‘దివానె రజాలత్’ అనే మంత్రి నిర్వర్తించే విధులు?
సుల్తాన్:
ఇస్లాం మత సిద్ధాంతానుసారం నిజమైన ముస్లిం ఎవరైనా సుల్తాన్ కావచ్చు. ఢిల్లీ సామ్రాజ్యాధీశుడు సుల్తాన్ సార్వభౌముడు, సర్వాధికారి, సర్వశక్తిమంతుడు. ముస్లింలలో ఎక్కువగా సున్ని, మిలత్ మతశాఖలవారందరికీ సార్వభౌమాధికారం ఉన్నట్లు తెలుస్తుంది. ఇస్లాం మతం ప్రకారం రాజ్యానికి భగవంతుడే రాజు. రాజ్యాన్ని పాలించే సుల్తాన్ భగవంతుని ప్రతిరూపం, ప్రతినిధి. ఖురాన్లో పేర్కొన్న దైవ సూత్రాలను అమలుపర్చుట సుల్తాన్ విధి. ధర్మసూవూతాలను అమలుపర్చుటలో ‘హదీర్’ అనేవారు సుల్తాన్‌కు సహకరించేవారు. వివాద విషయాలను న్యాయవాదులు, దైవజ్ఞులు తమ అభివూపాయాలను, ధర్మసూకా్ష్మలను సుల్తాన్‌కు తెలియపరుస్తారు. సుల్తాన్ ప్రధాన న్యాయాధికారి. అతనిదే తుది తీర్పు. అల్లాఉద్దీన్ ఖిల్జీ, మహ్మద్ బిన్ తుగ్లక్ ముస్లిం న్యాయశాస్త్రాన్ని ధిక్కరించి పరిపాలించారు. ఇస్లాం మత సిద్ధాంతాల ప్రకారం రాజ్యం ప్రజాస్వామ్య పద్ధతిలో ఉండాలి. వీరికాలంలో సుల్తాన్ ప్రజలకు రాజుగాను, సామ్రాజ్యంలోని ముస్లింలకు మతాధిపతిగాను ఉన్నారు.
అమాత్యులు:
అంటే మంత్రులు. పరిపాలనావసరాన్ని బట్టి మంత్రుల సంఖ్య మారుతుంది. ఢిల్లీని పాలించిన బానిస వంశ కాలంలో వజీర్, అరీజ్ ముమాలిక్, దివానె ఇన్షా, దివానె రజాలత్ అనే నలుగురు మంత్రులు ఉండేవారు. ‘నాయబె ముమాలిక్’ అనే మంత్రి ఒక్కోసారి సుల్తాన్ తరువాత పాలనాబాధ్యతలు నిర్వహించే అధికారం కలిగి ఉండేవాడు. ‘నాదిరుజ్ సుదూర్’, ‘దివానెఖాజా’ అనేవారికి మంత్రి హోదా ఉండేది.
వజీర్:
ఇతన్ని ప్రధానమంత్రి అని కూడా అంటారు. ప్రజలకు సుల్తాన్‌కు అనుసంధానకర్త. ముఖ్య అధికారులను నియమించే అధికారం కలిగి ఉండేవాడు. అధికారులపై వచ్చే ఫిర్యాదులను పరిశీలించేవాడు. సుల్తాన్ బాలుడైనా, అనారోగ్యంతో ఉన్నప్పుడు, రాజధానిలో లేని సమయంలో పరిపాలనాధికారాలు చెలాయించేవాడు. భూమి శిస్తు విధానాన్ని చూసే బాధ్యత ఉన్నవాడు. పన్నులు విధించటం, వ్యయాన్ని అదుపు చేయటం, సైనిక వ్యవస్థను నియంవూతించటం, విద్యావంతులకు, పేదలకు ఉపకారవేతనాలు కల్పించటం, రాజ్యంలోని అన్ని శాఖలను పర్యవేక్షించే అధికారం కలిగిఉండేవాడు. వజీర్ ఆఫీసును ‘దివానె వజారత్’ అనేవారు. ఈ ఆఫీసును చూసే అధికారులు ‘నాయబ్ వజీర్, ముష్రియె ముమాలిక్’, ముస్తాయుషీమె’, ‘ముమాలిక్’. తనిఖీ అధికారి గణకక్షిశేష్టుడు.
దివానె అరిజ్:
ఇతడు రక్షణ, సైనిక మంత్రి. సైనికులను నియమించి, సైనిక బలాన్ని పర్యవేక్షించే అధికారాలు ఉన్నాయి. వజీర్ పధానమంత్రి) తరువాత రాజ్యంలో ఇతడే ప్రముఖుడు. సైనికుల్లో క్రమశిక్షణను నెలకొల్పి, యుద్ధానికి అవసరమైన ఆయుధాలను పరిశీలించేవాడు. ఇతడు యుద్ధ విషయాల్లో ప్రతి అంశంలోనూ సుల్తాన్‌కు సలహాలిచ్చేవాడు.
దివానె ఇన్షా:
ఇతడు మూడో మంత్రి, ప్రభుత్వ ఉత్తరవూపత్యుత్తర విషయాలు చూసే మంత్రి. ఇతని కార్యాలయంలో ‘దబీర్ల్’ అనేవారు సహకరించేవారు. వీరు లేఖకులు. ఇతర దేశ రాజులు, సామంతులు, మాండలికులు, ప్రధానాధికారులకు మధ్య జరిగే రహస్య ఉత్తర ప్రత్యుత్తరాలను ఈ శాఖవారు చూసేవారు. ముఖ్యమైన రాజపవూతాలు భద్రపర్చేవారు.
దివానె రజాలత్:
ఇతడు ఢిల్లీ సుల్తానుల రాజ్యంలో నాలుగో మంత్రి. మతం, భక్తి, దానధర్మాలు, విద్యావిషయాలు, ఉపకారవేతనాలకు సంబంధించిన వ్యవహారాలు చూసేవాడు. విదేశీ వ్యవహార శాఖ కూడా చూసేవాడు. దూతలను, రాయబారులను నియమించుట, అన్యదేశాలకు పంపించుట, రాజవూపతినిధులను ఢిల్లీకి ఆహ్వానించటం ఇతని విధులు.
సదర్-ఉజ్-సుదూర్, దివానె ఖాజా:
ఈ ఇద్దరు మంత్రులు ధర్మాదాయ, న్యాయశాఖలను చూసేవారు. ఒక్కోసారి ఈ రెండు శాఖలను ఒకే మంత్రి చూసేవాడు. ఇస్లాం మతానికి చెందిన నియమ, నిబంధనలు ప్రజలు పాటించేటట్లు చూసేవారు. ముస్లిం దైవజ్ఞులకు, పండితులకు, భక్తులకు, సుల్తాన్ ఆజ్ఞతో దానధర్మాలు చేయటం ఈ శాఖ విధులు.
మజ్లిసెఖల్వత్:
ఇది సుల్తాన్‌కు ఒక సలహా మండలి. ఇందులో సుల్తాన్ స్నేహితులు, విధేయులైన అధికారులు, ఉలేమాలోని పెద్దలు సభ్యులు. మంత్రులందరూ ఒకేసారి సుల్తాన్‌కు సహాయం అందించటానికి అవకాశం ఉండేది.
ఇతర శాఖలు
1) బందె మాలిక్: రహస్య సమాచార శాఖ, తపాలా శాఖ.
2) అమర్కోహి: వ్యవసాయ శాఖ
3) దివానె ముస్బాబ్ రాజ్: పన్నుల బకాయిలు వసూలు చేసే అధికారి
4) దివానె ఖైరాత్: ధర్మాదాయ శాఖ
5) దివానె ఇస్తివాఖాన్: రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లు ఇచ్చే శాఖ
6) ప్రధాన ఖాజీ: న్యాయశాఖాధిపతి (జిల్లాల్లో)
7) అమీదాద్: ముఖ్య పట్టణాల్లో న్యాయాధికారి
8) నాయబెదాద్బక్: నగరాల్లో న్యాయాధికారి
9) కొత్వాల్: రక్షణ శాఖ
రాజకుటుంబ ఆదాయ, వ్యయ నియంవూతణాధికారి:
సుల్తాన్ వ్యక్తిగత వ్యవహారాలు చూసే నియంవూతణాధికారి కింద సర్ ఇజందర్, దివానె బందగాన్ అనే అధికారులుండేవారు. కొన్ని సమయాల్లో వజీర్ కన్నా ఇతనికే ఎక్కువ అధికారాలు ఉండేవి.
రాజ్య విభజన:
13వ శతాబ్దంలో ఢిల్లీ సుల్తానుల సామ్రాజ్యాన్ని ఇక్తాలు (రాష్ట్రాలు)గా విభజించారు. ఇక్తాల పాలకులను ముక్తీలు అంటారు. నూతనంగా జయించిన ప్రాంతాలను పరిపాలించేవారిని నమీరులని, వలీలని పిలిచేవారు. ‘ముక్తీ’ల కన్నా వలీలకు ఎక్కువ హోదా, అధికారాలు ఉండేవి. ప్రతి రాష్ట్రంలో శిస్తు వసూలుకు నజీరులు, నఖాషీలు ఉండేవారు. రాష్ట్రాలు షిక్కాలుగా, షిక్కాలు పరగణాలుగా, పరగణాలను గ్రామాలుగా విభజించేవారు. షిక్కా పాలకుడు షిక్దార్. నూరు గ్రామాల కూటమి గల పాలనా పరిధి ప్రాంతాన్ని ‘సాది’ అని పిలిచేవారని ఇబన్ బటూటా రాశాడు. పరగణాల్లో చౌదరీలు శిస్తు వసూలు చేసేవారు. గ్రామాల్లో ‘చౌకీదార్’, ‘పట్వారీ’లు ప్రజల భూముల కొలతలు, శిస్తు వసూలు వంటి పనులు చేసేవారు. గ్రామాల్లో పంచాయతీలుండేవి. గ్రామ ప్రజలు పంచాయతీ సభ్యులను ఎన్నుకొనేవారు. గ్రామపంచాయతీలు గ్రామాల్లోని అన్ని సమస్యలను, బాధ్యతలను చూసేవారు.
సైనిక వ్యవస్థ:
ఢిల్లీ సుల్తానుల ప్రభుత్వం సైనిక అధికారంపై ఆధారపడి ఉంది. అపారమైన సైనిక సంపద కలిగి ఉంది. నాలుగు రకాల సైన్యం ఉండేది. 1) సుల్తాన్ వద్ద ఉండే శాశ్వత సైన్యం 2) రాష్ట్ర పాలకులు, రాజాస్థానంలోని అమీరులు, కులీనుల సైన్యం 3) యుద్ధ సమయాల్లో మాత్రమే నియమించే సైన్యం 4) మత యుద్ధాల (జిహాద్) కోసం ఏర్పడే సైన్యం. ఢిల్లీలో సుల్తాన్ సైన్యం, హష్మెకల్బ్ అనే రెండు విధాల సైన్యం ఉంది. సుల్తాన్ ప్రత్యక్ష పర్యవేక్షణలో ఉన్న సైన్యాన్ని ‘ఖసబ్ఖైల్’ అంటారు. ఇందులో ‘జందర్లు’ అనే రాజ బానిసలు, ‘అఫాజెకల్’ అనే రాజ అంగరక్షకులు ఉండేవారు. అల్లాఉద్దీన్ ఖిల్జీ కాలంలో సైనికులకు జీతభత్యాలు ఇచ్చేవారు. సుమారు 4,75,000 అశ్వికులు ఉండేవారు. సైన్యంలోని తెగలు ‘లోడీలు’, ‘గూర్లు’, ‘లోహనీలు’, ‘ఖార్మాలీలు’, ‘ఆఫ్ఘన్లు’ ఉండేవారు. కులీనులు, అమీర్ల సైన్యాన్ని యుద్ధ సమయాల్లో ‘దివానె అరబ్’కు అప్పగించేవారు. ‘జిహాద్ సైన్యం’ తాత్కాలిక కూలీ సైన్యం. జాతీయసైన్యం కాదు. వేతనాలుండవు. వీరికి యుద్ధ సమయాల్లో దోపిడీ ధనం లభించేది. ‘జిహాద్ సైన్యం’లో తురుష్కులు, తజిక్కులు, పర్షియన్లు, మంగోలులు, ఆఫ్ఘన్లు, అరబ్బులు, అబిసీనియన్లు, భారతదేశ ముస్లింలు, హిందువులు మొదలైన తెగలు ఉండేవారు. సుల్తాన్ సైన్యంలో గజ, అశ్వ, కాల్బలం ఉండేది. అందులో అశ్విక దళం శక్తిమంతమైనది. ప్రతి అశ్విక దళంలో మూడు రకాలు అశ్వికులు ఉండేవారు.
1) మురత్తాబ్: రెండు గుర్రాలున్నవారు
2) పవార్: ఒక్క గుర్రం ఉన్నవాడు
3) దో అస్పి: సైనికునిగా కాక, గుర్రాన్ని తోలుకొని వెళ్లే బంటు.
గుర్రాలు:
అరేబియా, టర్కిస్థాన్, రష్యా మొదలైన దేశాల నుంచి మేలు జాతి గుర్రాలను దిగుమతి చేసుకొనేవారు. కాల్బలం, సైనికులను పాయకులనేవారు.
యుద్ధ సామగ్రి:
చేతిబాంబులు, బాణాసంచా, రాకెట్లు, ఖనిజతైలపు బంతులు వాడేవారు. ఇంకా మండుతున్న బంతులు, రాళ్లు, రాతిగుండ్లు, ఇనుపగుండ్లు, లోహపు ముక్కలను, ఇత్తడి, రాగి తునకలు, ఫిరంగులను శత్రువులపై ఉపయోగించేవారు. పేలుడు పదార్థాలున్న కుండలవంటి వాటిని యుద్ధంలో వినియోగించేవారు. ఒక్కోసారి యుద్ధాల్లో విషపూరితమైన పాములు, తేళ్లను శత్రువులపై విసిరేవారు. ‘దివానె ఉరుజ్’ అనే సైనికమంత్రి కొత్తగా నియమించిన సైనికులకు శిక్షణ ఇప్పించి మంచి, చెడులు చూసేవారు. అల్లాఉద్దీన్ ఖిల్జీ గుర్రాలకు ముద్రలు వేసే పద్ధతి ప్రవేశపెట్టాడు.
సైన్యాన్ని దశాంశ పద్ధతిలో నిర్వహించేవారు.
1) పదిమంది సైనికుల అధికారి – సర్ఖేల్
2) పదిమంది సర్ఖేళ్లపై అధికారి – సిపేసాలార్
3) పదిమంది సిపేసాలార్లపై అధికారి – అమీర్
4) పదిమంది అమీర్‌లపై అధికారి – మాలిక్
5) పదిమంది మాలిక్‌లపై అధికారి – ఖాన్
-రణరంగంలో సైన్యాన్ని ఏడు విభాగాలుగా విభజించేవారు. సేనాముఖం, మధ్యసైన్యం, దక్షిణ సైన్యం, వాయు సైన్యం, అదనపు సైన్యం మొదలైనవి. అల్లాఉద్దీన్ ఖిల్జీ సైనికులకు ఏడాదికి 234 టంకాలు, సైన్యాధికారికి లక్ష టంకాల వేతనం ఇచ్చేవాడు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు