For quick employment ..| త్వరిత ఉపాధికి..?
మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ (ఎంఎల్టీ)
ఉన్నత విద్యావకాశాలు
బ్రిడ్జి కోర్సు చేయనివారికి : బీఎస్సీ (ఎంఎల్టీ), బీఎస్సీ (మైక్రోబయాలజీ), బీఎస్సీ (బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ)
పీజీ కోర్సులు
ఎంఎస్సీ ఎంఎల్టీ/ బయోకెమిస్ట్రీ/ మైక్రోబయాలజీ/ బయోటెక్నాలజీ
ఉపాధి అవకాశాలు
-ఆస్పత్రులు, ఫార్మా కాలేజీలు, డయాగ్నస్టిక్ సెంటర్లలో ఉద్యోగావకాశాలు ఉంటాయి.
-నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, సెంట్రల్ డ్రగ్ రిసెర్చ్ లాబొరేటరీ, మాలిక్యులర్ బయాలజీ ల్యాబ్, క్వాలిటీ అండ్ కంట్రోల్లలో ఉద్యోగావకాశాలు లభిస్తాయి.
స్వయం ఉపాధి
-సొంతంగా డయాగ్నస్టిక్ ల్యాబ్‌లు పెట్టుకోవచ్చు.
మల్టిపర్పస్ హెల్త్‌వర్కర్ (ఎంపీహెచ్‌డబ్ల్యూ-మహిళలు)
ఉన్నత విద్యావకాశాలు
బ్రిడ్జి కోర్సు చేసినవారికి : బీఎస్సీ (బీజడ్సీ), బీఎస్సీ జనరల్, బీఎస్సీ (లైఫ్‌సైన్సెస్), ఎంసెట్ రాయొచ్చు
బ్రిడ్జి కోర్సు చేయనివారికి : జీఎన్ఎం, బీఎస్సీ (నర్సింగ్), బీఏ, బీకాం
ఉపాధి అవకాశాలు
ఆస్పత్రులు, నర్సింగ్‌హోంలు, క్లినిక్‌లలో ఉద్యోగాలు లభిస్తాయి. ప్రభుత్వ, స్వచ్ఛంద సంస్థల ఆరోగ్య సంస్థల ద్వారా గ్రామాల్లో కూడా ఉపాధి పొందవచ్చు.
ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కాలేజీల్లో ల్యాబ్ అటెండర్‌గా కూడా పనిచేయొచ్చు.
డెంటల్ టెక్నీషియన్
ఉన్నత విద్యావకాశాలు
బ్రిడ్జి కోర్సు చేసినవారికి : బీఎస్సీ జనరల్, బీఎస్సీ (బీజడ్సీ), బీఎస్సీ (లైఫ్ సైన్సెస్)
బ్రిడ్జి కోర్సు చేయనివారికి : బీకాం, బీఏ, ఎంసెట్ రాసి బీఎస్సీ (అగ్రికల్చర్), బీఎస్సీ (హార్టికల్చర్), బీఎస్సీ (సెరికల్చర్) చదవొచ్చు.
ఉపాధి అవకాశాలు
డెంటల్ క్లినిక్‌లలో డెంటల్ టెక్నీషియన్‌గా ఉపాధి పొందవచ్చు. లేదా సొంతంగా డెంటల్ లాబొరేటరీ పెట్టుకొని స్వయం ఉపాధి పొందవచ్చు.
ఒకేషనల్ కోర్సులు,పారామెడికల్ కోర్సులు
ఆప్తాల్మిక్ టెక్నీషియన్
బ్రిడ్జి కోర్సు చేసినవారికి : బీఎస్సీ జనరల్, బీఎస్సీ (బీజడ్సీ), బీఎస్సీ (లైఫ్‌సైన్సెస్)
బ్రిడ్జి కోర్సు చేయనివారికి : ఆప్తాల్మిక్ అసిస్టెంట్, డిప్లొమా ఇన్ ఆప్టిమెట్రి, బీఎస్సీ (క్లినికల్ ఆప్టిమెట్రి-పుణె), ఎంసెట్ రాసి బీఎస్సీ (అగ్రికల్చర్, హార్టికల్చర్, సెరికల్చర్ ఫారెస్ట్రీ), బీఫార్మసీలో చేరొచ్చు.
ఉపాధి అవకాశాలు
ప్రైవేట్ కంటి ఆస్పత్రుల్లో టెక్నీషియన్‌గా ఉపాధి లభిస్తుంది.
ఒకేషనల్ ఇంటర్ కాలేజీల్లో ఇన్‌స్ట్రక్టర్‌గా చేరవచ్చు.
ఆప్తాల్మిక గ్లాస్, గ్రిండింగ్ వర్క్‌షాప్‌లలో సూపర్వైజర్గా పనిచేయొచ్చు.
ఫిజియోథెరపీ
ఉన్నత విద్యావకాశాలు
బ్రిడ్జి కోర్సు చేసినవారికి : బీఎస్సీ జనరల్, బీఎస్సీ (బీజడ్సీ), బీఎస్సీ (లైఫ్‌సైన్సెస్)
బ్రిడ్జి కోర్సు చేయనివారికి : బీపీటీ, బీవోటీ, బీఎస్సీ (ఆర్థోటిక్ అండ్ ప్రోస్థటిక్ టెక్నాలజీ), బీఏ, బీకాం
ఉపాధి అవకాశాలు
హెల్త్‌క్లబ్‌లు, రిహాబిలిటేషన్ సెంటర్లు, జనరల్ ఆస్పత్రులు, ప్రైవేట్ ఫిజియోథెరపీ సెంటర్లు, ఫిజియోథెరపీ కాలేజీలు, నేచర్ క్యూర్ క్లినిక్‌లు, జిమ్నాసియమ్స్, స్టేడియాల్లో అసిస్టెంట్ ఫిజియోథెరపిస్ట్‌గా ఉపాధి పొందవచ్చు.
బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అండ్ మెయింటెనెన్స్ టెక్నీషియన్
ఉన్నత విద్యావకాశాలు
బ్రిడ్జి కోర్సు చేసినవారికి : ఎంసెట్ రాసి బీఈ/బీటెక్ చదవొచ్చు. డిప్లొమా ఇంజినీరింగ్, ఏఎంఐఈ, బీఎస్సీ (మ్యాథమెటిక్స్) చదవొచ్చు.
బ్రిడ్జి కోర్సు చేయనివారికి : బీఏ, బీకాం, బీబీఏ, బీఎస్సీ, బీబీఎం, బీకాం (కంప్యూటర్స్), సీఏ, ఐసీడబ్ల్యూఏ, ఏసీఎస్ చదవొచ్చు.
ఉపాధి అవకాశాలు
సివిల్ ఇంజినీరింగ్ వర్క్స్‌లో ప్లంబర్, పెయింటర్, కార్పెంటర్‌గా ఉపాధి పొందవచ్చు.
వాటర్ సప్లయ్ అండ్ శానిటరీ ఫిట్టింగ్స్ అండ్ ఇతర సంబంధ సివిల్ ఇంజినీరింగ్ పనుల్లో క్వాలిటీ సర్వేయర్‌గా పనిచేయొచ్చు.
కాంట్రాక్టర్‌గా, శానిటరీ స్టోర్స్ పెట్టుకొని స్వయం ఉపాధి పొందవచ్చు.
డెయిరీ కోర్స్
ఉపాధి అవకాశాలు
ప్రభుత్వం రాష్ట్రంలో పాడి పరిశ్రమకు ప్రోత్సాహం అందిస్తుండటంతో ఈ కోర్సు చేసినవారికి మంచి అవకాశాలు ఉంటాయి. కోర్సు పూర్తయిన తర్వాత వెటర్నరీ అసిస్టెంటుగా, లైవ్‌స్టాక్ అసిస్టెంట్, మిల్క్ ప్రొక్యూర్మెంట్ సూపర్వైజర్, డెయిరీ లాబొరేటరీ అసిస్టెంట్, ఫార్మ్ సూపర్వైజర్గా ఉద్యోగాలు లభిస్తాయి.
సొంతంగా డెయిరీ ఫామ్ నిర్వహించుకోవచ్చు. దీంతోపాటు పాలు, పాల పదార్థాలను ఉత్పత్తి, పశువుల వ్యర్థాలతో బయోగ్యాస్ ఉత్పత్తి చేయవచ్చు. దీనిద్వారా తనతోపాటు మరికొంతమందికి ఉపాధి కల్పించవచ్చు.
ఉన్నత విద్యావకాశాలు
బ్రిడ్జ్ కోర్సు చేయడం ద్వారా బీఎస్సీ డెయిరింగ్/డెయిరీ సైన్స్/ డెయిరీ టెక్నాలజీ/ యానిమల్ సైన్స్/బీటెక్ చేయవచ్చు. బీవీఎస్సీ అండ్ ఏహెచ్, బీఎస్సీ బయోటెక్నాలజీ, బీఎస్సీ మైక్రోబయాలజీ వంటి కోర్సులు అభ్యసించవచ్చు.
బ్రిడ్జ్ కోర్సు చేయనివారు బీఏ, బీకామ్ చేయవచ్చు.
ఫిషరీస్
ఉద్యోగ అవకాశాలు
లాబొరేటరీ ఫీల్డ్ అసిస్టెంట్, ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్, ఫార్మ్ మేనేజర్‌గా పనిచేయవచ్చు. దీంతోపాటు సొంతంగా చేప విత్తనాల ఉత్పత్తిదారునిగా వ్యాపారం ప్రారంభించవచ్చు.
ఉన్నత విద్య
బ్రిడ్జ్ కోర్సు చేయడంద్వారా బీఎస్సీలో బీజెడ్సీ లేదా ఎఫ్‌జెడ్‌సీ, బీఎఫ్ఎస్సీ (బయోటెక్నాలజీ లేదా మైక్రోబయాలజీ) చదవొచ్చు.
బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ సర్వీసెస్
ఈ కోర్సు చేయడం ద్వారా బ్యాంకింగ్, ఫైనాన్స్ సర్వీస్ విభాగంలో ప్రాథమిక భావనలు తెలుసుకోవచ్చు. అంటే బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఎలా పనిచేస్తాయి, వాటి విధివిధానాల గురించి అవగాహన ఏర్పడుతుంది.
ఉపాధి అవకాశాలు
సూపర్ బజార్లు, షాపింగ్ మాళ్లు, హోటళ్లు, రికవరీ ఏజెన్సీలు, బ్యాంకుల్లో ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. సొంతంగా సర్వీస్ ట్యాక్స్ రిటర్న్, పోస్టల్ సేవింగ్ ఏజెంట్లుగా, బ్యాంకింగ్ డైరెక్ట్ సెల్లింగ్ ఏజెంట్లుగా పనిచేయవచ్చు.
ఉన్నత విద్య
ఈ కోర్సు చేయడం ద్వారా బీకామ్, బీబీఎం, బీబీఏ, ఎల్ఎల్బీ, సీఏ, సీఎస్ వంటి కోర్సులు చదవవచ్చు.
ప్రీ స్కూల్ టీచర్ ట్రైనింగ్
ఉపాధి అవకాశాలు
శిషు సంరక్షణ కేంద్రాల్లో (డే కేర్/క్రెచ్) ఉపాధ్యాయులుగా, ప్రీ స్కూల్ టీచర్‌గా, అంగన్వాడీ వర్కర్‌గా పనిచేయవచ్చు. సొంతంగా ప్రీ స్కూల్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు, ఫ్యామిలీ కేర్ సెంటర్లు, ప్లే స్కూళ్లు నిర్వహించుకోవచ్చు.
ఉన్నత విద్య
బ్రిడ్జ్ కోర్సు చేయడంద్వారా బీఎస్సీ చేయవచ్చు. ఎంసెట్, డీఈడీ చేయడానికి అర్హత లభిస్తుంది.
బీఎస్సీ (హోమ్‌సైన్స్), బీఏ, బీకామ్ చేయవచ్చు.
ఫిజియోథెరపిస్ట్
ఈ కోర్సు చేయడంద్వారా జిల్లా, జనరల్ దవాఖానల్లో ఫిజియోథెరపిస్టులుగా, స్టేడియాలు, ఫిజియోథెరపీ కాలేజీల్లో, నేచర్ క్యూర్ క్లిన్సిక్స్లో పనిచేయవచ్చు.
ఉన్నత విద్య
బ్రిడ్జి కోర్సు చేయడం ద్వారా బీఎస్సీ (బీజెడ్సీ) చేయవచ్చు. ఎంసెట్ రాయడానికి అర్హత లభిస్తుంది. దీంతో వైద్యవిద్యలో అన్ని రకాల కోర్సులు అభ్యసించవచ్చు.
బ్రిడ్జి కోర్సు కానట్లయితే బీపీటీ, బీఓటీ, బ్యాచిలర్ ఆఫ్ ఆర్థోపెడిక్ అండ్ ప్రోస్థెటిక్ టెక్నాలజీ, బీఏ, బీకామ్ వంటి కోర్సులు చేయవచ్చు.
ఎలక్ట్రికల్ టెక్నీషియన్
ఈ కోర్సు చేసినవారు సేల్స్‌మెన్‌గా, వైండర్, మెకానిక్‌గా ఉద్యోగాలు సంపాదించవచ్చు. సొంతంగా ఎలక్ట్రికల్ గృహోపకరణాలు అమ్మే ఏజెన్సీ లేదా డీలషిప్ తీసుకోవచ్చు. రిపేర్ షాప్ నిర్వహించుకోవచ్చు.
ఉన్నత విద్య
బ్రిడ్జి కోర్సు చేయడం ద్వారా మూడేండ్ల డిప్లొమా (ఈఈఈ)లో సెకండియర్ చేయవచ్చు. బీఎస్సీలో ఎంపీసీ, కంప్యూటర్స్, బీఏ, బీకామ్ చేయవచ్చు.
కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్
ఉద్యోగ అవకాశాలు
జూనియర్ ప్రోగ్రామర్, కంప్యూటర్ ఆపరేటర్, కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్, సాఫ్ట్వేర్ మార్కెటింగ్ పర్సనల్, కంప్యూటరైజ్డ్ అకౌంట్స్ అసిస్టెంట్స్, నెట్వర్కింగ్ టెక్నీషియన్స్, డ్రాఫ్టింగ్ అసిస్టెంట్స్, డీటీపీ ఆపరేటర్, ఇంటర్నెట్ అండ్ ఈమెయిల్ సెంటర్ మెయింటనెన్స్, మెయింటనింగ్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ స్మాల్ నెట్వర్క్, ఇమేజ్ అండ్ వీడియో ఎడిటింగ్, బేసిక్ హార్డ్‌వేర్ అండ్ ట్రబుల్ షూటింగ్ టెక్నీషియన్, వెబ్ డిజైనర్
ఉన్నత విద్యావకాశాలు
బ్రిడ్జి కోర్సులు చేసినవారికి కోర్సుల ప్రవేశం: బీఎస్సీ(సీఎస్/ఐటీ), బీఈ/బీటెక్, పాలిటెక్నిక్
బ్రిడ్జి కోర్సు చేయనివారికి కోర్సుల ప్రవేశం : బీకాం, బీసీఏ
కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్
ఉద్యోగ అవకాశాలు
మీడియా ప్రొడక్షన్, యానిమేషన్ అసిస్టెంట్స్ డ్రాయింగ్/ఫిల్మ్ మేకింగ్, ఫొటో ఎడిటింగ్
ఉన్నత విద్యావకాశాలు
బ్రిడ్జి కోర్సు చేసినవారికి : బీఎస్సీ (సీఎస్/ఐటీ), బీఈ/బీటెక్, బీఎఫ్ఏ యానిమేషన్
బ్రిడ్జి కోర్సు చేయనివారికి : బీఎస్సీ మల్టీమీడియా
టూరిజం అండ్ ట్రావెల్ టెక్నిక్స్
ఉద్యోగ అవకాశాలు
ట్రావెల్ అసిస్టెంట్స్క, ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్స్, టూరిజం, సిటీ, మాన్యుమెంట్ గైడ్, రిజర్వేషన్, కస్టమర్ రిలేషన్ అసిస్టెంట్స్, అడ్వెంచర్ స్పోర్ట్స్ ఇన్స్ట్రక్టర్, మార్కెటింగ్ అండ్ సేల్స్ అసిస్టెంట్స్, వెయిటర్, రూమ్ సర్వీస్
స్వయం ఉపాధి అవకాశాలు
సబ్ ఏజెంట్స్ టూరిజం అండ్ ట్రావెల్ టెక్నిక్స్, కేటరింగ్ ఆపరేటర్స్, టూర్ కండక్టర్, కోచ్, కార్ రెంటల్, కొరియర్ అండ్ కార్గో ఏజెంట్స్, ఎక్స్కర్షన్ ఏజెంట్, టూరిస్ట్ గైడ్, ఔట్‌డోర్ క్యాటరింగ్
కార్ప్ ప్రొడక్షన్ అండ్ మేనేజ్మెంట్
ఉపాధి అవకాశాలు
విలేజ్ లెవల్ అసిస్టెంట్స్/వర్కర్స్, ఫీల్డ్ అసిస్టెంట్స్/ఫామ్/అగ్రికల్చర్ అసిస్టెంట్స్, ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్/డెమాన్స్ట్రేటర్/విలేజ్ కోర్డినేటర్, మెటలర్జికల్ అబ్జర్వేటర్, అగ్రికల్చర్ మార్కెటింగ్ అసిస్టెంట్స్, సేల్స్‌మన్/హెల్పర్
ఉపాధి అవకాశాలు
అగ్రి ఇన్పుట్ సప్లయర్, సీడ్ గ్రోవెర్, కార్ప్ ప్రొడ్యూసర్, కస్టమ్ సర్వీస్, కాంట్రాక్టర్, కాంట్రాక్టర్ ఫార్మింగ్
ఉన్నత విద్యావకాశాలు
బ్రిడ్జి కోర్సు చేసినవారికి : బీఎస్సీ, బీఎస్సీ (అగ్రికల్చర్), బీఎస్సీ (కమర్షియల్ అగ్రికల్చర్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్), బీవీఎస్సీ, బీఎస్సీ (హోమ్ సైన్స్)
బ్రిడ్జి కోర్సు చేయనివారికి : బీఎస్సీ (ఫామ్ సైన్స్ అండ్ రూరల్ డెవల్మెంట్) బీఏ/బీకాం/బీబీఎం.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు