Telangana projects | తెలంగాణ ప్రాజెక్టులు ప్రత్యేకతలు
నాగార్జునసాగర్ ప్రాజెక్ట్
-ఈ ప్రాజెక్టును ఖోస్లా కమిటీ సూచనల మేరకు నల్లగొండ జిల్లాలోని నందికొండ గ్రామం వద్ద నిర్మించారు.
-దీన్ని 1955, డిసెంబర్ 10న ప్రారంభించారు.
-ఈ డ్యామ్ పొడవు 1500 మీ., ఎత్తు 124 మీ.
-ఈ ప్రాజెక్టు పరివాహక ప్రాంతం 2.15 లక్షల చ.కి.మీ.
-ఈ ప్రాజెక్టు కింద 10 లక్షల ఎకరాలకుపైగా సాగవుతుంది.
మూసీ ప్రాజెక్టు
-నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలంలో మూసీ నదిపై దీన్ని నిర్మించారు.
-దీన్ని 1954లో ప్రారంభించి 1961లో పూర్తిచేశారు.
-దీని ప్రధాన కాలువ 64 కి.మీ. పొడవు ఉంది.
-దీని కుడి కాలువ 31 కి.మీ., ఎడమ కాలువ 34 కి.మీ. ఉంటుంది.
-ఈ ప్రాజెక్టు కింద 30 వేల ఎకరాలు సాగవుతున్నాయి.
అలీసాగర్ ప్రాజెక్టు
-గోదావరి నదిపై నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం కోసి వద్ద మొదటి పంప్‌హౌజ్‌ను నిర్మించారు.
-రెండో పంప్‌హౌజ్‌ను రెంజల్ మండలంలోని తాడ్‌బిలోలిలో, మూడో పంప్‌హౌజ్‌ను ఎడపల్లి మండలంలోని జాన్కంపేటలో నిర్మించారు.
రీరామ్సాగర్ ప్రాజెక్టు
-నిజామాబాద్ జిల్లాలోని పోచంపాడు వద్ద గోదావరి నదిపై నిర్మించారు.
-ఈ ప్రాజెక్టుకు 1963లో అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ శంకుస్థాపన చేశారు.
-1978లో పూర్తయిన ఈ ప్రాజెక్టును అప్పటి సీఎం మర్రి చెన్నారెడ్డి ప్రారంభించారు.
-ఈ ప్రాజెక్టు కింద ఖరీఫ్‌లో 9.5 లక్షల ఎకరాలు, రబీలో 7 లక్షల ఎకరాలు సాగవుతున్నాయి.
నిజాం సాగర్
-మంజీర నదిపై సంగారెడ్డి జిల్లాలోని బంజపల్లి వద్ద దీన్ని నిర్మించారు.
-1923లో నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఆదేశాల మేరకు ఈ ప్రాజెక్టును చేపట్టారు.
-1931లో ఈ ప్రాజెక్టు నిర్మాణం నవాబ్ అలీ నవాజ్‌జంగ్ బహదూర్ పర్యవేక్షణలో పూర్తయింది.
-58 టీఎంసీల సామర్థ్యంతో నిర్మితమైన ఈ ప్రాజెక్టు 2.31 లక్షల ఎకరాలకు నీరందిస్తుంది.
అర్గుల రాజారామ్ ఎత్తిపోతల పథకం (గుత్ప)
-నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం ఉమ్మెడ వద్ద గోదావరి నదిపై మొదటి పంప్‌హౌజ్‌ను నిర్మించారు.
-రెండో పంప్‌హౌజ్‌ను మోర్తాడ్ మండలంలోని ధర్మారం వద్ద నిర్మించారు.
ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు
-జోగుళాంబ గద్వాల జిల్లా ధరూరు మండలంలోని రావులపల్లి వద్ద కృష్ణా నదిపై ఈ ప్రాజెక్టు ఉంది.
-1984లో 11 టీఎంసీల సామర్థ్యంతో ఈ ప్రాజెక్టును నిర్మించారు.
-ఈ ప్రాజెక్టు ఎడమ (ఎన్టీఆర్ కాలువ) కాలువ కింద 26,103 హెక్టార్లు, కుడి (నల్ల సోమాద్రి కాలువ) కాలువ కింద 15,257 హెక్టార్లు సాగవుతున్నాయి.
-అంతేకాకుండా ఈ ప్రాజెక్టు ద్వారా 221.40 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది.
రాజోలిబండ మళ్లింపు పథకం (ఆర్డీఎస్)
-ఈ ప్రాజెక్టును తుంగభద్రా నదిపై కర్ణాటకలోని రాయచూర్ జిల్లా మన్ని తాలూకాలోని రాజోలిబండ వద్ద నిర్మించారు.
-దీన్ని నిజాం కాలంలో 1946లో ప్రారంభించి, 1958లో పూర్తిచేశారు.
-ఈ ప్రాజెక్టు నీరు గద్వాల మండలంలోని 8 గ్రామాలకు, అలంపూర్ మండలంలోని 67 గ్రామాలకు అందుతుంది.
కడెం రిజర్వాయర్
-ప్రస్తుత నిర్మల్ జిల్లా కడెం మండలంలోని పెద్దూరు గ్రామం వద్ద ఈ ప్రాజెక్టును నిర్మించారు.
-ఈ ప్రాజెక్టు ద్వారా 13.243 టీఎంసీల నీటిని వినియోగిస్తున్నారు.
లోయర్ మానేర్ డ్యామ్
-ఇది కరీంనగర్ జిల్లాలోని గోదావరి నది ఉపనది అయిన మానేరు నదిపై ఉంది.
-దీని నిర్మాణం 1985లో పూర్తయింది.
సింగూరు ప్రాజెక్టు
-ఈ ప్రాజెక్టును సంగారెడ్డి జిల్లా సింగూరు గ్రామం వద్ద నిర్మించారు.
-దీని సామర్థ్యం 30 టీఎంసీలు
-దీని ద్వారా 40,000 ఎకరాలు సాగవుతున్నాయి.
-ఈ ప్రాజెక్టు ద్వారా 15 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది.
నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం
-దీనికి 2005లో శంకుస్థాపన చేశారు.
-ఈ ప్రాజెక్టు జోగుళాంబ గద్వాల జిల్లా ధరూరు మండలంలోని ఉప్పేరు గ్రామం వద్ద ఉంది.
-దీని ఆయకట్టు 2 లక్షల ఎకరాలు.
కోయిల్ సాగర్ ప్రాజెక్టు
-ఈ ప్రాజెక్టును మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలం బొల్లారం వద్ద ఉన్న పెద్దవాగుపై నిర్మించారు.
-దీని నిర్మాణం 1954లో పూర్తయింది.
-దీని ద్వారా 50,250 ఎకరాలకు సాగునీరందుతుంది.
కంతానపల్లి సుజల స్రవంతి ప్రాజెక్టు
-ఈ ప్రాజెక్టును జయశంకర్ భూపాలపల్లి జిల్లా కంతానపల్లిలో గోదావరి నదిపై నిర్మిస్తున్నారు.
దేవాదుల ఎత్తిపోతల పథకం
-ఈ ప్రాజెక్టును జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని పాలంపేట వద్ద నిర్మించారు.
-దీని ఆయకట్టు 6.21 లక్షల ఎకరాలు
కాళేశ్వరం (మేడిగడ్డ) ఎత్తిపోతల పథకం
-ఈ ప్రాజెక్టును జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలోని కన్నేపల్లి గ్రామం వద్ద గోదావరి నదిపై నిర్మిస్తున్నారు.
-దీని ఆయకట్టు 45,000 ఎకరాలు
-సుమారు 235 టీఎంసీల నీటిని ఎత్తిపోయడమే దీని లక్ష్యం.
శ్రీపాదసాగర్ (ఎల్లంపల్లి) ప్రాజెక్టు
-ఈ ప్రాజెక్టుకు 2004, జూలై 28న శంకుస్థాపన చేశారు. ఇంకా పూర్తికాలేదు.
సీతారామా లిఫ్ట్ ఇరిగేషన్
-ఈ ప్రాజెక్టును భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండంలోని రాళ్లపాడు వద్ద నిర్మించనున్నారు.
-దీన్ని 2016, ఫిబ్రవరి 16న సీఎం కేసీఆర్ ప్రారంభించారు.
-50 టీఎంసీల గోదావరి నీటిని ఎత్తిపోయడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం.
ప్రణాళిక దశలో ఉన్న భారీనీటి పారుదల ప్రాజెక్టులు
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు
-మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలంలోని కరివెన వద్ద ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు.
-దీనికి 2015, జూన్ 11న సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు.
-జూరాల ప్రాజెక్టు వద్ద కృష్ణానది నుంచి 70 టీఎంసీల వరద నీటిని ఎత్తిపోయడం ఈ ప్రాజెక్టు లక్ష్యం.
-దీని ద్వారా మహబూబ్‌నగర్ జిల్లాలో 7 లక్షల ఎకరాలకు, రంగారెడ్డి జిల్లాలో 2.7 లక్షల ఎకరాలకు, నల్లగొండ జిల్లాలో 0.3 లక్షల ఎకరాలకు సాగునీరందనున్నది.
డిండి ఎత్తిపోతల పథకం
-ఈ ప్రాజెక్టును నల్లగొండ జిల్లా శివన్నగూడెం శివారులోని చర్లగూడెం చెరువు వద్ద నిర్మిస్తున్నారు.
-దీనికి 2015, జూన్ 12న సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు.
-దీనిద్వారా 3.68 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించనున్నారు.
గూడెం ఎత్తిపోతల పథకం
-ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి మండలంలో ఈ ప్రాజెక్టును నిర్మించనున్నారు.
-దీనికి 2015, జూలై 5న సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు.
-ఈ ప్రాజెక్టు సామర్థ్యం 3 టీఎంసీలు.
నక్కలగండి ప్రాజెక్టు
-శ్రీశైలం ప్రాజెక్టు నుంచి తవ్వుతున్న లెఫ్ట్‌బ్యాంక్ కాలువ సొరంగం నుంచి 30 టీఎంసీల నీటిని వినియోగించుకోవడం కోసం ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు.
-దీనిద్వారా నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని సుమారు 3.41 లక్షల ఎకరాలకు సాగునీరు అందనున్నది.
భక్త రామదాసు ఎత్తిపోతల పథకం
-ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెంలో ఈ ప్రాజెక్టును నిర్మించనున్నారు.
-2016, ఫిబ్రవరి 16న సీఎం కేసీఆర్ దీనికి శంకుస్థాపన చేశారు.
-దీనిద్వారా పాలేరు నియోజకవర్గంలోని 59,000 ఎకరాలకు సాగునీరు అందనున్నది.
అంబేద్కర్ ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు
-ఏడు జిల్లాలకు 180 టీఎంసీల గోదావరి నీటిని వినియోగించే లక్ష్యంతో దీన్ని నిర్మించనున్నారు.
-దీనిద్వారా 16.40 లక్షల ఎకరాలు సాగులోకి రానుంది.
మధ్య, చిన్నతరహా నీటి ప్రాజెక్టులు
బొగ్గులవాగు ప్రాజెక్టు
-ఈ ప్రాజెక్టును జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్వర్రావు మండంలోని రుద్రారం గ్రామం వద్ద నిర్మించారు.
-దీన్ని 1976-77లో ప్రారంభించి 1987లో పూర్తిచేశారు.
-దీనిద్వారా 5150 ఎకరాలకు సాగునీరందుతుంది.
గుండ్లవాగు ప్రాజెక్టు
-దీన్ని జయశంకర్ భూపాలపల్లి జిల్లా వాజేడు మండలంలోని ప్రగలపల్లి గ్రామం వద్ద 1976-77లో నిర్మించారు.
-దీనిద్వారా 2580 ఎకరాలకు సాగునీరందుతుంది.
రామప్ప చెరువు
-జయశంకర్ భూపాలపల్లి జిల్లా పాలంపేట మండలంలో రామప్ప చెరువు ఉన్నది.
-ఈ చెరువును మేడి, పోలవాగులపై కాకతీయ రాజు గణపతి దేవుని కాలంలో రేచర్ల రుద్రుడు నిర్మించాడు.
లక్నవరం చెరువు
-జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్న లక్కవరం సరస్సును పది వేల ఎకరాల విస్తీర్ణంలో కాకతీయ రాజులు 600 ఏండ్ల క్రితం నిర్మించారు.
-ఈ సరస్సులో చిన్నచిన్న ద్వీపాలు 13 ఉండగా, అందులో మూడు ద్వీపాలను కలుపుతూ సస్పెన్షన్ బ్రిడ్జిని నిర్మించారు.
పాకాల
-వరంగల్ రూరల్ జిల్లా ఖానాపూర్ మండలం అశోక్‌నగర్ సమీపంలో మున్నేరు వాగుపై నిర్మించారు.
-ఖానాపూర్, నర్సంపేట మండలాల పరిధిలో 18,193 ఎకరాలకు నీటిని అందిస్తుంది.
చలివాగు ప్రాజెక్టు
-ఈ ప్రాజెక్టు వరంగల్ రూరల్ జిల్లాలో ఉన్నది.
బయ్యారం చెరువు
-ఈ చెరువు మహబూబాబాద్ జిల్లాలో ఉన్నది. ఈ చెరువును కాకతీయ చక్రవర్తి గణపతి దేవుని సోదరి మైలాంబ నిర్మించారు.
పెద్దచెరువు
-కంబాలపల్లిలో గల పెద్ద చెరువును కాకతీయుల కాలంలో నిర్మించారు.
బీఎన్గుప్తా (తులారం) ప్రాజెక్టు
-మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం వినోబానగర్ సమీపంలో ఈ ప్రాజెక్టు ఉన్నది.
గడ్డెన్న వాగు
-నిర్మల్ జిల్లా భైంసా పట్టణానికి సమీపంలో సుద్దవాగుపై గడ్డెన్నవాగు ప్రాజెక్టును నిర్మించారు.
-14 వేల ఎకరాల్లో సాగునీరుతోపాటు భైంసా నగర పంచాయతీతో సహా 19 గ్రామాలకు తాగునీరు అందించాలని ప్రాజెక్టు నిర్మించారు.
సరస్వతి కాలువ
-నిర్మల్ జిల్లాలోని నిర్మల్ మండలం పాకపట్ట శివారు గ్రామం గాంధీనగర్ వద్ద ఈ కాలువ ప్రారంభమవుతుంది.
-ఆయకట్టు 35,735 ఎకరాలు. నిర్మల్, లక్ష్మణ్‌చాందా, ఖానాపూర్, కడెం మండలాల్లోని 64 గ్రామాలకు సాగునీరు అందుతుంది.
కుమ్రంభీం (అడ్డ) ప్రాజెక్టు
-కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలం అడ్డ గ్రామం వద్ద పెద్దవాగుపై ఈ ప్రాజెక్టును నిర్మించారు.
తుమ్మిడిహట్టి ప్రాజెక్టు
-ప్రాణహిత నదిపై ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు.
-నిల్వ సామర్థ్యం 1.8 టీఎంలు. సిర్పూర్, కాగజ్‌నగర్, ఆసిఫాబాద్, చెన్నూర్, బెల్లంపల్లి నియోజకవర్గాల్లో రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించనున్నారు.
వట్టివాగు ప్రాజెక్టు
-కుమ్రం భీం ఆసిఫాబాద్ మండలంలోని పహాడీబండ గ్రామం సమీపంలో వట్టివాగుపై 1976లో ఈ ప్రాజెక్టును నిర్మించారు.
ఎన్టీఆర్ సాగర్ ప్రాజెక్టు (చెలిమెల ప్రాజెక్టు)
-ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలం ఇర్కపల్లి గ్రామ సమీపంలోని చెలిమెలవాగు వద్ద ఈ ప్రాజెక్టును నిర్మించారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు