Sculpture in Telangana | తెలంగాణలో శిల్పం
శిల్పశాస్త్ర స్థపతులు – శిల్పాచార్యులు
-చరిత్రను శోధిస్తే ఎంతోమంది స్థపతులు ఉన్నారు. కానీ కొందరు మాత్రమే చరిత్రలో నిలబడగల్గుతారు. శిల్ప పుట్టుక వేదకాలం నాడే పూర్తిగా అధర్వణ వేదంలోనిదని చెప్పారు. యుగాలుగా శిల్ప పోషణ బాగా ఉన్నదనే దాఖలాలు ఉన్నాయి. కాలగర్భంలో కలిసి కనపడని ఎన్నో శిల్పాలు ఉన్నాయి. కొన్ని మహాశిల్పాలు ముష్కరుల దాడికి ధ్వంసమయ్యాయి. అయితే ప్రాచీన ఝరాసంగ శిల్పి కీ.శే. రంగాచార్యులు, మరికొందరు పెద్దల అభిప్రాయం ప్రకారం మహా రుషి శ్రీ వేదవ్యాసుడు దీన్ని స్థాపత్యవేదంగా చేశారు.
-శ్లో. శిల్పం శిల్పం హాస్మిన్నధి గమ్యతే, య పెమ వేదయదేవ శిల్పాని ఆత్మ సంస్కృతిర్వాన శిల్పాని చందోమయం వాపత్యైజగమాన ఆత్మోనం సంస్కృతే॥
-స్థపతుల (స్థపతి)కు అవేద జ్ఞానం అంటే అవిద్య సంబంధ స్వరం చాలా అవసరంగా ఉన్నదని స్పష్టంగా తెలుస్తున్నది. ప్రత్యేకంగా శిల్ప గ్రంథంలో అనేక ప్రమాణాలున్నాయి. ఈ విశాల జగంలో 1. ఆకాశం, 2. వాయువు, 3. అగ్ని, 4. జలం, 5. భూమి (పంచభూతాలు) అన్నీ రూప సంబంధమేనని శ్రుతుతు ఉపనిషత్తులు, పురుషసూక్తము కూడా చెప్పింది. శిల్పాచార్యునికి, స్థపతికి ముఖ్యంగా ఒక నియమ పద్ధతిని కూడా సూచించింది. శిల్పి హృదయం జ్ఞానరస ప్రపూర్ణం. ప్రాచీన మూడు యుగాల్లోనూ, యజ్ఞానికి శిల్పమే మూలం. అటువంటి యజ్ఞ వస్తువులన్నీ శిల్పులే చేయాలి. పూర్వం అలాగే ఉండేదని, ఇది సృష్టికర్మ సిద్ధాంతం అని చెబుతున్నారు.
నానార్థ భాజం వాచగ్ం శిల్ప విచిత్ర సందరామత కరోత్- శిల్పోపనిషత్తు
-సర్వం రకరకాలుగా, సుందరంగా ఉన్నది చిత్ర విచిత్ర శిల్పాలతో. రూపేణైవ ధాయన్తే తద్దేవమ్ రూపము చేతనే అభీష్ట దేవతను ధ్యానం చేస్తారు. రూప శిల్పంలో, ధ్యానంలో సులభంగా చేసి తరించవచ్చు. శిల్పకర్మ కలాదికమ్ అనే నిఘంటువు నందు కర్మేతి హస్తయే: అని ఉపనిషత్తు. దాని గురించి చేతులతో కర్మ చేయడమేనని స్పష్టంగా చెప్పబడింది. 1. సానగ, 2. సనాతన, 3. అహబూనస, 4. ప్రత్నస, 5. సుపర్నసయనే (ఆది విశ్వకర్మ) నుంచి పుట్టిన సర్వకళా నిపుణులైన ఆదిపంచ రుషులు.
మహాభారతంలో శిల్పం
-సంస్కృతంలో వేదవ్యాసుడు రాసిన మహాభారతంలో తెలుగులో నన్నయ కవి రాసిన పద్యాన్ని గమనించండి..
కం. ఆ విశ్వకర్మ నిర్మిత
దేవ విమానుండు నిఖల దివ్యాభరణ
శ్రీవిరచన చిత్రపరితోషిత
దేవుడు శిల్ప ప్రజాపత నైనెడగెన్॥
ఆదిపర్వం (భారతం)
-మయుడు (మయబ్రహ్మ) రావణబ్రహ్మ లంకను సృష్టించాడు. భారతమందు మయసభను సృష్టించాడు. విష్ణువుకు విష్ణుచక్రం, శివుడికి త్రిశూలం, ఇంద్రునకు వజ్రాయుధం, సప్త రుషులకు యజనాది షట్కర్కాధికారం ఇచ్చెనని.. ప్రాకృత (బ్రాహ్మీ) సంస్కృత వైవస్వత పురాణంలో ఉన్నది.
-శరభాచార్యుని శిల్పస్తుతిలోనూ మరొక కందపద్యం.
కం. మయ దివ్య సూత్ర దారుని
మయ మాయా, మయ జయప్రమాణ గ్రంథ
ద్వయ మిపుడెక్కడ ఖాండవ
భయ దాగ్నికి నాడే బూది పండ్లయి పోయెన్.
-వరామిహిరుడు చెప్పిన వజ్రవేప యోగం ప్రముఖ జ్యోతిష శాస్త్రకారుడు, వరాహమిహిరుడు తన బృహత్సంహితలో మయమతమందు వజ్రలేప అనే యోగం ఉంటుందని చెప్పాడు. 11వ శతాబ్దంలో విరివిగా తెలంగాణ ప్రాంతంలో ఉండేదని పరిశోధకులు చెబుతున్నారు. కశ్యపుడు కూడా శిల్పియేనని కొందరి అభిప్రాయం. ఆయన తపస్సు చేసిన చోటే నేటి కశ్మీర్ ప్రాంతమని అన్నారు.
దేవా(ళం)లయ ఏర్పాటుకు కొన్ని ఆకార సూచనలు
-1. పాఠాలు – పాఠ శిలలు, 2. పిక్కలు పై భాగం = రాళ్ల సౌందర్యం, 3. నడుమును మేఖల వలెను, 4. అపానములు = సోమసూత్రము, 5. చేతులు = కర్మశక్తి, 6. బాహువులు = స్తంభాలు, 7. ప్రాణం = దీపం, 8. కాంతి = భక్షువు, 9. ఘంట = నాలుక, 10. నాభి = బ్రహ్మ, 11. పాదాచారం = అహంకారము, 12. ముక్కు = శుకనాశనం, 13. చెవి = గవాక్షం, 14. కంఠం = అమల సారికం, 15. తల = కలశం. విగ్రహారాధన రుగ్వేద కాలంలో ఉందని చారిత్రకాంశం.
శివలింగం (శిల్పరత్న శాస్త్రం)
శ్లో. తుర్యస్రేష్టాస్రకే వృత్తే బ్రహ్మ విష్ణుః శివః క్రమాత్
దేవతాః సర్వలింగే ఘ త్రభండేఘ విశేషతః॥
తా. లింగమునందు 3 భాగాల్లో 1వ భాగం – బ్రహ్మ అంశము, 2వ భాగం – విష్ణు (అంశ)వంశము, 3వ భాగం – శివ (అంశ)వంశము. బ్రహ్మ – చతురస్రం, విష్ణు – అష్టాస్రం, శివుడు – గుండ్రని ఆకారం. 4, 8, 16, 32, 64 కోణములు గలది. 4 కోణాలు = బ్రహ్మ, ఇది పాఠశాల. 8 కోణాలు = విష్ణు (పాన(వ)మట్టం), శివునికి గుండ్రని ఆకారం.
శిల్ప సంపదలోని సర్వధాతువులైన వస్తువులు
-పలు విధాలుగా సర్వ వస్తువులు యంత్ర-బంగారం, వెండి, రాగి గృహ పరికరాలు మొదలైనవన్నీ ప్రాచీన శాస్త్ర సృష్టిగా తెలుస్తున్నది. చిత్రశిల్ప చతురత కలిగి ఉన్నది. 1. రూప భేదం, 2. పరస్పర భేదం, 3. పశు, పక్షి, క్రిమి, కీటకాది తిర్యక్ భేదాలు, 4. పర్వత భేదం, 5. వృక్షలత పర్వతారణ్యాలు, 6. మనుషుల్లో రాజు మహావీరుడు, యోగి, పతివ్రత మొదలైన ఆకార భేదములను నిర్ణయించడమైనది. అంతేగాక 1. ఉత్తమాంగుళం, 2. దేవాంగుళం, 3. పూర్ణాంగుళం, 4. శిల్పాంగుళం, 5. సర్వాంగుళం, 6. మానాంగుళం, 7. ఆదిమాంగుళంగా శిల్ప కొలతలు, పుట్టుక ఉన్నది.
శిల్ప లక్షణాలు
-మయ మతాగమంను అనుసరించి ఆచార్య విశ్వకర్మచే ఆది బ్రహ్మ కులోద్భవః అనడం ఎంతో గొప్ప అర్థంలో శిల్పి కర్తవ్యాన్ని తెలిపాడు. యముడు శిల్పశాస్త్రమునందు చెప్పినప్పటికినీ, ఆగమాచార్యులకు ఎంతో అవసరం. ప్రాచీనకాలంలో తెలంగాణలోని శిల్పులు ఇతర రాష్ర్టాల్లో స్థిరపడ్డారు. స్థపతుల చరిత్రను తీసుకుంటే తెలంగాణలో పేరు ప్రఖ్యాతులు లేని మహాస్థపతులు (శిల్పులు) ఎందరో ఉన్ననూ, వీరంపుడనే మహా శిల్పి చరిత్ర ఆమోఘం, అద్వితీయం. అలాగే లింగాచార్యులు కూడా. మనకు రామప్ప-జక్కన్నలే కాదు ఎంతో మంది మహా శిల్పులు-స్థపతులు, విరాట్ విశ్వకర్మ వారసులు కనిపిస్తారు. తెలంగాణ ప్రాచీనుల్లో రుషికేశ్, బద్రీనాథ్లలో స్థిరపడిన వర్దన్న స్వామి కూడా గొప్ప శిల్ప (స్థపతి)కారుడు. శిల్పానికి శిల్ప వాస్తు ఆలయాలు తెలంగాణలో ఉన్నాయి. వాటిలో ఝరాసంగం-వరదరాజుస్వామి, రామప్ప దేవాలయం, కూచనపల్లి నందికంది సిద్దేశ్వరాలయం మొదలైనవి ఎన్నో ఉన్నాయి. 1. 750 ఏండ్ల నుంచి 1000 ఏండ్ల వరకు ఉత్తమం, 2. 500 ఏండ్ల నుంచి 750 ఏండ్ల వరకు మధ్యమం, 3. 250 ఏండ్ల నుంచి 500 ఏండ్ల వరకు అధమం. క్రీ.పూ. నిర్మించినవి కూడా కొన్ని మన తెలంగాణలో ఉన్నాయన్నది చారిత్రకాంశం. 1. స్థపతి, 2. తక్షకి, 3. వర్ధకి, 4. సూత్రగ్రాహి ఇలా ఎంతో మంది చరిత్ర గర్భంలో ఉన్నారు. వరంగల్, ఝరాసంగం, కాళేశ్వరం, ఇతర ప్రాంతాల్లో పూర్తి నలుపు అతిలేతపచ్చ (ఆకు రంగు), నలుపు, నీలము (అతిలేత నీలి రంగు) ఏడు రకాల శిల్ప బండలు రాళ్లు నేడు లభ్యమవుతున్నాయి.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు