భూమిపైన అత్యంత పల్లంలో ఉన్న దేశం ఏది
జాగ్రఫీ
1. కిందివాటిలో ఏ భారతీయ ద్వీపాలు ఇండియా – శ్రీలంక మధ్య ఉన్నాయి?
ఎ) ఎలిఫెంటా బి) నికోబార్
సి) రామేశ్వరం డి) సల్సెట్టి
2. కింది వాటిలో ఏ రాష్ట్రంలో అతి తక్కువ ఒండ్రుమట్టి నేలలు ఉన్నాయి?
ఎ) బీహార్ బి) మధ్యప్రదేశ్
సి) తమిళనాడు డి) పంజాబ్
3. కింది వాటిలో ఏ పర్వతాలు తూర్పుకనుమలు, పశ్చిమ కనుమలు కలిసే చోట కనిపిస్తాయి?
ఎ) ఆరావళి పర్వతాలు
బి) కార్డమమ్ పర్వతాలు
సి) నీలగిరి పర్వతాలు
డి) శివరామ్ పర్వతాలు
4. ఇండియాలో పశు సంక్షేమ మండలి ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉన్నది?
ఎ) అహ్మదాబాద్ బి) చెన్నై
సి) హైదరాబాద్ డి) కోల్‌కతా
5. ఉత్తర ధృవం ఎల్లప్పుడు కాంతిని కలిగి ఉండే కాలం?
ఎ) సెప్టెంబర్ 23 నుంచి 21 వరకు
బి) మార్చి21 నుంచి సెప్టెంబర్ 23 వరకు
సి) జూన్ 21 నుంచి డిసెంబర్ 22 వరకు
డి) డిసెంబర్ 23 నుంచి జూన్ 21 వరకు
6. సౌర వ్యవస్థలో అతి తక్కువ సాంద్రతగల గ్రహం?
ఎ) సూర్యుడు బి) బుధుడు
సి) శని డి) భూమి
7. కింది నదుల్లో భారతదేశంలో ఆరంభం కాని నది ఏది?
ఎ) రావి బి) బియాస్
సి) సట్లెజ్ డి) చీనాబ్
8. భారతదేశ అంతర జలమార్గాల సంస్థ ప్రధాన కార్యాలయం ఏ నగరంలో ఉంది?
ఎ) ముంబై బి) కోల్‌కతా
సి) నోయిడా డి) ఢిల్లీ
9. రేఖాంశాలను 0o నుంచి ఎంత వరకు లెక్కిస్తారు?
ఎ) 180o దక్షిణ, 180o ఉత్తరం
బి) 90o తూర్పు, పడమర
సి) 180o తూర్పు 180o పడమర
డి) 90o తూర్పు, 180o పడమర
10. జనసాంద్రత మొత్తం విస్తీర్ణంలో ప్రపంచంలోనే అతి చిన్న దేశం?
ఎ) వాటికన్‌సిటీ బి) తువాలు
సి) నౌరు డి) పాలో
11. భూమిపైన అత్యంత పల్లంలో ఉన్న దేశం ఏది?
ఎ) బెల్జియం బి) నెదర్లాండ్స్
సి) మాల్దీవులు డి) నార్వే
12. భారతదేశంలో మొదటి ప్రపంచ వారసత్వ నగరాల్లో యునెస్కో లాఛనంగా గుర్తించిన నగరం?
ఎ) ఉదయపూర్ బి) మధుర
సి) ఉజ్జయిని డి) అహ్మదాబాద్
13. కింది వాటిలో ఏ రకం వ్యవసాయ పద్ధతులు పర్యావరణ రక్షణకు దోహదపడతాయి?
ఎ) సేంద్రియ వ్యవసాయం
బి) బదిలీ సేద్యం
సి) అధిక ఉత్పత్తి వంగడాల సేద్యం
డి) గాజుగదుల్లో మొక్కలు పెంచడం
14. కిందివాటిలో ఆంధ్రప్రదేశ్‌తో సరిహద్దులు పంచుకోని జిల్లా ఏది?
ఎ) భద్రాద్రి కొత్తగూడెం
బి) నల్లగొండ
సి) నాగర్‌కర్నూల్
డి) మహబూబ్‌నగర్
15. ప్రతిపాదన(ఎ) : దక్షిణ చైనాలో జనించే ఉష్ణమండల చక్రవాతాలను టైపూన్లు అంటారు.
కారణం(ఆర్) : ఉష్ణమండల చక్రవాతాల సమపీడన రేఖలు వర్తులాకారంలో ఉంటాయి.సరైన సమాధానం ఏది?
ఎ) ఎ, ఆర్ రెండూ నిజం, ‘ఎ’ కి ఆర్ సరైన వివరణ.
బి) ఎ, ఆర్ రెండూ నిజం, ‘ఎ’ కి ఆర్ సరైన వివరణ కాదు.
సి) ‘ఎ’ నిజం ఆర్ తప్పు
డి) ‘ఎ’ తప్పు, ఆర్ నిజం
16. అసోం ప్రభుత్వం ‘నమామి బ్రహ్మపుత్ర పండుగను ఎందుకు నిర్వహిస్తుంది?
ఎ) పడవల పోటీలు నిర్వహించడానికి
బి) నీటి మార్గాలలో ప్రయాణాన్ని
ప్రోత్సహించడానికి
సి) అసోం లోని వివిధ తెగల మధ్య
బంధాలు పటిష్టం చేయడానికి
డి) ప్రభుత్వ ఘన కార్యములను
ప్రదర్శించడానికి
17. ధైర్ఘ్యలోయలు ఏ హిమాలయాల మధ్య విస్తరించి ఉన్నవి?
ఎ) హిమాచల్-శివాలిక్
బి) హిమాద్రి హిమాచల్
సి) హిమాద్రి ట్రాన్స్ హిమాలయాలు
డి) ఏదీకాదు
18. భారతదేశంలో ఎత్తయిన కనుమ ఏది?
ఎ) బనీహల్ కనుమ
బి) జెలప్ కనుమ
సి) షిష్కిలా కనుమ
డి) కర్డుంగులా కనుమ
19. ముంబై పుణెలను కలుపుతున్న కనుమ ఏది?
ఎ) థాల్గట్ బి) బోర్ఘాట్
సి) పాలాఘట్ డి) కరంజ కనుమ
20. తమిళనాడులో వేసవి విడిది కేంద్రమైన కొడైకెనాల్ ఏ కొండల్లో కలదు?
ఎ) నీలగిరి కొండలు
బి) షెవరాయి కొండలు
సి) పళని కొండలు
డి) జువధి కొండలు
21. ట్రాన్స్ హిమాలయాల్లో ఉన్న శ్రేణులను పై నుంచి కిందికి వరుస క్రమంలో రాయండి?
ఎ) జష్కర్, కారకోరం, కైలాస్, లడఖ్
బి) కారకోరం, కైలాస్, లడఖ్, జష్కర్
సి) కైలాస్, జష్కర్, లడఖ్, కారకోరం
డి) కారకోరం, లడఖ్, జష్కర్, కైలాస్
22. రాజ్‌మహల్ కొండల్లో ఎతైన శిఖరం?
ఎ) పారస్ నాథ్ బి) సాడిల్
సి) గిర్నాల్ డి) సారమతి
23. హిమాలయాలు ప్రధానంగా ఏ శిలలతో ఏర్పడినవి?
ఎ) అగ్నిశిలలు బి) అవక్షేప శిలలు
సి) రూపాంతర శిలలు డి) ఏదీకాదు
24. జతపరచండి.
1) థాల్‌ఘాట్ /బాల్గట్ ఎ) ముంబై- ఇండోర్‌లను కలుపుతుంది
2) పాల్ఘాట్కనుమ బి) కొచ్చిన్ కోయంబత్తూర్లను కలుపుతుంది
3) బనీహల్ కనుమ సి) జమ్ము- శ్రీనగర్లను కలుపుతుంది
4) జలప్లో కనుమ డి) టిబెట్ పశ్చిమ బెంగాల్‌లోని కలింగపాం
ఎ) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి బి) 1-బి, 2-డి, 3-సి, 4-ఎ
సి) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ డి) 1-సి, 2-డి, 3-బి, 4-ఎ
25. జతపర్చండి.
1) జీలం నది ఎ) బారాలాప్చాలా (హిమాచల్ ప్రదేశ్)
2) రావి నది బి) వేరీనాగ్ (జమ్ము కశ్మీర్)
3) బియాస్ నది సి) రోహతక్ (హిమచల్‌ప్రదేశ్)
4) చీనాబ్ నది డి) బియాస్‌కుండ్ (హిమచల్ ప్రదేశ్)
ఎ) 1-ఎ, 2-డి, 3-సి, 4-బి బి) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
సి) 1-బి, 2-సి, 3-డి, 4-ఎ డి) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
26. సింధూనది ఎడమవైపు ఉపనదుల్లో అత్యధిక నీటిని కలిగి ఉండే నది?
ఎ) రావి బి) బియాస్ సి) సట్లెజ్ డి) చీనాబ్
27. జపరచండి.
1) గోవా ఎ) జువారి నది, మాండవి నది
2) కేరళ బి) పెరియార్ నది, పంపా నది, ఇడుక్కి నది
3) కర్ణాటక సి) శరావతి నది, కావేరి నది, గంగవల్లి, నేత్రావతి
4) మధ్యప్రదేశ్ డి) మహి నది
ఎ) 1డి, 2-సి, 3-బి, 4-డి బి) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
సి) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి డి) 1-బి, 2-డి, 3-సి, 4-ఎ
28. నైరుతి, ఈశాన్య రుతుపవనాల నుంచి వర్షపాతం పొందుతున్నది?
ఎ) దామోదర్ బి) బ్రహ్మపుత్ర
సి) మహానది డి) కావేరి
29. జతపరచండి.
1) షింసా జలవిద్యుత్ (షింసానది) ఎ) కర్ణాటక
2) పాపనాశం జల విద్యుత్ (తాబ్రపరాని నది)బి) ఒడిశా
3) వలినేని జల విద్యుత్ (సీతార్నది) సి) తమిళనాడు
4) పారంగల్ పట్టు ప్రాజెక్టు (పారంగల్ నది) డి) కేరళ
ఎ) 1-ఎ, 2-సి, 3-బి, 4-డి బి) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
సి) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి డి) 1-డి, 2-సి, 3-ఎ, 4-బి
30. భారత దేశంలో రుతుపవనాలకు ప్రధాన కారణం?
ఎ) హిందూ మహాసముద్రం, భూభాగాల మధ్య ఉష్ణోగ్రతలో తేడాలు
బి) ఉత్తర దక్షిణ భారతాల ఉష్ణోగ్రతలో తేడాలు
సి) భూమధ్య రేఖ దగ్గరగా ఉండటం
డి) వేసవి, శీతాకాలాల్లో ఉష్ణోగ్రతల మధ్య తేడాలు
31. కరువు పరిస్థితి పరిశీలన, నిర్వహణకు భారత ప్రభుత్వం నోడల్ మంత్రిత్వ శాఖ ఏది?
ఎ) నీటి వనరుల మంత్రిత్వ శాఖ
బి) పర్యావరణ మంత్రిత్వ శాఖ
సి) శాస్త్ర, సాంకేతిక శాఖ
డి) వ్యవసాయ మంత్రిత్వశాఖ
32. లానినో, ఎల్‌నినో సముద్ర ప్రవాహాలు ఎక్కడ ఏర్పడతాయి?
ఎ) పసిఫిక్ మహాసముద్రం
బి) బంగాళాఖాతం
సి) అట్లాంటిక్ మహాసముద్రం
డి) హిందూ మహాసముద్రం
33. హ్యూమస్ అధికంగా ఉండే చెర్నోజెమ్ రేగడి భూములు ఉన్న ప్రాంతం?
ఎ) అమెజాన్ తీరం బి) ఈజిప్టు
సి) ఉక్రెయిన్ డి) గంగా తీరం
34. దేశంలో కాఫీని ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్న రాష్ర్టాలు
ఎ) తమిళనాడు, కేరళ, కర్ణాటక
బి) కర్ణాటక, కేరళ, తమిళనాడు
సి) కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, కేరళ
డి) తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్
35. జతపరచండి.
1) భారతదేశంలో కనుగొన్న
మొదటి ఇనుప గని ఎ) శ్రీకాకుళం
2) భారత్‌లో కనుగొన్న
మొదటి బొగ్గు గని బి) కాగితం
3) భారత్‌లో అత్యంత
పురాతన మాంగనీస్ గని సి) సింగ్భమ్
4) దేవాస్ ప్రాంతం దేనికి ప్రసిద్ధి డి) రాణిగంజ్
ఎ) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
బి) 1-డి, 2-సి, 3-ఎ, 4-బి
సి) 1-బి, 2-సి, 3-ఎ, 4-డి
డి) 1-ఎ, 2-డి, 3-సి, 4-బి
36. భారతదేశంలో కెల్లా అధికంగా బొగ్గు
నిక్షేపాలు ఉన్న నది?
ఎ) సోన్ లోయ
బి) దామోదర్ లోయ
సి) మహానది లోయ
డి) బ్రహ్మపుత్ర లోయ
37. సింధ్రీ దేనికి ప్రసిద్ధి చెందింది?
ఎ) అల్యూమినియం కర్మాగారం
బి) సిమెంట్ కర్మాగారం
సి) కాగితం కర్మాగారం
డి) ఎరువుల కర్మాగారం
38. పవనశక్తిని అత్యధికంగా నియంత్రణలోకి తెచ్చుకుంటున్న ముఖ్యమైన రాష్ర్టాలు
ఎ) ఒడిశా, మహారాష్ట్ర
బి) మహారాష్ట్ర, కేరళ
సి) గుజరాత్, మహారాష్ట్ర
డి) గుజరాత్, తమిళనాడు
శిలలు
- వివిధ ఖనిజాల సమ్మేళనం శిల. అనేక ఖనిజాల సమూహం వల్ల శిల ఏర్పడుతుంది. అదే విధంగా అనేక మూలకాల సమూహం వల్ల ఖనిజం ఏర్పడుతుంది. శిలలు విచ్ఛిన్నం కావడం వల్ల నేల (Soil) ఏర్పడుతుంది. శిలల గురించి అధ్యయనం చేసే శాస్ర్తాన్ని పెట్రోలజీ అంటారు. శిలలను వాటి ఉద్భవ విధానం, భౌతిక ధర్మాల ఆధారంగా మూడు రకాలుగా విభజిస్తారు.
1. అగ్ని శిలలు 2. అవక్షేప శిలలు
3. రూపాంతర శిలలు
ముందుగా అగ్ని శిలలు గురించి తెలుసుకుందాం.
- Ignis అంటే లాటిన్‌భాషలో అగ్ని అని అర్థం. అగ్ని పర్వత ప్రక్రియ వల్ల భూమిపై ప్రథమంగా ఏర్పడిన శిలలు కనుక వీటిని ప్రథమ శిలలు అనికూడా అంటారు. భూ అంతర్భాగంలో శిలాద్రవం ఉపరితలానికి చేరి ఘనీభవించడం వల్ల ఏర్పడిన శిలలను అగ్ని శిలలు అంటారు. వీటిలో సిలికాపాళ్లు 80శాతం వరకూ ఉంటే ఆమ్ల శిలలు అని అంటారు.
ఉదా: గ్రానైట్
- అదే 40 శాతం లేదా అంతకంటే తక్కువగా ఉంటే మౌలిక శిలలు లేదా క్షార శిలలు అంటారు. ఉదా: బసాల్ట్
- శిలాద్రవం భూ ఉపరితలానికి వచ్చి చల్లారి ఘనీ భవించడం వల్ల ఏర్పడే శిలలు
ఉదా: బసాల్ట్ అండిసైట్. రియొలైట్
అంతర్గమ శిలలు
- శిలాద్రవం భూ ఉపరితలానికి కొంచెం దిగువ భాగంలోని రాతి పొరల మధ్య ఘనీ భవించుట వల్ల ఏర్పడే శిలలు.
ఉదా: గ్రానైట్, గాట్రో
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు