Land of Superlatives | ల్యాండ్ ఆఫ్ సూపర్లేటివ్
దక్షిణ అమెరికా
-ప్రకృతి సిద్ధమండలాలు, జలపాతాలు, పక్షులు, విభిన్న ఉష్ణోగ్రతలు, జీవరాశులకు ప్రసిద్ధి దక్షిణ అమెరికా. ఇది 12 డిగ్రీల ఉత్తర అక్షాంశం నుంచి 55 డిగ్రీల దక్షిణ అక్షాంశాల మధ్య, 35 డిగ్రీల పశ్చిమ రేఖాంశాల నుంచి 81 డిగ్రీల పశ్చిమరేఖాంశాల మధ్య విస్తరించి ఉంది.
-విస్తీర్ణపరంగా నాలుగో అతిపెద్దఖండం (1,78,18,000 చ.కి.మీ.). ఇది ప్రపంచ భౌగోళిక విస్తీర్ణంలో 12 శాతం ఆక్రమించింది.
-ఇది పసిఫిక్ (పశ్చిమాన), అట్లాంటిక్ (ఉత్తరం, తూర్పున) మహాసముద్రాలు, కరీబియన్ సముద్రం (వాయవ్యం) మధ్య ఉన్నది.
-ఈ ఖండంలో ఎక్కువ భాగం (2/3వ వంతు) ఉష్ణమండలంలో ఉంది. ఇక్కడ ఏడాదిపొడుగున అధిక ఉష్ణోగ్రత, వర్షపాతం ఉంటాయి.
-ఇలా వర్షపాతం, ఉష్ణోగ్రత, ఆర్థత, ప్రకృతి వనరులు అధికంగా ఉండటంతో దీన్ని ల్యాండ్ ఆఫ్ సూపర్లేటివ్ (అన్ని అతిగా ఉన్న ఖండం) అని పిలుస్తారు.
-ఇక్కడ సూర్యుని అనుసరించి వానలు కురుస్తాయి. అంటే సూర్యుడు ఉత్తర ప్రాంతంలో ఉన్నప్పుడు ఉత్తర ప్రాంతంలో, దక్షిణ ప్రాంతంలో ఉన్నప్పుడు దక్షిణాన వానలు పడుతాయి.
-చిలీలోని శాంటియాగోలో మధ్యధరా శీతోష్ణతి, అమెజాన్ నదీ ప్రాంతంలో భూమధ్యరేఖా ప్రాంతంలో ఉండే విలక్షణ శీతోష్ణస్థితి ఉంటుంది.
-దక్షిణ అమెరికా ఉత్తర భాగం అంటే ఈక్వెడార్, కొలంబియా, బ్రెజిల్ దేశాల గుండా భూ మధ్యరేఖ పోతుంది.
-చిలీ, అర్జెంటీనా, పరాగ్వే, బ్రెజిల్ దేశాల మీదుగా మకరరేఖ వెళ్తుంది.
-బొలీవియా, పరాగ్వేలు భూ పరివేష్ఠిత దేశాలు.
-జనాభా పరంగా ప్రపంచంలో 5వ స్థానంలో ఉన్న ఈ ఖండంలో సుమారు 38,57,42,554 మంది నివసిస్తున్నారు.
-త్రిభుజాకారంలో ఉన్న ఈ ఖండంలో మొత్తం 13 దేశాలు (అర్జెంటీనా, బొలీవియా, బ్రెజిల్, చిలీ, కొలంబియా, ఈక్వెడార్, పరాగ్వే, పెరూ, సురినామ్, ఉరుగ్వే, వెనెజులా, గయానా, ఫ్రెంచ్ గయానా)ఉన్నాయి.
-ఇక్కడ ప్రధానమైన భాషలు.. స్పానిష్, పోర్చుగీసు, ఫ్రెంచ్, డచ్, ఇంగ్లిష్, కెఛ్వా, ఐమారా, గ్వారానీ.
-అతిపెద్ద నగరాలు.. సావోపోలో, బ్యూనస్ ఎయిర్స్, రియో డి జనీరో, బొగాటా, లీమా, శాంటియాగో, కారకస్.
-ఈ ఖండంలో అతి పల్లపు ప్రాంతం అర్జెంటీనాలోని సలినాసీ గ్రాండెస్. ఇది సముద్రమాట్టానికి 40 మీ. తక్కువ ఎత్తులో ఉంది.
-అత్యధిక ఉష్ణోతలు అర్జెంటీనాలోని రివడనియాలో నమోదవుతాయి. ఇక్కడ 48.9 డిగ్రీల సెల్సీయస్ ఉష్ణోగ్రత ఉంటుంది.
-అతి శీతల ప్రాంతం కలోనియా సార్మియం. అర్జెంటానాలో ఉన్న ఈ ప్రాంతంలో -38.8 డిగ్రీల సెల్సీయస్ నమోదవుతుంది.
-అటకామా ఎడారిలోని ఆరికా ప్రపంచంలోనే అత్యంత పొడి ప్రాంతం. దీన్ని దయ్యాలనగరం అని పిలుస్తారు.
-ప్రపంచంలో ఎత్తయిన గ్రామం- ఆకాన్ క్విల్కా. ఇది చిలీ దేశంలో ఉంది.
-బొలీవియా రాజధాని లాపాజ్ ప్రపంచంలోనే అత్యధిక ఎత్తులో ఉన్న రాజధాని నగరం.
-ప్రపంచంలో అత్యంత పొడవైన పర్వతశ్రేణులు ఆండిస్ పర్వతాలు. ఇవి వెనెజులా, కొలంబియా, బొలీవియా, పెరూ, చిలీ, అర్జెంటీనా దేశాల్లో 7,600 కి.మీ. పొడవు విస్తరించి ఉన్నాయి.
-ఈ పర్వత ప్రాంతంలో అగ్నిపర్వతాలు ఎక్కువగా ఉండటంతోపాటు, భూకంపాలు అధికంగా సంభవిస్తాయి.
-ఈ ఖండంలో అత్యంత ఎత్తయిన ప్రాంతం అకన్కగువా శిఖరం (6,960 మీ.). ఇది ఆండిస్ పర్వత శ్రేణుల్లో, అర్జెంటీనా, చిలీ దేశాల మధ్య ఉంది.
-ఈ పర్వతాలకు తూర్పున పెటగోనియా ఎడారి ఉన్నది.
-ప్రపంచంలో అత్యంత ఎత్తయిన క్రియాశీల అగ్నిపర్వతాలు ఓజోస్ డెల్ సలాడో (6,895 మీ.). ఇది అర్జెంటీనా, చిలీ దేశాల మధ్య ఉంది.
-ఈ ఖండంలో అతిపొడవైన నది అమెజాన్ (ప్రపంచంలో రెండోది). 6400 కి.మీ. ప్రవహించే ఈ నది పెరూలోని ఆండీస్ పర్వతాల్లో జన్మించి బ్రెజిల్‌లోని మకాపా వద్ద దక్షిణ అట్లాంటిక్ సముద్రంలో కలుస్తుంది. ఇక్కడ ఏడాదిపొడుగునా ఎక్కువ ఉష్ణోగ్రత, వర్షపాతం ఉంటాయి.
-ఇది ప్రపంచంలో అతిపెద్ద ఉప్పునీటి కయ్య కలిగిన నది.
-ఈ నదీపరివాహక ప్రాంతం రబ్బరు చెట్లకు ప్రసిద్ధి. ఇక్కడి అడవుల్లో గట్టి కలప అధికంగా లభిస్తుంది.
-ఇక్కడ ఉండే క్యుబ్రెకో చెట్ల నుంచి తోళ్లను పదును చేయడానికి ఉపయోగించే పదార్ధాలు లభిస్తాయి.
-ప్రపంచంలో అతిఎత్తయిన జలపాతం ఏంజెల్ వాటర్‌ఫాల్స్ (979 మీ.). ఇది వెనెజులాలోని ఒరినాకో నదిపై ఉంది.
-నీటిపరిమాణం పరంగా ప్రపంచంలో అతిపెద్ద జలపాతం ఇగ్వాజో వాటర్ ఫాల్స్. ఇది పరాగ్వేలోని పరాన నదిపై ఉంది.
-ప్రపంచంలో అత్యంత ఎత్తులో ఉన్న నౌకాయాన సరస్సు టిటికా. ఇది సముద్ర మట్టం నుంచి 12,500 అడుగుల ఎత్తులో.. బొలీవియా, పెరూ దేశాల్లో, ఆండిస్ పర్వత శ్రేణుల్లో ఉంది.
-దక్షిణ అమెరికాలో అతిపెద్ద సరస్సు మరకైబో సరస్సు (వెనెజులా)
-పరాగ్వే, బ్రెజిల్ దేశాల మధ్య ప్రవహించే నది పరన
-దక్షిణ అమెరికా, అంటార్కిటికాకు మధ్య ఉన్న జలపాతం బ్రౌట్ జలసంధి
-ఈ ఖండంలో 1500 జాతుల పక్షులు, గుడ్లగూబలను పోలిన కోతులు ఇక్కడ ఉంటాయి.
-పెరూ తీరప్రాంతంలో పక్షులు వేసే రెట్టలను గుయానో లేదా గ్వానో అని పిలుస్తారు.
-ఒంటెలా పొడవైన మెడకలిగి ఉండే లామాను ఇక్కడ బండ్లను లాగడానికి ఉపయోగిస్తారు. దీంతోపాటు ఆర్మాడిల్లో (Armadillo), పుమా (Puma) వంటివి దక్షిణ అమెరికాలో మాత్రమే కనిపిస్తాయి.
-ఇక్కడ గోధుమను అర్జెంటీనా అధికంగా ఉత్పత్తి చేస్తున్నది.
-ప్రంపచంలో మాంసపు ఉత్పత్తులను అధికంగా చేస్తున్న దేశాల్లో అర్జెంటీనా కూడా ఉంది.
-ప్రపంచంలో కాఫీ ఉత్పత్తి, ఎగుమతిలో బ్రెజిల్ ప్రథమ స్థానంలో ఉంది.
-ముడిఇనుము నిక్షేపాలు అధికంగా ఉన్న, పత్తి ఎక్కువగా పండే దేశాల్లో బ్రెజిల్ ఒకటి.
-ప్రపంచం మొత్తం రాగి ఉత్పత్తిలో ఐదో వంతు ఈ ఖండం నుంచి లభిస్తున్నది. ఇక్కడ చిలీ ఎక్కువగా రాగిని ఉత్పత్తి చేస్తున్నది.
-ప్రపంచ తగరం ఉత్పత్తిలో బొలీవియా రెండో స్థానంలో ఉంది.
-ప్రపంచ మినరల్ ఆయిల్ లేదా పెట్రోలియం మొత్తం ఉత్పత్తిలో ఏడో వంతు ఈ ఖండం నుంచే ఉత్పత్తి అవుతున్నది.
-దూర (Long distance) నౌకాయానానికి అమెజాన్, లాప్లాటా నదులు అనుకూలంగా ఉన్నాయి.
-ప్రపంచంలో ఎత్తయిన రైలు మార్గాలు చిలీలోని ఆండిస్ పర్వతాల గుండా పోతున్నాయి.
-దక్షిణ అమెరికా ప్రజలు అమెరికన్ ఇండియన్లు, నీగ్రోలు, యూరప్ దేశస్థులు అనే మూడు ప్రధాన జాతులకు చెందినవారు. ఇక్కడ ఉండే అనేక మిశ్రమ జాతుల్లో మెస్టిజోలు అధికంగా ఉంటారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు