భక్తి ఉద్యమ ఆవిర్భావానికి గల కారణాలు
అంతర్గతంగా మతం పేరుతో చెలామణి అవుతున్న సామాజిక అసమానతలు సమాజంలో గొప్ప అశాంతికి దారితీశాయి. ఇందుకు వ్యతిరేకంగా వచ్చిన బౌద్ధ, జైన మతాలు పూర్తిస్థాయిలో విజయవంతం కాకపోవడంవల్ల అసమానతలు కొనసాగాయి. ఈ పరిస్థితి నుంచి సమాజాన్ని సంస్కరించడానికి భక్తి ఉద్యమం ఏర్పడింది. ఈ కారణంవల్లనే ఎక్కువ మంది ఉద్యమకారులు దిగువ కులాల నుంచి ఆవిర్భవించారు.
మతంలో సంస్కారాలు, కృతులు, కర్మకాండల ప్రాధాన్యం పెరిగిపోవడంవల్ల ఉన్నతమైన ఉపనిషత్తుల ఆలోచనా విధానం తెరమరుగైపోయింది. విశ్వజనీన భావనతో కూడిన వేదాంత తత్వాన్ని వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఏర్పడింది.
మధ్య యుగాల్లో బలమైన రాజ్యాలు లేకపోవడంవల్ల సమాచార వ్యవస్థ దెబ్బతిన్నది. మతం ఆయా ప్రాంతాలకే పరిమితమైంది. దీనివల్ల ప్రాంతీయ ఆచారాలు, సంప్రదాయాలు మతంలోకి చొచ్చుకొని వచ్చి పలు శాఖలు, ఉప శాఖలు ఏర్పడి మతపరమైన అనైక్యత చోటు చేసుకుంది. ఈ పరిస్థితిని సరిదిద్దడానికి భక్తి ఉద్యమం అవసరమైంది.
జ్ఞానం పేరుతో మార్మికవాదం ప్రచారం కావడం, క్షుద్ర విద్యలైన మంత్ర, తంత్రాలు మతంలోకి ప్రవేశించడం వంటి పరిస్థితులకు వ్యతిరేకంగా మతాన్ని సంస్కరించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
భక్తి ఉద్యమ ఆవిర్భావానికి సామాజిక పరంగా ఏర్పడిన అభద్రతా భావం కూడా తోడ్పడింది. ఇస్లాం ఆగమనం, దాడులు, యుద్ధాలు ప్రజల్లో అభద్రతా భావానికి దారితీశాయి. దీనికి భక్తి ఒక పరిష్కార మార్గంగా కనిపించింది.
ఇస్లాం ఆగమనంతో తలెత్తిన సంక్షోభం ఉద్యమానికి ప్రేరణ అయింది. మత సాంస్కృతికపరంగా హిందూ మతం సంక్షోభాన్ని ఎదుర్కొన్నది. దేవాలయాల విధ్వంసం, బలవంతపు మత మార్పిడుల నుంచి హిందూ మతాన్ని, సంస్కృతిని రక్షించుకోవాల్సిన అవసరాన్ని ఉద్యమకారులు గుర్తించారు. ఫలితంగానే విద్యారణ్య స్వామి విజయనగర సామ్రాజ్య స్థాపనకు పూనుకొనగా మరాఠా భక్తి ఉద్యమం స్వరాజ్య నిర్మాణానికి పిలుపునిచ్చింది.
పైవన్నీ అంతర్గత కారణాలు కాగా, బహిర్గత కారణాలు కింది విధంగా ఉన్నాయి.
ఇస్లాం ఆగమనం భక్తి ఉద్యమానికి ప్రేరణ అయింది. హిందూ మతం పేరుతో కొనసాగిస్తున్న అసమానతలను, విగ్రహారాధనలను, బహుదేవతారాధనను ఇస్లాం ప్రశ్నించింది. ఇస్లాం తాకిడి నుంచి తనను తాను కాపాడుకోడానికి హిందూమతం చేసిన ప్రయత్నమే భక్తి ఉద్యమం అని చెప్పవచ్చు.
- Tags
- nipuna special
- TET
- TSLPRB
- TSPSC
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు