సూఫీ ఉద్యమం

ఇస్లాంలో ప్రారంభమైన మార్మికవాదాన్ని సూఫీ ఉద్యమమని నిర్వచించవచ్చు. ఏ రకంగానైతే ఇస్లాం ప్రభావం వల్ల హిందూమతంలో సంస్కరణ వాదంతో కూడిన భక్తి ఉద్యమం ఏర్పడిందో అదేవిధంగా ఇస్లాంలో సంస్కరణవాదంతో కూడిన సూఫీ ఉద్యమం ప్రారంభమైంది.
సూఫీ అనే పదం సు అంటే ఉన్ని/ఊలు అనే అరబిక్ పదం నుంచి వచ్చింది. ఇది ఇస్లాంలో నిరాడంబరతకు చిహ్నం. ఒక ఉద్యమంగా సూఫీ మతం ఆవిర్భవించడానికి అంతర్గత, బహిర్గత కారణాలు తోడ్పడ్డాయి.
కారణాలు
ముస్లిం సమాజంలో పెడధోరణలు చోటు చేసుకోవడంవల్ల నిరాడంబరతకు మారుపేరు అయిన ఇస్లాంలో సంపద పట్ల వ్యామోహం, ఆడంబరత్వం పెరిగిపోయాయి. దీనికి వ్యతిరేకంగానే సూఫీ ఉద్యమం నిరాడంబరతకు పిలుపునిచ్చింది.
శాంతి, సహనం వంటి ఇస్లామిక్ మౌలిక సూత్రాలు దెబ్బతినడం కూడా ఉద్యమ ఆవిర్భావానికి కారణమైనది. భగవంతుని దృష్టిలో అందరూ సమానమనే ఉన్నతమైన భావం ఇస్లాంలో లోపించింది. పైగా ఆటవిక తెగలు ఇస్లాంలోకి మార్పు చెందడంతో ఇస్లాంలో హింసాయుత ధోరణులు పెరిగిపోయాయి. వీటి నుంచి మతాన్ని సంస్కరించాల్సిన అవసరం ఏర్పడింది.
- Tags
- nipuna special
- TET
- TSLPRB
- TSPSC
Latest Updates
డిగ్రీలో జాబ్ గ్యారెంటీ కోర్సులు!
అంబేద్కర్ ఓపెన్ వర్సిటీలో యుజీ, పీజీ ప్రవేశాలు
మాడల్ స్కూళ్లలో ఇంటర్ ప్రవేశాలు
కొత్తగా మరో 1,663 కొలువులు
సుప్రీంకోర్టు న్యాయమూర్తి పదవీ విరమణ వయస్సు ఎంత?
కొత్తగా వచ్చిన చిన్నవాడి వయస్సు ఎంత?
సికింద్రాబాద్ నైపెడ్లోకాంట్రాక్టు పోస్టుల భర్తీ
సీడాక్లో450 పోస్టుల భర్తీ
ఐబీపీఎస్ 6035 క్లర్క్ పోస్టులు భర్తీ
వేరుశనగ ఉత్పత్తిలో భారతదేశ స్థానం ఎంత?