తెలంగాణలో ఎడ్లబండిపై తొలి సంచార గ్రంథాలయం నడిపిన వారు?
తెలంగాణ చరిత్ర -3
నవంబర్ 17 తరువాయి
106. లింగమంతుల స్వామిని ఏ జాతరలో పూజిస్తారు?
1) పెద్దగట్టు 2) మన్నెం కొండ
3) యాదాద్రి 4) కొండగట్టు
107. అసఫ్ జాహీ వంశ చివరి పాలకుడు?
1) మీర్ కమ్రుద్దీన్
2) మహబూబ్ అలీ పాషా
3) మీర్ ఉస్మాన్ అలీఖాన్
4) నిజాం అలీఖాన్
108. భారత యూనియన్‌లో విలీనంకావాలని పిలుపునిచ్చిన హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ అధ్యక్షుడు?
1) బూర్గుల రామకృష్ణారావు
2) కేవీ రంగారెడ్డి
3) స్వామి రామానంద తీర్థ
4) కాళోజీ నారాయణ రావు
109. తెలంగాణ రాష్ట్ర పార్టీ స్థాపకులెవరు?
1) గాదె ఇన్నయ్య 2) గద్దర్
3) విజయశాంతి 4) విమలక్క
110. హరిజన, అస్పృశ్యులు, పంచములు అనే పదాలను తిరస్కరించి, వారిని ఆదిహిందు-వులు అని పిలవాలని అన్నది ఎవరు?
1) ఎం.ఎల్. ఆదయ్య
2) అరిగె రామస్వామి
3) జేఎస్ ముత్తయ్య
4) భాగ్యరెడ్డి వర్మ
111. ‘తెలంగాణ విమోచన ఉద్యమ సమితి చైర్మన్/అధ్యక్షులు’ ఎవరు?
1) కాళోజీ నారాయణరావు
2) దామోదరం సంజీవయ్య
3) కే బ్రహ్మానంద రెడ్డి
4) జీ నారాయణ రావు
112. తెలంగాణ ప్రాంతం నుంచి ‘పెద్ద మనుషుల ఒప్పందం’లో సభ్యులు కానివారెవరు?
1) మర్రి చెన్నారెడ్డి
2) బూర్గుల రామకృష్ణారావు
3) కొండా వెంకట రంగారెడ్డి
4) కొండా లక్ష్మణ్ బాపూజీ
113. రామప్ప దేవాలయం ఎక్కడ ఉంది?
1) గణపూరం గ్రామం
2) పాలంపేట గ్రామం
3) వెంకటాపూర్ గ్రామం
4) భూపాలపల్లి గ్రామం
114. ‘రజాకార్’ అనే మాటకు భాషాపరమైన అర్థం ?
1) యుద్ధవీరుడు 2) పౌరుడు
3) స్వచ్ఛంద కార్యకర్త 4) దేశ భక్తుడు
115. విసునూరు దేశ్‌ముఖ్ దురాగతాలను ఎదిరించిన ఐలమ్మ ఏ గ్రామానికి చెందిన వీరనారి?
1) పాలకుర్తి 2) కడవెండి
3) బైరాన్‌పల్లి 4) అల్లీపురం
116. జతపరచండి.
ఎ. తెలంగాణ యూనివర్సిటీ 1. 1985
బి. ఆరు సూత్రాల పథకం 2. 2005
సి. జీ.ఓ. నెం. 610 3. 2006
డి. గిర్గ్లానీ కమిషన్ 4. 1973
5. 2001
1) ఎ-3, బి-4, సి-1, డి-5
2) ఎ-2, బి-4, సి-3, డి-1
3) ఎ-5, బి-3, సి-4, డి-2
4) ఎ-1, బి-5, సి-2, డి-4
117. ఉర్దూ గజల్స్ సంపుటిని ‘దివాస్’ పేరుతో ప్రచురించిన నిజాం ప్రాంతపు తొలి మహిళ ఎవరు?
1) మా లఖ చందా 2) జిలానీ బానో
3) భాగమతి 4) రషీదున్నీసా బేగం
118. మేళ్ల చెరువు జాతర దైవం ఎవరు?
1) భద్రకాళి 2) దుర్గాదేవి
3) శ్రీరామ చంద్రుడు
4) శంభు లింగేశ్వర స్వామి
119. ‘కలమ’, ‘శాలి’, ‘శిరాముఖి’, ‘పతంగ హోయన’ అనేవి?
1) మిలిటరీ పన్నులు
2) వర్తకులపై వసూలు చేసే పన్నులు
3) మంగళ్లపై వసూలు చేసే పన్నులు
4) వరిలో రకాలు
120. కాకతీయుల కాలంలో ‘కిళిరము’ అనే పన్ను దేనిపై విధించారు?
1) గొర్రెల మందపై
2) చెరువు కాలువలపై
3) పోక తోటలపై
4) వారాంతపు సంతలపై
121. 2001లో తెలంగాణ కోసం ‘సింహ గర్జన’ సభ ఎక్కడ జరిగింది?
1) సిద్దిపేట 2) కరీంనగర్
3) హన్మకొండ 4) నల్లగొండ
122. కాకతీయుల కాలంలో వసూలు చేసే ఆస్తి పన్నును ఏ పేరుతో పిలిచేవారు?
1) ముదార 2) కనిక
3) పుల్లరి 4) ఇల్లరి
123. తెలంగాణ సాధన సమితి తెలంగాణ రాష్ట్ర సమితిలో ఏ రోజున విలీనం చేశారు?
1) 2002, ఆగస్టు 11
2) 2002, ఆగస్టు 14
3) 2002, ఆగస్టు 15
4) 2002, ఆగస్టు 13
124. హైదరాబాద్‌లోని చారిత్రక చార్మినార్‌ను నిర్మించిన కుతుబ్‌షాహీ రాజు ఎవరు?
1) మహ్మద్ కులీ కుతుబ్ షా
2) జంషద్ కులీ కుతుబ్ షా
3) కులీ కుతుబ్ ఉల్-ముల్క్
4) ఇబ్రహీం కులీ కుతుబ్ షా
125. 18వ శతాబ్దంలో నిర్మించిన శ్రీ రంగనాయక స్వామి దేవాలయం తెలంగాణలో ఎక్కడ ఉన్నది?
1) వనపర్తి వద్ద శ్రీరంగాపూర్
2) రాచకొండ ప్రాంతం
3) ఇబ్రహీంపట్నం, జాపాల్ రంగాపూర్
4) ఆలేరు వద్ద కొలనుపాక
126. సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళీ దేవాలయాన్ని కింది వారిలో ఎవరు
నిర్మించారు?
1) భగవాన్ దాస్
2) సూరితి అప్పయ్య
3) పద్మారావు పిైళ్లె
4) రాజా చందూలాల్
127. కింది వాటిలో తెలంగాణలో దసరా పండుగతో సంబంధం కలిగినవి ?
1) మారేడు పండ్లు, జొన్న కొమ్మలు
2) మర్రి ఆకులు, మోదుగు ఆకులు
3) జమ్మి ఆకులు, వరి కాండం కొమ్మలు
4) జమ్మి ఆకులు, జొన్న కొమ్మలు
128. ముల్కీ నిబంధనల కొనసాగింపు తీర్పును సమీక్షించడానికి కింది వాటిలో ఏ కమిటీని నియమించారు?
1) జస్టిస్ భార్గవ కమిటీ
2) సుందరేశన్ కమిటీ
3) జస్టిస్ వాంఛూ కమిటీ
4) గిర్గ్లానీ కమిషన్
129. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం యూపీఏ ప్రభుత్వం నియమించిన శ్రీకృష్ణ కమిటీలో కింది వారిలో ఎవరు సభ్యులు కారు?
1) డాక్టర్ అబూ సలే షరీఫ్
2) ప్రొఫెసర్ అరవింద్ సింగ్
3) వినోద్ కే దుగ్గల్
4) డాక్టర్ రవీందర్ కౌర్
130. శ్రీకృష్ణ కమిటీ మెంబర్ సెక్రటరీగా వ్యవహరించింది ఎవరు?
1) రణబీర్ సింగ్ 2) వీకే దుగ్గల్
3) రవీందర్ కౌర్ 4) సజ్జన్ కుమార్
131. 1969 తెలంగాణ ఆందోళనను ఎవరు ప్రారంభించారు?
1) నల్లగొండ ఉపాధ్యాయులు
2) కొత్తగూడెం థర్మల్ విద్యుత్ కేంద్రం ఉద్యోగులు
3) ఉస్మానియా మెడికల్ కాలేజీ విద్యార్థులు
4) రామగుండం థర్మల్ విద్యుత్ కేంద్రం ఉద్యోగులు
132. 1971 ఎన్నికల్లో తెలంగాణ ప్రజా సమితి కింది నాలుగు తప్ప మిగతా 10 లోక్‌సభ స్థానాలను గెలిచింది.
1) ఆదిలాబాద్, మెదక్, నల్లగొండ, జహీరాబాద్
2) ఆదిలాబాద్, ఖమ్మం, మిర్యాలగూడ, నిజామాబాద్
3) హైదరాబాద్, ఖమ్మం, మహబూబ్‌నగర్, సికింద్రాబాద్
4) హైదరాబాద్, ఖమ్మం, మిర్యాలగూడ, నల్లగొండ
133. ‘హైదరాబాద్’ తెలుగు వారపత్రిక సంపాదకుడు ఎవరు?
1) అరిగె రామస్వామి
2) మాడపాటి రామచంద్రా రావు
3) భాగ్యరెడ్డి వర్మ
4) బొజ్జం నర్సింలు
134. 1959 ఉద్యమంలో ప్రత్యేక తెలంగాణ నినాదాన్నిచ్చిన సంస్థ?
1) తెలంగాణ జనసభ
2) తెలంగాణ హక్కుల రక్షణ సమితి
3) తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్
4) తెలంగాణ మహాసభ
135. తెలంగాణపై కాంగ్రెస్ నియమించిన ఏకే ఆంటోని కమిటీ ఇతర సభ్యులు ఎవరు?
1) ప్రణబ్ ముఖర్జీ, రామచంద్ర కుంతియ, చంద్రకాంత్ కవలేకర్
2) కొణిజేటి రోశయ్య, గులాంనబీ ఆజాద్, మల్లికార్జున ఖర్గే
3) జైపాల్ రెడ్డి, కేశవ్‌రావ్, ఎస్ఎం కృష్ణ
4) అహ్మద్ పటేల్, దిగ్విజయ్‌సింగ్, వీరప్ప మొయిలీ
136. 1980 చివరి భాగంలో తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్టు తీసుకువచ్చిన సమాచార పత్రిక పేరు?
1) తెలంగాణ క్రానికల్
2) తెలంగాణ టైమ్స్
3) ప్రజా తెలంగాణ
4) మా తెలంగాణ
137. ‘పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలమా’ పాట రచయిత?
1) అందెశ్రీ
2) ముదింగంటి సుజాతారెడ్డి
3) గద్దర్
4) నందిని సిధారెడ్డి
138. 9 అక్టోబర్ 2010న ఏర్పడిన ప్రజాఫ్రంట్‌కు చైర్మన్ ఎవరు?
1) విమలక్క 2) విజయశాంతి
3) మందకృష్ణ మాదిగ 4) గద్దర్
139. ముద్దపప్పు బతుకమ్మ ఏ రోజున జరుపుకొంటారు?
1) బతుకమ్మ పండుగ రెండవరోజు
2) బతుకమ్మ పండుగ ఎనిమిదవ రోజు
3) బతుకమ్మ పండుగ మూడో రోజు
4) బతుకమ్మ పండుగ ఆరో రోజు
140. పాతకాలపు తెలంగాణలో చెరువు నుంచి నీటి పంపిణీ, సప్లై ఎవరి బాధ్యతగా ఉండేది?
1) నీరటికాడు 2) పట్వారీ
3) పోలీసు పటేల్ 4) గిర్దావర్
141. కాకతీయుల కాలానికి చెందిన ఏ శాసనంలో ‘వినయ భూషణుడు’ బిరుదుతో రుద్రదేవుడిని పేర్కొన్నారు?
1) గణపురం శాసనం
2) ద్రాక్షారామ శాసనం
3) వరంగల్ ఖిలా శాసనం
4) హనుమకొండ శాసనం
142. మిద్దె రాములు ఏ రంగంలో ప్రసిద్ధులు?
1) ఒగ్గు కథ 2) యక్షగానం
3) మిమిక్రీ 4) ఏకపాత్రాభినయం
143. ‘చిత్తారమ్మ జాతరను’ కింది వాటిలో ఏ ప్రాంతంలో జరుపుకొంటారు?
1) పటాన్చెరు, సంగారెడ్డి
2) అనంతగిరి, వికారాబాద్
3) కోయిలకొండ, మహబూబ్‌నగర్
4) గాజులరామారం, హైదరాబాద్
144. 3 జనవరి 2010న తెలంగాణ విద్యార్థి మహా గర్జన జరిగిన ప్రదేశం ఏది?
1) నిజాం కాలేజీ గ్రౌండ్స్
2) కాకతీయ యూనివర్సీటీ
3) ఎస్ఆర్ఆర్ కాలేజీ గ్రౌండ్స్, కరీంనగర్
4) ఉస్మానియా యూనివర్సిటీ
145. ప్రజా సంఘాల జేఏసీ లో భాగంకాని వారు ఎవరు?
1) దిలీప్ కుమార్
2) తేజావత్ బెల్లయ్య నాయక్
3) ఆచార్య ఐ.తిరుమలి
4) మంద కృష్ణ మాదిగ
146. ఏడుపాయల జాతరకు సందర్భం ఏమిటి?
1) దీపావళి 2) దసరా
3) శివరాత్రి 4) హోళి
147. తెలంగాణలోని ఏ ప్రదేశంలో చరిత్ర పూర్వ యుగానికి చెందిన గుర్రం అస్థిపంజరం
కనుగొన్నారు?
1) కోటిలింగాల 2) మెదక్
3) పోచంపాడు 4) ఉట్నూర్
148. ‘అష్టాండ నిఘంటు’ అనే వైద్య లెక్సికన్ రచయిత ఎవరు?
1) మద్వాచార్యుడు 2) విష్ణు గోపుడు
3) నారద పండితుడు
4) బహతాచార్యుడు
149. ప్రఖ్యాత నృత్యరూపం ‘పేరిణి శివతాండవాన్ని’ అందించినవారు?
1) అన్నమాచార్య 2) పేరిణి
3) జాయప్ప కళ్యాణి
4) నటరాజ రామకృష్ణ
150. ముల్కీ ఉద్యమం ప్రారంభమైన సంవత్సరం?
1) 1956 2) 1950
3) 1969 4) 1952
151. 27 ఏప్రిల్ 2003న జరిగిన వరంగల్ జైత్రయాత్ర మీటింగ్‌కు వచ్చిన ముఖ్య అతిథి ?
1) అజిత్ సింగ్ 2) దేవెగౌడ
3) 1,2 4) శరద్ యాదవ్
152. 2009లో తెలంగాణ ఉద్యోగులు నిర్వహించిన ‘ఉద్యోగుల గర్జన’ సమావేశం ఎక్కడ జరిగింది?
1) సిద్దిపేట 2) వరంగల్
3) హైదరాబాద్ 4) సూర్యాపేట
153. టీజేఏసీ నిర్వహించిన కార్యక్రమం ఏది?
1) సమర దీక్ష
2) ఢిల్లీ సంసద్ యాత్ర
3) పోరు గర్జన 4) సకల జనభేరి
154. 1969 ఆందోళనలో 37 రోజుల సమ్మెను నిర్వహించిన తెలంగాణ ఎన్జీవో నాయకుడి పేరు?
1) బాకర్ అలీ మిర్జా
2) ఎం నారాయణ రెడ్డి
3) కే ఆర్ అమోస్
4) బీవీ రాజు
155. జల సాధన సమితి స్థాపకులు ?
1) నోముల సత్యనారాయణ
2) జాజాల వాసుదేవ శర్మ
3) తేరాల సత్యనారాయణ శర్మ
4) దుశర్ల సత్యనారాయణ
156. తెలంగాణలో ఎడ్లబండిపై తొలి సంచార గ్రంథాలయం నడిపినవారెవరు?
1) పువ్వాడ వెంకటప్పయ్య
2) కోదాటి నారాయణ రావు
3) బోయినపల్లి వెంకట రామారావు
4) టీకే బాలయ్య
157. కింది ఏ సంస్థ ‘Hyderabad for Hyderabadis’ నినాదాన్నిచ్చింది?
1) జామియా ఇస్లామియా
2) ఇత్తేహాదుల్ ముస్లిమీన్
3) దక్కన్-ఏ-షబ్బీర్
4) జమీయత్ రియా మయే నిజాం
158. నిజాం కళాశాల మైదానంలో 8 ఫిబ్రవరి 2010న తెలంగాణ ముస్లిం గర్జన ఏర్పాటు చేసింది?
1) మజ్లిస్ ఇహదుల్ ముస్లిమీన్
2) తెలంగాణ ముస్లిం జేఏసీ
3) జమాత్-ఇ-ఇస్లామీ హింద్
4) టీజేఏసీ
159. 1969 ఉద్యమ ఆరంభంలో తెలంగాణ అంశంపై నిరాహార దీక్షకు కూర్చున్న తొమ్మిది సంవత్సరాల బాలిక ఎవరు?
1) సరోజ 2) అనురాధ
3) రాజమ్మ 4) లక్ష్మమ్మ
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు