భాష్పీభవనం ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది?
కుటుంబం: బీ మధ్యస్థ మేఘాలు
-ఈ కుటుంబంలోని మేఘాలను మధ్యస్థ మేఘాలు అంటారు.
-వీటి సరాసరి ఎత్తు 1950 నుంచి 6000 మీ. మధ్య ఉంటుంది.
-సగటు ఉష్ణోగ్రత +100 సెల్సియస్ నుంచి -300 సెల్సియస్ వరకు ఉంటుంది.
ఈ కుటుంబానికి చెందిన మేఘాలు..
1. ఆల్టో స్ట్రాటస్ (As)
2. ఆల్టో క్యుములస్ (Ac)
ఆల్టో స్ట్రాటస్ మేఘాలు
-ఈ మేఘాలు పెద్ద వర్షం కురిసి వెలిసిన తర్వాత కన్పిస్తాయి.
-ఇవి దట్టంగా ఉన్నచోట సూర్యకాంతి అంత స్పష్టంగా వీటి నుంచి ప్రసరించదు. అందువల్ల ఆ ప్రాంతం మసకమసకగా ఉంటుంది.
-ఇవి లేత నీలి రంగులో ఉంటాయి.
-ఇవి పీచు పీచుగా కన్పించే మేఘాలు.
ఆల్టో క్యుములస్ మేఘాలు
-ఇవి సిర్రోక్యుములస్ మేఘాలను పోలి ఉంటాయి.
-ఇవి పెద్ద పెద్ద మచ్చలు వలె ఉండి, తెలుపు లేదా బూడిద రంగులో ఉంటాయి.
-వీటి అంచులు పల్చగా ఉంటాయి. ఈ మేఘాల గుండా సూర్యకిరణాలు పోయినప్పుడు ఇంద్రధనస్సులోని రంగుల్లా లోపల నీలం, పైన ఎరుపు కలిగిన వలయాలు కన్పిస్తాయి.
కుటుంబం: సీ
-ఇందులో మేఘాలను దిగువ మేఘాలు అంటారు.
-ఇవి భూమి ఉపరితలం నుంచి సుమారు 1950 మీ. ఎత్తులో ఏర్పడుతాయి.
-వీటి సగటు ఉష్ణోగ్రత +500 సెల్సియస్ నుంచి -500 సెల్సియస్
ఈ కుటుంబానికి చెందిన మేఘాలు
1. స్ట్రాటస్ మేఘాలు (St)
2. స్ట్రాటో క్యుములస్ (Sc)
3. నింబో స్ట్రాటస్ (Ns)
4. క్యుములస్ (Cu)
5. క్యుములో నింబస్ (Cb)
స్ట్రాటస్ మేఘాలు
-ఇవి తీరానికి దాదాపు 300 కి.మీ. దూరంలో అల్ప పీడనం ఏర్పడినప్పుడు తీరప్రాంతాల్లో దూది పింజల్లా తెల్లగా పెద్ద పెద్ద చెట్ల కొమ్మలను తాకుతూ వేగంగా కదులుతూ ఉంటాయి.
-ఇవి సాధారణంగా భూమి ఉపరితలంపై గాని, చిన్న చిన్న కొండలపైన, గుట్టలపైన కన్పిస్తాయి.
స్ట్రాటో క్యుములస్ మేఘాలు
-ఈ రకమైన మేఘాలు తక్కువ ఎత్తులో ఉండి బూడిద రంగులో కన్పిస్తాయి. ఇవి వరుసలుగా గాని, అలల మాదిరిగా గాని ఉంటాయి.
నింబో స్ట్రాటస్ మేఘాలు
-ఇవి మనకు వర్షానిచ్చే మేఘాలు.
-ఇవి దట్టంగా, ఆకారం అనేది లేకుండా భూమికి కొంత ఎత్తులో ఏర్పడతాయి.
-ఇవి మోస్తరు నల్లగా ఉండి వర్షం వచ్చే ముందు దట్టంగా కన్పిస్తాయి.
-ఇవి ఆవరించిన చోట చీకటిగా ఉంటుంది.
క్యుములస్ మేఘాలు
-ఈ మేఘాలు చూడటానికి కాలీ ఫ్లవర్ లేదా గుమ్మడి కాయ ఆకారంలో ఉండి గొడుగులా నిర్మాణాన్ని కలిగి ఉంటాయి.
-ఇవి కూడా ఆహ్లాదకరమైన వాతావరణం కలిగిస్తాయి.
క్యుములోనింబస్ మేఘాలు
-ఇవి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షానికి (వడగండ్ల) కారణమవుతాయి.
-ఇవి పర్వతాల్లా చాలా ఎత్తుగా ఉన్నట్లు కన్పిస్తాయి.
-భారీ వర్షాలకు (చిరు జల్లులు, ఉరుములు, మెరుపులతో కూడినవి) ఇలాంటి మేఘాలే కారణం. అందువల్ల వీటిని మేఘాల రాజు అంటారు.
-ఇవే కాకుండా కొన్ని ప్రత్యేకమైన మేఘాలు కూడా ఉన్నాయి. ఇందులో రెండు రకాలు ఉన్నాయి. అవి..
1. నొక్టుల్యుసెంట్ మేఘాలు (Noctulucent Clouds)
2. గర్జన మేఘాలు (Thunder Clouds)
నొక్టుల్యుసెంట్ మేఘాలు
-ఇలాంటి మేఘాలు వాతావరణ పొరల్లోని మధ్య ఆవరణం (Meso sphere)లో మాత్రమే కన్పిస్తాయి. దాదాపు 80 కి.మీ. ఎత్తులో.
-ఇవి కేవలం రాత్రి వేళల్లో మాత్రమే కన్పిస్తాయి.
-శీతాకాలంలో కంటే వేసవిలోనే బాగా కన్పిస్తాయి.
గర్జన మేఘాలు
-వాతావరణంలో విక్షోభాలు (సైక్లోన్ మొదలైనవి) ఉన్నప్పుడు క్యుములస్ మేఘాలు గర్జన మేఘాలుగా మారి సుమారు 7000 మీ. ఎత్తువరకు ఎదిగి భయంకరంగా కన్పిస్తూ కల్లోలానికి కారణం అవుతాయి. చాలా ఎత్తులో బలంగా వీచే గాలుల వల్ల ఈ మేఘాలు సమ్మెట ఆకారం (Hammer) పొందుతుంటాయి.
-ఈ రకమైన మేఘాలు భయంకర శబ్దాన్ని, భయాన్ని కలిగించే ఉరుములు, మెరుపులు, వడగళ్లు మొదలైన వాటికి కారణం.
-వాతావరణంలోని నీటిఆవిరి ద్రవీకరణం (Condensation) చెందడం వల్ల ద్రవరూపంలో (నీరు) గాని, ఘనరూపంలో (మంచు) గాని, నీరు ప్రకృతి సిద్ధంగా భూమిని చేరడాన్ని అవపాతం (Precipitation) అంటారు.
అవపాతం కలగడానికి కింది రెండు నిబంధనలు అవసరం..
1. గాలిలో తేమ విస్తారంగా ఉండి సంతృప్తంగా ఉండాలి.
2. గాలి ప్రకృతి సిద్ధంగా పైకి లేచి చల్లబడాలి.
-ఈ నిబంధనలు నెరవేరిన తర్వాత 5 ముఖ్య పద్ధతుల ద్వారా తన స్థితిని మార్చుకుని తద్వారా అవపాతానికి కారణమవుతుంది.
1. ద్రవీభవనం (Melting): మంచుగడ్డ నీరుగా మారడం
2. భాష్పీభవనం (Evaporation): నీరు ఆవిరిగా మారడం
3. ద్రవీకరణం (Condensation): ఆవిరి నీరుగా మారడం
4. ఘనీభవనం (Freezing): నీరు మంచుగడ్డగా మారడం
5. ఉత్పతనం (Sublimation): ఘనపదార్థం నేరుగా వాయు పదార్థంగా మారడం (ఉదా: కర్పూరం, అయోడిన్ భాష్పాలుగా పోవడం)
నీటి లభ్యత
-నీరు లేని ఎడారి ప్రాంతాల్లో కంటే నీరు పుష్కలంగా ఉన్న సముద్రాలు, ఇతర జలాశయాల్లో భాష్పీభవనం ఎక్కువ.
ఉష్ణోగ్రత
-భాష్పీభవనానికి, ఉష్ణోగ్రతకు దగ్గర సంబంధ ఉంది. ఉష్ణోగ్రత పెరిగితే భాష్పీభవనం కూడా పెరుగుతుంది. ఈ రెండు అనులోమానుపాతంలో ఉంటాయి. ఉష్ణోగ్రత పెరిగితే గాలి నీటి ఆవిరిని పీల్చుకునే శక్తి కూడా పెరుగుతుంది.
సాపేక్ష ఆర్ధ్రత
-భాష్పీభవనానికి, సాపేక్ష ఆర్ధ్రతకు దగ్గర సంబంధం ఉంది. తడి గాలితో పోల్చిచూస్తే, పొడి గాలిలో భాష్పీభవనం ఎక్కువగా జరుగుతుంది. వేసవి కాలంలో భాష్పీభవనం ఎక్కువగా ఉంటే, శీతాకాలంలో తగ్గుతుంది. మధ్యాహ్నం పూట ఎక్కువగా ఉంటే రాత్రిపూట తగ్గుతుంది.
పవనాల వేగం
-భాష్పీభవనం పవనాల వేగం మీద ఆధారపడి ఉంటుంది. పవనాలకు వేగం లేకుండా చాలా శాతంగా ఉన్నప్పుడు భాష్పీభవనం చాలా తక్కువగా ఉంటుంది. పవనాలు బాగా వేగంగా వీస్తున్నప్పుడు భాష్పీభవనం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఒక ప్రాంత వాతావరణం స్థితి ఎక్కువ ఉష్ణోగ్రత, తక్కువ ఆర్ధ్రత, వేగంగా వీచే పవనాలతో ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో భాష్పీభవనం చాలా ఎక్కువగా ఉంటుంది.
భాష్పీభవనం జరిగే ప్రాంత వైశాల్యం
-భాష్పీభవనం ఎక్కువగా జరగాలంటే జలాశయాల వైశాల్యం కూడా ఎక్కువగానే ఉండాలి. ఉదాహరణకు చిన్న చిన్న నీటి గుంటల్లో కంటే విశాలంగా ఉండే సముద్రాల్లో భాష్పీభవనం ఎక్కువ.
గాలి ఒత్తిడి
-ఒక్కొక్కప్పుడు వాతావరణ పీడనం కూడా భాష్పీభవనానికి కారణమవుతుంది. వాతావరణ పీడనం ఎక్కువగా ఉన్నప్పుడు ఇది జలాశయాల మీద ఎక్కువ ఒత్తిడిని కలిగిస్తుంది. అయితే వాతావరణ పీడనం తక్కువ ఉన్నప్పుడు మాత్రమే భాష్పీవనం ఎక్కువగా ఉంటుందని గుర్తించాలి.
నీటి సంఘటనం
-భాష్పీభవనం అనేది నీటి స్పచ్ఛత మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు ఉప్పునీటితో ఉండే సముద్రాల మీద కంటే మంచి నీరుండే సరస్సులపై భాష్పీభవనం ఎక్కువగా ఉంటుంది. ఒక అధ్యయనం ప్రకారం ఉప్పునీటి కంటే మంచినీటి మీద భాష్పీభవనం సుమారు ఐదు రెట్లు ఎక్కువగా ఉంటుంది.
ద్రవీభవనం
-ఘనపదార్థంగా ఉన్న మంచు కొంత ఉష్ణోగ్రతను గ్రహించగానే నీరుగా మారడాన్ని ద్రవీభవనం (Melting) అంటారు. మంచు (ఘన)—–> ఉష్ణోగ్రత…………నీరు (ద్రవ)
భాష్పీభవనం
-ద్రవరూపంలో ఉన్న నీరు. కొంత ఉష్ణోగ్రతను గ్రహించగానే నీటిఆవిరి (భాష్పాల) రూపంగా మారడాన్ని భాష్పీభవనం అంటారు. నీరు (ద్రవ)——-> ఉష్ణోగ్రత….. నీటిఆవిరి (వాయు)
-నీరు మొక్కల నుంచి, చెరువులు, కుంటలు, నదులు, సముద్రాలు మొదలైనవాటి నుంచి నీటి ఆవిరి రూపంలో ఉష్ణోగ్రతను గ్రహించగానే భాష్పీభవన-భాష్పోత్సేకం (Evapo-Rranspiration) ద్వారా భాష్పీభవనం
చెందుతుంది.
భాష్పీభవనం ప్రభావితం చేసే అంశాలు…
-ఒక ప్రాంతంలో జరిగే భాష్పీభవనం ఆధారపడి ఉండే అంశాలు..
1. నీటి లభ్యత (Water availability)
2. ఉష్ణోగ్రత (Temparature)
3. సాపేక్ష ఆర్ధ్రత (Relative Humidity)
4. పవనాల వేగం (Wind velocity)
5. భాష్పీభవనం జరగబోయే ప్రాంత వైశాల్యం
6. గాలి ఒత్తిడి (Air pressure)
7. నీటి సంఘటనం (Composition of water)
-దీన్ని అట్మోమీటర్…./ఎవాపిరోమీటర్ అనే పరికరంతో కొలుస్తారు.
ద్రవీకరణ
-వాయురూపంలో ఉన్న నీటి ఆవిరి ద్రవరూపంలో ఉన్న నీరుగా మారే విధానాన్ని ద్రవీకరణం అంటారు.
నీటిఆవిరి (వాయు)—->ఉష్ణోగ్రత…. తగ్గినప్పుడు ….. నీరు (ద్రవ)
-గాలిలో ఉన్న తేమ ఆవిరి రూపంలో పుష్కలంగా ఉన్నప్పుడు అది ఒక చల్లని వస్తువును తాకగానే (ఉష్ణోగ్రత తగ్గినప్పుడు) …. ద్రవీకరణం చెంది సన్నని నీటి బిందువులుగా మారుతుంది. అప్పుడు గాలికి ఉన్న ఉష్ణోగ్రతను తుషారస్థానం (Dewpoint) అంటారు.
ఉదా: పచ్చని పరకగడ్డిపై శీతాకాలంలో పచ్చగడ్డి అంచుల మీద నీటి బిందువులుగా మారి ఉండటం.
-ద్రవీకరణం చెందడం వల్ల హేజ్ గానీ, తుహినం (Frost) గానీ, పొగమంచు (Fog) గానీ, పల్చని పొగమంచు (Mist) గాని, తుషారం (Dew) గాని, మేఘాలు (Clouds) గాని ఏర్పడుతున్నాయి.
ద్రవీకరణం జరగాలంటే కింది అంశాలు కావాలి…
1. గాలిలో తేమ పుష్కలంగా ఉండాలి.
2. గాలి బాగా చల్లబడాలి.
3. ద్రవీకరణం జరగడానికి ఒక ఆధారంకావాలి.
గమనిక: భాష్పీభవనంలో ఉష్ణోగ్రత తీసుకుంటుంది. ద్రవీకరణంలో ఉష్ణోగ్రత విడుదల అవుతుంది.
ఘనీభవనం
-ద్రవరూపంలో ఉన్న నీరు ఉష్ణోగ్రత తగ్గినప్పుడు ఘనరూపంలో ఉన్న మంచుగా మారే ప్రక్రియను ఘనీభవనం అంటారు.
ఉత్పతనం
-ఘనరూపంలో ఉన్న పదార్థం నేరుగా వాయు పదార్థంగా (ద్రవరూపం పొందకుండా) మారడం.
ఉదా: కర్పూరం మండినప్పుడు వాయురూపంలోకి మారడం, అయోడిన్ స్పటికాలను వేడిచేసినప్పుడు భాష్పాలుగా మారడం.
మేఘాల విస్తరణ
-భూమధ్య రేఖ వద్ద- ఎక్కువగా
-అయన రేఖ వద్ద- తక్కువగా
-ధృవ ప్రాంతాల్లో- ఎక్కువగా
-మేఘాల వేగం, దిశను తెలుసుకోవడానికి ఉపయోగించే పరికరం
– నెఫో స్కోప్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు