(గ్రాడ్యుయేట్ స్కూల్ అడ్మిషన్స్)
జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పరిశోధనలకు పేరుగాంచిన సంస్థ..టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రిసెర్చ్ (టీఐఎఫ్ఆర్). మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, కంప్యూటర్‌సైన్స్, సైన్స్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్‌లలో ప్రవేశాల కోసం నిర్వహించే గ్రాడ్యుయేట్ స్కూల్ అడ్మిషన్స్ ప్రకటన విడుదలైన నేపథ్యంలో కోర్సులు, అర్హతలు, ప్రవేశాలు కల్పించే విధానం, క్యాంపసుల వివరాలు నిపుణ పాఠకుల కోసం…
టీఐఎఫ్ఆర్: ఈ సంస్థను ప్రఖ్యాత శాస్త్రవేత్త డా.హోమి భాభా 1945 జూన్‌లో ప్రారంభించారు. టాటా ట్రస్ట్ సహకారంతో దీన్ని ఏర్పాటుచేశారు. ఫండమెంటల్ సైన్సెస్, బయాలజీ, కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, సైన్స్ ఎడ్యుకేషన్లలో పరిశోధనల కోసం ప్రారంభించి కాలక్రమేణా పలు ఇతర ప్రోగ్రామ్స్, క్యాంపసులను ఏర్పాటుచేశారు.
జీఎస్-2023: ఎమ్మెస్సీ, పీహెచ్డీ, ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టెస్టే గ్రాడ్యుయేట్ స్కూల్ అడ్మిషన్స్ (జీఎస్-2023).
సబ్జెక్టులు-ప్రోగ్రామ్స్
మ్యాథమెటిక్స్
పీహెచ్డీ, ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ-పీహెచ్డీ ప్రోగ్రామ్:
ఈ ప్రోగ్రామ్‌ను ముంబైలోని టీఐఎఫ్ఆర్, బెంగళూరులోని సెంటర్ ఫర్ అప్లికేబుల్ మ్యాథమెటిక్స్ (సీఏఎం), బెంగళూరులోని ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ థియరిటికల్ సైన్సెస్ (ఐసీటీఎస్) కేవలం పీహెచ్డీ మాత్రమే.
అర్హతలు: పీహెచ్డీ కోర్సుకు – ఎంఏ/ఎమ్మెస్సీ/ఎంటెక్
ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీ: బీఏ/బీఎస్సీ లేదా బీఈ/బీటెక్
ఫిజిక్స్
పీహెచ్డీ, ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ-పీహెచ్డీ ప్రోగ్రామ్స్
ముంబైలోని టీఐఎఫ్ఆర్లోని కింది విభాగాలు పై ప్రోగ్రామ్స్‌ను అందిస్తున్నాయి.. డిపార్ట్మెంట్ ఆఫ్ ఆస్ట్రానమీ & అస్ట్రోఫిజిక్స్, డిపార్ట్మెంట్ ఆఫ్
కండెన్స్డ్ మ్యాటర్ ఫిజిక్స్ & మెటీరియల్స్ సైన్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ హై ఎనర్జీ ఫిజిక్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూక్లియర్ & అటామిక్ ఫిజిక్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ థియరిటికల్ ఫిజిక్స్.
పుణెలోని ఎన్సీఆర్ఏ, హైదరాబాద్‌లోని టీసీఐఎస్ పై ప్రోగ్రామ్స్‌ను అందిస్తున్నాయి.
నోట్: ఫిజిక్స్‌కు దరఖాస్తు చేసుకునేవారికి ఇండియన్ బేస్డ్ న్యూట్రినో అబ్జర్వేటరీ (ఐఎన్‌వో)లో గ్రాడ్యుయేట్ ట్రెయినింగ్ ప్రోగ్రామ్ (జీటీపీ)లో కూడా ప్రవేశాలు తీసుకోవచ్చు. అయితే దరఖాస్తు సమయంలో ఈ విషయాన్ని పేర్కొనాలి.
అర్హతలు: పీహెచ్డీ- ఎమ్మెస్సీ/ఎంఎస్ ఇన్ ఫిజిక్స్ లేదా తత్సమానకోర్సు.
ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీ-ఎంఈ/ఎంటెక్ లేదా బీఎస్సీ/బీఎస్ లేదా బీఈ/బీటెక్/ఇంజినీరింగ్ ఫిజిక్స్ లేదా తత్సమాన కోర్సు (కోర్సు కాలపరిమితి కనీసం మూడేండ్లు ఉండాలి)
ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీ- సంబంధిత సబ్జెక్టులో కనీసం నాలుగేండ్ల కోర్సు ఉత్తీర్ణత. అదేవిధంగా టీసీఐఎస్ నిర్వహించే రాతపరీక్ష తప్పనిసరిగా క్వాలిఫై కావాలి.
కెమిస్ట్రీ
పీహెచ్డీ, ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ-పీహెచ్డీ ప్రోగ్రామ్స్
ముంబైలోని టీఐఎఫ్ఆర్, హైదరాబాద్‌లోని టీసీఐఎస్
అర్హతలు: పీహెచ్డీ-ఎమ్మెస్సీ/బీఈ/బీటెక్ లేదా ఎంఫార్మా లేదా తత్సమాన డిగ్రీ ఉత్తీర్ణత.
ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీ – బీఎస్సీ/బీఫార్మా లేదా బీఎస్ లేదా తత్సమాన కోర్సు. బీఈ/బీటెక్ డిగ్రీ ఉన్నవారు ఆప్షనల్స్‌ను బట్టి ఎమ్మెస్సీ డిగ్రీకి ఎంపికచేస్తారు.
బయాలజీ
పీహెచ్డీ, ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ-పీహెచ్డీ ప్రోగ్రామ్స్
ముంబైలోని టీఐఎఫ్ఆర్, బెంగళూరులోని ఎన్సీబీఎస్, హైదరాబాద్‌లోని టీసీఐఎస్ (ఇక్కడ కేవలం పీహెచ్డీ, ఎమ్మెస్సీ-పీహెచ్డీ ప్రోగ్రామ్స్ మాత్రమే ఉన్నాయి)
అర్హతలు: పీహెచ్డీ- ఎమ్మెస్సీ ఫిజిక్స్/కెమిస్ట్రీ లేదా బయాలజీలో ఏదైనా బ్రాంచీ లేదా ఎంఫార్మా/ఎంటెక్ లేదా ఎంబీబీఎస్/ఎండీఎస్ లేదా తత్సమాన డిగ్రీ ఉత్తీర్ణత.
ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీ-బేసిక్ సైన్సెస్‌లో డిగ్రీ (ఫిజిక్స్/కెమిస్ట్రీ/బయాలజీలో ఏదైనా బ్రాంచీ) లేదా తత్సమాన కోర్సు/బీవీఎస్సీ, బీఫార్మా కంప్యూటర్ & సిస్టమ్స్ సైన్సెస్ (కమ్యూనికేషన్స్ అండ్ అప్లయిడ్ ప్రాబబులిటి)
పీహెచ్డీ ప్రోగ్రామ్
ముంబైలోని టీఐఎఫ్ఆర్
అర్హతలు: పీహెచ్డీ-బీఈ/బీటెక్ లేదా ఎంటెక్/ఎంఈ లేదా ఎంసీఏ లేదా ఎమ్మెస్సీలో కంప్యూటర్ సైన్స్ లేదా ఈసీఈ/ఈఈఈ లేదా సంబంధిత బ్రాంచీలు.
సైన్స్ ఎడ్యుకేషన్: పీహెచ్డీ ప్రోగ్రామ్
ముంబైలోని హోమిభాభా సెంటర్ ఫర్ సైన్స్ ఎడ్యుకేషన్ ప్రవేశాలు ఎలా కల్పిస్తారు…?
సైన్స్ ఎడ్యుకేషన్ తప్ప మిగిలిన అన్ని సబ్జెక్టులకు దేశవ్యాప్తంగా నిర్వహించే ఆన్లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు.
గమనిక: జీఎస్-2023 ద్వారానే కాకుండా సైన్స్ (కమ్యూనికేషన్, అప్లయిడ్ ప్రాబబులిటీ సబ్జెక్టులకు గేట్ స్కోర్ ఆధారంగా ప్రవేశాలు కలిస్తారు. బయాలజీ ఎకాలజీ అండ్ ఎవల్యూషన్ వారికి గేట్ స్కోర్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.
అదేవిధంగా ఫిజిక్స్/కెమిస్ట్రీ, బయాలజీ
సబ్జెక్టులకు గేట్/జెస్ట్, నెట్ ద్వారా కూడా
ప్రవేశాలు కల్పిస్తారు.
ఫెలోషిప్స్: అభ్యర్థులకు నిబంధనల ప్రకారం ఫెలోషిప్ ఇస్తారు.
ముఖ్యతేదీలు
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: అక్టోబర్ 31
ఎంట్రెన్స్ టెస్ట్ తేదీ: 2022, డిసెంబర్ 11
వెబ్సైట్: http://univ.tifr.res.in/admissions/GS2023
కోర్సు కాలవ్యవధి
పీహెచ్డీ ఐదేండ్లు
ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ-పీహెచ్డీ ఆరేండ్లు
ఎమ్మెస్సీ ప్రోగ్రామ్ వేర్వేరుగా ఉన్నాయి వివరాలు వెబ్సైట్లో చూడవచ్చు.
- Tags
- nipuna news
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు