Our poets | మన కవిపండితులు
తెలంగాణ మాగాణంలో తెలుగు, సంస్కృత, ప్రాకృత (పైశాచీ) బ్రాహ్మీకవి పండితులకు కొదువలేదు.
-గణపతి శ్రీనివాసరావు: ఘణాపురం, తొగుట మండలం. ఒకప్పటి ప్రాచీనకవి. శంభూక వధ-గణపురం లక్ష్మీనరసింహస్వామిపై పంచరత్న పద్యాలను రచించినట్టుగా చరిత్ర చెపుతున్నది. శంభూక వధ అనే గ్రంథాన్ని అనువదించినట్టుగా చెబుతున్నారు. గోల్కొండ పత్రికలో వీరి గురించి సురవరం ప్రతాపరెడ్డి రాశారు.
-జానకీరామశర్మ: కవి, తెలుగు పండితులు. తొగుట గ్రామం. ఆయన శ్రీశ్రీశ్రీ కృష్ణానంద స్వామిగా ప్రసిద్ధి చెందారు. భక్తి కావ్య శతకాన్ని రాశారు. మదనానంద సరస్వతి స్వామి ఆశ్రమాన్ని రాంపురంలో నెలకొల్పారు. వీరి తండ్రి, తాతల హయాంలో తొగుటలో సంస్కృత పాఠశాల నిర్వహించారు. పూర్వాశ్రమంలో ఉపాధ్యాయుడిగా ఉండగానే పది వచన కవితలను రాశారు.
-లింగోజీ ఆనందరావు దేశపాండే: ప్రాచీన కవి, జ్యోతిశాస్త్ర నిపుణుడు. 1914లో జన్మించారు. ఉర్దూ మాధ్యమంలో చదువును కొనసాగించి పద్య, వచన కవితా సంపుటాలను రెండింటిని అందించిన ఘనత వీరిది. స్వగ్రామం కామారెడ్డిలోని ఆర్గొండ గ్రామం, నివాసం నార్సింగ్. వీరి బంధువుల ఇంట్లోనే ఒక ప్రాచీన వేమన పద్యాల తాళపత్ర ప్రతిని కావూరి శ్రీనివాస్ సేకరించారు. వేణుగోపాల భజనమాల పరమేశ్వర శతకం అచ్చులో ఉంది. అముద్రిత గ్రంథాలు రాజీవ చరిత్ర యక్షగానం, చాటువులు-గేయాలు.
-చింతమడక జానకీరాములు: ప్రాచీన అనువాద, ఆశుకవి, వేమన పద్యాల మాదిరిగా, కొన్ని ఆటవెలది పద్యాలను అందించారని చరిత్ర. రామాయంపేట దగ్గరలో నివాసం ఏర్పర్చుకొని చివరిదశలో మిరుదొడ్డి గ్రామంలో తనువును చాలించిన చరిత్రకు తెలియని కవి ఈయన.
-పావని విశ్వనాథం: 1913లో జన్మించిన ఈయన తెలుగు, ఉర్దూ, హిందీ భాషల్లో ప్రావీణ్యం సంపాదించి గోల్కొండ, పద్మశాలి నేత పత్రికల్లో విరివిగా రచనలు చేసినట్టు చరిత్ర చెబుతున్నది. అబలా విలాసం మొదలైన కొన్ని గ్రంథాలను అందించినట్టుగా చరిత్ర.
-హన్మంతరావు: కాజాపూర్ చిన్న శంకరంపేటలో జన్మించారు. ఉర్దూలో కొంత ప్రవేశం ఉన్నప్పటికీ అమరనోటి మాట-ఆర్యమాట అనే మకుటంతో అమరనాథ శతకం రచించారు. తెలుగు పండితులుగా కాళేశ్వర శతకం రాశారు. ఇటీవల ఓయూ ఉత్సవాల గురించి కూడా ఆయన రాశారు.
-సేడిది విశ్వనాథం (1942-1967) : వీరి తల్లిదండ్రులు నాగమ్మ-వీరన్న. నివాసం సదాశివపేట. హిందీ అనువాదకథలు, పద్యగద్య రచనలను తెలంగాణకు అందించారు. వీరి వంశీకులు ఇప్పటికీ ఉన్నారు.
-ఉప్పల రాములు: 1944లో జన్మించారు. ఈయన తల్లిదండ్రులు భూదేవి-శివయ్య. విశ్వేశ్వర శతకం, భగవద్గీత కర్మకాండ బుర్రకథ మొదలలైన గ్రంథాలను రచించారు. మచ్చుకు
॥సీ॥ కాసులు లేకున్న కడుపు యాకలి చింత
పది కాసులున్న కాపాడు చింత
బట్టలు లేకున్న పైన గప్పుట చింత
బట్టలున్నను శుద్ధి పరుచు చింత
సంతానమున్నను సాదుట కొక చింత
సుతులు లేకున్నచో గతుల చింత
పశువులు గలిగిన పరగ మేతకు చింత
పశువులు లేకున్న పాడి చింత॥
-పొట్టిపల్లి వీరప్ప: 1925లో జన్మించారు. వీరు సహజ ధోరణి గల కవితాధార కలిగిన కవి. మన్మథ సంహారం, రైతు విజయం యక్షగాన పద్య గద్య కీర్తనలు, కందాలతో రాయగల సమర్థులు.
-పడిగ శివయ్యగారి నారాయణ: 1919లో జననం. తల్లిదండ్రులు బాలమ్మ-శివయ్య. శ్రీరామ నక్షత్రమాల, శ్రీసాయిబాబా పంచవింశతి, తత్వభజన, రుక్మాబాయి నాటిక, లక్ష్మీ సరస్వతి సంవాదములు వీరి రచనలు.
ఉదా:
గీ॥ వేదాంత రూపమిక్కిలి
పాదుగ నీనామమెపుడు ప్రార్థింతునికన్
నీధరయందు సదాసుల
మోదముతో బ్రోచునట్టి ముఖ్యడ సాయీ॥
స్వార్థపరులయ్యు మానవుల్ చాలా వరకు
ప్రజకు మేల్జేతుమని చాలాబలుకుచుండ్రు
మాటలమృతంబు మాట లోపల విషంబు
లలిత రఘురామ ఇది మాయ కలియుగంబు॥
ఈయన రచనలు ఆముదిత్రాలుగా ఉన్నాయి. కుమారస్వామి విజయం, రుక్మిణి కల్యాణం, సభాపర్వం, శ్రీకృష్ణ లీలలు, భద్రావతి వివాహం, శ్రీకృష్ణార్జున యుద్ధం, వీరి యక్షగాన అముద్రిత గ్రంథాలు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు