తెలుగు సాహిత్య ప్రక్రియలు-నవల
సీరము సుభవూదాంబ రాసిన అపరాధ పరిశోధక నవల- జాగిలం
-ముప్పాళ్ల రంగనాయకమ్మ రచించిన నవలలు- పేక మేడలు, కృష్ణవేణి, స్వీట్ హోం, బలిపీఠం.
-పోరంకి దక్షిణామూర్తి రచించిన నవలలు- ముత్యాల పందిరి, వెలుగు-
-బతికిన కాలేజీ, నల్లరేగడి నవలల రచయిత- పాలగుమ్మి పద్మరాజు
-కనుపర్తి వరలక్ష్మమ్మ రచించిన నవల- వసుమతి
-వాసిడ్డి సీతాదేవి రచించిన నవలలు- సమత, మట్టిమనిషి, మరీచిక.
-ప్రభుత్వ నిషేధానికి గురైన నవల- మరీచిక.
-కాలాతీత వ్యక్తులు, అమృతం కురిసినరాత్రి నవలల రచయిత్రి- శ్రీదేవి.
-కొమ్మూరి వేణుగోపాలరావు రచించిన నవలలు- హౌస్ సర్జన్, పెంకుటిల్లు, ఒకే రక్తం- ఒకే మనుషులు.
-యుద్ధనపూడి సులోచనా రాణి రచించిన నవలలు- విజేత, శ్వేత-రాణి, జీవనతరంగాలు, సెక్రటరీ.
-నైమిషారణ్యం నవలా రచయిత- ఎన్ఆర్ నంది.
-రావూరి భరద్వాజ రచించిన నవలలు- పాకుడు రాళ్లు, కీలుగుర్రం, కరిమింగిన వెలగపండు, మణిమందిరం.
-2012కుగాను జ్ఞానపీఠ అవార్డు పొందిన నవల- పాకుడు రాళ్లు.
-సినీరంగంలో కథానాయికల జీవితాలను చిత్రీకరించిన నవల- పాకుడు రాళ్లు.
-మాలతీ చందూర్ రచించిన నవలలు- చంపకం, చెదపురుగులు, ఆలోచించు, హృదయనేత్రి.
-1992లో కేంద్రసాహిత్య అకాడమీ బహుమతి పొందిన నవల- హృదయనేత్రి.
-బీనాదేవి కలం పేరుతో బీ నర్సింగరావు రచించిన సుప్రసిద్ధ నవల- పుణ్యభూమి కళ్లు తెరువు.
-అంపశయ్య నవలా రచయిత- నవీన్. ఈయన అసలు పేరు దొంగరి మల్లయ్య. వరవర రావు సలహా మేరకు తన పేరును నవీన్గా మార్చుకున్నారు. చైతన్య స్రవంతి శిల్పంలో ప్రభావితమై పలు నవలలు రాశారు. అవి.. అంపశయ్య, ముళ్లపొదలు, అంతవూస్సవంతి, కాలరేఖలు, చెదిరిన స్వప్నాలు, బాంధవ్యాలు, రక్తకాసారం, చీకటిరోజులు, మహారణ్యం, తీరని దాహం, సౌజన్య, మౌనరాగాలు, తారు-మారు, దృక్కోణాలు.
-నవీన్ రచించిన మూడు నవలల్లో కథానాయకుడు రవి కావడంతో రవివూతయంగా ప్రసిద్ధిగాంచిన నవలలు- అంపశయ్య, ముళ్లపొదలు, అంతవూస్సవంతి.
-పూర్తిగా చైతన్య స్రవంతిలో సాగిన నవల- అంపశయ్య. ఇది విశ్వవిద్యాలయాల్లో విద్యార్థుల మనస్తత్వాన్ని కళ్లకు కట్టినట్లుగా చిత్రిస్తుంది.
-1944 నుంచి 1995 వరకు గల తెలంగాణ ప్రాంతపు సామాజిక, రాజకీయ, సాంస్కక్షుతిక చరివూతకు అద్దంపట్టే నవల- కాలరేఖలు. ఈ నవలకు 2004లో కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి లభించింది.
-అతడు అడవిని జయించాడు, మూగవాని పిల్లనక్షిగోవి నవలల రచయిత- కేశవడ్డి.
-వెన్నెల కాటేసింది, పిడికెడు ఆకాశం నవలల రచయిత- గొల్లపూడి మారుతీరావు.
-స్త్రీవాద దృక్పథంలో నవలలను రచించిన రచయిత్రి- ఓల్గా. ఈమె అసలు పేరు లలితకుమారి.
-ఓల్గా రచించిన నవలలు- స్వేచ్ఛ, ఆకాశంలో సగం, సహజ, మానవి.
-అహల్య నవలా రచయిత్రి- కుప్పిలి పద్మ.
-చిలుకూరి దేవపుత్ర రచించిన నవల- అద్దంలో చందమామ.
-కే రామలక్ష్మి రచించిన నవలలు- ద్రౌపది, ప్రేమించు ప్రేమకై, నన్ను వెళ్లిపోనీయరా.
-రుతుచక్రం నవలా రచయిత్రి- మాదిడ్డి సులోచన.
-శ్వేతనాగు నవలా రచయిత్రి- లల్లాదేవి.
-మునిమాణిక్యం నరసింహారావు రచించిన నవల- వృద్ధాప్యం.
-పాతాళభైరవి నవలా రచయిత- ఏవీ నర్సింహం.
-నిశ్శబ్ద యుద్ధం నవలా రచయిత- శాతవాహనుడు.
-వేంకట పార్వతీశ్వర కవులు రచించిన నవల- శ్యామల.
-మంజుశ్రీ రచించిన నవల- నూరు శరత్తులు
-చంద్రలత రచించిన నవల- రేగడివిత్తులు.
-ముదిగంటి సుజాతాడ్డి రచించిన నవలలు- మలుపు తిరిగిన రథచక్షికాలు, సంకెళ్లు తెగాయి, ఆకాశంలో విభజన రేఖల్లేవు.
-బీఎస్ రాములు రచించిన నవల- బతుకుపోరు.
-బీఎన్ శాస్త్రి రచించిన నవలలు- విప్లవజ్వాల, తుక్కాదేవి, వాకాటక మహాదేవి, రాధ, సంధ్యారాగం, పరివర్తన, జీవన పథం.
-తెలంగాణ సాయుధ పోరాటాన్ని చిత్రిస్తూ కందిమళ్ల ప్రతాపడ్డి రచించిన నవల- బందూక్.
-తిరునగరి రచించిన నవల- సంగం.
-తెలంగాణ సాయుధపోరాట కాలంలోని పల్లెల పరిస్థితిని ప్రజాజీవితాన్ని చిత్రిస్తూ వాస్తవిక దృష్టిలో బీఎన్ రెడ్డి రచించిన నవలిక- ఆయువుపట్టు.
-ప్రాణ్రావు రచించిన నవలలు- మలగని బత్తి, రుద్రమదేవి.
-బోయ జంగయ్య రచించిన నవలలు- జగడం, జాతర.
-కొల్లు మధుసూదనరావు రచించిన నవల- శిక్ష.
-కొట్ర మల్లికార్జున శర్మ రచించిన నవల- స్వర్ణలత.
-ముడుంబై పురుషోత్తమాచార్యులు రచించిన నవల- నీడలేని చెట్లు.
-బోయినిపల్లి వెంకటరామారావు రచించిన నవల- జీవితబంధాలు.
-వసంతరాయ్ రచించిన నవలలు- ఆత్మబలి, భగ్నవూపేమికులు, ప్రేమాలయం, ఇదీ ఈ దేశ కథ, మన్నే బంగారం, మగువ తిరగబడితే, జడ్జిమెంటు.
-విప్లవోద్యమ నేపథ్యంలో అల్లం రాజయ్య రచించిన నవలలు- కొలిమంటుకున్నది, అగ్నికణం, భూమి, వసంతగీతం.
-అల్లం రాజయ్య సాహుతో కలిసి రచించిన నవల-కొమురం భీమ్.
-వసంతరావు దేశ్పాండే గిరిజనుల పోరాట చైతన్యాన్ని చిత్రిస్తూ రచించిన నవలలు- అడవి, ఊరు.
-పులుగు శ్రీనివాస్ విప్లవోద్యమ చైతన్యం నేపథ్యంలో రచించిన నవలలు- అన్నలు, అడవి తల్లి.
-తుమ్మేటి రఘోత్తండ్డి సింగరేణి కార్మికుల సమస్యలను, వ్యథలను చిత్రిస్తూ రచించిన నవల- నల్లవజ్రం.
-సింగరేణి బొగ్గు కార్మికుల ఉద్యమాన్ని చిత్రిస్తూ పీ చంద్ రచించిన నవలలు- మహేంద్ర, శేషగిరి.
-జోగినుల జీవితాలను, క్షోభలను చిత్రిస్తూ శాంతి ప్రబోధ రచించిన నవల- జోగిని.
-అమృతలత రచించిన నవల- సృష్టిలో తీయనిది.
-గీతకార్మికుల సమస్యలను చిత్రిస్తూ నేరెళ్ల శ్రీనివాస్ గౌడ్ రచించిన నవల- బ్రతుకుతాడు.
-దిలావర్ రచించిన నవలలు- సమిధలు, ముగింపు, తుషార గీతిక. విద్యార్థుల క్యాంపస్ జీవితాలు, వారిమీద ఉన్న ప్రభావాలను చిత్రించే నవల- సమిధలు.
-విప్లవకవిగా ప్రసిద్ధిగాంచిన చెరబండరాజు విప్లవ నిబద్దతతో గ్రామీణ ప్రజల సంఘర్షణలను, పోరాటాలను చిత్రిస్తూ రచించిన నవలలు- నిప్పురాళ్లు, మాపల్లె, ప్రస్థానం, దారి పొడుగునా.
-పట్టణీకరణను నిరసిస్తూ భూపాల్ రచించిన నవలిక- పట్నమొచ్చిన పల్లె.
-తెలంగాణ దళిత బహుజనుల జీవితాలు, సంస్కక్షుతి పండుగలను చిత్రిస్తూ తిరుపతయ్య రచించిన నవలలు- బతుకు, జీవన సమరం.
-దళిత చైతన్యాన్ని చిత్రిస్తూ వేముల ఎల్లయ్య రచించిన నవలలు- కక్క, సిద్ది.
-దళిత సంస్కక్షుతిని, జీవిత విధానాన్ని వాస్తవికంగా పాత్రచివూతణలో ప్రతిబింబింపజేస్తూ, దళితుల నిత్యజీవితంలోని భాషయాసల్లో రాసిన మొదటి నవల- కక్క.
-దళితుల జీవితాన్ని చిత్రిస్తూ కదిరె కృష్ణ రచించిన నవల- పొద.
-దళితుల జీవితాలను ప్రతిబింబింపజేస్తూ జాజులగౌరి రచించిన నవలలు- మన్నుబిడ్డ, వొయనం. ఒక దళిత స్త్రీ వ్యవసాయం చేసేటప్పుడు ఎదుర్కొనే సమస్యలను చిత్రిస్తూ రాసిన నవల- మన్నుబిడ్డ. దళితుల జీవితాల్ని, ఆచారవ్యవహారాలను చిత్రిస్తూ మాదిగ సమాజంలోని అధికార సంబంధాలను తెలిపే నవల- వొయనం.
-2016కు గాను తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారం లభించిన నవల వొయనం.
-మాలల సంస్కక్షుతిని, జీవితవిధానాన్ని వాస్తవికంగా పాత్రచివూతణలో ప్రతిబింబింపజేస్తూ భూతం ముత్యాలు రచించిన నవలలు- సూర, పురుడు, ఇగురం.
-దళితుల జీవితాన్ని చిత్రిస్తూ గుండెపంగు వరకుమార్ రచించిన నవలలు- నేను బానిసనా?, మైల.
-లంబాడాల జీవితాన్ని చిత్రిస్తూ దశరథ్ రచించిన నవలలు- శతాబ్దాల నిశ్శబ్దం, తెగిపడిన సంకెళ్లు.
-తిరుకోవలూరు శశిరేఖ రచించిన నవల- కాలానికి సమాధి.
-తెలంగాణ గ్రామీణ జీవితాన్ని చిత్రిస్తూ ఇల్లిందల సరస్వతీదేవి రచించిన నవల- బాంచెన్ కాల్మొక్త.
-వెంపో రచించిన నవలలు- ఈ దేశం నాది, వెలుతురు మలుపులు.
-భూదానోద్యమాన్ని వస్తువుగా తీసుకొని రచించిన నవల- ఈ దేశం నాది. తెలంగాణలో ఆర్యసమాజ ఉద్యమాన్ని చిత్రిస్తూ రాసిన నవల – వెలుతురు మలుపులు.
-తెలంగాణ బహుజనుల జీవితాన్ని, సంస్కక్షుతిని చిత్రిస్తూ కాలువ మల్లయ్య రచించిన నవలలు- భూమి పుత్రుడు, సాంబయ్య చదువు, మాట్లాడే బొమ్మలు, బతుకు పుస్తకం.
-పెద్దింటి అశోక్కుమార్ రచించిన నవలలు- ఎడారి మంటలు, దాడి, నెత్తుటి ధార, హక్కుల యోధుడు, భూదేవి, జిగర్. బతుకు సాగక వలసలుపోయే ప్రజల జీవితాలను చిత్రిస్తూ రాసిన నవల ఎడారి మంటలు. నీటి సమస్య ప్రధాన ఇతివృత్తంగాగల నవల దాడి. ఆటావారి నవలా రచన పోటీలో బహుమతి పొందిన నవల జిగర్. ఇది హిందీ, పంజాబీ, ఇంగ్లిష్ భాషల్లోకి అనువదించబడింది.
-విప్లవోద్యమంపై సానుభూతిని చూపే విద్యార్థుల జీవితాలను చిత్రిస్తూ నందిగం కృష్ణారావు రచించిన నవల- చీకట్లో నల్ల పిల్లి.
-1969లో జరిగిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని ప్రధాన ఇతివృత్తంగా తీసుకుని పరవస్తు లోకేశ్వర్ రచించిన నవల- సలాం హైద్రాబాద్. ఇది నవలలా సాగిన చరిత్ర వృత్తాంతం. గతంలోకి, వర్తమానంలోకి మారుతూ తెలంగాణ చారివూతక, సామాజిక, సాంస్కక్షుతిక, రాజకీయ పరిస్థితులను వివరిస్తుంది. ఈ నవలా కాలం క్రీ.శ. 1578 నుంచి 1790 జూలై 10 వరకు. స్వామి అనే ఒక విద్యార్థి ఆత్మకథగల నవల ‘సలాం హైద్రాబాద్’.
-తెలంగాణ ప్రాంతీయ అస్తిత్వవాదాన్ని ప్రతిబింబించే నవల ‘సలాం హైద్రాబాద్’. ఈ నవలకు తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారం లభించింది.
-డా. శంకరయ్య రచించిన నవల- దూరపు కొండలు. అమెరికాలో స్థిరపడిన భారతీయుల కుటుంబ జీవిత పరిస్థితులను చిత్రిస్తూ రాసిన నవల ఇది. దీనికి సీపీ బ్రౌన్ అకాడమీ, నవ్య వారపవూతికలు సంయుక్తంగా నిర్వహించిన నవలల పోటీలో లక్ష రూపాయల బహుమతి లభించింది.
-తెలంగాణ భాష, నుడికారాలతో మలయశ్రీ రచించిన నవల- నిర్ణయం.
-పట్టణాల్లో స్త్రీలు ఎలాంటి స్వేచ్ఛ లేకుండా హింసలకు గురికావడాన్ని చిత్రిస్తూ గీతాంజలి రచించిన నవల- ఆమె అడవిని జయించింది.
-తాడిగిరి పోతరాజు రచించిన నవల- మట్టి బొమ్మలు, పావురాలు. తెలంగాణ సాయుధ పోరాటకాలంలో రజాకార్ల దురాగతాలను తెలియజేస్తూ రచించిన నవల పావురాలు.
-హైదరాబాద్ పట్టణ జీవితం, సంస్కక్షుతులను వివరిస్తూ భాస్కరభట్ల కృష్ణారావు రచించిన నవలలు- యుగసంధి, వెల్లువలో పూచికలు.
-అంటరాని వసంతం నవలా రచయిత- కళ్యాణరావు.
-ముస్లింల జీవన విధానాన్ని, ఆచార వ్యవహారాలను చిత్రిస్తూ సలీం రాసిన నవల- వెండి మేఘం. తెలుగులో వెలువడిన తొలి ముస్లిం నవల ఇది.
-పోల్కంపల్లి శాంతాదేవి రచించిన నవలలు- అష్టదళం, బాటసారి, చండీవూపియ, కన్నెవాగు-కోడెనాగు, మాయలేడి, మంచుముత్యం, మణిదీపం, పువ్వుల పడవ, పెళ్లి మంటలు, ప్రేమ కావ్యం.
నవలా సాహిత్యంపై వెలువడిన పరిశోధనా గ్రంథాలు
1. తెలుగు నవలల్లో కుటుంబ జీవన చిత్రణ
– డా. సీ ఆనందరామం
2. తెలుగు నవలల్లో సామాజిక చైతన్యం
– డా. పి. సంజీవమ్మ
3. తెలంగాణ విమోచనోద్యమం-తెలుగు నవల
– డా. పి. వరవరరావు
4. ఆధునిక తెలుగు నవలా రీతులు
– డా. యు. శ్రీరామ్మూర్తి
5. సాంఘిక నవల-కథన శిల్పం – డా. కె. మృణాళిని
6. తెలుగు నవలా సాహిత్యంలో మనో విశ్లేషణ
– కోడూరి శ్రీరామమూర్తి
7. చివరకు మిగిలేది (పరిశోధనా గ్రంథం)
– కాత్యాయని విద్మహే
8. వేయిపడగలు-ఒక పరిశీలన – ముదిగొండ వీరభవూదయ్య
9. వేయిపడగలు-ఆధునిక ఇతిహాసం
– అనుమాండ్ల భూమయ్య
10. మన నవలలు-మన కథానికలు
– డా. రాచపాలెం చంద్రశేఖరడ్డి
11. తెలుగు నవలానుశీలనం – డా. ముదిగంటి సుజాతాడ్డి
12. తెలుగు నవల సాహిత్య వికాసం
– డా. పుల్లాభొట్ల వెంక
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు