అంబేద్కర్ జీవిత చరిత్ర ఎలాంటి వనరు?
1. మానవ సమాజ అభ్యున్నతికి తోటి మానవుల సముదాయంతో కలిసి జీవించే విధానాన్ని, తన అభ్యున్నతికి సంబంధించిన ప్రత్యక్ష, పరోక్ష అంశాలపై అవగాహన కలిగించేదే సాంఘికశాస్త్రం అని చెప్పినది?
1) అమెరికా సంయుక్త రాష్ర్టాల జాతీయ విద్యాసంస్థ విక్టోరియా చార్టు
2) అమెరికా సంయుక్త రాష్ర్టాల సాంఘికశాస్త్ర పునర్వ్య వస్థీకరణ సమాఖ్య
3) జాన్ వి మైఖేల్స్
4) సాంఘికశాస్త్ర జాతీయ మండలి
2. కింది వాటిలో సామాజికశాస్ర్తాలకు సంబంధించనిది?
1) ఇవి మానవ సమాజ పుట్టుక గురించి తెలుపుతాయి
2) ఇవి స్థూల రూపంలో ఉంటాయి
3) ఇవి సమాజంలో వ్యక్తుల కార్యకలాపాల గురించి తెలుపుతాయి
4) ఇవి విశాల పరిధిని కలిగి ఉంటాయి
3. కింది వాటిలో ఉద్దేశాల విషయంలో సరైనది?
1) ఉపాధ్యాయునికి బోధనలో ఉపయోగపడుతాయి
2) వీటిని తప్పక సాధిస్తారు
3) ఇవి తాత్కాలిక విలువలను తెలుపుతాయి
4) ఇవి విద్యలో దిశానిర్దేశం చేస్తాయి
4. విద్యార్థుల్లో పౌరసత్వ విలువలను పెంపొందించడంఅనేది?
1) విద్యాలక్ష్యం 2) బోధనాలక్ష్యం
3) ప్రవర్తనాలక్ష్యం 4) పైవన్నీ
5. కింది వాటిలో 1986 మౌలికాంశాల్లో లేనిది?
1) పరిమిత కుటుంబ భావన పెంపొందించడం
2) పర్యావరణ పరిరక్షణ
3) భారతదేశ స్వాతంత్య్రోద్యమ చరిత్ర
4) విద్యార్థిలో దేశభక్తి పెంపొందించడం
6. కింది వాటిలో విలువ కట్టడం అనేదానిలో లేనిది?
1) నిబద్ధత పాటించడం
2) సరైనదాన్ని ఎంచుకోవడం
3) విలువలకు ప్రాధాన్యం ఇవ్వడం
4) విలువలను పెంపొందించడం
7. భావాత్మక సంబంధాల సముదాయాన్ని నిర్మించుకోవడం అనేది దేనిలో సోపానం?
1) మూల్యాంకనం 2) సంశ్లేషణ
3) విశ్లేషణ 4) వ్యవస్థాపన
8. తెలంగాణ రాష్ట్ర పటంలో థర్మల్ విద్యుత్ ఉన్న కేంద్రాలను గుర్తించండి అనేది?
1) అభిరుచి 2) నైపుణ్యం 3) జ్ఞానం 4) వైఖరి
9. సమాజంలో ఉన్న మూఢాచారాలు, నమ్మకాలు, ఆలోచనలు మొదలైన వాటి గురించి విద్యార్థులు తెలుసుకునేలా చేయడానికి ఉపాధ్యాయుడు ఉపయోగించాల్సిన టెక్నిక్?
1) క్షేత్ర పర్యటనలు 2) పాఠశాల శిబిరాలు
3) సర్వేలు 4) విజ్ఞాన యాత్రలు
10. క్రమబద్ధం, లయబద్ధం అనేవి కింది వాటిలో దేనికిసంబంధించినవి?
1) సహజీకరణ 2) ఉచ్ఛారణ
3) హస్తలాఘవం 4) అనుకరణ
11. కింది వాటిని సరిగా జతపర్చండి.
1. బ్లూమ్స్ ఎ. 1956
2. క్రాత్‌హోల్ బి. 1972
3. సింప్సన్ సి. 1964
4. హీరో డి. 1966
5. దవే ఇ. 1969
1) 1-ఎ, 2-బి, 3-డి, 4-ఇ, 5-సి
2) 2-బి, 1-ఎ, 4-ఇ, 3-డి, 5-సి
3) 1-ఎ, 2-సి, 3-డి, 4-బి, 5-ఇ
4) 1-ఎ, 2-డి, 3-సి, 4-ఇ, 5-బి
12. కింది వాటిలో నిర్మాణాత్మక ఉపగమానికి సంబంధించి ఉపాధ్యాయుని పాత్రకానిది?
1) ఉపాధ్యాయుడు విద్యార్థులను ప్రోత్సహించాలి
2) విద్యార్థుల సామర్థ్యాలపట్ల అవగాహన కలిగి ఉండాలి
3) వైవిధ్యమైన అనుభవాలు కల్పించాలి
4) ఉపన్యాస విధానంలో బోధన చేయాలి
13. కింది వాటిలో బోధనోపకరణాల వినియోగంలో మార్గదర్శక సూత్రం కానిది?
1) తయారీ సూత్రం
2) భౌతిక నియంత్రణ సూత్రం
3) ఉద్దేశ సూత్రం
4) మదింపు సూత్రం
14. పెయింటింగ్, చిత్రాలు, రేడియోల ద్వారా విద్యార్థి విషయాన్ని తెలుసుకుంటే కలిగే అనుభవం?
1) ప్రత్యక్ష అనుభవం 2) కల్పిత అనుభవం
3) ఆపాదిత అనుభవం 4) పరోక్ష అనుభవం
15. భారంలేని అభ్యసనం అనే విషయాన్ని ప్రస్తావించినవారు?
1) కొఠారీ కమిషన్ 2) యశ్పాల్ కమిటీ
3) సెకండరీ విద్యాకమిషన్
4) ఈశ్వరీబాయి పటేల్ కమిటీ
16. 1857 తిరుగుబాటు పాఠ్యాంశ బోధనకు ముందు దాని చారిత్రక నేపథ్యం గురించి చెప్పడానికి కింది ఏ పద్ధతి అత్యంత అనువైనది?
1) చాక్ అండ్ టాక్ మెథడ్ 2) ప్రాజెక్టు పద్ధతి
3) సోర్స్ మెథడ్ 4) పర్యవేక్షణ పద్ధతి
17. నిజ జీవిత సన్నివేశంలో పద్ధతి ప్రకారం విద్యాశాఖ సాధించిన లక్ష్యాత్మక కృత్యమే ప్రాజెక్టు అని చెప్పినవారు?
1) బల్లార్డ్ 2) కిల్పాట్రిక్
3) స్టీవెన్సన్ 4) బైనింగ్
18. పాట పాడటం, పదజాలాన్ని అభ్యసించడం, పటాలను గీయడంలో ఉపయోగించే ప్రాజెక్టు?
1) సమస్యా ప్రాజెక్టు 2) తర్ఫీదు ప్రాజెక్టు
3) వినియోగదారుని ప్రాజెక్టు
4) ఉత్పత్తిదారుని ప్రాజెక్టు
19. తెలంగాణ రాష్ట్రం – రవాణా సౌకర్యాలు అనే పాఠ్యాంశ బోధనకు అనువైన బోధన పద్ధతి?
1) ఉపన్యాస ప్రదర్శన పద్ధతి
2) ప్రకల్పన పద్ధతి
3) సమస్య పరిష్కార పద్ధతి
4) చారిత్రక పద్ధతి
20. కింది ఏ సోపానంలో విద్యార్థులు తమ తప్పులు తెలుసుకుని పథకం ప్రకారం కార్యకలాపాలన్నీ నిర్వహించినది, లేనిది ఆత్మవిమర్శ చేసుకుంటారు?
1) పరిస్థితులను కల్పించడం
2) ప్రాజెక్టును మూల్యాంకనం చేయడం
3) నమోదు చేయడం 4) ప్రణాళిక రచన
21. మనం బతికి ఉన్నామంటే మన జీవిత సమస్యలు మనం పరిష్కరించుకున్నట్టు లెక్క అని చెప్పినది?
1) స్ట్రంక్ 2) సిమాక్సిన్
3) 1, 2 4) బైనింగ్ & బైనింగ్
22. కింది వాటిలో నిగమనాత్మక దృక్పథం లోపం కానిది?
1) ఆలోచనను, వివేకాన్ని, అన్వేషణను పెంచలేదు
2) స్వయంకృషి, స్వీయ కార్యకలాపంగా ఉంటుంది
3) ఇది క్లుప్తంగా ఉండి కాలాన్ని పొదుపు చేస్తుంది
4) విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, చొరవ పెంపొందించలేదు
23. అంబేద్కర్ జీవిత చరిత్ర ఎలాంటి వనరు?
1) గౌణ వనరు 2) ప్రాథమిక వనరు
3) చారిత్రక వనరు 4) పౌరశాస్త్ర వనరు
24. విద్యార్థులు ఒక అంశంపై తమ ఆలోచనా ప్రతిభను ఇచ్చిన సమయంలో ఒక ప్రవాహంవలె వ్యక్తంచేసేలా ప్రేరేపింపజేయడాన్ని ఏమంటారు?
1) బ్రెయిన్ వాషింగ్ 2) బ్రెయిన్ స్టార్మింగ్
3) బ్రెయిన్ స్టోరింగ్ 4) బ్రెయిన్ స్టాగ్నేషన్
25. దేశంలో నిరుద్యోగం అనే పాఠ్యాంశం బోధించిన తర్వాత విద్యార్థి నిరుద్యోగుల పట్ల సానుభూతి కలిగి ఉంటే అది?
1) ప్రేరణా విలువ 2) బౌద్ధిక విలువ
3) నైతిక విలువ 4) శాస్త్రీయ వైఖరుల విలువ
26. విద్యార్థి అడవుల సంరక్షణకు తగిన సూచనలు తెలియజేసిన అది..?
1) అవగాహన వైఖరి 2) వైఖరి
3) వినియోగం 4) ప్రశంస
27. విలువలుగల వ్యక్తి ఓటమి ఎరుగని వ్యక్తికంటే గొప్పవాడు అని నిర్వచించింది?
1) గాంధీ 2) వివేకానంద
3) ఐన్‌స్టీన్ 4) హాకిన్స్
28. భారతదేశ విద్యాప్రణాళిక ఉద్దేశాలు సాధించాలంటే ఎన్ని నైపుణ్యాలు సాధించాలి?
1) 30 2) 31 3) 32 4) 33
29. కింది వాటిలో సూక్ష్మబోధనా లక్షణం కానిది?
1) దీనిలో విద్యార్థి ప్రవర్తనను మార్చే అవకాశం ఉంది
2) పర్యవేక్షకుని పాత్ర అధికంగా ఉంటుంది
3) నైపుణ్యాలకు మూల బోధనా నైపుణ్యాలని పేరు
4) నియంత్రిత పరిసరాల్లో బోధన జరుగుతుంది
30. నూతన నైపుణ్యాలను అభివృద్ధి పర్చడానికి, పాత నైపుణ్యాలను మెరుగుపర్చుకోవడానికి బోధనను సంధించడాన్ని తగ్గించిన వ్యూహకల్పనే సూక్ష్మబోధన అని నిర్వచించినది?
1) జేసీ క్లిప్ 2) అలెన్, బుష్
3) లాడ్యూ 4) మైక్ నైట్
31. కింది వాటిలో ఉపాధ్యాయుని భౌతిక లక్షణం కానిది?
1) మంచి ఆరోగ్యం 2) శారీరక ఆకృతి
3) కంఠస్వరం 4) పనిపట్ల అంకితభావం
32. పెన్సిల్వేనియా యూనివర్సిటీలో పనిచేసిన విలియం జోన్ కింది ఏ యూనిట్ల గురించి చెప్పాడు?
1) విషయ విజ్ఞాన యూనిట్
2) అనుభవసాకల్య యూనిట్
3) బోధనా యూనిట్ 4) నిర్మాణాత్మక యూనిట్
33. కింది వాటిలో అవగాహనకు సంబంధించని ప్రశ్న?
1) ఆహార పంటలకు తగిన ఉదాహరణలు ఇవ్వండి?
2) పర్యావరణ కాలుష్యానికి తగిన కారణాలు తెల్పండి?
3) భారతదేశ భౌతిక స్వరూపాన్ని వివరించండి?
4) ఏక కేంద్ర, సమాఖ్య ప్రభుత్వానికి మధ్యగల భేదాలు ఏవి?
34. సైమన్ కమిషన్ సమయంలో టంగుటూరి ప్రకాశం పంతులు చూపించిన ధైర్యసాహసాలను, విద్యార్థి మెచ్చుకోవడంలో దాగి ఉన్న లక్ష్యం?
1) అభిరుచి 2) వైఖరి 3) ప్రశంస 4) నైపుణ్యం
35. ఒక మనిషి ఏదైనా అంశంపట్ల ఎలా ఆలోచిస్తాడు? అర్థం చేసుకుంటాడు? నేర్చుకుంటాడు? అనే విషయాలకు సంబంధించిన జ్ఞానం, తనకుగల జ్ఞానానికి సంబంధించిన పూర్తి అవగాహన అనేది దేనికి సంబంధించినది?
1) విధానాత్మక జ్ఞానం 2) భావనాత్మక జ్ఞానం
3) వాస్తవానికి సంబంధించిన జ్ఞానం
4) మెటాకాగ్నిషన్ జ్ఞానం
36. పైన తెలిపిన పేరాగ్రాఫ్ ఆధారంగా ప్రభుత్వ వ్యవహారాల్లో న్యాయస్థానాల జోక్యం సరైనదని భావిస్తున్నావా? వ్యాఖ్యానించండి? అనే ప్రశ్న కింది ఏ విద్యా ప్రమాణానికి సరిపోతుంది?
1) సమాచార సేకరణ నైపుణ్యాలు
2) విషయ అవగాహన
3) ఇచ్చిన విషయాన్ని చదివి అర్థం చేసుకుని
వ్యాఖ్యానించడం
4) ప్రశంస, సున్నితత్వం
37. ఎండో సల్ఫాన్ వంటి పురుగు మందులు, రసాయనిక ఎరువులు వాడుతూ భూమిని నాశనం చేస్తున్నారు. మీ ప్రాంతంలో కూడా ఇలాంటి పరిస్థితులే ఉన్నాయా? చర్చించండి? అనే ప్రశ్న ఏ విద్యాప్రమాణానికి సంబంధించింది?
1) సమకాలీన అంశాలపై ప్రతిస్పందన
2) ప్రశంస, సున్నితత్వం
3) పట నైపుణ్యాలు
4) ఇచ్చిన దాన్ని చదివి అర్థం చేసుకుని వ్యాఖ్యానించడం
38. ఒక ఉపాధ్యాయుడు సంకలన మూల్యాంకనంలో భాగంగా ప్రశ్నపత్రంలో.. మీ ప్రాంతంలో పండే వివిధ ఆహార, వాణిజ్య పంటల రకాలు సేకరించి పట్టికలో చూపండి? అని ఇస్తే అది?
1) పట నైపుణ్యాలు 2) విషయ అవగాహన
3) సమాచార సేకరణ నైపుణ్యాలు
4) ప్రశంస, సున్నితత్వం
39. ఒక విద్యార్థి పర్యావరణ కాలుష్యాన్ని ఎలా తగ్గించవచ్చో తెలియజేస్తూ ఒక పోస్టరు తయారు చేస్తే అతనిలో సాధించబడిన విద్యాప్రమాణం?
1) విషయ అవగాహన 2) ప్రశంస, సున్నితత్వం
3) సమాచార సేకరణ నైపుణ్యాలు
4) సమకాలీన అంశాలపై ప్రతికూల స్పందన
40. తెలంగాణ పటంలో కొత్తగా ఏర్పడిన జోగుళాంబ గద్వాల జిల్లాను గుర్తించండి అనే ప్రశ్నద్వారా సాధించిన లక్ష్యం?
1) జ్ఞానం 2) వినియోగం
3) అభిరుచి 4) నైపుణ్యం
41. తాజ్‌మహల్ విశిష్టతను వేరేవాళ్లు చెప్పినప్పుడు గానీ, రేడియో ద్వారా విన్నప్పుడు గానీ విద్యార్థి పొందిన అనుభవం?
1) ప్రత్యక్ష అనుభవం 2) ఆపాదిత అనుభవం
3) కల్పిత అనుభవం 4) పరోక్ష అనుభవం
42. విద్యార్థులకు పాఠ్యాంశం చదివేటప్పుడు వచ్చిన సందేహాలను ఉపాధ్యాయుడు నివృత్తి చేశాడు. అయితే అందుకు ఉపయోగించిన పద్ధతి?
1) ఉపన్యాస ప్రదర్శన పద్ధతి 2) ఉపన్యాస పద్ధతి 3) ప్రాజెక్టు పద్ధతి 4) సమస్యా పరిష్కార పద్ధతి
43. కౌటిల్యుడు రాసిన అర్థశాస్త్రం ఎలాంటి వనరు?
1) ప్రాథమిక వనరు 2) గౌణ వనరు
3) చారిత్రక వనరు 4) పూర్వచారిత్రక వనరు
44. భారత స్వాతంత్రోద్యమం అనే పాఠ్యాంశాన్ని బోధించడానికి విద్యార్థులను కొందరు జాతీయ నాయకుల గురించి తెలుసుకుని రమ్మన్నాడు. ఈ విధానంలో ఉపాధ్యాయుడు ఇచ్చిన నియోజనం?
1) రెమిడియల్ అసైన్మెంట్
2) ప్రిపరేటరీ అసైన్మెంట్
3) రివిజనల్ అసైన్మెంట్
4) రెమిడియల్ అసైన్మెంట్
45. ప్రాచీన, మధ్య యుగాల నాటి విదేశీ యాత్రికులు కాల క్రమానుగతంగా తమ చేతుల్లో తమ గురించిన సమాచారాన్ని తెలిపే పోస్టర్లతో వేదికపైకి వస్తారు. ఇది?
1) నాటకం
2) ఒక సంఘటనను దృశ్యీకరించే బహిరంగ నాటక ప్రదర్శన
3) మూకాభినయం 4) టాబ్లో
46. ఒక స్కూల్ కాంప్లెక్స్ సమావేశంలో ఉమా మహేశ్వర్ అనే సాంఘికశాస్త్ర ఉపాధ్యాయుడు తోటి ఉపాధ్యాయులకు సర్దార్ వల్లభాయ్ పటేల్ పాఠాన్ని బోధించాడు. ఇది కింది దేనికి సంబంధం కలిగి ఉంది?
1) నాటకీకరణ 2) పాత్రధారణ
3) సిమ్యులేషన్ 4) బ్రెయిన్ స్టార్మింగ్
47. దేశంలోని యువతను ఎలా మేల్కొలపాలని ఉపాధ్యాయుడు విద్యార్థులను అడుగగా దాదాపుగా 100 మంది వరకు జవాబులు చెప్పారు. అయితే ఈ విధానం?
1) బ్రెయిన్ స్టార్మింగ్ 2) సిమ్యులేషన్
3) కల్పితాలు 4) టాబ్లో
48. సాంఘికశాస్త్ర ఉపాధ్యాయుడు దేశంలోని గొప్ప దేవాలయాలను సందర్శించి వాటికి సంబంధించిన చిత్రాలు తన బోధనలో ఉపయోగించాడు. ఆ చిత్రాలు అనేవి?
1) గ్రాఫిక్ ఉపకరణం 2) టూ డైమెన్షన్ ఎయిడ్ 3) ద్విపార్శ బోధనోపకరణం 4) పైవన్నీ
49. తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రా సరిహద్దు ప్రాంతాల్లో దట్టంగా విస్తరించి ఉన్న నల్లమల అడవులను పటంలో కింది ఏ రంగుతో సూచించాలి?
1) ముదురు నీలం 2) ముదురు ఆకుపచ్చ 3) గోధుమ రంగు 4) మట్టిరంగు
50. బీఈడీ చదివిన రమేష్ అనే ఛాత్రోపాధ్యాయుడు ఒక పాఠశాలలో ఇంటర్వ్యూకి వెళ్లగా విద్యాశాఖ అనే అంశాన్ని బోధించమని యాజమాన్యం అడిగింది. అప్పుడు ఆ ఉపాధ్యాయుడికి ఉపయోగపడే చార్టు?
1) వ్యవస్థాక్రియ చార్టు 2) పట్టిక చార్టు
3) ప్రవాహ చార్టు 4) ఫ్లిప్ చార్టు
51. తెలంగాణ ఉద్యమం అనే అంశాన్ని విద్యార్థులకు అర్థవంతంగా బోధించడానికి కింది ఏ చార్టు అనుకూలంగా ఉంటుంది?
1) కాలరేఖా చార్టు 2) ప్రవాహ చార్టు
3) స్ట్రిప్‌టీజ్ చార్టు 4) వృక్ష చార్టు
52. షాజహాన్ గొప్ప భవన నిర్మాత అనే అంశాన్ని షాజహాన్ చిత్రం మధ్యలో ఉంచి చుట్టూ అతను నిర్మించిన భవనాలు చూపడం?
1) ఉత్సవరకం సాధనాలు 2) చిత్రాల సమాహారం
3) చిత్రాల చార్టు 4) కార్టూన్లు
53. భూభ్రమణం, అర్ధగోళం, భూపరిభ్రమణం వంటి పాఠ్యాంశాలను అర్థవంతంగా బోధించడానికి కింది వాటిలో సరైన బోధనోపకరణం?
1) పటం 2) గ్లోబు 3) చార్టు 4) కార్టూన్లు
54. ఒక ప్రైవేటు పాఠశాలవారు వారి పాఠశాల మొత్తాన్ని తయారు చేయించి దానిని ఒక అద్దాల పెట్టెలో భద్రపరిచేలా చేశారు. అయితే అది?
1) నమూనా 2) డయోరమ
3) చార్టు 4) ప్రక్షేపక సాధనాలు
55. పట్టువస్ర్తాల తయారీ- తెలంగాణ రాష్ట్రం అనే పాఠ్యాంశాన్ని బోధించడానికి విద్యార్థులను పట్టు ఉత్పత్తి కేంద్రాల దగ్గరకు తీసుకెళ్తారు. అయితే, ఆ కేంద్రం?
1) సాంస్కృతిక వనరు 2) ఆర్థిక వనరు
3) సామాజిక వనరు 4) భౌగోళిక వనరు
56. భారత స్వాతంత్రోద్యమాన్ని ఏకకాలంలో ఇంగ్లండ్‌లో జరిగిన సంఘటనతో పోల్చి చెప్పడానికి ఉపయోగపడే చార్టులు?
1) పురోగమన కాలరేఖా చార్టు
2) తిరోగమన కాలరేఖా చార్టు
3) సరిపోల్చే కాలరేఖలు 4) సచిత్ర కాలరేఖలు
57. జోగుళాంబ గద్వాల పట్టణం సముద్ర మట్టానికి 750 మీటర్ల ఎత్తులో ఉంది. అయితే దానిని పటంలో ఏ రంగుతో సూచిస్తారు?
1) ఎరుపు రంగు 2) ముదురు గోధుమ
3) లేత ఆకుపచ్చ 4) ముదురు ఆకుపచ్చ
58. అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు మంటలను ఆర్పడానికి వచ్చే అగ్నిమాపక కేంద్రాలు కింది ఏ రకమైన వనరు?
1) భౌగోళిక వనరు 2) ఆర్థిక వనరు
3) రాజకీయ వనరు
4) ప్రభుత్వపరంగా విలువగల వనరు
59. దర్శనీయ ప్రదేశాల బోధనకుగాను ఒక సాంఘికశాస్త్ర ఉపాధ్యాయుడు వేయి స్తంభాల గుడి, వరంగల్ కోట, భువనగిరి కోట మొదలైన ప్రాంతాల సందర్శన ఏర్పాటు చేశాడు. అతడు చూపించిన ఆ దర్శనీయ స్థలాలు ఏ రకమైన సామాజిక వనరులకు చెందుతాయి?
1) శాస్త్రీయంగా విలువగల వనరులు
2) సాంస్కృతికంగా విలువగల వనరులు
3) భౌగోళికంగా విలువగల వనరులు
4) చారిత్రకంగా విలువగల వనరులు
60. గుణాత్మకమైన విద్య ద్వారా దేశం అభివృద్ధి చెందడాన్ని ప్రభావం చేసే అంశాలన్నింటిలో ఉపాధ్యాయుల గుణం, సామర్థ్యం, ప్రవర్తన నిస్సందేహంగా ప్రాముఖ్యమైనవి అని చెప్పినవారు?
1) ఎన్సీఎఫ్- 2005 2) ఏపీఎస్సీఎఫ్- 2011
3) కొఠారి కమిషన్ 4) సర్వేపల్లి రాధాకృష్ణన్
61. కింది వాటిలో సాంఘికశాస్త్ర ఉపాధ్యాయునికి అవసరమైన కార్యనిర్వహణ దక్షత అనే అంశానికి సంబంధించింది?
1) మార్గదర్శకత్వం 2) అనుసరణీయం
3) ఆత్మపరిశీలన 4) సానుభూతి
62. కింది వాటిలో సాంఘికశాస్త్ర ఉపాధ్యాయుడికి ఉండాల్సిన ప్రత్యేక లక్షణం కానిది?
1) విస్తృతస్థాయి యాత్రికుడు 2) మంచి వర్తకుడు
3) సాంకేతిక వినియోగంలో నేర్పరితనం
4) విషయ పరిజ్ఞానం
63. కింది వాటిలో కరికులం విషయంలో అవాస్తవం ఏది?
1) కరికులం ఎప్పుడూ దశల వారీగా ఉంటుంది
2) సిలబస్ వంటి ఎన్నో అంశాలు కలిస్తే కరికులం అవుతుంది
3) ఇది ఆచరణాత్మకమైంది
4) ఒక దేశానికి అనుగుణంగా దీనిని తయారు చేస్తారు
64. కింది వాటిలో విద్యాప్రణాళికా నిర్మాణ సూత్రంలో సెకండరీ విద్యా కమిషన్ చెప్పిన సూత్రాల్లో లేనిది?
1) విరామకాల సద్వినియోగ సూత్రం
2) ప్రయోజన సూత్రం
3) విషయాల అంతఃసంబంధాల సూత్రం
4) వైవిధ్యత సామ్యతా సూత్రం
65. పటాల అధ్యయనం అనే పాఠ్యాంశాన్ని 6, 7, 8 తరగతుల్లో వాటి స్థాయినిబట్టి విషయ కాఠిన్యత పెంచుతూ ఇవ్వడమనేది కింది ఎలాంటి ఉపగమనానికి చెందుతుంది?
1) కాలక్రమ ఉపగమం 2) ఏకకేంద్ర ఉపగమం
3) సర్పిలాకార ఉపగమం 4) శీర్షిక ఉపగమం
66. మృత్తికలు, మృత్తికా క్రమక్షయం అనే పాఠ్యాంశాన్ని సాంఘికశాస్త్ర పాఠ్యపుస్తకంలో ఏర్పాటు చేయడం ద్వారా సాధించే మౌలికాంశం?
1) శాస్త్రీయ దృక్పథం 2) పరిసరాల పరిరక్షణ
3) చిన్నకుటుంబం భావన
4) భారతదేశ స్వాతంత్రోద్యమ చరిత్ర
67. గ్రామజ్యోతి కార్యక్రమంలో గ్రామసభ గురించి అవగాహన కలిగించడానికి ఉపాధ్యాయుడు తరగతి గదిలో మాదిరి గ్రామసభను నిర్వహించాడు. అతడు అనుసరించిన టెక్నిక్?
1) ఏకపాత్రాభినయం 2) చర్చ
3) నాటకీకరణ 4) సిమ్యులేషన్
68. ప్రపంచంలోని అన్ని ఖండాలకు సంబంధించిన విషయం 9వ తరగతి సాంఘికశాస్త్ర పాఠ్యపుస్తకంలో ఇవ్వబడింది. ఇక్కడ అనుసరించిన పాఠ్యప్రణాళిక నిర్వహణా విధానం?
1) సర్పిల పద్ధతి 2) ఏకకేంద్ర పద్ధతి
3) శీర్షికాపద్ధతి 4) సెమిస్టర్ పద్ధతి
69. ఒక సాంఘికశాస్త్ర ఉపాధ్యాయుడు కింద తెలిపిన విధంగా ప్రశ్నను రూపొందించాడు. అయితే, ఈ ప్రశ్నలో లోపం?
ప్రశ్న: కింద తెలిపిన వాటిలో ప్రాథమిక హక్కు కానిది?
ఎ. సమానత్వపు హక్కు
బి. స్వేచ్ఛా స్వాతంత్య్రపు హక్కు
సి. మత హక్కు
డి. సాంస్కృతిక వారసత్వపు హక్కు
1) ఇచ్చిన సమాధానాలన్నీ సరైనవి
2) సరైన సమాధానం ఇవ్వలేదు
3) ప్రశ్న రూపం ఇవ్వలేదు 4) ప్రశ్న క్లూ ఇస్తున్నది
70. విద్యార్థులను పోస్టాఫీసు గురించి స్వీయ అనుభవాల ద్వారా అభ్యసించడానికి ప్రోత్సహించే పద్ధతి?
1) ప్రదర్శనా పద్ధతి 2) ప్రాజెక్టు పద్ధతి
3) సాంఘిక ఉద్గార పద్ధతి 4) ఉపన్యాస పద్ధతి
71. జాతీయ సమైక్యతకు గల అవరోధాలు ఏవి అనే వివాదాస్పద అంశాల గురించి చర్చకు అవకాశం కల్పించే చర్చారూపం?
1) సెమినార్ 2) వాగ్వాదం
3) సింపోజియం 4) జట్టుచర్చ
72. 10వ తరగతి సాంఘికశాస్త్ర విద్యార్థి ప్రశ్నపత్రాన్ని రాము, రఫి, డేవిడ్ అనే ముగ్గురు ఉపాధ్యాయులు విడివిడిగా దిద్దగా వేర్వేరు మార్కులు వచ్చాయి. అయితే, ఆ పరీక్షలో లోపం?
1) సప్రమాణత 2) ఆచరణాత్మకత
3) లక్ష్యాత్మకత 4) విచక్షణాశక్తి
73. కింది ఏ రకమైన మూల్యాంకనం ఒక విద్యార్థి ఇతరులతో పోటీ పడేటట్లు చేస్తుంది?
1) సంకలన మూల్యాంకనం
2) నిర్మాణాత్మక మూల్యాంకనం
3) లోపనిదాన మూల్యాంకనం
4) ప్రాగుక్తీకరణ మూల్యాంకనం
74. కింది వాటిలో నిజమైన సాంఘికశాస్త్ర ఉపాధ్యాయుడు ఎవరు?
1) కేవలం పాఠ్యగ్రంథంపై ఆధారపడి బోధించే
ఉపాధ్యాయుడు
2) పాఠ్యగ్రంథాన్ని ఉపయోగించని ఉపాధ్యాయుడు
3) పాఠ్యగ్రంథాన్ని ఒక సహాయకారిగా ఉపయోగించే
ఉపాధ్యాయుడు
4) పాఠ్యగ్రంథంలో పాఠ్యాంశాలను విద్యార్థులతో చది
వించి బోధించే ఉపాధ్యాయుడు
75. విద్యార్థిలో నిబిడీకృతమైన అభిలషణీయమైన ఫలితాలను వెలికి తీయడానికిగాను క్రమపద్ధతిలో పొందుపరిచిన విషయ అనుభవాల నిర్మాణ అంశం యూనిట్ అని చెప్పినవారు?
1) హెన్రీ మారిసన్ 2) రిచర్డ్ 3) వెస్లీ 4) ట్రస్టన్
76. అనగననగ రాగ మతిశయిల్లుచునుండు, తినగతినగ వేము తియ్యనుండు అనే పద్య పాదాలు కింది ఏ సోపానానికి సరిపోతాయి?
1) సాంశీకరణ 2) వ్యవస్థీకరణ
3) ప్రదర్శన 4) వల్లెవేయడం
77. మౌర్యసామ్రాజ్యాన్ని గురించి బోధించడానికి చంద్రగుప్త మౌర్యునితో ప్రారంభించి మౌర్య సామ్రాజ్య పతనం వరకు వెళ్లడం అనేది ఎలాంటి సహసంబంధానికి సంబంధించింది?
1) అంతర్గతంగా ఏర్పడే సంబంధం
2) పాఠ్యవిషయ సహసంబంధం
3) అంతర్గత సంబంధం
4) బాహ్య సహసంబంధం
78. 9వ తరగతి పాఠ్యపుస్తకంలో పాఠ్యాంశాలుగా భూమి-మనం, భూమి ఆవరణాలు, జలావరణం, వాతావరణం, జీవావరణం అనే పాఠ్యాంశాలను వరుసక్రమంలో అమరిస్తే అందులో దాగి ఉన్న ఉపగమం?
1) ఏకకేంద్ర ఉపగమం 2) సహసంబంధ ఉపగమం
3) యూనిట్ ఉపగమం 4) శీర్షికా ఉపగమం
79. కింది వాటిలో మూల్యాంకనం అనే అంశానికి సరిపోయేది?
1) పరిమాణాత్మక వివరణ + విద్యార్థి సామర్థ్య నిర్ణయం
2) విషయ పరిమాణాత్మక వివరణ + సామర్థ్యంపై నిర్ణయం
3) సామర్థ్య నిర్ణయం+ సామర్థ్యంపై నిర్ణయం
4) పరిమాణాత్మక వివరణ + విద్యార్థి సామర్థ్య నిర్ణయం+ విద్యార్థి సామర్థ్యంపై నిర్ణయం
80. విద్యార్థిలో ఉన్న మూర్తిమత్వ లక్షణాలైన సహకారం, చాకచక్యం, సమయస్ఫూర్తి, నాయకత్వ లక్షణాలు మొదలైన వాటిని ఎంతమేరకు ఉన్నాయో కచ్చితంగా మూల్యాంకనం చేయడానికి ఉపయోగపడే మూల్యాంకన పరికరం?
1) ప్రశ్నావళి 2) క్యుములేటివ్ రికార్డు
3) అంచనామాపని 4) చెక్‌లిస్ట్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు