‘సికిందర్ ఇసాని’ బిరుదు ఎవరికి ఉంది?
బహమనీ రాజ్యం
పిచ్చి తుగ్లక్ అని అల్ బెరూని లాంటి చరివూతకారులు పిలిచిన మహ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో (1325-51) దేశంలో జరిగిన అనేక తిరుగుబాట్లలో బహమనీ రాజ్యస్థాపన ఒకటి. తుగ్లక్ కీర్తివూపతిష్టలు కోల్పోయి ప్రజాభిమానానికి దూరమవుతున్న సమయంలో క్రీ.శ. 1347లో శిస్తు వసూలుచేసే ఉద్యోగులు కలిసి అల్లాఉద్దీన్ హసన్‌గంగూ నాయకత్వంలో గుల్బర్గా కేంద్రంగా ఈ రాజ్యాన్ని దక్కన్లో స్థాపించారు. శిస్తు వసూలుచేసే అధికారులైన అమీర్‌లపై అనుమానం కలిగి మాళ్వా షిక్దారైన అజీజ్ ఉద్దీన్‌ను పంపి మాళ్వాలో ఉన్న 80 మంది అమీర్లను ఉరితీయించాడు. ఇస్మాయిల్ ముఖ్ నాయకత్వంలో దౌలతాబాద్, గుజరాత్‌లలో తిరుగుబాట్లు జరిగాయి.
తుగ్లక్ దండయాత్ర చేయగా ఇస్మాయిల్ ముఖ్ ఓడిపోయి కోటలో తలదాచుకున్నాడు. సుల్తాన్ కోటను ముట్టడించిన సమయంలో గుజరాత్లో ‘తషీ అనేవాడు తిరుగుబాటు చేయగా తుగ్లక్ అటు పయనమై వెళ్లగా ఇక తిరిగి రాలేని సందర్భంలో దక్కన్లో బహమనీ సామ్రాజ్యం ఏర్పడింది (1347). హసన్గంగూకు జాఫర్‌ఖాన్ అనే మరో పేరు కూడా ఉంది. ముసునూరి కాపయ నాయకుని సైనిక సాయంతో 1509లో సైన్యాన్ని తీసుకొని దౌలతాబాద్పై దాడిచేసి ఇస్మాయిల్ముఖ్ స్థానంలో జాఫర్ఖాన్ను తమ సుల్తాన్‌గా ఎన్నుకున్నారు. అబ్దుల్ ముజఫర్ అల్లాఉద్దీన్ బహ్మన్షా అనే పేరుతో (గుల్బర్గా కేంద్రంగా ఉన్న రాజ్యానికి) దౌలతాబాద్‌లో సింహాసనాన్ని అధిష్టించి రాజ్యస్థాపనకు కారకుడయ్యాడు. హసన్గంగూలోని గంగూ అనేది బ్రాహ్మణ పేరని, అతడొక బ్రాహ్మణుడని, మతాంతీకరణ జరిగి ఉంటుందని కొందరు చరివూతకారుల అభివూపాయం.
అల్లాఉద్దీన్ బహ్మన్షా (1347-58):
ఇతడు ఢిల్లీవాసి. అసలు పేరు హసన్. గంగూ అనే బ్రాహ్మణ ఆశీర్వాదంతో అతని ఇంట్లో పెరిగాడు కనుక తన పేరులో అలా గంగూ అనే పేరువాడినాడనీ చెబుతారు చరివూతకారులు. పెరిష్టా ప్రకారం గంగూ బ్రాహ్మణ్ లేదా గంగూ బహ్మన్ పేరే తన రాజ్యానికి వచ్చిందని చెబుతారు. ప్రాచీన పారశీక చక్రవర్తి అయిన బహ్మన్ వంశంవాడని చరివూతకారులు తెలిపారు. ఇతని తండ్రి ‘కైకా ఉన్’ కైకా పదమే కంకూ తరువాత గంగూగా మారిందని మరికొందరు చరివూతకారులు తమ అభివూపాయం తెలిపారు.
దాడులు:
1) తెలంగాణ అధిపతి తనకు గతంలో యుద్ధంలో సహాయం చేసిన ముసునూరి కాపయ నాయకునిపై 1350లో దాడిచేసి యుద్ధంలో ఓడించి కొంతవూపాంతాన్ని ఆక్రమించాడు. 2) 1358లో తుంగభవూదానది ఒడ్డున గల విజయనగర సామ్రాజ్యంపై దాడిచేశాడు. 3) పశ్చిమ తీరంలోని కొంకణ్ దేశంపై కూడా దండయాత్ర చేశాడు.
రాజ్య విస్తీర్ణం:
బహమనీ సామ్రాజ్యం ఉత్తరాన వెయిన్ గంగానది నుంచి దక్షిణాన తుంగవూభదా నది వరకు, పశ్చిమాన అరేబియా సముద్రం నుంచి తూర్పున బోనగిరి వరకు వ్యాపించింది.
ముగింపు :
అల్లాఉద్దీన్ బహ్మన్షాకు ‘సికిందర్ ఇసాని’ అనే బిరుదు ఉంది. ఇతడు గొప్ప సామ్రాజ్య నిర్మాత. గుల్బర్గా రాజధానిలో నూతన భవన నిర్మాణం చేశాడు. గుల్బర్గా, దౌలతాబాద్, బీరార్, బీదర్ అనే 4 తరఫ్‌లు (రాష్ట్రాలు)గా విభజించాడు. నమ్మకమైన తరఫ్దార్లను నియమించాడు. 11 ఏండ్లు పాలించి 1358లో మరణించాడు.
మొదటి మహ్మద్ షా (1358-75):
ఇతడు అల్లాఉద్దీన్ పెద్దకుమారుడు. తండ్రి అనంతరం సింహాసనానికి రాగానే ముసునూరి కాపయ, విజయనగర బుక్కరాయలు కలిసి యుద్ధం ప్రకటించారు. అంతకుముందే వారు పంపిన లేఖను లెక్కచేయలేదు. ఓరుగల్లుపై దాడిచేశాడు. 1362లో కాపయనాయకుని కుమారుడైన వినాయకదేవుని పట్టుకొని వధించాడు. ఇందుకు అరబ్బు వ్యాపారులు వినాయకదేవుడు తమను ఇబ్బంది పెట్టాడని ఫిర్యాదు చేయడమే కారణం. రెండోసారి జరిగిన దాడిలో మహ్మద్ షా గోల్కొండను ఆక్రమించగా కాపయ సంధిచేసుకున్నాడు. తరువాత విజయనగర బుక్కరాయలుతో జరిగిన యుద్ధం వల్ల పౌరజనానికి విపరీతమైన నష్టం జరిగినట్లు పెరిస్టా రచనల ద్వారా తెలుస్తుంది. మహ్మద్ షా గెలిచిన సందర్భంగా బుక్కరాయలు సంధిచేసుకున్నాడు. అనంతరం దౌలతాబాద్‌లో ‘బవూహంఖాన్’ తిరుగుబాటును అణచివేశాడు.
-ఇతడు సమర్థుడు. సైపుద్దీన్ ఘోరి సలహాతో 8 మంది మంత్రులను ఏర్పాటుచేశాడు. వకీల్, పీష్వా, వజీర్-జుమ్లా టెజరరీ), వజీర్-ఇ-అష్పా-ష్ (Foregn), కొత్వాల్ (రక్షకభట శాఖ), సాదర్-ఇ-జహర పధానన్యాయమూర్తి) మొదలైనవారు. గుల్బర్గాలోని పెద్ద మసీదు నిర్మాణం ఇతనికాలంలోనే పూర్తయింది. ఇది దక్కన్ వాస్తుశైలిలో ఉంది. ఇతడు 20 వేల మంది దోపిడీదొంగలను వధించాడు. 1375లో మరణించాడు.
ముజాహిద్ షా (1375-78):
మహ్మద్ షా కుమారుడు. ఇతడు పొగరుబోతు. సరైన పాలనా అవగాహనలేనివాడు. విజయనగరంపై దండెత్తి బుక్కరాయలచేత ఓడి, అవమానానికి గురై తిరిగి వస్తుండగా ఇతని మేనమామ కృష్ణానది ఒడ్డున చంపించి సింహాసనాన్ని అధిష్టించాడు. అతనిపేరే దావూద్‌ఖాన్. ఇతడి పాలన అనంతరం అల్లాఉద్దీన్ హసన్‌గంగూ బహ్మన్ షా మనవడు రెండో మహ్మద్ షాని సింహాసనంపై కూర్చోపెట్టాడు.
రెండో మహ్మద్ షా (1378-97):
ఇతడు కవి, పండితపోషకుడు, విద్యాభిమాని, శాంతికాముకుడు. ఇతడి ఆస్థానంలో పారశీక కవియైన హఫీజ్‌ను తన ఆస్థానానికి పిలిచి సన్మానం చేశాడు. హఫీజ్ సుల్తాన్‌కు రెండో అరిస్టాటిల్ అనే బిరుదు ఇచ్చాడు. తన రాజ్యంలో కరువు వచ్చినప్పుడు ఇతడు ముస్లింలకు మాత్రమే సాయం చేసేవాడు. శాంతికాముకత్వం వల్ల విజయనగర రెండో హరిహర రాయలు కృష్ణా-తుంగభద్రా నదులు మధ్య అంతర్వేది ప్రాంతాన్ని ఆక్రమించాడు. ఇతడు 1397లో మరణించాడు.
అహ్మద్‌షా (1422-35):
ఫిరోజ్‌షా తమ్ముడైన అహ్మద్‌షా పాలన విజయనగరంపై పగతీర్చుకోవడంతోనే ప్రారంభమైంది.
దాడులు:
1) 1425లో ఓరుగల్లుపై దండెత్తి రేచర్ల వెలమ నాయకుని వధించి తెలంగాణలో అనేక దుర్గాలను వశం చేసుకున్నాడు. ఈ యుద్ధంలో లతీఫ్‌ఖాన్ సైనికాధికారిగా ఉన్నాడు. భువనగిరి జాగీర్దార్ను ఇబ్రహీం వజీర్‌ఖాన్‌ను నియమించాడు.
2) గోండ్వానాపై దాడిచేసి ఎలిచేపూర్ వరకు సామ్రాజ్యాన్ని విస్తరింపచేశాడు.
3) గావిల్ఘర్, నర్నాల దుర్గాలకు మరమ్మతులు చేయించి ఉత్తర సరిహద్దులకు రక్షణ కల్పించాడు.
4) 1428లో ఖేర్‌ల పాలకుడైన నరసింగ రాయలుపైకి మాళ్వా సుల్తాన్ హుషంగ్షా దండెత్తగా అహ్మద్‌షా సహాయం చేసి తపతీ నదీ తీరాన హుషంగ్షాను ఓడించాడు
5) 1430లో గుజరాత్‌పై దాడిచేయగా అహ్మద్‌షా సైన్యం ఓడిపోయింది.
6) 1432లో తన మేనల్లుడైన షేర్‌ఖాన్ సింహాసనం కోసం కుట్రపన్నుతున్నాడన్న అనుమానంతో అతన్ని చంపాడు.
రాజధాని మార్పిడి:
బహమనీ రాజధానిని గుల్బర్గా నుంచి బీదర్‌కు మార్చాడు. కారణం గుల్బర్గా విజయనగర సరిహద్దు నగరమని, భద్రత తక్కువని దూరాన ఉన్న బీదర్‌కు మార్చాడు. అంతేగాక బీదర్ సహజ సుందరమైన ప్రకృతి వాతావరణం అహ్మద్‌షాను ఆకర్షించాయి.
ముగింపు: ఇతని కాలంలో ముస్లింలు 1) దక్కన్ ముస్లింలు 2) గరీబులని రెండు విధాలుగా చీలారు. దక్కనీలంటే ముస్లిం మతంలోకి మారిన హిందువులు. వారి సంతతివారు స్వదేశీయులు. తక్కినవారు గరీబులు (అఫాకీలు). వీరు విదేశీయులు. ఇతనికి పార్శీ భాషపై అభిమానం ఎక్కువ. ‘బహ్మన్నామా’ పేరుతో గ్రంథం ఇతనికాలంలోనే వెలువడింది. తన రెండో కుమారుడైన మహ్మద్‌షాను మాహూర్ పాలకునిగా నియమించాడు. తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా అంతా మాహుర్ దుర్గాధ్యక్షుడి ఆధీనంలో ఉంది. ఇతడు 1446లో మరణించాడు.
ఫిరోజ్ షా (1397-1342):
రెండో మహ్మద్ అల్లుళ్లు ఫిరోజ్, అహ్మద్‌ఖాన్‌లు వారసత్వ యుద్ధం చేయగా ఫిరోజ్ షా సింహాసనాన్ని అధిష్టించాడు. ఇతడు రాచకొండ, దేవరకొండ రాజులతో స్నేహం చేసి విజయనగర రాజులపై పగను పెంచుకున్నాడు. ఇతడు బహుభాషావేత్త. యుద్ధవీరుడు, విద్యాధికుడు, గుణసంపన్నుడు. హిందూ, ముస్లిం సంస్కక్షుతుల సమ్మేళనం కొత్తరూపం పొందిందని చరివూతకారుల అభివూపాయం. అనేకమంది హిందువులను ఉన్నత ఉద్యోగాల్లో నియమించి పరమత సహనాన్ని పాటించాడు. ముస్లిం పెద్ద ‘గిజూదరాజ్’ను గౌరవించి అతనికి గుల్బర్గాలో మసీదు కట్టించాడు. కానీ ఇతడు స్త్రీలోలుడు. భీమానది ఒడ్డున ఫిరోజాబాద్ పట్టణాన్ని నిర్మించాడు. విదేశాల నుంచి 800 మంది స్త్రీలను తెప్పించాడని, వారిని తన అంతఃపురంలో ఉంచి వారితో వారివారి భాషల్లో మాట్లాడేవాడని పెరిస్టా రచనలు తెలుపుతున్నాయి.
దాడులు:
1) 1398లో విజయనగర రాజు రెండో హరిహర రాయలు తుంగభవూద-కృష్ణానదుల అంతర్వేదిని ఆక్రమించగా, కొండవీటి రెడ్డిరాజు పెదకోమటి వేమాడ్డి సహాయంతో ఓడించాడు.
2) ఖేర్‌ల రాజు (గోండు) నరసింహ రాయలు బీరార్పై దాడి చేశాడు. కృష్ణానదీ తీరానగల కోపాల తిరుగుబాట్లను కూడా అణచివేశాడు.
3) పద్మనాయక ప్రభువులు ఫిరోజ్‌షా సహాయం అర్థించగా వెళ్లి విజయనగర రాజులను ఓడించాడు (ండో హరిహర రాయలు). ఈ యుద్ధం నల్లగొండ ప్రాంతంలో జరిగింది. విజయనగర రాజు వాడపల్లి, పానగల్లు, నల్లగొండ ప్రాంతాలను ఆక్రమించాడు. పద్మనాయకులు విధిలేని పరిస్థితుల్లో విజయనగర రాజులతో సంధిచేసుకున్నారు. ఇది రెండో బుక్కరాయలు కాలంలో జరిగిన యుద్ధం.
4) విజయనగర మొదటి దేవరాయలు ముద్గల్లులోని ‘నెహర్’ అనే కంసాలి యువతిని బలవంతంగా పెండ్లి చేసుకొనగా ఫిరోజ్‌షా యుద్ధంచేసి అతన్ని ఓడించాడని, దేవరాయలు తన కుమ్తానిచ్చి సుల్తాన్‌తో సంధిచేసుకున్నాడని పెరిస్టా కథనం.
5) 1403లో కాటయవేమాడ్డికి పెదకోమటి వేమాడ్డికి జరిగిన వారసత్వ యుద్ధంలో జోక్యం చేసుకొని కాటయ వేమాడ్డిని ఓడించాడు. ఈ యుద్ధంలో కాటయ మరణించాడు.
6) 1420లో విజయనగర రాజులతో చేయి కలిపి వెలమ నాయకులను ఓడించి విజయనగరం నుంచి పానగల్లును ఆక్రమించాలనే ప్రయత్నం విఫలం అయింది. విజయనగర రాజులు ఫిరోజ్‌షాను ఓడించారు. బహమనీ, విజయనగర రాజ్యాల మధ్య 1398, 1403, 1406, 1417ల్లో యుద్ధాలు జరిగాయి.
7) ఖేర్లా నరసింగరాయలు తిరుగుబాటు చేయగా (1400) అతన్ని ఓడించి అతని కుమ్తాను వివాహం చేసుకున్నాడు.
ముగింపు: 1398లో తైమూర్ దాడిచేయగా ఢిల్లీ పాలకులు లొంగిపోయారు. గుజరాత్, మాళ్వా రాష్ట్రాలపై దాడులుచేసి శత్రుత్వం పెంచుకొన్నాడు. తన చివరిరోజుల్లో తన తమ్ముడైన అహ్మద్‌ఖాన్‌తో కలహం ఏర్పడింది. ఇది ఫిరోజ్షాని కుంగదీసింది. 1422లో మరణించాడు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు