తెలుగు సాహిత్య ప్రక్రియలు – కథ
-తెలుగు సాహిత్యంలో కథ, కథానిక అనేవి పర్యాయపదాలుగా వాడబడుతున్నాయి.
-ప్రపంచ కథానికలకు ఆద్యవూబహ్మ అనదగినవాడు – గుణాఢ్యుడు. ఈయన పైశాచిక భాషలో బృహత్కథను రాశారు.
-కథానిక అని పేరు పెట్టినవారు – ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి.
-కథానిక అంటే చిన్నకథ. ఆంగ్లంలో Short Story కి సమానార్థకంగా తెలుగులో వాడబడుతున్న పదం కథానిక.
-కథానిక ప్రస్తావన గల పురాణం – అగ్ని పురాణం
-భయానక రసం, కరుణరసాత్మకమై, మిక్కిలి ఆహ్లాదాన్ని కలిగించేదిగా ఉంటూ, అద్భుతమైన విషయాలతో కూడుకొని సంక్షిప్తంగా చెప్పబడే ఉదాత్తమైన సాహితీ ప్రక్రియ కథానిక అని అగ్ని పురాణంలో ప్రస్తావించబడింది.
కథానిక నిర్వచనాలు
-సాధారణంగా నీతి విస్తక్షుతక్షేత్రం కలిగి ఒకానొక సంవేదనతో కూడి స్వయం సంపూర్ణమై దానిలోని విభిన్న తత్వాలను ఏకోన్ముఖంగా చూపే ఇతివృత్తాత్మక గద్య కవితా శిల్పఖండమును కథానిక అనవచ్చు- బొడ్డపాటి కుటుంబరాయశర్మ ( తెలుగు విజ్ఞాన సర్వస్వం)
-ఒక రకమైన ఎత్తుగడ, నడకతీరు, ముగింపు, పరిమితపావూతలు, ఆ పావూతలకు చక్కని పోషణ, వస్తువిన్యాస వైశిష్టం, ఒక జీవితసత్యాన్ని ప్రతిపాదించటం, అన్నిటినిమించి వస్తువైక్యత ఉండి వినోదమో, విజ్ఞానమో, వికాసమో కలిగించగల చిన్న కథ కథానిక- జీ నాగయ్య (తెలుగు సాహిత్య సమీక్ష రెండో సంపుటం)
కథానిక లక్షణాలు:
సంక్షిప్తత, సమక్షిగత, ఏకాక్షిగత, నిర్భరత
-తెలుగులో తొలి కథానికగా గురజాడ అప్పారావు 1910లో రచించిన ‘దిద్దుబాటు’ వూపసిద్ధిగాంచింది. కాని బండారు అచ్చమాంబ 1901లో రచించిన ‘లలితాశారదలు’ తెలుగులో తొలి కథానిక. 1902లో ఈమె రచించిన మరో కథానిక ‘ధనవూతయోదశి’.
-ఆధునిక తెలుగుకథకు ఆద్యురాలు – బండారు అచ్చమాంబ
-దిద్దుబాటు కథానికకు గురజాడ పెట్టిన మొదటిపేరు – కమలిని. ఇది 1910, ఫిబ్రవరిలో ఆంధ్రభారతి పత్రికలో ప్రచురింపబడింది. దిద్దుబాటులో నాయికా నాయకులు కమలిని, గోపాలరావు.
-గురజాడ రచించిన ఇతర కథానికలు – మీ పేరేమిటి, మతము, విమతము, మెటిల్డా, సంస్కర్త హృదయం, పెద్ద మసీదు.
-1903లో ఆచంట వేంకటసాంచ్ఛాయన శర్మ రచించిన కథానిక – లలిత.
-1912లో మాడపాటి హనుమంతరావు రాసిన కథ – హృదయశల్యం. ఈయన వెలువరించిన కథా సంపుటి – మల్లికాగుచ్ఛం.
-మాడపాటి హనుమంతరావు రచించిన ‘నేనే’ అనే కథలో కథానాయిక – హైమావతి.
-1913లో బండారు శ్రీనివాసరావు రాసిన కథ – రాజయ్య సోమయాజులు. ఇది 1914లో హితబోధిని పత్రికలో అచ్చయింది.
-సురవరం ప్రతాపడ్డి రచించిన కథలు – హుసేన్బీ, అపరాధం, వింతవిడాకులు, నిరీక్షణ, మొగలాయి కథలు, చంద్రయ్య భీమా, పెండ్లిబేరము.
-స్త్రీ పునర్వివాహమును చిత్రిస్తూ 1921లో షబ్నవీసు రచించిన కథ- బాలికావిలాపం.
-వెట్టిమాదిగ కథా రచయిత- భాగ్యడ్డివర్మ (ఇది తొలి దళితకథ).
-నిజాం సంస్థానం విలీనం ఇతివృత్తంగా నెల్లూరి కేశవస్వామి రచించిన కథ- యుగాంతం
-గొల్లరామవ్వ కథా రచయిత – పీవీ నరసింహారావు
-చింతా దీక్షితులు రచించిన కథలు – దాసరిపాట, కిష్కింధలో కోతి, అభివూపాయభేదం, పెద్దమేడ, గోదావరి నవ్వింది, చెంచురాణి, గాలిపాటు, సుగాలీకుటుంబం, స్వకీయ చరిత్ర, తాడివనంలో, ఊరిపేరు, దేశభక్తి, వటీరావు, శిలావూపతిమ మొదలైనవి. ఈయనకు గల బిరుదు – కథక చక్రవర్తి.
-శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి రచించిన కథలు – కలుపుమొక్కలు, గులాబి అత్తరు, వడ్లగింజలు, మార్గదర్శి, ఇలాంటి తవ్వాయి వస్తే, విషభుజంగం, ఆడపడుచు, తల్లివూపాణం, అన్నంతపనీ జరిగింది, తాపీమేస్త్రీ, రావు దీక్షితులు, బీఏ మొదలైనవి.
-వేలూరి శివరామశాస్త్రి రచించిన కథలు – నఖల్ హైద్రాబాద్, ఊరిబడి, జన్మాంతర సంబంధం, మాలదాసరి, మూడు తమాషాలు, రాచపట్టు, డిప్రెషన్చెంబు.
-మొక్కపాటి నర్సింహశాస్త్రి కథలు- చిత్రం, గత్యంతరం, భిక్షువు, మహత్తు, శిల్పిద్వయం, చావు తెలివి, పిలక మొదలైనవి.
-తెలంగాణ సాయుధపోరాట నేపథ్యంలో వట్టికోట ఆళ్వారుస్వామి రచించిన కథలు- జైలులోపల కథలు.
-విశ్వనాథ సత్యనారాయణ రచించిన కథలు- నీ ఋణం తీర్చుకున్న, మాక్లీ దుర్గంలో కుక్క, ముగ్గురు బిచ్చగాళ్లు, ఏమి సంబంధం, యోర్విష్ఖేయ్ మొదలైనవి.
-వస్తువులోనూ, శైలిలోనూ తెలుగుకథలో విప్లవాత్మకమైన మార్పు తీసుకువచ్చిన రచయిత- చలం. ఈయన రచించిన కథలు- ఓ పూవు పూసింది, ఆ రాత్రి, పాపఫలాలు, జలసి, హరిజన సమస్య, ఆమెపెదవులు, ఆమె త్యాగం, నేనేం చేశాను, దోషగుణం, కర్మమిట్లాకాలింది మొదలైనవి.
-అడవి బాపిరాజు రచించిన కథలు- హిమాలయరశ్మి, తిరుపతి కొండమెట్లు, నాగలి, శైలిబాల, భోగీరలోయ, కన్నీరు, తూలికానృత్యం, తరంగిణి, రాగమాలిక, అంజలి, నరసన్న పాపాయి, గుడ్డిపిల్ల, ద్వేషము మొదలైనవి.
-కనుపర్తి వరలక్ష్మమ్మ రచించినవి- ఒట్టు, మావూరు
-భమిడిపాటి కామేశ్వరరావు కథలు- దానికేమందు, మాటలేనా, మడతపేచీ, గుసగుస పెళ్లి, తోడుదొంగలు, సమస్య మొదలైనవి.
-మునిమాణిక్యం నరసింహారావు కథలు- కాంతం కథలు, శరవూదావూతులు, నేను- మా కాంతం.
-‘కరుణ కుమార’ కలం పేరుతో కందుకూరి అనంతం రచించిన కథలు- కయ్య కాలువ, బిల్లల మొలతాడు, ఆకలిమంటలు, రిక్షావాలా, మొక్కుబడి, కొత్త చెప్పులు, పోలయ్య, సన్నజీవాలు.
-తూడిపెద్ది వెంకటరమణ కథలు- రుమాలు, పుష్పక విమానం.
-కథకుల గురువుగా పేరుగాంచిన మల్లాది రామకృష్ణశాస్త్రి రచించిన కథలు- రంగవల్లి, మునిగోరింట, మత్తకోకిల, కామునిపున్నమి, వెన్నెల గులాబీలు, తపస్విలోకం, పంచ చామరం, చెంగలవ్వా, రజమంజరి, వనమాలి, రంగవల్లి, మాద్రి, నేతి నేతి, డుమువులు, చైత్రరథం, సర్వమంగళ.
-కొడవగంటి కుటుంబరావు కథలు- నీకేంకావాలి, దత్తపువూతుడు, అమాయకురాలు, కులద్వేషం, ఒంటిస్తంభం మేడ, నువ్వులు- తెలకపిండి, కొత్తజీవితం, తిండిదొంగ, ఆడజన్మ, లేచిపోయిన మనిషి, పాపఫలం, సుడిగుండాలు, ఫోర్త్ డైమన్షన్, పక్షి కోసం వెళ్లిన పంజరం మొదలైనవి.
-పాట్లపల్లి రామారావు రచించిన కథలు- జైలు, న్యాయం
-కాంచనపల్లి చిన వెంకట రామారావు రచించిన కథలు – దావతు, ఆకలి, చెరువొడ్డున (హిందూ,ముస్లిం దొరలు నీటిని పొలాలకందకుండా ఎత్తువేస్తే, హిందూ, ముస్లిం రైతులు ఏకమై పోరాడి గెలిచే ఇతివృత్తం గల కథ) మొదలైనవి.
-తెలంగాణ మంటల్లో కథ రచయిత- అయోధ్యరామకవి
-మంద రామాడ్డి రచించిన కథ- సర్కారు కిస్తు
-తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట నేపథ్యంలో ఆవుల పిచ్చయ్య రచించిన కథలు- ఈతగింజ ఇచ్చి తాటిగింజ లాగిన జమీందారు, దౌరా, ఊరేగింపులు, దినచర్య, వెట్టిచాకలి, ఈ కథలను సేకరించి వెలుగులోనికి తీసుకొచ్చిన పరిశోధకుడు సంగిశెట్టి శ్రీనివాస్.
-భాస్కరభట్ల కృష్ణారావు కథలు- చంద్రలోకానికి ప్రయాణం, కృష్ణారావు కథలు, వెన్నెలరాత్రి, ఇజ్జత్ మొదలైనవి.
-తెలంగాణ గ్రామీణ జీవన విధానాన్ని చిత్రిస్తూ పాకాల యశోదాడ్డి రచించిన కథలు మూడు సంపుటాలుగా వెలువడ్డాయి. అవి.. మా ఊరి ముచ్చట్లు, ఎచ్చమ్మ కథలు, ధర్మశాల.
-చరమరాత్రి కథ సంపుటి రచయిత – శ్రీశ్రీ. ఈ సంపుటిలోకి కథలు- అనామిక, హేమంతం, అశ్వమేధయాగం, కోనేటిరావు కథలు.
-చైతన్య ధోరణిలో కథలను రచించిన తొలి రచయిత – శ్రీశ్రీ
-త్రిపురనేని గోపిచంద్ రచించిన కథలు- ధర్మవడ్డీ, హిందూ పాతివూవత్యం, వెంకటాచలం పాత్ర, పీడిత హృదయం, కూపస్థ మండూకం, మమకారం, దేవుని జీవితం, దేశం ఏమయ్యేటట్టు, గీతాపారాయణం, ఆత్మవూదోహులు, భార్యల్లోనే ఉంది, జనాభా, ఆపద్బాంధవ్యం మొదలైనవి.
-పాలగుమ్మి పద్మరాజు కథలు- గాలివాన, పరిహారం, పడవ ప్రయాణం, కూలిజనం, వాసనలేని పువ్వులు, వెండిసీసా, సుబ్బి, ఆశాజీవులు. 1952లో న్యూయార్క్ హెరాల్డ్ ట్రిబ్యూన్ పత్రిక నిర్వహించిన అంతర్జాతీయ కథానికల పోటీల్లో ద్వితీయ బహుమతి పొందిన కథ- గాలివాన.
-ఇల్లిందల సరస్వతీదేవి రచించిన కథ లు- ముత్యాల మ నసు, స్వర్ణకమలా లు, పండుగ బహుమానం, జైలులోప ల, బలీయసీ కేవలమీశ్వరాజ్ఞ. తులసీదళాలు, స్నేహబం ధం, మనిషివేట, ఓల్డ్ఏజ్హోమ్, స్త్రీ నీకు రక్షణ ఎక్కడ? మొదలైనవి. కేంద్ర సాహిత్య అకాడమి, రాష్ట్ర సాహిత్య అకాడమి బహుమతులను పొందిన కథా సంపుటి- స్వర్ణకమలాలు
-బుచ్చిబాబు కథలు- తెరచాపదించిన పడవ, ఆరుగురు కథకులు, ఒక నాయిక, నన్నుగురించి కథ రాయవూ, ఊడిన చక్రం, వాడిన పుష్పం, కలలో జారిన కన్నీరు, ఆ వాడిన ఆకులు, నిరంతరవూతయం, కాలచక్రం నిలిచింది, ఆమెనీడ, మరమేకులూ- చీరమడతలు, మూడు కోతులు మొదలైనవి.
-మాధవపెద్ది గోపాలకృష్ణ గోఖలే కథలు – బండరాముడి పెళ్లి, బల్లకట్టు పాపయ్య, మూగజీవాలు, అభిమానం.
-చాగంటి సోమయాజులు రచించిన కథలు – వాయులీనం, పరవూబహ్మం, కుక్కు బండపాటు, కుంకుడాకు, బుగ్గి బూడిదమ్మకథ, భల్లూక స్వప్నం, చిన్నాజీ, దుమ్ములగొండి, బొండు మల్లెలు, ఎంపు, ఎందుకుపారేస్తావు నాన్నా, బదిలీ మొదలైనవి.
-రాచకొండ విశ్వనాథశాస్త్రి కథలు- ఆరుసారా కథలు, కలకంఠి, ఋక్కులు, కార్నర్ సీటు, రొట్టెముక్క, జరీ అంచు చీర, నల్లమేక, ఎండ, పిపీలికం, వెన్నెల మొదలైనవి.
-బుడుగు, సీగాన పసూనాంబ, అప్పారావు, రాధాగోపాలం, రెండుజడల సీత వంటి పాత్రలను సృష్టించిన చమత్కార హాస్య కథల రచయిత- ముళ్లపూడి వెంకటరమణ. ఈయన రచించిన కథలు- కానుక, ఆకలి ఆనందరావు, యువరాజు మహారాజు మొదలైనవి. వెలువరించిన కథా సంపుటాలు- వేట, జనతా ఎక్స్వూపెస్, రాధాగోపాలం కథలు, సీతా కళ్యాణం.
-కాళీపట్నం రామారావు కథలు- యజ్ఞం, ఆర్తి, భయం, జీవధార, తీర్పు, కుట్ర, చావు, నోరూమ్, పెంపకపు మమకారం, అవిద్య, రాగమయి మొదలైనవి. ‘ఋతుపవనాలు’ అను కథా సంపుటిని వెలువరించారు. ‘యజ్ఞంతో తొమ్మిది’ కథా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమి బహుమతి లభించింది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు