మమ్మాలజీ.. అంటే వేటి అధ్యయనం?
బల్లి పక్షి
– దీని శాస్త్రీయ నామం ఆర్కియోపెర్టిక్స్ లిథోగ్రాఫికా.
– ఇది జురాసిక్ కాలంలో విలుప్తమైన పక్షి.
– దీనిలో సరీసృపాలు, పక్షుల లక్షణాలు ఉంటాయి. అందువల్ల దీన్ని సరీసృపాలకు, పక్షులకు మధ్య సంధాన సేతువు అంటారు.
– వర్షపు నీటిని మాత్రమే తాగే పక్షి- చేతక్
– సూర్యునికోసం ఎగిరే పక్షి- చకోర పక్షి (ఫీనిక్స్)
కోళ్ల పెంపకం
– గుడ్లు, మాంసం లేదా రెండింటి ఉత్పత్తి కోసం పెంపుడు రకపు కోళ్లు, నెమళ్లు, బాతులు, టర్కీ కోళ్లు, అడవి బాతులు (Geese), పావురాలు, ఈము పక్షుల పెంపకాన్ని పౌల్ట్రీ అంటారు.
– భారతదేశ నవీన పౌల్ట్రీ పితామహుడు- డా. బీవీ రావు
– ఈయన జాతీయ గుడ్ల సహకార సమాఖ్య (ఎన్ఈసీసీ) వ్యవస్థాపక అధ్యక్షుడు.
– ఇది దేశంలో గుడ్ల విక్రయాన్ని, వాటి ఎగుమతులను పర్యవేక్షిస్తుంది.
– గుడ్ల ఉత్పత్తి కోసం పెంచే పక్షులను లేయర్లు అని, మాంసం కోసం పెంచే పక్షులను బ్రాయిలర్లు అంటారు.
– ప్రపంచ గుడ్ల ఉత్పత్తిలో భారత్ మూడో స్థానంలో, కోడి మాంసం ఉత్పత్తిలో ఐదో స్థానంలో ఉంది.
– సంకరజాతి లేయర్లను ఉత్పత్తి చేయడానికి ముంబై, భువనేశ్వర్, హస్సర్గట్టలో కేంద్ర కోళ్ల ప్రజనన క్షేత్రాలు ఉన్నాయి.
– గుజరాత్‌లోని ఇజాత్నగర్లో ఉన్న భారత పశువైద్య పరిశోధన సంస్థ (ఐవీఆర్ఐ) మేలు రకపు బ్రాయిలర్ కోళ్లను, కోళ్ల వ్యాక్సిన్లను ఉత్పత్తి చేస్తున్నది.
– లేయర్లకు బ్రూడర్ లేదా చిక్మాష్, గ్రోయర్ మాష్, ప్రీలేయర్ మాష్, లేయర్ మాష్లను ఆహారంగా ఇవ్వాలి.
– బ్రాయిలర్లకు ప్రీస్టార్టర్ మాష్, స్టార్టర్ మాష్, ఫినిష్ మాష్లను ఆహారంగా ఇవ్వాలి.
– కోళ్లకు వచ్చే వైరస్ వ్యాధులు- రాణిఖేట్, మారెక్, గంబోర, బర్డ్ ఫ్లూ
– కోళ్లకు వచ్చే బ్యాక్టీరియా వ్యాధులు- కోళ్ల కలరా, ఇన్ఫెక్టియస్ కొరైజా, క్రానిక్ రెస్పిరేటరీ డిసీజ్ (సీఆర్డీ)
– శిలీంధ్ర వ్యాధులు- బ్రూడర్స్ న్యుమోనియా, ఎప్లోటాక్సికోసిస్, త్రష్
గమనిక: కోళ్లకు బర్డ్‌ఫ్లూ లేదా ఏవియన్ ఫ్లూ వ్యాధి HsN అనే వైరస్ ద్వారా వస్తుంది.
– కోడి పిల్లలను చిక్స్ అంటారు.
– కోడి పిల్లలను ఉత్పత్తి చేసే యంత్రం- భ్రూయరీ
– కోళ్ల ముక్కును 1/3వ వంతు కత్తిరించడాన్ని డిబీకింగ్ అంటారు.
– కోళ్ల తలపై ఉన్న మాంసయుత నిర్మాణాన్ని కత్తిరించడాన్ని డబ్బింగ్ అంటారు.
– కోళ్లు గుడ్లను పొదగడాన్ని బ్రూడినెస్ అంటారు. ఈ సమయంలో కోళ్లు గుడ్లు పెట్టవు.
– అంతర్జాతీయ గుడ్ల దినోత్సవం- అక్టోబర్ 10
– బ్రాయిలర్ కోళ్లు ఏడాదికి దాదాపు 280 గుడ్లు, నాటుకోళ్లు సుమారు 50-60 గుడ్లు పెడతాయి.
– గుడ్డు ఒక సంపూర్ణ ఆహారం.
– గుడ్డు పెంకులో CaCo3 ఉంటుంది.
– గుడ్డు పచ్చసొనలో కొలెస్ట్రాల్, తెల్ల సొనలో అల్బుమిన్ అనే ప్రొటీన్ ఉంటాయి, C-విటమిన్, పిండిపదార్ధాలు ఉండవు.
– గుడ్డులో Ca, P అనే మూలకాలు ఉంటాయి.
– గుడ్లు పొదగడానికి 21 రోజులు పడుతుంది. దీనికోసం 37-37.50C ఉష్ణోగ్రత అవసరం.
– గుడ్లకు సంబంధించిన విప్లవం- వెండి విప్లవం (సిల్వర్రెవల్యూషన్)
క్షీరదాలు
– క్షీరదాలకు సంబంధించిన అధ్యయనాన్ని మమ్మాలజి అంటారు.
– క్షీర గ్రంథులు కలిగి, పిల్ల జీవులకు పాలిచ్చి పెంచే జంతువులను క్షీరదాలు (Mammalia) అంటారు.
– ట్రయాసిక్ కాలంలో క్షీరదాలు ఉద్భవించాయి.
– ఆధునిక జీవమహాయుగాన్ని (సీనోజోయిక్ మహాయుగం) క్షీరదాల స్వర్ణయుగం అంటారు.
– అతి చిన్న క్షీరదం- కెట్టిస్ హాగ్నోస్డ్ బ్యాట్ లేదా బంబుల్ బీ బ్యాట్ (రెండు గ్రాముల బరువు ఉంటుంది)
– అతి పెద్ద క్షీరదం- బెలనాప్టెరా మస్కులస్ (నీలి తిమింగలం)
– వీటి దేహ ఉష్ణోగ్రత- 98.40F లేదా 370C (36.9 C)
– క్షీరదాలు ధృవప్రాంతాలు, ఎడారులు, పర్వతాలు, అడవులు, గడ్డి మైదానాలు, చీకటి గుహలు మొదలైన వివిధ ఆవాసాల్లో నివసిస్తాయి.
– కొన్ని క్షీరదాలు ఎగిరే అనుకూలనాలను, మరికొన్ని నీటిలో నివసించే విధంగా అనుకూలనం చెంది ఉంటాయి.
– ఇవి రెండు జతల అంగాలను (Limbs) కలిగి ఉండి నడవడానికి, పరుగెత్తడానికి, చెట్ల కొమ్మలను పట్టుకోవడానికి, బొరియలు చేయడానికి, ఈదడానికి, ఎగరడానికి తోడ్పడుతాయి.
– వీటి చర్మంపై వెంట్రుకలు ఉంటాయి.
గమనిక: రోమాలు/వెంట్రుకలను గురించిన అధ్యయనాన్ని ట్రైకాలజి అంటారు.
– వీటిలో బాహ్య చెవి ఉంటుంది, దవడలో వివిధ రకాల దంతాలు ఉంటాయి.
– నాలుగు గదుల హృదయం ఉంటుంది.
– ఇవి ఉష్ణరక్త లేదా స్థిరోష్ణ జంతువులు (Homoiothermous)
– శ్వాసక్రియ ఊపిరితిత్తుల ద్వారా జరుగుతుంది.
– వీటిలో విసర్జక పదార్థం- యూరియా
– ఇవి ఏకలింగ జీవులు, శిశోత్పాదకాలు (Viviparous). (కొన్ని మాత్రం అండోత్పాదకాలు)
– వీటిలో అంతర ఫలదీకరణం, ప్రత్యక్ష పిండాభివృద్ధి జరుగుతుంది.
– వీటి చర్మం గ్రంథియుతంగా ఉంటుంది.
– సెబేషియస్ గ్రంథి: ఇది సెబం అనే తైలాన్ని విడుదల చేస్తుంది. ఇది రోమాలు ఆరోగ్యంగా ఉండేందుకు తోడ్పడుతుంది.
– లాక్రిమల్ గ్రంథులు: ఇది కన్నీటిని స్రవిస్తుంది. (కన్నీటిలో లైసోజైమ్ ఎంజైమ్, సోడియం క్లోరైడ్ ఉంటాయి)
– సెరుమినస్ గ్రంథులు: ఇవి చెవిలో మైనంను స్రవిస్తాయి.
గమనిక: క్షీరదాల్లో క్షీర గ్రంథులు అనేవి స్వేద గ్రంథుల రూపాంతరం.
– క్షీరదాలను మూడు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి…
1. ప్రొటోథీరియా (మోన్ట్రిమ్లు)
2. మెటాథీరియా (మార్సుపియేల్లు)
3. యూథీరియా (నిజ జరాయుదారులు)
ప్రొటోథీరియా
– ఇవి గుడ్లు పెట్టే క్షీరదాలు. అయినప్పటికీ పిల్లలకు పాలిస్తాయి.
ఉదా: డక్‌బిల్ ప్లాటిపస్ (ఆర్నిథోరింకస్), ఎకిడ్నా (స్పైనీ యాంట్ ఈటర్), అనాటినస్
– డక్‌బిల్ ప్లాటిపస్ (ఆర్నిథోరింకస్): ఇది గుడ్లను పెడుతుంది. సరీసృపాలకు, క్షీరదాలకు మధ్య సంధాన సేతువు.
– అనాటినస్: ఇది విషపూరితమైన ప్రో థీరియా క్షీరదం.
– ఎకిడ్నా (స్పైనీ యాంట్ ఈటర్): ఇది చీమలను ఆహారంగా తీసుకుంటుంది. ఇవి స్త్రీ, పురుష జీవులు రెండూ పిల్ల జీవులకు పాలిచ్చి పెంచుతాయి. దీన్నే గైనకోమాస్టిజం అంటారు.
మెటాథీరియా
– ఇవి పూర్తిగా అభివృద్ధి చెందని పిల్లలకు జన్మనిస్తాయి. వీటిలో స్త్రీజీవి ఉదర భాగంలో శిశుకోశం (మార్సుపియం) ఉంటుంది. అపరిపక్వ పిండాలు లేదా పిల్ల జీవులకు పాలిస్తూ పెంచుతాయి. దీన్నే మమరీ ఫీటస్ అంటారు.
ఉదా: కంగారు (మాక్రోపస్), అపోజం, టాస్మానియన్ తోడేలు, టాస్మానియన్ పులి, బండికూట్ కంగారు
– ఇవి ఎక్కువగా ఆస్ట్రేలియాలో కనబడుతాయి. దీనివల్ల ఆ దేశాన్ని ల్యాండ్ ఆఫ్ మార్సుపియేల్స్ (Marsupiales) లేదా కంగారూస్ అంటారు.
– ఇవి అధికంగా లాంగ్ జంప్ చేస్తాయి.
– అపరిపక్వ శిశువులను కని దాన్ని పొట్ట కింద ఉండే అధిజఘనాస్థి రూపాంతరమైన శిశుకోశం (Marsupiam)లో రక్షిస్తుంది.
– అపోజం: ఇది అతి తక్కువ గర్భావది కాలం, అతి ఎక్కువ దంతాలు కలిగిన జంతువు. ఇది దక్షిణ అమెరికాలో నివసిస్తుంది.
యూథీరియం (నిజ జరాయు దారులు)
– ఇవి అభివృద్ధి చెందిన క్షీరదాలు.
– వీటిని సాధారణంగా జరాయు క్షీరదాలు అంటారు.
– జలచర క్షీరదాలు: వీటిని గురించిన అధ్యయనాన్ని సీటాలజి అంటారు.
ఉదా: సీల్, వాల్స్,్ర హిప్పొపోటమస్, బీవర్, డాల్ఫిన్, తిమింగలం
– తిమింగలం (బెలనాప్టెరా మస్కులఫ్): ఇది జంతు సామ్రాజ్యంలో అతిపెద్దది. వీటి వేటను వేలింగ్ అంటారు. దీని పూర్వాంగాలు తెడ్డులా (ప్లిప్పర్) మార్పు చెందిఉంటాయి.
– డాల్ఫిన్: ఇది మానవుని తర్వాత అత్యంత తెలివైన జంతువు. దీన్ని జాతీయ జలచర జంతువుగా ప్రకటించారు.
– హిప్పోపొటమస్: దీన్ని రివర్ హార్స్ (నీటి గుర్రం) అంటారు.
గమనిక: హిప్పోకాంపస్ (సముద్ర గుర్రం) అనేది చేప.
– బీవర్: ఇది సముద్రంలో ఆనకట్టలు కడుతుంది.
– సీల్, వాల్స్:్ర ఇవి ఆర్కిటిక్ ప్రాంతం (ఉత్తర ధృవం)లో నివసిస్తాయి. వీటిలో రధనికలు రూపాంతరం చెంది పొడవుగా ఉంటాయి.
గమనిక: జలచర క్షీరదాల చర్మం కింద కొవ్వు పొర ఉంటుంది. దీన్ని బ్లబ్బర్ అంటారు. ఇది దేహ ఉష్ణోగ్రతను క్రమపరుస్తుంది.
భూచర క్షీరదాలు
ఉదా: ఏనుగు (లాక్సోడాంట), జిరాఫి, కొడాయిక్ ఎలుగుబంటి, ఒంటె, ఖడ్గమృగం (రైనోసారస్), చిరుత, గబ్బిలం, జాగ్వార్, గుర్రం, మ్యూల్, హెన్ని, ఎద్దు, ఆవు, బర్రె, మేక, గొర్రె, తోడేలు, కుక్క, పిల్లి, పంది, గొరిల్లా, గిబ్బన్, చింపాంజి, పాండా.
ఏనుగు
– ఇది అతిపెద్ద భూచర క్షీరదం.
– ఇందులో రెండు జతల కుంతకాలు (దంతాలు) టస్క్స్గా రూపాంతరం చెంది ఉంటాయి.
– ఇది చెవులను కదిలించడం ద్వారా శరీర ఉష్ణోగ్రతను క్రమపర్చుకుంటుంది.
– దీన్ని జాతీయ వారసత్వ సంపదగా ప్రకటించారు.
ఒంటె
– ఇది నీటిని కొవ్వు రూపంలో మూపురంలో దాచుకుంటుంది.
– దీని చెమట గ్రంధులు క్రియారహితంగా ఉంటాయి.
– ఒంటెలు రెండు రకాలు. అవి..
– కామెలస్ డ్రోమేరస్: ఇది ఒకే మూపురాన్ని కలిగి ఉండి పొడవైన మెడతో ఉంటుంది.
– కామెలస్ బాట్రియానస్: ఇది రెండు మూపురాలను కలిగి ఉంటుంది. మందమైన చర్మం ఉంటుంది.
– ఇది ఒకసారి నీటిని తాగితే 12-15 రోజులవరకు ఉండగలుగుతుంది.
– క్షీరదాల ఎర్రరక్త కణాల్లో కేంద్రకం ఉండదు. కానీ ఒంటె, లామాల్లో కేంద్రకం ఉంటుంది.
జిరాఫీ
– ఇది ఎత్తయిన క్షీరదం.
– ఇందులో పొడవైన నాడీకణం ఉంటుంది.
పునుగు పిల్లి
– ఇది సర్వభక్షక (Omnivore) జీవి.
– ఆగ్నేయాసియాలో ఎక్కువగా ఉంటుంది.
– దీన్నుంచి తయారు చేసిన నూనెను తిరుమల తిరుపతి దేవస్థానం అభిషేకంలో ఉపయోగిస్తారు.
కొడాయిక్ ఎలుగుబంటి
– ఇది భూమిపై ఉన్న అతిపెద్ద మాంసాహార క్షీరదం లేదా జంతువు.
ఖడ్గమృగం
– దీని ముక్కుపై ఉన్న వెంట్రుక కొమ్ముగా రూపాంతరం చెందింది.
– ఇది భూమిపై వేగంగా పరిగెత్తే రెండో క్షీరదం.
– ఖడ్గమృగాల సంరక్షణ కేంద్రం- కజిరంగా నేషనల్ పార్క్ (అసోం)
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు