1969 ఉద్యమ కాలంలో ‘క్విట్ తెలంగాణ’ నినాదాన్నిచ్చింది ఎవరు?
తెలంగాణ చరిత్ర (12 నవంబర్ తరువాయి)
51. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆవిష్కరణల సంస్థ అయినటువంటి ‘టీ-హబ్’ను ఎక్కడ ఏర్పాటు చేసింది?
1) ఐఐటీ ప్రాంగణం, కంది, సంగారెడ్డి జిల్లా
2) ఐఐఐటీ ప్రాంగణం, గచ్చిబౌలి, హైదరాబాద్
3) ఐఐటీ ప్రాంగణం, బాసర, నిర్మల్ జిల్లా
4) ఎన్ఐటీ ప్రాంగణం, వరంగల్
52. ఆల్మట్టి ఆనకట్ట ఏ నదిపై నిర్మించారు?
1) కావేరి 2) సీలేరు
3) కృష్ణా 4) తుంగభద్ర
53. తెలంగాణ పునర్వ్యవస్థీకరణ తర్వాత నూతనంగా ఏర్పడిన జిల్లాలో పూర్తిగా దక్షిణాన ఉన్నది?
1) నాగర్‌కర్నూల్ 2) వనపర్తి
3) మహబూబ్‌నగర్
4) జోగులాంబ గద్వాల్
54. తెలంగాణలో అత్యధిక మాంగనీస్ ధాతువు ఉత్పాదన గల విభజన పూర్వపు జిల్లా?
1) ఖమ్మం 2) వరంగల్
3) ఆదిలాబాద్ 4) మెదక్
55. తెలంగాణ రాష్ట్రం కింది వాటిలో ఏ రాష్ర్టాల సముదాయాల చుట్టూ ఆవరించి ఉంది?
1) తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఒడిశా
2) ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మహారాష్ట్ర, కర్ణాటక
3) మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్
4) మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్
56. ఏ జిల్లా సాగునీటి అవసరాలను ఎగువ మానేరు సాగునీటి ప్రాజెక్టు తీరుస్తుంది?
1) రాజన్న సిరిసిల్ల 2) జగిత్యాల
3) కరీంనగర్ 4) కామారెడ్డి
57. తెలంగాణలో ‘దత్తాత్రేయ స్వామి’ ఆలయం ఎక్కడ ఉంది?
1) మంథని 2) మక్తల్
3) ముక్త్యాల 4) గజ్వేల్
58. కింది నదుల పరీవాహక ప్రాంతం బొగ్గు నిల్వలకు ప్రసిద్ధి?
1) ప్రాణహిత-గోదావరి
2) కిన్నెరసాని-కృష్ణా
3) కాగ్నా-భీమా
4) మంజీరా-మానేరు
59. వరంగల్ విమానాశ్రయం ఎక్కడ ఉంది?
1) కేసముద్రం 2) మామునూర్
3) హసన్‌పర్తి 4) మడికొండ
60. మన్నెంకొండ జాతరను కింది ఏ విభజన పూర్వపు తెలంగాణ జిల్లాలో నిర్వహిస్తారు?
1) రంగారెడ్డి 2) నల్లగొండ
3) నిజామాబాద్ 4) మహబూబ్‌నగర్
61. తెలంగాణలో కుంతల జలపాతం ఏ మండలంలో ఉంది?
1) నేరడిగొండ 2) మంచిర్యాల
3) సిర్పూర్ 4) ఆదిలాబాద్
62. కింది వాటిలో ఏ ఖనిజం విభజన పూర్వపు ఖమ్మం జిల్లా ప్రధాన ఖనిజం కాదు?
1) బైరటీస్ 2) గ్రానైట్
3) మాంగనీస్ 4) బొగ్గు
63. తెలంగాణ శీతోష్ణస్థితి?
1) ఉష్ణమండల శుష్క
2) ఉష్ణమండల ఆర్ధ్ర
3) సమశీతోష్ణ ఆర్ధ్ర
4) ఉష్ణమండల ఆర్ధ్ర శుష్క
64. తెలంగాణ కలప బొమ్మల తయారీకి ప్రసిద్ధి చెందిన ప్రాంతం?
1) పోచంపల్లి 2) నిర్మల్
3) కొలనుపాక 4) పోచారం
65. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన టెక్స్టైల్ పార్కులు?
ఎ. టెక్స్టైల్ పార్కు-సిరిసిల్ల-రాజన్న
సిరిసిల్ల జిల్లా
బి. టెక్స్టైల్ పార్కు-పాశమైలారం-సంగారెడ్డి జిల్లా
సి. టెక్స్టైల్ పార్కు-మల్కాపూర్-
యాదాద్రి భువనగిరి
1) ఎ, బి, సి 2) ఎ, బి
3) బి, సి 4) ఎ, సి
66. తెలంగాణ రాష్ట్రం భౌగోళికంగా వేటి మధ్య ఉంటుంది?
1) 940 251 తూర్పు రేఖాంశం నుంచి
980 271 తూర్పు రేఖాంశం వరకు
2) 580 161 తూర్పు రేఖాంశం నుంచి
760 181 తూర్పు రేఖాంశం వరకు
3) 770 251 తూర్పు రేఖాంశం నుంచి
810 191 తూర్పు రేఖాంశం వరకు
4) 820 201 తూర్పు రేఖాంశం నుంచి
930 241 తూర్పు రేఖాంశం వరకు
67. కొత్తగూడెం థర్మల్ పవర్‌స్టేషన్‌కు అవసర మైన నీరు ఏ నది నుంచి సరఫరా చేయబడుతుంది?
1) కిన్నెరసాని 2) శబరి
3) మున్నేరు 4) గోదావరి
68. వైశాల్యం రీత్యా తెలంగాణలో అతిపెద్ద జిల్లా ఏది?
1) జయశంకర్ భూపాలపల్లి
2) భద్రాద్రి కొత్తగూడెం
3) నల్లగొండ 4) నాగర్‌కర్నూల్
69. దేశంలోనే అరుదైన గోదాదేవి ఆలయం కింది ప్రదేశాల్లో ఎక్కడ ఉంది?
1) విభజన పూర్వపు ఖమ్మం జిల్లా –
సత్తుపల్లిలో
2) విభజన పూర్వపు మెదక్ జిల్లా – గజ్వేల్‌లో
3) విభజన పూర్వపు రంగారెడ్డి జల్లా – ఏదులాబాద్‌లో
4) విభజన పూర్వపు నల్లగొండ జిల్లా – పానగల్లులో
70. అమ్రాబాద్ పులుల అభయారణ్యం ఎక్కడ ఉంది?
1) జోగులాంబ గద్వాల జిల్లా
2) నల్లగొండ జిల్లా
3) నాగర్‌కర్నూల్ జిల్లా
4) రంగారెడ్డి జిల్లా
71. గోల్కొండ కోటపై ఎన్ని బురుజులు ఉన్నాయి?
1) 78 2) 82 3) 87 4) 69
72. హైదరాబాద్‌లో కింది కట్టడాల్లో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు చేత నిర్మాణం పూర్తి చేయబడింది?
1) గోల్కొండ 2) చార్మినార్
3) మక్కామసీద్ 4) ట్యాంక్‌బండ్
73. సమగర్ లక్షణాలుగల తొలి శతకమైన ‘వృషాధిప శతకం’ కర్త ఎవరు?
1) పిడమర్తి సోమనాథుడు
2) పిడుమర్తి బసవ కవి
3) పిడుమర్తి నిమ్మనాథుడు
4) పాల్కురికి సోమనాథుడు
74. కాకతీయుల కాలంలో విదేశీ వాణిజ్యానికి ఉపయోగపడిన ప్రసిద్ధ రేవు పట్టణం ?
1) పేరూరు 2) మోటుపల్లి
3) వాడపల్లి 4) మంథెన
75. 1946 రెండో అర్ధ భాగంలో, దేశ్‌ముఖ్ రామచంద్రారెడ్డి దురాగతాలను ఎదిరించిన ఐలమ్మ, దొడ్డి కొమురయ్యలు కార్య కాలాపాలు సాగించిన తాలూకా ఏది?
1) సూర్యాపేట తాలుకా
2) నల్లగొండ తాలుకా
3) మహబూబాబాద్ తాలుకా
4) జనగాం తాలుకా
76. వెలమల రాజధాని రాచకొండలోని గోపాల స్వామి వసంతోత్సవ పండుగ సందర్భంగా ప్రదర్శించే నాటకం ‘రత్నపాంచాలిక’ రచయిత ఎవరు?
1) మాదయ నాయకుడు
2) నాగనాథుడు
3) రెండో సింగభూపాలుడు
4) అనవోతా నాయకుడు
77. జతపరచండి.
ఎ) తిరుమల గోపన్న 1. దాశరథి శతకం
బి) కంచెర్ల గోపన్న 2. వీర తెలంగాణ –
నా అనుభవాలు
సి) గోన బుద్ధారెడ్డి 3. హంపీ నుంచి
హరప్పా దాక
డి) రావి నారాయణ రెడ్డి 4. రంగనాథ
రామాయణం
1) ఎ-3, బి-4, సి-2, డి-1
2) ఎ-2, బి-1, సి-3, డి-4
3) ఎ-3, బి-1, సి-4, డి-2
4) ఎ-4, బి-3, సి-1, డి-2
78. 1952 ముల్కీ పోరాటంలో ప్రధానమైన నినాదం?
1) దక్కనీలు గో బ్యాక్
2) ఇడ్లీ సాంబార్ గో బ్యాక్
3) తమిళులు గో బ్యాక్
4) జై బోలో తెలంగాణ
79. రామప్ప దేవాలయం నిర్మించిన సంవత్సరం?
1) 1113 2) 1213
3) 1214 4) 1413
80. వేములవాడ ఎవరి రాజధాని?
1) పశ్చిమ చాళుక్యులు
2) వేములవాడ చాళుక్యులు
3) చోళులు 4) శాతవాహనులు
81. తొలి కాకతీయులు పోషించింది?
1) జైనమతం 2) శైవ మతం
3) బౌద్ధ మతం 4) వైష్ణవ మతం
82. గోల్కొండ సామ్రాజ్యంలో ప్రసిద్ధి చెందినవి?
1) వజ్రాలు
2) వ్యవసాయాధార పరిశ్రమలు
3) చేతివృత్తులు 4) వస్ర్తాలు
83. జతపరచండి.
ఎ. పీ సుందరయ్య 1. నా గొడవ
బి. కాళోజీ నారాయణ రావు 2. రూరల్ ఎకనామిక్ ఎంక్వైరీస్ ఇన్ హైదరాబాద్ స్టేట్
సి. ఎస్ కేశవ అయ్యంగార్ 3. తెలంగాణ ఆంధ్ర
డి. ఐ తిరుమలి 4. తెలంగాణ పీపుల్స్ స్ట్రగుల్ అండ్ ఇట్స్ లెసన్స్
1) ఎ-4, బి-2, సి-3, డి-1 2) ఎ-4, బి-1, సి-2, డి-3
3) ఎ-3, బి-1, సి-4, డి-2 4) ఎ-2, బి-4, సి-1, డి-3
84. 1969 ఉద్యమ కాలంలో ‘క్విట్ తెలంగాణ’ నినాదాన్ని ఇచ్చింది ఎవరు?
1) మల్లికార్జున్ 2) శ్రీధర్ రెడ్డి
3) చెన్నారెడ్డి 4) అంజయ్య
85. గిర్గ్లాని కమిషన్‌ను ఎవరు నియమించారు?
1) వైఎస్ రాజశేఖర్‌రెడ్డి
2) జలగం వెంగళరావు
3) చంద్రబాబునాయుడు
4) ఎన్టీ రామారావు
86. జస్టిస్ శ్రీకృష్ణ కమిషన్‌ను నియమించిన సంవత్సరం?
1) 2011 2) 2009
3) 2012 4) 2010
87. 1969 తెలంగాణ ఉద్యమ మొదటి అమరులు ఎవరు?
1) రవీంద్రనాథ్, గోపాల్
2) శంకర్, కృష్ణ
3) సమ్మయ్య, వేణు
4) రాజు, వీరన్న
88. 2006లో తెలంగాణ ఆత్మగౌరవ సభ జరిగిన ప్రదేశం ఏది?
1) హన్మకొండ 2) సిద్దిపేట
3) కరీంనగర్ 4) నల్లగొండ
89. తెలంగాణలో పుట్టి భారత జాతీయ ఉద్యమం లో పాల్గొని ఖైదీ చేయబడిన మహిళ ఎవరు?
1) రాఘవమ్మ
2) ఆరుట్ల కమలా దేవి
3) సుశీల దేవి
4) సంగం లక్ష్మీబాయమ్మ
90. హైదరాబాద్ నగరంలో ‘దారుల్షిఫా’ ఆస్పత్రిని నిర్మించిన కుతుబ్‌షాహీ సుల్తాన్ ఎవరు?
1) మహమ్మద్ కులీ కుతుబ్‌షా
2) అబుల్ హసన్ తానీషా
3) సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా
4) అబ్దుల్లా కుతుబ్‌షా
91. కీసర రామలింగేశ్వర దేవాలయం ఎవరి కాలంలో నిర్మించారు?
1) కాకతీయులు 2) విష్ణుకుండినులు
3) ఇక్షాకులు
4) ముదిగొండ చాళుక్యులు
92. రాజగిరిపోతంలో, నాగ సముద్రమనే చెరువును ఎవరు నిర్మించారు?
1) నాగాంబిక 2) నాగసేన
3) మీరావాణి 4) దేవకి
93. మొగిలిచర్ల తామ్ర శాసనం ఏ వంశ పాలన గురించిన చారిత్రక సమాచారం అందజేస్తుంది?
1) విష్ణుకుండినలు 2) బాణులు
3) పల్లవులు
4) ముదిగొండ చాళుక్యులు
94. ఆగస్టు 1948లో ఏ ప్రదేశంలో అనేక మంది అమాయకులను రజాకారులును హతమార్చారు?
1) రామాపురం 2) కామారెడ్డి గూడెం
3) రాఘవాపురం 4) బైరాన్‌పల్లి
95. 9 డిసెంబర్ 2009న తెలంగాణపై ప్రకటన చేసింది ఎవరు?
1) కేంద్ర న్యాయశాఖ మంత్రి
2) కేంద్ర రక్షణశాఖ మంత్రి
3) కేంద్ర పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి
4) కేంద్ర హోం శాఖ మంత్రి
96. 10 జూలై 1968న తెలంగాణ హక్కుల దినోత్సవానికి నాయకత్వం వహించిన టీఎన్జీఓ నాయకుడు ఎవరు?
1) కే ఆర్ ఆమోస్
2) కేశవ్ రావ్ జాదవ్
3) గోపాల్ రావ్ ఎక్బోటే
4) మల్లికార్జున
97. తెలంగాణపై కాంగ్రెస్ పార్టీ వేసిన నలుగురు సభ్యుల కమిటీకి సారథ్యం వహించింది ఎవరు?
1) ప్రణబ్ ముఖర్జీ 2) వీరప్ప మొయిలీ
3) దిగ్విజయ్ సింగ్ 4) ఏ కే ఆంటొని
98. తెలంగాణ సాయుధ పోరాటం నాటి ధర్మాపురం గ్రామ లంబాడ అమరుడు ఎవరు?
1) భీమ్లా నాయక్
2) జఠోతు థాను నాయక్
3) నేత్య నాయక్
4) భూక్యా హరి సింగ్
99. ‘పెద్ద మనుషుల ఒప్పందం’లో సభ్యుడు కానివారు కింది వారిలో ఎవరు?
1) బీ రామకృష్ణారావు
2) ఎం హనుమంతరావు
3) కే వీ రంగారెడ్డి 4) ఎం చెన్నారెడ్డి
100. కింది అంశాలను పరిగణించండి.
ఎ. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలంగాణ సాధనకు ‘ఆమరణ నిరాహార దీక్ష’ను సిద్దిపేట నుంచి ప్రారంభించారు
బి. సకల జనుల సమ్మె 2011 అక్టోబర్ 13న ప్రారంభమైంది
1) బి 2) ఎ 3) ఎ, బి సరైనవి
4) ఎ, బి సరైనవి కావు
101. కింది నృత్య రూపాల్లో తెలంగాణకు చెందినది?
1) భరతనాట్యం 2) కూచిపూడి
3) కథాకళి 4) గుస్సాడి
102. కింది వారిలో తెలంగాణ తొలి దళిత కవి ఎవరు?
1) భాగ్యరెడ్డి వర్మ
2) అందె వెంకటరాజం
3) చింతపల్లి దున్నా ఇద్దాసు
4) అరిగె రామస్వామి
103. మా-సాహెబ్ ట్యాంకును ఎవరు నిర్మించారు?
1) కులీ కుతుబ్‌షా
2) హుస్సేన్‌షా వలి
3) ఇబ్రహీం కులీ కుతుబ్‌షా
4) హయత్ భక్ష్ బేగం
104. ‘జల్, జంగిల్, జమీన్’ నినాదాన్ని ఇచ్చింది ఎవరు?
1) కుమ్రం భీం 2) చిట్యాల ఐలమ్మ
3) సర్వాయి పాపన్న 4) రామ్‌జీ గోండ్
105. ‘తెలంగాణ ప్రజలకు, ప్రాంతానికి అన్యాయం జరుగుతున్న మాట వాస్తవం, ఈ అన్యాయాన్ని అరికట్టవలసిందే’ అని ఆనాటి ప్రధాన మంత్రి రాజీవ్‌గాంధీ ఏ సభలో అన్నారు?
1) మణికొండ 2) భువనగిరి
3) షాద్‌నగర్ 4) సిద్దిపేట
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు