Development goal | సుస్థిరాభివృద్ధి లక్ష్యం?
వర్తమాన భారతదేశంలో విద్య
-టీఆర్టీ రాయబోయే అభ్యర్థులు వర్తమాన భారతదేశంలో విద్య, సమకాలీన విద్యాంశాలపై పట్టు సాధిస్తే, టీఆర్టీలో ఈ యూనిట్ నుంచి వచ్చే 4 నుంచి 6 ప్రశ్నలకు సులభంగా సమాధానమిచ్చి విజయం సాధించవచ్చు.
-అభ్యర్థులు విద్యను అనేక కోణాల నుంచి అవగాహన చేసుకొని సమాజ అంశాలకు అనుప్రయుక్తం చేయగలిగితే మంచి మార్కులు పొందవచ్చు. కాబట్టి పర్యావరణ విద్య, ప్రజాస్వామ్య విద్య, విద్య అర్థశాస్త్రం, జనాభావిద్య, జీవన విద్య, కౌమార విద్య, సమ్మిళిత విద్య, ఆరోగ్య విద్య అంశాలపై పట్టు బాగా సాధించడానికి కింది ప్రశ్నలు దోహదపడుతాయి. మొదటగా ప్రశ్నలకు జవాబిచ్చి తర్వాత మీ సమాధానాలు సరిచూసుకొని లబ్ధి పొందగలరు.
1. ఓయికాస్ (Oikas) అనేది ఏ భాషా పదం?
1) లాటిన్ 2) గ్రీకు 3) ఫ్రెంచ్ 4) జర్మనీ
-Ecology (పర్యావరణం) అనే ఆంగ్లపదం, Oikas, Logos అనే రెండు గ్రీకు పదాల నుంచి ఉద్భవించింది. Oikas అంటే ఇల్లు అని, Logos అంటే తెలియజేసేది అని అర్థం.
2. గ్రీన్హౌస్ ఎఫెక్ట్ అంటే ఏమిటి? (డీఎస్సీ-ఎస్.ఏ-2012)
1) న్యూక్లియర్ రేడియేషన్ 2) రసాయన రేడియేషన్ 3) థర్మల్ రేడియేషన్ 4) వార్మింగ్ రేడియేషన్
-కార్బన్ డై ఆక్సైడ్, మీథేన్ వంటి వాయువులు వాతావరణంతో ఉద్గారం చెంది భూమిని వేడిగా ఉంచే దృగ్విషయమే గ్రీన్హౌస్ ఎఫెక్ట్. దీనివల్ల థర్మల్ రేడియేషన్ జనిస్తుంది.
3. అడవుల్లోని చెట్లను విపరీతంగా నరికివేయడంవల్ల గ్రీన్హౌస్ వాయువులు వెలువడి భూ, సముద్ర ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే పెరగడమే ….?
1) ఓజోన్ వార్మింగ్ 2) గ్లోబల్ వార్మింగ్
3) ఆమ్ల వర్షం 4) రసాయన వార్మింగ్
-గ్లోబల్ వార్మింగ్ అంటే భూ ఉష్ణోగ్రత, సముద్ర ఉష్ణోగ్రతలు పెరిగి కరువుకాటకాలు సంభవించడం. సముద్రనీటి మట్టాలు పెరిగి అధిక వరదలు, వర్షపాతం సంభవించడం.
4. NEPC (National council of Environment Planning Co-ordination) రూపొందిన ఏడాది?
1) 1980 2) 1962 3) 1982 4) 1972
5. ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరిపేరోజు?
1) జూన్-5 2) ఆగస్టు-5
3) జూలై-5 4) అక్టోబర్-5
6. ఎకో మార్క్ పథకం ప్రారంభించిన ఏడాది?
1) 1990 2) 1991 3) 1992 4) 1993
-ప్రపంచ ఎకాలజీ దినోత్సవం- నవంబర్ 1
-ప్రపంచ ఓజోన్ పొర సంరక్షణ దినం- సెప్టెంబర్ 16
-ప్రపంచ అటవీ దినోత్సవం- మార్చి 21
-ప్రపంచ నీటి సంరక్షణ దినం – మార్చి 7
-ప్రపంచ పర్యావరణ దినం- జూన్ 5
-ప్రపంచ జనాభా దినం- జూలై 11
-ప్రపంచ ధరిత్రీ దినోత్సవం- ఏప్రిల్ 22
-జల సంరక్షణ దినం- మార్చి 23
-NEPC ఏర్పాటు- 1972
-తివారీ కమిటీ ఏర్పాటు- 1980
-అవర్ కామన్ ఫ్యూచర్ (పర్యావరణ అభివృద్ధి అనే భావన)- 1987
-పర్యావరణ సాంకేతిక పరిజ్ఞానం పెంచే (ఎకోమార్క్) పథకం- 1991
-పర్యావరణ పరిరక్షణ చట్టం- 1986
7. ధరిత్రీ సదస్సు (Earth Summit) 1992లో ఎక్కడ జరిగింది?
1) రియోడిజనీరో 2) స్టాక్‌హోం
3) జొహాన్నెస్‌బర్గ్ 4) తెహ్రి
8. సుస్థిరాభివృద్ధి లక్ష్యం?
1) వనరులను వినియోగించుకోవడం
2) వనరులను పరిరక్షించడం
3) వనరుల అభిలషణీయ వినియోగం
4) అన్ని వనరుల సమీకరణ
9. కేంద్ర సహకారంతో అమలయ్యే పాఠశాల విద్యకు పర్యావరణ సానుకూలతా పథకం ఏ విద్యా ఏడాదిలో ప్రారంభమైంది?
1) 1993-94 2) 1988-89
3) 1990-91 4) 1981-82
10. పాఠశాల పాఠ్యప్రణాళికలో పర్యావరణ విషయాలకు ఏ విద్యావిధానం ద్వారా సంస్కరణలు వచ్చాయి?
1) NPE-1992 2) NPE-1968
3) NPE-1986 4) ఏదీకాదు
11. కింది ఏ రాజ్యాంగ కల్పన ద్వారా అల్ప సంఖ్యాకులు విద్యాసంస్థలను స్థాపించడానికి, నిర్వహించడానికి హక్కు కల్పించారు?
1) 30వ అధికరణ 2) 45వ అధికరణ
3) 28వ అధికరణ 4) 29వ అధికరణ
-పై ప్రశ్నకు సమాధానం ఎన్నుకున్న తర్వాత కింది ఆర్టికళ్లను గుర్తుంచుకుంటే టీఆర్టీలో లబ్ధి చేకూరుతుంది.
-ఆర్టికల్ 15(1): విద్యనందించడంలో ప్రభుత్వం స్త్రీ, పురుష, లింగ వివక్ష చూపరాదు
-ఆర్టికల్ 15(3): స్త్రీలకు విద్యావకాశాలు కల్పించడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలి.
-ఆర్టికల్ 16(1): స్త్రీ, పురుష భేదం లేకుండా ప్రభుత్వ సర్వీసుల్లో ఉద్యోగావకాశాలు కల్పించాలి.
-ఆర్టికల్ 16(4): ప్రభుత్వ ఉద్యోగాల్ల్లో వెనుకబడినవారికి రిజర్వేషన్ కల్పించాలి.
-ఆర్టికల్ 21(ఎ): 6-14 ఏండ్ల పిల్లలు ఉచిత విద్య పొందడం ప్రాథమిక హక్కు.
-ఆర్టికల్ 28: ప్రభుత్వ విద్యాసంస్థల్లో మతబోధన జరుపరాదు.
-ఆర్టికల్ 29(1): అల్పసంఖ్యాక వర్గం వారి ప్రత్యేక భాష, లిపి, సంస్కృతి, మతం పరిధి రక్షించాలి.
-ఆర్టికల్ 29(2): మతం, జాతి, కులం ఆధారంగా ప్రవేశాలు జరుపరాదు. విద్యాసంస్థల్లో ప్రవేశం నిరాకరించరాదు.
-ఆర్టికల్ 30(1): అల్పసంఖ్యాకులు విద్యాసంస్థలు స్థాపించడానికి, నిర్వహించడానికి హక్కు కల్పించడం.
12. ఎస్సీ, ఎస్టీలకు విద్యలో ఆర్థికంగా వృద్ధి చేయడంలో ప్రత్యేక శ్రద్ధ ప్రభుత్వం వహించాలని సూచించే అధికరణ (ఎస్ఏ(టీపీ)డీఎస్సీ-2012)
1) 16 2) 15 3) 46 4) 21
-ఆర్టికల్ 45: 6-14 ఏండ్ల పిల్లలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యనందించాలి.
-ఆర్టికల్ 46: ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన, బలహీనవర్గాల వారికి సామాజిక అన్యాయం జరగకుండా, అన్ని రకాల దోపిడీ నుంచి రక్షించి విద్యలో, ఆర్థికంగా వృద్ధి చేయడంలో ప్రభుత్వం బాధ్యత వహించాలి.
-ఆర్టికల్ 350(ఎ): ప్రాథమిక విద్యాదశలో మాతృభాష ద్వారానే తప్పక బోధించాలి.
-ఆర్టికల్ 351: జాతీయ భాష అయిన హిందీ అధ్యయనాన్ని ప్రోత్సహించాలి.
13. విద్యకు పెట్టుబడి దేశానికి పెట్టుబడి అని గుర్తించినది?
1) NCF-2005 2) NPE-86
3) NPE-68 4) NPE-92
14. మాతృభాషలోనే బోధన జరపాలని త్రిభాషా సూత్రాన్ని అమలుచేయాలని సూచించిన కమిషన్?
1) కొఠారి కమిషన్-1964-66
2) హంటర్ కమిషన్-1882
3) హార్టాగ్ కమిషన్-1929
4) మొదలియార్ కమిషన్-1952-53
15. స్త్రీ విద్యపై ప్రత్యేక శ్రద్ధతో కూడిన వయోజన అక్షరాస్యత సాక్షర భారత్-2009ని ఏ తేదీన రూపొందించారు?
1) మార్చి-8 2) నవంబర్-8
3) సెప్టెంబర్-8 4) అక్టోబర్-8
16. అంతర్జాతీయ విద్యాదినోత్సవం జరిపే రోజు?
1) సెప్టెంబర్-5 2) అక్టోబర్-2
3) సెప్టెంబర్-10 4) నవంబర్-11
17. ప్రపంచీకరణ విద్యాప్రక్రియ దేశంలో మొదలైన ఏడాది?
1) 1947 2) 1991 3) 1950 4) 1986
18. సరళీకరణ విద్యవల్ల కలిగే లాభం?
1) విద్యలో నాణత్య పెరుగుతుంది
2) అందరికీ విద్య అందుబాటులో ఉండటం
3) వృత్తి, సాంకేతిక విద్యనందించడం 4) పైవన్నీ
19. వయోజనులకు అందించే విద్య అభ్యసన విధానం
1) ఆండ్రగోజి 2) ఎడ్యుగోజి
3) అడలోగోజి 4) నార్సిగోజి
20. కౌమారదశలోని బాలికల సాధికారతను పెంపొందించే పథకం?
1) యువశక్తి యోజన 2) కిశోరిశక్తి యోజన 3) చైల్డ్శక్తి యోజన 4) బాలికాశక్తి యోజన
21. విద్యార్థి సాంఘిక అభ్యసనంలో ప్రధానపాత్ర పోషించేది?
1) పాఠశాల 2) సమాజం
3) కుటుంబం 4) మీడియా
22. ప్లస్ కరిక్యులమ్ ఎవరికి ఉద్దేశింపబడినది?
1) ప్రాథమిక పాఠశాల విద్యార్థులు
2) సెకండరీస్థాయి విద్యార్థులు 3) ప్రత్యేక అవసరాలుగల విద్యార్థులు 4) సీనియర్ సెకండరీ విద్యార్థులు
23. డిస్ ఫేసియా దేనికి సంబంధించినది? (డీఎస్సీ-2012)
1) భాషణ వైకల్యం 2) అంకగణిత వైకల్యం
3) పఠన వైకల్యం 4) లేఖన వైకల్యం
24. సహిత విద్య ఎవరికి ఉద్దేశించినది?
1) ప్రతిభావంతులకు
2) ప్రత్యేక అవసరాలుగల పిల్లలకు
3) సాధారణ పిల్లలకు 4) అందరికీ
25. ప్రతి పాఠశాలలో ఎవరికోసం ఒక ర్యాంప్ ఉండాలి?
1) బలహీనవర్గం 2) ప్రత్యేక అవసరాలుగల పిల్లలు 3) గ్రామీణ విద్యార్థులకు 4) ధనిక పిల్లలకు
-కింది అభ్యసన వైకల్యాలపై అవగాహన కలిగి ఉంటే మార్కు పొందవచ్చు.
డిస్లెక్సియా- 1) పఠన వైకల్యం
2) ఉచ్ఛారణ దోషాలు ఉండటం
3) పదాలు ఉపయోగించడంలో తడబడటం
అలెక్సియా- 1) ముద్రణ రూపంలో ఉన్న అంశాలు
చదవడంలో అనాశక్తత
డిస్గ్రాఫియా- 1) రాయడంలో ఇబ్బందిపడటం
2) లేఖన వైకల్యం
అగ్రాఫియా- 1) రాయడంలో అనాశక్తత
డిస్‌ఫేసియా- 1) భాషణ వైకల్యం
2) ఎదుటి వ్యక్తితో మాట్లాడటంలో,
ఎదుటి వ్యక్తి మాట్లాడితే అర్థం
చేసుకోవడంలో ఇబ్బంది పడటం.
అఫేసియా- 1) ముఖ కవళికలు అర్థం చేసుకోవడంలో
ఇబ్బంది పడటం
డిస్ కాల్కులియా- 1) గణిత వైకల్యం
2) గణిత ప్రక్రియలో చేయడంలో
ఇబ్బందిపడటం, తప్పులు చేయడం.
26. SUCCESS పాఠశాలలో స్టేట్ సిలబస్ ప్రవేశపెట్టాలన్నవారు?
1) యశ్పాల్ 2) కొఠారి
3) ఈశ్వరీబాయి 4) రాధాకృష్ణన్
27. NPEGEL రూపొందించిన ఏడాది?
1) 2002-03 2) 2003-04 3) 2004-05 4) 2005-06
28. KGBV (Kasturba Gandhi Balika Vidyalaya) ఏర్పడిన ఏడాది?
1) 2003-04 2) 2002-03
3) 2004-05 4) 2005-06
29. మధ్యాహ్న భోజన పథకం కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏడాది?
1) 1995 2) 1986 3) 2003 4) 2006
30. NPEGEL ప్రధాన లక్ష్యం?
1) బాలుర, బాలికల మధ్య వ్యత్యాసం తగ్గించడం
2) బాలికల్లో జీవననైపుణ్యాలు మెరుగుపర్చడం
3) బాలికల్లో వృత్తినైపుణ్యాలు పెంపొందించి పాఠశాలల్లో నిలుపుదలయ్యేటట్లు చూడటం 4) పైవన్నీ
31. RMSA (రాష్ట్రమాధ్యమిక శిక్షా అభియాన్) రూపొందిన ఏడాది?
1) 2008-09 2) 2009-10
3) 2010-11 4) 2011-12
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు