Death of Rudramadevi | రుద్రమదేవి మరణం గురించి తెలిపే శాసనం?
బయ్యారం చెరువు శాసనం: కాకతీయ గణపతిదేవుడి సోదరి మైలాంబ ఈ శాసనం వేయించింది. ఈ శాసనంలో కాకతీయుల వంశవృక్షం గురించి వివరించింది. దీని ప్రకారం కాకతీయుల మూలపురుషుడు వెన్నడు. ఇతను దుర్జయ వంశానికి చెందినవాడు.
శాసనాలు – ప్రాముఖ్యం
– నానాఘాట్ శాసనం: శాతవాహన చక్రవర్తి మొదటి శాతకర్ణి భార్య దేవి నాగానిక ప్రాకృతంలో ఈ శాసనం వేయించింది. ఈ శాసనంపై మొదటి శాతకర్ణి, శ్రీముఖుని ప్రతిమలు ఉన్నాయి. అప్రతిహత చక్ర, ఏకవీర, సూర, దక్షిణాపథపతి వంటి బిరుదులతో మొదటి శాతకర్ణిని ఈ శాసనంలో కీర్తించారు.
– సాంచీ స్థూప శాసనం: రెండో శాతకర్ణి సాంచీ స్తూపానికి దక్షిణ తోరణం నిర్మించడంతో ఇతని ఆస్థానంలో ఉన్న వాసిష్టీపుత్ర ఆనందుడు ఈ శాసనాన్ని వేయించాడు.
– నాసిక్ శాసనం: ఈ శాసనాన్ని గౌతమిపుత్ర శాతకర్ణి తల్లి గౌతమి బాలశ్రీ ప్రాకృతంలో వేయించింది. ఈ శాసనం గౌతమిపుత్ర శాతకర్ణిని ఏకబ్రాహ్మణ, క్షత్రియ దర్పమాన మర్దన, ఆగమనిలయ, త్రిసముద్ర తోయ పీతవాహన, దక్షిణ సముద్రాదీశ్వర తదితర బిరుదులతో వర్ణించింది.
– మ్యాకధోని శాసనం: చిట్టచివరి శాతవాహన రాజైన మూడో పులోమావి ఈ శాసనాన్ని వేయించాడు.
– రెంటాల, దాచేపల్లి, కేశానపల్లి శాసనం: వీటిని ఇక్షాక రాజ్యస్థాపకుడు వాసిష్టీపుత్ర శాంతమూలుడు ప్రాకృతంలో వేయించాడు.
– అల్లూరి, ఉప్పుగుండూరు, నాగార్జునకొండ, అమరావతి, జగ్గయ్యపేట శాసనాలు: వీటిని దక్షిణాది అశోకుడిగా పేరుగాంచిన ఇక్షాక రాజు వీర పురుషదత్తుడు ప్రాకృతంలో వేయించాడు.
– నాగార్జునకొండ సంస్కృత శాసనం: ఈ శాసనాన్ని వేయించింది ఎహూవల శాంతమూలుడు. ఇతని కాలం నుంచే సంస్కృతంలో శాసనాలు రాసే సంప్రదాయం ప్రారంభమైంది.
– రామతీర్థ శాసనం: విష్ణుకుండినుల రాజ్య స్థాపకుడు ఇంద్రవర్మ లేదా మహేంద్రవర్మ ఈ శాసనాన్ని వేయించాడు.
– ఇంద్రపాల నగర తామ్రశాసనం: ఈ శాసనాన్ని వేయించింది మొదటి గోవిందవర్మ. తెలంగాణలో లభించిన తొలి సంస్కృత శాసనం ఇది.
– చైతన్యపురి శాసనం: దీన్ని కూడా మొదటి గోవిందవర్మ వేయించాడు. ఇది తెలంగాణలో తొలి ప్రాకృత శాసనంగా పరిగణిస్తారు.
– తుమ్మలగూడెం, చిక్కుళ్ల శాసనాలు: వీటి నిర్మాత విక్రమేంద్ర భట్టారక వర్మ లేదా రెండో విక్రమేంద్రవర్మ.
– పొలమూరు, ఈపూరు శాసనాలు: ఈ శాసనాలు వేయించింది నాలుగో మాధవవర్మ
– కొల్లిపర శాసనం: ఈ శాసనాన్ని వేయించింది వేములవాడ చాళుక్యరాజు మొదటి అరికేసరి.
– కురవగట్టు శాసనం: ఈ శాసన నిర్మాత బీరన్న గృహుడు. ఇతను మొదటి అరికేసరి సోదరుడు.
– కుర్క్యాల శాసనం: ఈ శాసనాన్ని వేయించింది జినవల్లభుడు. ఇతను కన్నడంలో ఆదికవిగా ప్రసిద్ధి పొందిన పంపకవి సోదరుడు. ఈ శాసనంలో కంద పద్యాలు సంస్కృత, కన్నడ, తెలుగులో కనిపిస్తాయి.
– పర్బనీ శాసనం: ఈ శాసన నిర్మాత మూడో అరికేసరి.
– వేములవాడ శాసనం: దీన్ని కూడా మూడో అరికేసరి వేయించాడు.
– మొగల్ చెరువు శాసనం: ఈ శాసనాన్ని వేయించింది ముదిగొండ చాళుక్య రాజైన నాలుగో కుసుమాయుధుడు.
– క్రివ్వక దాన శాసనం: ఈ శాసన నిర్మాత ఆరో కుసుమాయుధుడు.
– మాగల్లు శాసనం: వేంగి చాళుక్య రాజు దానార్ణవుడు దీని నిర్మాత. కాకతీయుల గురించి మొదటగా తెలిపే శాసనం.
– బయ్యారం చెరువు శాసనం: కాకతీయ గణపతిదేవుడి సోదరి మైలాంబ ఈ శాసనం వేయించింది. ఈ శాసనంలో కాకతీయుల వంశవృక్షం గురించి వివరించింది. దీని ప్రకారం కాకతీయుల మూలపురుషుడు వెన్నడు. ఇతను దుర్జయ వంశానికి చెందినవాడు.
– శనిగరం శాసనం: ఒకటో బేతరాజు మంత్రి నారాయణయ్య చాళుక్య యుద్ధమల్లుడు నిర్మించిన జినాలయానికి మరమ్మతులు చేసి ఈ శాసనాన్ని వేయించాడు.
– కాజీపేట శాసనం: ఈ శాసన నిర్మాత రెండో బేతరాజు. దీని ప్రకారం ఇతను గొప్ప యుద్ధవీరుడు.
– అనుమకొండ శాసనం: కాకతీ రుద్రదేవుడు తన స్వాతంత్య్రానికి గుర్తుగా అనుమకొండలో రుద్రేశ్వర ఆలయం లేదా 1000 స్తంభాల గుడిని నిర్మించి ఈ శాసనాన్ని వేయించాడు. అనుమకొండ శాసనాన్ని అచితేంద్రుడు లిఖించాడు.
– గణపవరం శాసనం: ఈ శాసనం కూడా కాకతీరుద్రదేవుడు వేయించాడు. అనుమకొండ, గణపవరం శాసనాల్లో తన తండ్రి రెండో ప్రోలరాజు విజయాలను వివరించాడు.
– మోటుపల్లి అభయశాసనం: గణపతిదేవుడు మోటుపల్లి ఓడరేవును అంతర్జాతీయ ఓడరేవుగా అభివృద్ధి పరిచి వర్తకుల రక్షణ కోసం నియమ నిబంధనలతో ఈ శాసనాన్ని వేయించాడు. మోటుపల్లిలో ఈ శాసన నియమాలు అమలుపర్చడానికి సిద్ధయ దేవున్ని అధికారిగా నియమించాడు.
– బీదర్కోట శాసనం: యాదవ రాజు మహాదేవుడిపై విజయానికి గుర్తుగా రుద్రమ దేవి ఈ శాసనాన్ని వేయించింది.
– మల్కాపురం శాసనం: ఈ శాసన నిర్మాత రాణి రుద్రమదేవి. ఈ శాసనంలో శైవ గోళకీమఠాల గురించి వివరించారు. ప్రసూతి వైద్యశాలల గురించి కూడా తెలుపుతుంది.
– చందుపట్ల శాసనం: ఈ శాసనం ప్రకారం రుద్రమదేవి కాయస్థ అంబదేవుడితో జరిగిన యుద్ధంలో మరణించింది.
– కలువచేరు శాసనం: ఈ శాసన నిర్మాత రెడ్డిరాణి అనతల్లి. కాకతీయ సామ్రాజ్యంపై ఢిల్లీ సుల్తానుల దాడులను ఇది వివరిస్తుంది.
– విలాసతామ్ర శాసనం: ముసునూరి ప్రోలయనాయకుడు దీనిని వేయించాడు. కాకతీయ రెండో ప్రతాపరుద్రుడి కాలంలో జరిగిన ఢిల్లీ సుల్తానుల దండయాత్రలను, రెండో ప్రతాపరుద్రుడి మరణం గురించి ఈ శాసనం తెలుపుతుంది.
మాదిరి ప్రశ్నలు
1. కింది వాటిని జతపర్చండి. (2)
1. బీదర్కోట శాసనం
ఎ. గౌతమి బాలశ్రీ
2. బయ్యారం చెరువు శాసనం
బి. రాణిరుద్రమదేవి
3. నాసిక్ శాసనం
సి. మైలాంబ
4. నానాఘాట్ శాసనం
డి. నాగానిక
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2) 1-బి, 2-సి, 3-ఎ, 4-డి
3) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
4) 1-ఎ, 2-డి, 3-బి, 4-సి
2. కింది వాటిని జతపర్చండి. (3)
1. కుర్క్యాల శాసనం
ఎ. మొదటి అరికేసరి
2. పర్బనీ శాసనం
బి. బీరన్న గృహుడు
3. కురవగట్టు శాసనం
సి. మూడో అరికేసరి
4. కొల్లిపర శాసనం
డి. జీనవల్లభుడు
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2) 1-డి, 2-సి, 3-ఎ, 4-బి
3) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
4) 1-డి, 2-ఎ, 3-బి, 4-సి
3. తెలంగాణలో లభించిన తొలి ప్రాకృత శాసనం? (1)
1) చైతన్యపురి శాసనం
2) ఇంద్రపాల నగరం శాసనం
3) రామతీర్థ శాసనం
4) తుమ్మలగూడెం శాసనం
4. రుద్రమదేవి మరణం గురించి తెలిపే శాసనం? (2)
1) బయ్యారం చెరువు శాసనం
2) చందుపట్ల శాసనం
3) కాజీపేట శాసనం
4) అనుమకొండ శాసనం
5. తెలంగాణలో లభించిన తొలి సంస్కృత శాసనం ఏది? (1)
1) ఇంద్రపాల నగర తామ్రశాసనం
2) చైతన్యపురి శాసనం
3) తుమ్మలగూడెం శాసనం
4) కాజీపేట శాసనం
6. కాకతీయ సామ్రాజ్యంపై ఢిల్లీ సుల్తానుల దాడులను వివరించే శాసనం? (3)
1) బయ్యారం చెరువు శాసనం
2) అనుమకొండ శాసనం
3) కలువచేరు శాసనం
4) మోటుపల్లి శాసనం
7. కాకతీయుల కాలానికి చెందిన ప్రసూతి దవాఖానల గురించి వివరించే శాసనం? (2)
1) విలాసతామ్ర శాసనం
2) మల్కాపురం శాసనం
3) బయ్యారం శాసనం చెరువు
4) కాజీపేట శాసనం
8. కిందివాటిలో బయ్యారం చెరువు శాసనానికి సంబంధంలేని అంశం? (4)
1) గణపతి దేవుని సోదరి మైలాంబ ఈ శాసనం వేయించింది
2) కాకతీయుల మూలపురుషుడు వెన్నడు అని తెలుపుతున్నది
3) వెన్నడు దుర్జయ వంశానికి చెందినవాడు
4) 1000 స్తంభాల గుడి నిర్మాణాన్ని పేర్కొంది
9. కన్నడ ఆదికవి పంపడు సోదరుడు జినవల్లభుడు వేయించిన కుర్క్యాల శాసనంలో ఉన్న కంద పద్యాలు ఏయే భాషల్లో కనిపిస్తాయి? (3)
1) సంస్కృతం, తెలుగు
2) తెలుగు, మలయాళం
3) సంసృతం, కన్నడ, తెలుగు
4) పాలి, గ్రాంథికం
10. శాసనాలను సంస్కృతంలో రాసే సంప్రదాయం ఎవరికాలంలో ప్రారంభమైంది? (2)
1) మొదటి గోవిందవర్మ
2) ఎహూవల శాంతమూలుడు
3) ఇంద్రవర్మ
4) వీరపురుష దత్తుడు
11. దక్షిణాది అశోకుడిగా పేరుగాంచిన ఇక్షాక రాజు? (4)
1) ఉపాసిక బోధిశ్రీ
2) మూడో పులోమావి
3) మొదటి శాతకర్ణి
4) వీర పురుషదత్తుడు
12. నాగార్జునకొండ సంస్కృత శాసనం వేయించినవారు? (3)
1) రెండో శాతకర్ణి
2) గౌతమిపుత్రుడు
3) ఎహూవల శాంతమూలుడు
4) వాసిష్టీపుత్ర శాంతమూలుడు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు