H ఆకారపు శ్మశానవాటిక లభించిన ప్రాంతం?
1. క్రీ.పూ. 2600-1900ల మధ్యకాలంలో సింధు, దాని ఉపనదుల పరిసర ప్రాంతాల్లో విలసిల్లిన నాగరికతకు సింధూలోయ నాగరికత అని శాస్త్రవేత్తలు పేరుపెట్టారు. ఈ నాగరికత హరప్పా, మొహంజోదారో (ఇవి పాకిస్థాన్లో ఉన్నాయి) వద్ద వెలుగులోకి వచ్చింది. దీంతో ఈ నాగరికతను హరప్పా నాగరికత అని కూడా పిలుస్తారు. అయితే హరప్పా నాగరికత అని పేర్కొన్నదెవరు?
1) సర్ జాన్ మార్షల్ 2) చార్లెస్ మోర్సన్
3) చార్లెస్ మాజిన్ 4) సర్ జాన్ హరప్పా
2. సింధు నాగరికత 1921లో వెలుగులోకి వచ్చింది. దయారాం సాహ్ని, ఎంఎస్ వాట్స్, మార్టిమర్ వీలర్ ఆధ్వర్యంలో తవ్వకాలు జరిపారు. అయితే అప్పటి పురావస్తు శాఖ డైరెక్టర్ ఎవరు?
1) చార్లెస్ మోర్సన్ 2) సర్ జాన్ మార్షల్
3) ఎంఎస్ వాట్స్ 4) దయారాం సాహ్ని
3. విస్తీర్ణం దృష్ట్యా ప్రపంచంలోనే అతిపెద్ద నాగరికత సింధు నాగరికత. అయితే దీని సరిహద్దులను జతపర్చండి.
1) ఉత్తరాన ఎ) మహారాష్ట్రలోని దైమాబాద్,ప్రవర (గోదావరి ఉపనది)
2) దక్షిణాన బి) జమ్ములోని మండా (చీనాబ్ నది ఒడ్డున)
3) తూర్పున సి) పాకిస్థాన్, ఇరాన్ సరిహద్దుల్లోని సుత్కజెండార్
4) పశ్చిమాన డి) ఉత్తరప్రదేశ్లోని అలంగీర్పూర్,హిందన్ (యమున ఉపనది)
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2) 1-బి, 2-సి, 3-డి, 4-ఎ
3) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
4) 1-బి, 2-డి, 3-ఎ, 4-సి
4. సింధు నదీ తీరాన లార్ఖానా జిల్లాలో 1922లో తవ్వకాలు జరపగా ఒక దిబ్బ బయల్పడింది. దీన్ని మొహంజోదారో అని ఆర్డీ బెనర్జీ ఆవిష్కరించారు. దీనికి అర్థం మృతుల దిబ్బ అని. ఈ ప్రాంతంలో పెద్ద కోటగోడ శిథిలాలు లభ్యమయ్యాయి. ఈ కోటగోడ పొడవు, వెడల్పు ఎంత?
1) 1140, 543 2) 1150, 553
3) 1160, 563 4) 1170, 573
5. మొహంజోదారో తవ్వకాల్లో బయల్పడి అతి ముఖ్యమైనది అతిపెద్ద స్నానవాటిక. దీని నిర్మాణంలో కాల్చిన ఇటుకలను వాడటం విశేషం. దీని అడుగుభాగంలో నీరు ఇంకిపోకుండా జిప్సంను ఉపయోగించారు. ఈ స్నానవాటికను మతపరమైన ఉత్సవాలకు వినియోగించారు. అయితే ఈ స్నానవాటిక పొడవు, వెడల్పు, లోతు (మీటర్లలో) ఎంత?
1) 11.88, 7.01, 2.4 2) 10.88, 6.01, 1.4
3) 9.88, 5.01, 3.4 4) 8.88, 4.01, 2.41
6. సింధు నాగరికత పట్టణాలు, నదీతీరాలను గుర్తించండి.
1) మొహంజోదారో ఎ) రావి
2) హరప్పా బి) సింధు
3) కాలిబంగన్ సి) భొగోవా
4) లోథాల్ డి) షుగ్గర్
1) 1-డి, 2-ఎ, 3-బి, 4-సి
2) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
3) 1-ఎ, 2-డి, 3-సి, 4-బి
4) 1-ఎ, 2-డి, 3-బి, 4-సి
7. సింధు నది ఐదు ఉపనదుల ఋగ్వేదం కాలంనాటి, ప్రస్తుత పేర్లను జతపర్చండి.
1) పరుష్ని ఎ) రావి
2) వితస్తె బి) జీలం
3) సుతుద్రి సి) సట్లెజ్
4) అసిక్ని డి) చీనాబ్
5) విపాస్ ఇ) బియాస్
1) 1-బి, 2-సి, 3-డి, 4-ఇ, 5-ఎ
2) 1-ఎ, 2-సి, 3-బి, 4-ఇ, 5-డి
3) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి, 5-ఇ
4) 1-ఎ, 2-బి, 3-సి, 4-ఇ, 5-డి
8. హరప్పా (సింధు) నాగరికత ప్రజల ముఖ్య వృత్తి వ్యవసాయం, పశుపోషణ. ఖరీఫ్ సీజన్లోని ప్రధాన పంటలు పత్తి, నువ్వులు, ఆవాలు, పండ్లు, కూరగాయలు. రబీ సీజన్లోని ప్రధాన పంటలు వరి, గోధుమ, బార్లీ. అయితే వరికి సంబంధించిన ఆధారాలు లభించిన ప్రాంతాలను గుర్తించండి?
1) బన్వాలి- వరిగింజ, కాలిబంగన్- వరిపొట్టు
2) మొహంజోదారో- వరిగింజ, సుర్కోటోడా- వరిపొట్టు
3) చన్హుదారో- వరిగింజ, ధోలవీర- వరిపొట్టు
4) లోథాల్- వరిగింజ, రంగాపూర్- వరిపొట్టు
9. సింధు నాగరికత ప్రజల లిపి బొమ్మల లిపి. వీరి లిపిలో సుమారు 375 నుంచి 400 అక్షరచిత్రాలున్నాయి. ఈ లిపిని స్టియటైట్తో చేసిన ముద్రికలపై ఉపయోగించేవారు. ఇది కుడి నుంచి ఎడమకు, ఎడమ నుంచి కుడికి సర్పలేఖనలో పద్ధతిలో ఉంటుం ది. అయితే ఈ లిపి ఆధారాలను మొదటగా ఎప్పుడు గుర్తించారు?
1) 1853 2) 1753 3) 1653 4) 1553
10. సింధు నాగరికత పట్టణాలు, వాటిని కనుగొన్న శాస్త్రవేత్తలను జతపర్చండి.
1) హరప్పా ఎ) ఏ ఘోష్ (1921)
2) మొహంజోదారో బి) ఎస్సార్ రావు (1922)
3) లోథాల్ సి) దయారాం సాహ్ని (1954)
4) కాలిబంగన్ డి) ఆర్డీ బెనర్జీ (1953)
1) 1-సి, 2-బి, 3-ఎ, 4-డి
2) 1-సి, 2-డి, 3-బి, 4-ఎ
3) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
4) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
11. కొలిచే ప్రమాణం లభించిన సింధు నాగరికత పట్టణం?
1) మొహంజోదారో 2) కాలిబంగన్
3) లోథాల్ 4) హరప్పా
12. సింధు నాగరికతకు గల పేరు?
1) అక్షరాస్య నాగరికత 2) కాంస్యయుగ నాగరికత
3) మూల భారతీయ నాగరికత 4) పైవన్నీ
13. సింధు నాగరికత కాలంలో స్వస్తిక్ గుర్తును దేనికి చిహ్నంగా వాడేవారు?
1) సర్వాభివృద్ధి 2) ఆరోగ్యాభివృద్ధి
3) ఐశ్వర్యాభివృద్ధి 4) విద్యాభివృద్ధి
14. H ఆకారపు శ్మశానవాటిక లభించిన ప్రాంతం?
1) బన్వాలి 2) హరప్పా 3) సుర్కటోడ 4) చన్హుదారో
15. మొహంజోదారో పట్టణంలో ఎంతమంది పౌరులు ఉండేవారని చరిత్రకారులు అభిప్రాయపడ్డారు?
1) 15,000-30,000 2) 70,000-90,000
3) 35,000-41,000 4) 50,000-70,000
16. సింధు ప్రజలకు ఇనుము లోహం తెలియదు. వీరు ఆఫ్ఘనిస్థాన్ నుంచి వెండిని, కర్ణాటక నుంచి బంగారాన్ని, బీహార్ నుంచి తగరాన్ని దిగుమతి చేసుకునేవారు. వీరు ఎక్కువగా వాడిన రాగి లోహాన్ని ఎక్కడి నుంచి దిగుమతి చేసుకొనేవారు?
1) మెసపటోమియా 2) బహ్రెయిన్
3) యూరప్ 4) రాజస్థాన్లోని ఖేత్రి
జవాబులు
1-1, 2-2, 3-3, 4-4, 5-1, 6-2, 7-3, 8-4, 9-1, 10-2, 11-3, 12-4, 13-1, 14-2, 15-3, 16-4
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు