Water Resources | తెలంగాణ-నీటివనరులు

రాష్ట్రంలోని మృత్తికల అడుగు పొరలు కఠినంగా ప్రవేశ యోగ్యం లేకుండా ఉండటంవల్ల చెరువులో నీరు ఎక్కువకాలం నిల్వ ఉండే అవకాశం ఉంది. తద్వారా రాష్ట్రంలో భూగర్భ జల మట్ట్టాలు గణనీయంగా పెరుగుతున్నట్టు రాష్ట్ర భూగర్భ జల వనరుల శాఖ 2017, ఏప్రిల్‌లో వెల్లడించింది. (0.08 మీటర్ల నుంచి 0.97 మీటర్లకు పెరిగినట్లు స్పష్టమైంది)
తెలంగాణలో నీటి వసతికి ప్రాణాధారం చెరువులు. భారీ, మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టుల కంటే తక్షణ ఫలితాన్ని, ఎక్కువ మందికి ఉపాధిని కల్పించేవి చెరువులు.
– తెలంగాణ ప్రభుత్వం చెరువుల ద్వారా నీటిపారుదల సౌకర్యాలు పెంచాలనే ఉద్దేశంతో చెరువుల పునరుద్ధరణకు చేపట్టిన పథకం మిషన్ కాకతీయ. ఇందులో భాగంగా మన ఊరు – మన చెరువు అనే నినాదంతో సీఎం కే చంద్రశేఖర్‌రావు 2015, మార్చి 12న కామారెడ్డి జిల్లా సదాశివనగర్ పాతచెరువును పునరుద్ధరించడంతో ప్రారంభించారు.
– చెరువులను పునరుద్ధరించడమనేది చిన్నతరహా నీటిపారుదల వ్యవస్థకు చెందింది.
– ఈ కార్యక్రమంలో భాగంగా 46,531 చెరువులను పునరుద్ధరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
– మొత్తం ఐదేండ్లలో ప్రతి సంవత్సరం 1/5వ వంతు చెరువులను పునరుద్ధరించడం.
చెరువులకు భౌగోళిక నైసర్గిక కారణం
– తెలంగాణలోని మృత్తికల అడుగు పొరలు కఠినంగా, ప్రవేశ యోగ్యం లేకుండా ఉండటంవల్ల చెరువుల్లో నీరు ఎక్కువకాలం నిల్వ ఉండే అవకాశం ఉంది. తద్వారా రాష్ట్రంలో భూగర్భ జల మట్ట్టాలు గణనీయంగా పెరుగుతున్నట్టు రాష్ట్ర భూగర్భ జల వనరుల శాఖ 2017, ఏప్రిల్‌లో వెల్లడించింది. (0.08 మీటర్ల నుంచి 0.97 మీటర్లకు పెరిగినట్లు స్పష్టమైంది)
మిషన్ కాకతీయ కార్యక్రమాలు
– చెరువుల్లో పూడిక తీయడం- తొలిగించిన పూడికను రైతుల పంట భూముల్లో పోయడం
– చెరువు కట్టను బలోపేతం చేయడం- చెరువు అలుగు, తూములకు మరమ్మతులు చేయడం
– చెరువుల్లో పెరిగిన తుమ్మ చెట్లు, గుర్రపుడెక్క, లొట్టపీసు మొక్కల తొలిగింపు
– చెరువుల శిఖం భూములను కబ్జాల నుంచి కాపాడటం
గమనిక: మిషన్ కాకతీయ కార్యక్రమం ద్వారా జిల్లాల వారీగా చెరువులను, ఆయకట్టు వివరాలను పరిశీలిస్తే (ఎకరాల్లో) గరిష్ఠంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 1,80,527 ఎకరాల్లో ఆయకట్టు స్థిరీకరణ ఉంది.
గమనిక: అన్ని నీటిపారుదల సౌకర్యాల పరంగా మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం- 1. ఉత్తరప్రదేశ్ 2. మధ్యప్రదేశ్
– శాతంపరంగా అన్ని నీటిపారుదల సౌకర్యాల పరంగా మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం- పంజాబ్ (99 శాతం) చివరి రాష్ట్రం- మిజోరం (6.5 శాతం)
– రాష్ట్రంలో అన్ని నీటిపారుదల సౌకర్యాలపరంగా మొదటి స్థానంలో ఉన్న జిల్లా- 1. కరీంనగర్ 2. వరంగల్ అత్యల్పంగా- రంగారెడ్డి
– శాతం పరంగా అన్ని నీటిపారుదల సౌకర్యాల పరంగా మొదటి స్థానంంలో ఉన్న జిల్లా – ఉమ్మడి వరంగల్
రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు
– వ్యవసాయానికి అవసరమైన సాగునీటి పారుదల వ్యవస్థకు సంబంధించి తెలంగాణలో శతాబ్దాల చరిత్ర ఉంది.
– అప్పటి పాలకులు తమ రాజ్యాల్లో సాగునీటి పారుదల వ్యవస్థ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు.
– కాకతీయుల కాలంలో నిర్మించిన చెరువులు రామప్ప, పాకాల, లక్నవరం
– నిజాం నవాబు నవాజ్‌జంగ్ బహదూర్ పాలన కాలంలో నిర్మించిన రిజర్వాయర్లు హుస్సేన్‌సాగర్, ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్, నిజాంసాగర్
– తెలంగాణలో నిర్మాణం పూర్తయిన, పూర్తికానున్న మొత్తం రిజర్వాయర్లు, డ్యామ్‌లు కలిపి 182 (2014 వరకు) ఉన్నాయి.
– ప్రాజెక్టులు వాటి కింద ఉన్న సాగునీటి ఆయకట్టు సామర్థ్యాన్ని బట్టి మూడు రకాలు- అవి..
1. భారీ తరహా ప్రాజెక్టులు
– 10,000 హెక్టార్ల కంటే ఎక్కువ ఆయకట్టు సామర్థ్యం ఉన్నవి.
ఉదా: కాళేశ్వరం, నిజాంసాగర్, అలీసాగర్, శ్రీరాంసాగర్,నాగార్జునసాగర్
2. మధ్యతరహా ప్రాజెక్టులు
– 2,000 హెక్టార్ల నుంచి 10,000 హెక్టార్ల మధ్య ఆయకట్టు సామర్థ్యం ఉన్నవి.
ఉదా: గడ్డెన్నవాగు ప్రాజెక్ట్, నీల్వాయి, స్వర్ణ, గొల్లవాగు
3. చిన్నతరహా ప్రాజెక్టులు
– 2,000 హెక్టార్ల కంటే తక్కువ ఆయకట్టు సామర్థ్యం ఉన్నవి.
ఉదా: చెరువులు
గమనిక: 1 హెక్టార్ – 2.47 ఎకరాలు
1 టీఎంసీ – 2831,68,46,592 లీటర్లు(శతకోటి ఘనపు అడుగులు)
క్యూసెక్- నీటి ప్రవాహ రేటును కొలిచే ప్రమాణం.
1 క్యూసెక్ = 28.317 లీటర్లు/ సెకన్
RELATED ARTICLES
-
Indian Polity | సభ ఆమోదిస్తేనే అత్యవసరం.. లేదంటే రద్దు
-
Geography | సౌర కుటుంబంలో అత్యంత సాంద్రత గల గ్రహం?
-
General Studies – Groups Special | ఇనుము తుప్పు పట్టినప్పుడు బరువు పెరగడానికి కారణం?
-
Biology | First Genetic Material.. Reactive Catalyst
-
Telangana Movement | ‘తెలంగాణ జాగో హైదరాబాద్‌కో బచావో’ సభ నిర్వహించిన పార్టీ?
-
Economy- Groups Special | భారతదేశంలో ప్రత్యేక ఆర్థిక మండళ్ల ప్రధాన విధి?
Latest Updates
Groups / DSC Special – Social Studies | స్వయం మట్టి మార్పిడి విధానాన్నిఅనుసరించే నేలలు?
Israel – Hamas war | రావణకాష్టం.. ఇజ్రాయోల్ – పాలస్తీనా వివాదం
Current Affairs | ఆది మహోత్సవ్ దేనికి సంబంధించింది?
UCEED & CEED 2024 | యూసీడ్ & సీడ్-2024 ఐఐటీలో ప్రవేశాలు !
Geography | ప్రపంచంలో తేయాకు ఉత్పత్తిలో ఏ దేశం అగ్రస్థానంలో ఉంది?
Economy | రామగిరి ఖిల్లాను ఏ శతాబ్దంలో నిర్మించారు?
DSC – Groups Special | తరిగిపోతే తిరిగిరావు.. పొదుపుగా వినియోగిద్దాం
SAT Preparation | SAT… Short and Digital
Group 2,3 Special | మహిళలు, బాలలు, ట్రాన్స్జెండర్ల చట్టాలు
General Essay – Groups Speical – AI | వస్తువుకు ప్రాణం.. కృత్రిమ మేధ మాయాజాలం