దేశంలో కర్కట రేఖ అత్యంత ఎక్కువ దూరం ప్రయాణించే రాష్ట్రం?
భారతదేశ విస్తరణ గురించి తెలుసుకోవాలంటే ఆక్షాంశ, రేఖాంశాల పరంగా భారతదేశం ఉనికి భూగోళంలో ఎలా ఉందనే అంశాన్ని చర్చించాలి.
భారతదేశ ఉనికి-విస్తరణ
- భారతదేశం భూమధ్య రేఖకు ఉత్తర దిక్కులో, దక్షిణాసియా ప్రాంతంలో అక్షాంశాల పరంగా 8O4 నుంచి 37O25 తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది.
- దీవులతో కలుపుకొని (అండమాన్ నికోబార్ దీవులు) అక్షాంశాల 6O45 నుంచి 37O6 మధ్య భారతదేశం విస్తరించి ఉంది.
- అక్షాంశాల పరంగా భారతదేశం దాదాపు 30 అక్షాంశాల పొడవు కలిగి ఉంది.
- రేఖాంశాల పరంగా కూడా భారతదేశం దాదాపు 30 రేఖాంశాల వెడల్పు కలిగి ఉంది.
- కర్కట రేఖ: 23 1/2O (23O 30) ఉత్తర అక్షాంశాన్ని కర్కట రేఖ ఉంటారు.
- కర్కట రేఖ భారతదేశాన్ని అడ్డంగా (రెండు సమాన అర్ధ భాగాలుగా విభజిస్తూ 8 రాష్ర్టాల నుంచి వెళ్తుంది.
అవి పశ్చిమం నుంచి తూర్పుకు
1) గుజరాత్ (కర్కట రేఖ చివర అడుగుపెట్టే రాష్ట్రం)
2) రాజస్థాన్ (కర్కట రేఖ అతి తక్కువ దూరం ప్రయాణించే రాష్ట్రం)
3) మధ్యప్రదేశ్ (కర్కట రేఖ అత్యంత ఎక్కువ దూరం ప్రయాణించే రాష్ట్రం)
4) ఛత్తీస్‌గఢ్
5) జార్ఖండ్
6) పశ్చిమ బెంగాల్
7) త్రిపుర
8) మిజోరం (కర్కట రేఖ మొదటి ప్రవేశించే రాష్ట్రం)
కర్కట రేఖకు సమీపంగా ఉన్న రాజధానులు
1) గాంధీనగర్ (గుజరాత్)
2) భోపాల్ (మధ్య్రపదేశ్)
3) రాంచీ (జార్ఖండ్)
4) ఐజ్వాల్ (మిజోరం)
5) అగర్తలా (త్రిపుర)
కర్కట రేఖకు దగ్గరగా ఉన్న పట్టణాలు
1) అహ్మదాబాద్ (గుజరాత్)
2) ఉజ్జయిని (మధ్యప్రదేశ్)
3) భోపాల్ (మధ్యప్రదేశ్)
4) జబల్పూర్ (మధ్యప్రదేశ్)
5) హుగ్లీ (పశ్చిమబెంగాల్)
కర్కటరేఖకు సమీపంగా వెళుతున్న నదులు
1) గుజరాత్ – సబర్మతి, మహి
2) రాజస్థాన్ -మహి
3) మధ్యప్రదేశ్ – చంబల్, బెట్వా, కెన్, సోన్
4) జార్ఖండ్ – దామోదర్
5) పశ్చిమ బెంగాల్- దామోదర్, హుగ్లీ
కర్కట రేఖకు సమీపంగా ఉన్న జీవవైవిధ్య ప్రాంతాలు
1) గుజరాత్- రాణ్ ఆఫ్ కచ్ బయో రిజర్వ్
2) మధ్యప్రదేశ్- వనవిహార్, కన్హా , బాంధవ్‌ఘర్ నేషనల్ పార్కులు
3) జార్ఖండ్- పలమావు టైగర్ రిజర్వ్
4) మిజోరం- ముర్లేన్ నేషనల్ పార్క్
5) ఛత్తీస్‌గఢ్- సంజయ్ నేషనల్ పార్క్
కర్కటరేఖకు సమీపంగా ఉన్న కొండలు
- మధ్యప్రదేశ్- సాంచీ కొండలు, బానేరు శ్రేణులు
- జార్ఖండ్- మైలాన్ కొండలు
- ఛత్తీస్‌గఢ్- నేబర్హట్ శిఖరం
- మహినది కర్కట రేఖను 2 సార్లు ఖండిస్తుంది. ఒకసారి మధ్య ప్రదేశ్‌లో మరోసారి గుజరాత్లో
- దామోదర్ నది కర్కట రేఖకు సమీపంగా, సమాంతరంగా ప్రవహిస్తుంది.
- బెట్వా నదిపై ఉన్న హలాలి రిజర్వాయర్, సుబర్న రేఖ మీదగల బెటాల్ సూడ్ రిజర్వాయర్ల మీదుగా కర్కట రేఖ వెళుతుంది.
- మిజోరంలోని వాంటాంగ్ జలపాతం, జార్ఖండ్ లోని ఘాగ్రి జలపాతాలు కర్కట రేఖకు దగ్గరగా ఉన్నాయి.
- మధ్యప్రదేశ్‌లోని ఉమారియా, విదిశ నగరాలు, గుజరాత్‌లోని మొదస నగరం కర్కట రేఖ మీదనే ఉంటాయి.
భారతదేశ ప్రామాణిక రేఖాంశం
- 0O రేఖాంశాన్ని గ్రీన్విచ్ (Greenwich) లేదా ప్రామాణిక రేఖాంశం అంటారు.
- భారతదేశ ప్రామాణిక సమయ రేఖగా 821/2O తూర్పు రేఖాంశాన్ని ఎంచుకోవడం జరిగింది. 821/2O ప్రకారం భారత ప్రామాణిక సమయం లండన్ ప్రామాణిక సమయానికి 5 గంటల 30 నిమిషాలు ముందు ఉంటుంది. అంటే లండన్‌లో ఉదయం 6 గంటలు అయితే భారత్‌లో 11.30 (ఉదయం) అవుతుంది.
- ఈ ప్రామాణిక సమయాన్ని మీర్జాపూర్ (ఉత్తరప్రదేశ్) జిల్లాలోని వింద్యాచల్ రైల్వేస్టేషన్ కు 3 కి.మీ. దూరంలో ఉన్న క్లాక్ టవర్‌పై ఆధారపడి నిర్ణయించారు.
- ఒక్కో రేఖాంశం దాటడానికి సూర్యకిరణాలకు పట్టే కాలం 4 నిమిషాలు. అరుణాచల్ ప్రదేశ్‌కి- గుజరాత్‌కి మధ్య ఉండే కాల వ్యత్యాసం 2 గంటలు (120 నిమిషాలు= 30 రేఖాంశాలు x 4 నిమిషాలు) అంటే అరుణాచల్ ప్రదేశ్‌లోని ‘కిరుబిట్’ వద్ద 8. P.M. సమయం ఉంటే గుజరాత్‌లోని ద్వారక వద్ద 6 P.M. సమయం ఉంటుంది.
- అరుణాచల్ ప్రదేశ్‌లో సూర్యుడు ఉదయించిన 2 గంటల తర్వాత గుజరాత్లో ఉదయిస్తాడు.
- భారతదేశం మొత్తానికి ఒకే సమయం సూచించారు.
- శ్రీలంక కూడా మనదేశ ప్రామాణిక రేఖాంశాన్ని అనుసరిస్తుంది.
- బంగ్లాదేశ్ ప్రామాణిక సమయం-90O తూర్పు రేఖాంశం
- నేపాల్ ప్రామాణిక సమయం-86O 20 తూర్పు రేఖాంశం
- పాకిస్థాన్ ప్రామాణిక సమయం-74O 22 తూర్పు రేఖాంశం
- 821/2O తూర్పు రేఖాంశం భారతదేశంలోని కింది 5 రాష్ర్టాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం ద్వారా వెళుతుంది.
అవి ఉత్తరం నుంచి దక్షిణానికి.
1) ఉత్తర ప్రదేశ్- మీర్జాపూర్, జాన్పూర్
2) మధ్యప్రదేశ్- జబల్పూర్, రేవా
3) ఛత్తీస్‌గఢ్- బైకుంఠాపూర్
4) ఒడిశా- కోరాపుట్
5) ఆంధ్రప్రదేశ్- కాకినాడ
6) పుదుచ్చేరి- యానాం
భారత ప్రామాణిక సమయాన్ని (IST) మొదట పరిచయం చేసిన సంవత్సరం 1947 సెప్టెంబర్ 1. దీనిని నిర్వహించింది న్యూఢిల్లీలోని ‘నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీ. ఈ సంస్థ భారతదేశానికి రెండు ప్రామాణిక కాలమానాలు ఉండాలని సూచించింది.
1) IST-1: 68O 7 నుంచి 89O52 తూర్పు మధ్య రేఖాంశాలు. ఇది భారతదేశంలో చాలా ప్రాంతాలకు వర్తిస్తుంది. ఇది రాణ్ ఆఫ్ కచ్ గుజరాత్ నుంచి కూచ్‌బిహార్ పశ్చిమబెంగాల్ వరకు.
2) IST -II: 89O52 తూర్పు నుంచి 97O 25 తూర్పు మధ్య రేఖాంశాలు. ఇది ఈశాన్య భారత్‌కు మాత్రమే వర్తించేది. ఇది కూచ్బిహా ర్ నుంచి మొత్తం 7 ఈశాన్య రాష్ర్టాలు
23 1/2O ఉత్తర అక్షాంశం (కర్కట రేఖ), 83 1/2O తూర్పు రేఖాంశం ఖండించుకునే ప్రాంతం ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని కొరియా జిల్లాలోని బైకుంఠాపురం.
ప్రపంచ కాల మండలాలు: ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్థానిక కాల మండలాల సంఖ్య 24
అత్యధికంగా స్థానిక కాల మండలాలున్న దేశాలు
1) ఫ్రాన్స్ – 12
2) రష్యా – 9 (2010లో 11 నుంచి 9కి తగ్గించారు)
3) అమెరికా- 11 (కానీ 4 కాలమండలాలు మాత్రమే వినియోగం)
భారతదేశ ప్రామాణిక రేఖాంశం
- రేఖాంశాన్ని గ్రీన్విచ్ (Greenwich) లేదా ప్రామాణిక రేఖాంశం అంటారు.
- భారతదేశ ప్రామాణిక సమయ రేఖగా 821/2O తూర్పు రేఖాంశాన్ని ఎంచుకోవడం జరిగింది. 821/2O ప్రకారం భారత ప్రామాణిక సమయం లండన్ ప్రామాణిక సమయానికి 5 గంటల 30 నిమిషాలు ముందు ఉంటుంది. అంటే లండన్‌లో ఉదయం 6 గంటలు అయితే భారత్‌లో 11.30 (ఉదయం) అవుతుంది.
ఈ ప్రామాణిక సమయాన్ని మీర్జాపూర్ (ఉత్తరప్రదేశ్) జిల్లాలోని వింద్యాచల్ రైల్వేస్టేషన్ కు 3 కి.మీ. దూరంలో ఉన్న క్లాక్ టవర్‌పై ఆధారపడి నిర్ణయించారు. - ఒక్కో రేఖాంశం దాటడానికి సూర్యకిరణాలకు పట్టే కాలం 4 నిమిషాలు. అరుణాచల్ ప్రదేశ్‌కి- గుజరాత్‌కి మధ్య ఉండే కాల వ్యత్యాసం 2 గంటలు (120 నిమిషాలు= 30 రేఖాంశాలు x 4 నిమిషాలు) అంటే అరుణాచల్ ప్రదేశ్‌లోని ‘కిరుబిట్’ వద్ద 8. P.M. సమయం ఉంటే గుజరాత్‌లోని ద్వారక వద్ద 6 P.M. సమయం ఉంటుంది.
- అరుణాచల్ ప్రదేశ్‌లో సూర్యుడు ఉదయించిన 2 గంటల తర్వాత గుజరాత్లో ఉదయిస్తాడు.
- భారతదేశం మొత్తానికి ఒకే సమయం సూచించారు.
- శ్రీలంక కూడా మనదేశ ప్రామాణిక రేఖాంశాన్ని అనుసరిస్తుంది.
- బంగ్లాదేశ్ ప్రామాణిక సమయం-90O తూర్పు రేఖాంశం
- నేపాల్ ప్రామాణిక సమయం-86O 20 తూర్పు రేఖాంశం
- పాకిస్థాన్ ప్రామాణిక సమయం-74O 22 తూర్పు రేఖాంశం
- 821/2O తూర్పు రేఖాంశం భారతదేశంలోని కింది 5 రాష్ర్టాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం ద్వారా వెళుతుంది. అవి ఉత్తరం నుంచి దక్షిణానికి.
ప్రాక్టీస్ బిట్స్..
1. కిందివాటిలో సరైన వాక్యాలను గుర్తించండి?
1) దామోదర్ నది కర్కట రేఖకు సమాంతరంగా ప్రవహిస్తుంది
2) కర్కట రేఖకు సమీపంగా ఉన్న కన్హా జీవవైవిధ్య సంరక్షణ ప్రాంతం జార్ఖండ్ రాష్ట్రంలో ఉంది
3) కర్కట రేఖకు దగ్గరగా ఉన్న దేవ్‌ఘర్ శిఖరం ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఉంది
ఎ) 1, 2 బి) 2, 3 సి) 1, 3 డి) అన్నీ సరైనవే
2. కర్కట రేఖ-భారత ప్రామాణిక కాలరేఖలు కింది ఏ ప్రాంతంలో ఖండించుకుంటాయి?
ఎ) జబల్పూర్ బి) రేనా
సి) యానాం డి) బైకుంఠాపురం
3. కర్కట రేఖ భారతదేశంలో ఎక్కువ దూరం ఏ రాష్ట్రం నుంచి ప్రయాణిస్తుంది?
ఎ) జార్ఖండ్ బి) మధ్యప్రదేశ్
సి) రాజస్థాన్ డి) ఛత్తీస్‌గఢ్
4. మహి నది ఏ అక్షాంశాన్ని రెండు సార్లు ఖండిస్తుంది?
ఎ) కర్కట రేఖ బి) మకర రేఖ
సి) భూమధ్య రేఖ డి) ఏదీకాదు
5. కింది వాటిలో సరైన జతను గుర్తించండి?
ఎ) 6045 ఉత్తర అక్షాంశం – గ్రేట్ నికోబార్ దీవి
బి) దక్షిణకొనకు ఉన్న ప్రాంతం- ద్వీపు కనుమ
సి) ఉత్తర కొనకు ఉన్న ప్రాంతం- ఇందిరాపాయింట్
డి) పశ్చిమ కొనకు ఉన్న ప్రాంతం- ఇందిరాకాల్
6. ప్రపంచ ప్రామాణిక రేఖాంశం ఏ దేశం గుండా వెళుతుంది?
ఎ) భారతదేశం బి) శ్రీలంక
సి) ఫ్రాన్స్ డి) ఇంగ్లండ్
7. ఒక్కొక్క రేఖాంశాన్ని దాటడానికి సూర్యకిరణాలకు పట్టే కాలం ఎంత?
ఎ) 8 నిమిషాలు బి) 4 నిమిషాలు
సి) 12 నిమిషాలు డి) ఏదీకాదు
8. భారత ప్రామాణిక సమయాన్ని (ఐఎస్టీ) మొదటగా పరిచయం చేసిన సంవత్సరం?
ఎ) 1947 సెప్టెంబర్ 1
బి) 1948 సెప్టెంబర్ 1
సి) 1946 సెప్టెంబర్ 1
డి) 1945 సెప్టెంబర్ 1
9. బంగ్లాదేశ్ ప్రామాణిక సమయాన్ని ఏ రేఖాంశంపై గణిస్తారు?
ఎ) 821/2O తూర్పు రేఖాంశం
బి) 90O తూర్పురేఖాంశం
సి) 861/2O తూర్పురేఖాంశం
డి) 70O తూర్పు రేఖాంశం
10. ప్రపంచంలో అత్యధిక కాలమండలాలను (12) కలిగిన దేశం ఏది?
ఎ) అమెరికా బి) రష్యా
సి) ప్రాన్స్ డి) ఏదీకాదు
11. భారతదేశంలో మొట్టమొదట సూర్చుడు అరుణాచల్ ప్రదేశ్‌లో ఉదయించిన ఎన్ని గంటల తర్వాత గుజరాత్లో ఉదయిస్తాడు?
ఎ) 1 గంట 56 నిమిషాలు
బి) 1 గంట 52 నిమిషాలు
సి) 1 గంట 48 నిమిషాలు
డి) 1 గంట 44 నిమిషాలు
12. భారతదేశం, బంగ్లాదేశ్‌ల మధ్య కాలవ్యత్యాసం పరంగా సరైనవి గుర్తించండి?
1) నిమిషాలు బంగ్లాదేశ్ వెనుక ఉంటుంది
2) నిమిషాలు భారత్ వెనుక ఉంటుంది.
3) 30 నిమిషాలు బంగ్లాదేశ్ ముందు ఉంటుంది
4) నిమిషాలు భారత్ ముందు ఉంటుంది
ఎ) 1, 3 బి) 4, 2
సి) 1, 2 డి) 2, 3
13. 821/20 తూర్పు రేఖాంశం కింది ఏ ప్రాంతం గుండా వెళ్లదు?
ఎ) జైపూర్ బి) హైదరాబాద్
సి) గాంధీనగర్ డి) బెంగళూరు
14. కిందివాటిలో ఏ రాష్ట్ర రాజధాని భారత ప్రామాణిక కాలరేఖ గుండా పోతుంది?
ఎ) జైపూర్ బి) హైదరాబాద్
సి) గాంధీనగర్ డి) బెంగళూరు
15. అక్షాంశాల పరంగా భారతదేశం ఏ అర్ధగోళంలో విస్తరించి ఉంది?
ఎ) ఉత్తరార్ధగోళం
బి) తూర్పు అర్ధగోళం
సి) పశ్చిమార్ధగోళం
డి) దక్షిణార్ధగోళం
సమాధానాలు
1.సి 2.డి 3.బి 4. ఎ 5.ఎ 6.డి 7. బి 8. ఎ 9.సి 10. సి 11.ఎ 12.డి 13. సి 14.సి 15.ఎ
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు