్లోరైడ్ బి) సున్నం
సి) సిమెంట్ డి) ఇథైల్ ఆల్కహాల్
40. కింది వాటిలో ఏది రసాయన చర్య?
ఎ) గాలిలో బొగ్గును మండించడం
బి) అయోడిన్ ఉత్పతనం
సి) మైనం కరిగించడం
డి) ఇనుప ముక్కను అయస్కాంతీకరించడం
41. కింది వాటిలో ఏది భౌతిక మార్పు?
ఎ) పాలను పెరుగుగా మార్చడం
బి) లవణాన్ని నీటిలో కరిగించడం
సి) కర్రముక్కను మండించడం
డి) మైనం మండించడం
42. ఉత్పతనం చెందని పదార్థం?
ఎ) యూరియా బి) పొడి మంచు
సి) నాఫ్తలిన్ డి) అయోడిన్
43. గుడ్డు పై పెంకును జాగ్రత్తగా ఆమ్లంలో కరిగించి ఉప్పునీటిలో ఉంచితే అది?
ఎ) ఇంకా లావు అవుతుంది
బి) కుచించుకుపోతుంది
సి) కరిగిపోతుంది
డి) మాయమవుతుంది
44. హైడ్రోజన్, ఆక్సిజన్‌లలో ఏది త్వరగా వ్యాపనం చెందుతుంది?
ఎ) తక్కువ అణుభారం ఉన్న హైడ్రోజన్
బి) ఎక్కువ అణుభారం ఉన్న ఆక్సిజన్
సి) రెండూ సమానం
డి) పరిస్థితులపై ఆధారపడుతుంది
45. ప్రకృతిలో లభించిన ముడిపదార్థం?
ఎ) నీరు బి) పెట్రోల్
సి) వినైల్ క్లోరైడ్ డి) కార్బన్ డై ఆక్సైడ్
46. కాంతి వేగం?
ఎ) 3×108 m/s బి) 0
సి) అనంతం డి) 3×108 cm/s
47. పరమాణువులోని కేంద్రక వ్యాసం?
ఎ) 10-10 cm బి) 10-8 cm
సి) 10-13 cm డి) 10-15 cm
48. డాల్టన్ సిద్ధాంతం ప్రకారం పదార్థపు అతి చిన్న కణం ఏది?
ఎ) పరమాణువు బి) అణువు
సి) ప్రోటాన్ డి) న్యూట్రాన్
49. పరమాణు కేంద్రకంలో ఉండే కేంద్రక కణాలు ఏవి?
1. ఎలక్ట్రాన్లు 2. ప్రోటాన్లు
3. న్యూట్రాన్లు
ఎ) 1, 2 బి) 2, 3
సి) 1, 3 డి) 1, 2, 3
50. ప్రాథమిక కణాలు ఏవి?
ఎ) ఎలక్ట్రాన్లు బి) ప్రోటాన్లు
సి) న్యూట్రాన్లు డి) అన్నీ
51. కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు తిరగడానికి గల కారణం?
ఎ) అభికేంద్ర బలం
బి) అపకేంద్ర బలం
సి) వాండర్ బలం
డి) అధిశోషణ బలాలు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు