భక్తి ఉద్యమ స్వరూపం, స్వభావం
స్వరూపం:
స్వరూప పరంగా భక్తి ఉద్యమం రెండు పోకడలను సంతరించుకుంది.
భగవంతుడు నిరామయుడు, నిర్గుణకారుడు అనే భావాన్ని చాటే విధంగా నిర్గుణ భక్తిని బోధించినది. ఈ కోవకు చెందిన భక్తి ఉద్యమకారులు ఆదిశంకర, కబీర్, నానక్, చండీదాస్, బీర్బల్, మెహతా, దాదు దయాళ్లు.
స్వరూపం పరంగానే భక్తి ఉద్యమం నిర్గుణ భక్తికి పూర్తిగా వ్యతిరేకమైన సద్గుణ భక్తి తత్వాన్ని అలవర్చుకుంది. ముఖ్యంగా వైష్ణవ మతం అనుచరులైన రామానుజ, నింబార్క, మధ్వాచార్య, వల్లభాచార్య రామానంద, మీరాబాయి, చైతన్య, సూర్దాస్లు సద్గుణ భక్తిని బోధించారు.
స్వరూపం పరంగా భక్తి ఉద్యమం రెండు పోకడలను తన ఉద్దేశాల్లోనూ కనబర్చింది. సంస్కరణ వాదం, ప్రతిఘటన వాదం భక్తి ఉద్యమ భిన్న స్వరూపాలు. సంస్కరణ వాదంలో భాగంగా ఆదిశంకర, కబీర్, నానక్లు హిందూమతంలోని లోపాలను సరిదిద్దారు. ప్రతిఘటనా వాదులైన స్వామి విద్యారణ్య, సాయనలు ఇస్లాంను ప్రతిఘటించడానికిగాను విజయనగర సామ్రాజ్య స్థాపనకు పూనుకోగా మరాఠా భక్తి ఉద్యమకారులైన సమర్థ రామదాసు స్వరాజ్యానికి పిలుపునిచ్చారు.
స్వభావం:
ఉద్యమ స్వభావం ఉద్యమ భావాల్లో, ఉద్దేశాల్లో ప్రతిబింబిస్తుంది.-భక్తి ఉద్యమకారులు ప్రజల్లో తాము ఒకరుగా, సమాజంలో తాము అంతర్భాగంగా ఉద్యమ నిర్వహణకు పూనుకున్నారు. ప్రజల భాష అయిన ప్రాంతీయ భాషల్లోనే తమ బోధనలు వినిపించారు.
ప్రజలకు బోధపడే రీతిలో, ఉత్తేజపరిచే విధంగా పలు సంగీత ప్రక్రియలైన భజనలు, కీర్తనలు, అభంగాలను ప్రవేశపెట్టి ప్రజలకు దగ్గరై చైతన్యవంతులను చేశారు.
ప్రతి భక్తి ఉద్యమకారుడు తమకంటూ గురువును ఏర్పర్చుకుని గురువు ప్రాధాన్యాన్ని చాటి చెప్పారు.
సామాజిక సమానత్వం విషయంలో ఉద్యమకారులు ఏకీభవించలేదు. కులపరమైన అసమానతలను వ్యతిరేకించారు. కానీ కుల వ్యవస్థను వ్యతిరేకించలేదు.
- Tags
- nipuna special
- TET
- TSPSC
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు