Do not compromise in education | చదువులో రాజీపడొద్దు..!
చదవడం ఎప్పుడు మొదలుపెట్టినా మైండ్ దాన్ని తనకున్న సామర్థ్యం మేరకు అర్థం చేసుకొని రికార్డ్ చేసుకుంటూనే ఉంటుంది. అయితే చదివే విషయంపై మీకు ఉన్న ప్రయోజకత్వాన్ని బట్టి ఆయా విషయాలు మీకు దీర్ఘకాలిక విభాగంలో చోటు చేసుకుంటాయి. తాత్కాలికంగా చదివిన వార్తను అవసరం తీరిపోయిన తర్వాత మర్చిపోతాం. అలా పాఠాల విషయంలో జరగకూడదంటే వార్తలు చదివినట్లుగా పాఠాలను చదవద్దు. విద్యార్థిగా ఉంటున్న ప్రతి వ్యక్తీ తన ముఖ్యమైన విధిని మర్చిపోకూడదు. చదవడం తన ముఖ్య ప్రవృత్తిగా గుర్తించాలి. చదివే విషయంలో ఏ దశలోనూ రాజీపడకూడదు. ఒక రోజులో చదవడానికి మీరు కేటాయించే సమయం చాలా తక్కువే అయి ఉండవచ్చు. కానీ ఆ స్వల్ప కాలం మీరు చదవాల్సిన సరైన రీతిలో చదువును కొనసాగించాలి. అక్కడ రాజీ ప్రసక్తే ఉండకూడదు. అర్థం కాకపోతే మరోసారి చదవవచ్చులే అని అనుకోకూడదు. అస్పష్టంగా ఉన్న పేరాగ్రాఫ్లను వదిలిపెట్టి ముందుకుపోకూడదు. ఎందుకంటే మీకు అర్థం కాకుండాపోయిన అతి కీలకమైన సాంకేతిక అంశాన్నే ఆధారంగా చేసుకొని మీ తదుపరి పాఠం ఉంటుంది. మీరు చదువుకుంటున్నది ఒక విజ్ఞానశాస్త్రం.
ఎన్నో శతాబ్దాలుగా ఆ శాఖలో ఎంతోమంది మేధావులు, శాస్త్రజ్ఞులు అధ్యయనం చేసి పొందుపర్చిన విషయాలు క్రోడీకరించి ఉంటాయి. కాబట్టి ఆ విజ్ఞానశాస్త్రం అభివృద్ధి క్రమంలో పరిణామ స్వభావాన్ని మీరు స్పష్టంగా అర్థం చేసుకొని తీరాల్సిందే. ఈ విజ్ఞానం ఆ సబ్జెక్టులో మీకు ఉన్న ఉత్సాహాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడమే కాక, మీరు మాస్టర్స్ డిగ్రీ చేసే సమయానికి, ఆ విజ్ఞానశాస్త్రంలో మీరు కూడా మరింత అధ్యయన దృక్పథాన్ని అలవర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి అస్పష్టతను స్పష్టం చేసుకోవడానికి ఎప్పుడూ వెనుకడుగు వేయరాదు. మొదటిసారి చదివేటప్పుడు పూర్తి అర్థమయ్యేలా చదవాలి. ఒక పద్ధతి ప్రకారం వ్యవస్థీకృత విధానం ప్రకారం చదవండి. చదివే ప్రతిసారి ముందుగా మానసికంగా బాగా ప్రిపేర్ కావాలి. శారీరకంగా, మానసికంగా మీరు సమాయత్తం కాకుండా పాఠ్యాంశం తిరగేస్తే రోజూ చదివే వార్త పత్రికలోని వార్తలను ఆ సాయంత్రానికే మర్చిపోయినట్లుగా పాఠాలను కూడా మర్చిపోతాం. మనసుకు హత్తుకునే అంశాలు మాత్రమే మరికొద్ది కాలం పాటు గుర్తుంటాయి. వైజ్ఞానిక శాస్త్రీయ అంశాలను స్పృశించే మీ పాఠ్యాంశాల్లో మీ అభిరుచులకు తగిన అంశాలు ఉండే అవకాశమే లేదు. కాబట్టి సరైన మనోస్థితి లేకుండా పాఠాలను చదవవద్దు. చదవటం మీ మానసిక ప్రమేయం ఉండి తీర్సాలిన చర్య ఉదాసీనంగా చేసుకుంటూ పోయే పనికాదు. చదివింది కాస్తయినా అది పూర్తిగా నూటికి నూరు శాతం మీకు బోధపడేలా ఉండాలి.
శృతి చేయండి
టెక్ట్స్ పుస్తకాలను చదివేటప్పుడు ప్రతిసారి కొన్ని నిమిషాల పాటు సంబంధిత పాఠ్యాంశాల్లో మీకు ఉన్న పూర్వపు జ్ఞానాన్ని తలుచుకోండి. మీ గత తరగతుల్లో ఏయే అంశాలను మీరు నేర్చుకొని ఉన్నారో గుర్తు తెచ్చుకోండి. మీ గత తరగతుల్లో ఏయే అంశాలను మీరు నేర్చుకొని ఉన్నారో గుర్తుకు తెచ్చుకోండి. ఉదాహరణకు మీరు బయాలజీలో అంటువ్యాధుల గురించి చదవుతున్నారనుకుందాం. ఈ అధ్యాయాన్ని చదివే ముందు అంటువ్యాధుల పట్ల అంతకుముందు మీరు నేర్చుకున్న అంశాలేమిటో గుర్తుకు తెచ్చుకోండి. అసలు వేటిని అంటువ్యాధులని అంటారో, అవి ఎలా ప్రబలుతాయో ఏయే క్రిముల వల్ల అంటువ్యాధులు ఏర్పడుతాయో గుర్తుకు తెచ్చుకోండి. ఇప్పుడు మీరు చదవబోయే పాఠం ఆయా అంశాలకు సీరియల్ పాఠం అని భావించండి. అంటువ్యాధుల గురించి మరింత లోతైన సమాచారం మీకందివ్వడం కోసమే ఈ తరగతిలో కూడా ఈ అధ్యయనం చేర్చబడిందని తెలుసుకోండి.
సదరు పాఠ్యాంశానికి సంబంధించిన పూర్వపు జ్ఞానం లేకపోతే ఈ లోతైన విషయాలు బోధపడవు. సాంఘిక శాస్త్రంలో కూడా ఇదే ధోరణి మీ పాఠ్యాంశాల్లో కనిపిస్తుంది. మీ కింది తరగతుల్లో మొదటి ప్రపంచ యుద్ధం గురించి తేలికగా వర్ణించబడి ఉండగా, ప్రస్తుతపు తరగతిలో ఆ యుద్ధానికి దారితీసిన పలు దేశాల సామాజిక, ఆర్థిక పరిస్థితులు, ఫాసిజం, నాటిజం, ఇంపీరియరిజం, కమ్యూనిజం వంటి పలు ఇజాలు, వాటి ఆవిర్భావం గురించి వివరించడం జరుగుతుంది. వీటిని అవగాహన చేసుకోవాలంటే ఈ వారం సీరియల్ ఎపిసోడ్ చూసేముందు పోయిన వారం జరిగిందేమిటో గుర్తుకు తెచ్చుకున్నట్లే మానసిక విషయ పరిగ్రహణ శక్తిని శృతి చేయకతప్పదు. మీ మైండ్లో ఇంతకుముందే నిల్వ ఉన్న విజ్ఞానం మీకు తోడ్పడుతుంది. అదే సమయంలో కింది తరగతిలో మీరు సక్రమంగా అభ్యసనం చేసుకోకపోయి ఉన్నట్లయితే ఆ లోపం మీకు స్పష్టంగా తెలిసిపోతుంది. వెంటనే మీరు సంబంధిత ఉపాధ్యాయులను సంప్రదించి మీ సందేహాలను నివృత్తి పర్చుకోవాల్సి ఉంటుంది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?