భారతీయ అణు పరిశోధనా పితామహుడు ఎవరు?
జనరల్ సైన్స్
1. వరి విత్తనాలు విత్తేందుకు డ్రోన్ ను ఉపయోగించడం ద్వారా సాగు వ్యయాన్ని తగ్గించుకోవచ్చని గుర్తించిన విశ్వవిద్యాలయం?
1) ఆచార్య ఎన్ జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం-గుంటూరు
2) పంజాబ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ- లూథియానా
3) ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ- హైదరాబాద్
4) బిశ్రా అగ్రికల్చర్ యూనివర్సిటీ- రాంచీ
2. కింది వాటిలో రుస్తుం-2కు సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించండి?
1) దేశీయ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన మానవ రహిత డ్రోన్ యుద్ధ విమానం
2) ఇది గంటకు 200 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది
3) ప్రస్తుతం వినియోగిస్తున్న ఇజ్రాయెల్ ఇరాన్ డ్రోన్లకు రుస్తుం-2 ప్రత్యామ్నయం
4) ఓషనోగ్రఫిక్ సర్వేలు చేపట్టే అత్యాధునిక విమానం
3. దేశీయ పరిజ్ఞానంతో రూపొందించిన దీర్ఘశ్రేణి సబ్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి?
1) నిర్భయ 2) మిషన్ శక్తి
3) అస్త్ర 4) రుద్రం-1
4. భారతదేశ మొట్టమొదటి డిస్ట్రాయర్ యుద్ధనౌకను ఇటీవల విశాఖపట్నం వద్ద ఉపసంహరించారు. అయితే అది ఏది?
1) అర్జున్ 2) రాజ్ పుత్
3) వేలా 4) సార్థక్
5. 2021 నాటికి కింది ఏ సూపర్ కంప్యూటర్ ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన కంప్యూటర్లలో అగ్రస్థానంలో నిలిచింది?
1) ఫుగాకు 2) సమిట్
3) సన్ వే తైలైట్ 4) ఇంట్రిఫిడ్
6. కింది వాటిలో వేటిని బయోమెట్రిక్ కింద ధ్రువీకరిస్తారు?
1)చేతి ఆకారం 2) నడక
3) డీఎన్ ఏ రక్తం 4) పైవన్నీ
7. అంతరిక్ష సంస్థ స్పేస్ ఎక్స్, ట్రాన్స్పోర్టర్ -2 మిషన్ లో భాగంగా ఒకేసారి ఎన్ని ఉపగ్రహాలను రోదసిలోకి పంపింది?
1) 106 2) 95 3) 50 4) 88
8. పీఎస్ఎల్ వీ సీ-51కు సంబంధించి సరైంది ఏది?
1) దీన్ని 2021 ఫిబ్రవరి 28న షార్ నుంచి ప్రయోగించారు
2) దీని ద్వారా 19 ఉపగ్రహాలను ఒకేసారి కక్ష్యలోకి ప్రవేశపెట్టారు
3) ఇది భగవద్గీతను తీసుకెళ్లింది
4) పైవన్నీ
9. కిందివారి అంతరిక్షంలోకి వెళ్లిన భారత సంతతి వ్యోమగామికి సంబంధించి సరైనది ఏది?
1) కల్పనాచావ్లా
2) సునీతా విలియమ్స్
3) బండ్ల శిరీష 4) పై అందరూ
10. అంగారక గ్రహంపై పరిశోధనకు ‘ఇన్ సైట్ ’ను ప్రయోగించింది?
1) నాసా 2) ఇస్రో
3) సూపర్ 4) రాస్ కాస్మోస్
11. మనదేశంలో మొదటి సౌండింగ్ రాకెట్ ను ఎక్కడి నుంచి ప్రయోగించారు?
1) శ్రీహరికోట (1989)
2) బెంగళూర్ (1977)
3) తుంబా (1963) 4) ఏదీకాదు
12. ప్రపంచంలో మొట్టమొదటి 3డీ-ప్రింటెడ్ గుండెను మానవ కణాల ఆధారంగా తయారు చేసిన దేశం?
1) ఇజ్రాయెల్ 2) అమెరికా
3) జపాన్ 4) ఇండియా
13. సతీష్ ధావన్ సెంటర్ పేరుతో ఇస్రో నూతన కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది?
1) జమ్మూ 2) మచిలీపట్నం
3) రాంచీ 4) ఫరీదాబాద్
14. మొదటిసారిగా విజయం సాధించిన పీఎస్ఎల్ వీ వాహక నౌక ఏది?
1) పీఎస్ఎల్ వీ-సి3
2) పీఎస్ఎల్ వీ-డి2
3) పీఎస్ఎల్ వీ-సి4
4) పీఎస్ఎల్ వీ-డి4
15. జీఎస్ఎల్ వీ (జియోస్టేషనరి శాటిలైట్ లాంచ్ వెహికల్ ) ఎంత బరువు గల ఉపగ్రహాన్ని తీసుకెళ్లగలుగుతుంది?
1) 1000 కేజీ 2) 2500 కేజీ
3) 5000 కేజీ 4) 10,000 కేజీ
16. క్రయోజనిక్ ఇంజిన్ లను భారతదేశానికి ఎగుమతి చేస్తున్న దేశం ఏది?
1) అమెరికా 2) ఫ్రాన్స్
3) బ్రిటన్ 4) రష్యా
17. క్రయోజెనిక్ ఇంజిన్ లో ఇంధనాన్ని ఏ ఉష్ణోగ్రతల వద్ద ఉంచుతారు?
1) 00C 2) 1000C
3) -2000C 4) -3600C
18. క్రయోజనిక్ ఇంజిన్ లో వాడే ఇంధనం ఏది?
1) నాఫ్తా 2) యురేనియం
3) ఫ్లుటోనియం
4) ద్రవ ఆక్సిజన్ , ద్రవ హైడ్రోజన్
19. ఇండియన్ అటామిక్ ఎనర్జీ కమిషన్ ను ఎప్పుడు ఏర్పాటు చేశారు?
1) 1940 2) 1948
3) 1961 4) 1981
20. భారతీయ అణు పరిశోధనా పితామడు ఎవరు?
1) విక్రమ్ సారాభాయ్
2) అబ్దుల్ కలాం
3) హోమిభాభా 4) టెస్సీ థామస్
21. బార్క్ (BARC)ను ఎప్పుడు ఏర్పాటు చేశారు?
1) 1950 2) 1980
3) 1954 4) 1948
22. బార్క్‌లో అతిపెద్ద రిసెర్చ్ రియాక్టర్ ఏది?
1) పూర్ణిమ 2) జిర్లినా
3) ధ్రువ 4) సైరస్
23. 1969లో ఏ రియాక్టర్ క్రిటికాలిటీ పొందడంతో మనదేశంలో అణు విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం అయింది?
1) తారాపూర్ (TAPS)
2) మద్రాస్ (MAPS)
3) నరోరా (NAPS)
4) రావత్ భట్ (RVBJ)
24. భారతదేశంలో తొలిసారిగా అణు పరీక్షలను ఎప్పుడు జరిపారు?
1) 1969 2) 1974
3) 1998 4) 1948
25. దేశంలో స్థాపించిన మొదటి అణు విద్యుత్ కేంద్రం ఎక్కడ ఉంది?
1) తారాపూర్ 2) బొంబాయి
3) నరోరా 4) మద్రాస్
26. 2022 జనవరి నాటికి భారతదేశంలో గల మొత్తం న్యూక్లియర్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఎంత?
1) 6,280 మెగావాట్లు
2) 8,780 మెగావాట్లు
3) 7,480 మెగావాట్లు
4) 5,780 మెగావాట్లు
27. యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (UCIL) ఎక్కడ ఉన్నది?
1) జాదూగూడ (జారండ్ )
2) హైదరాబాద్
3) మద్రాస్ 4) బెంగళూర్
28. గగనతలం నుంచి ప్రయోగించ గల బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణిని అభివృద్ధి చేసేందుకు ఏయే దేశాల మధ్య ఒప్పందం కుదిరింది?
1) భారత్ – రష్యా
2) భారత్ – చైనా
3) చైనా- రష్యా
4) రష్యా- జపాన్
29. రష్యా సహకారంతో 1000 MW సామర్థ్యం గల రెండు అణు విద్యుత్ కేంద్రాలను ఎక్కడ నిర్మించారు?
1) కైగా (కర్ణాటక)
2) నరోరా (ఉత్తరప్రదేశ్ )
3) కూడంకులం (తమిళనాడు)
4) తారాపూర్ (మహారాష్ట్ర)
30. రాణా ప్రతాప్ సాగర్ అణు విద్యుత్ కేంద్రం నిర్మించిన ప్రదేశం ఏది?
1) కోట (రావత్ భట్ , రాజస్థాన్ )
2) కైగా (కర్ణాటక)
3) కూడంకుళం (తమిళనాడు)
4) హైదరాబాద్ (తెలంగాణ)
31. మనదేశపు మొట్టమొదటి భారజల ప్లాంటు ఎక్కడ ఉంది?
1) నంగల్ (పంజాబ్ )
2) మణుగూరు (తెలంగాణ)
3) కల్పకం (మద్రాస్)
4) భద్రావతి (కర్ణాటక)
32. ఫాస్ట్‌బ్రీడర్ టెస్ట్ రియాక్టర్ (PFBR) లో ఉపయోగించే ఇంధనం ఏది?
1) మిక్స్డ్ కార్బైడ్
2) మిక్స్డ్ ఆక్సైడ్ (ప్లుటోనియం ఆక్సైడ్ , యురేనియం ఆక్సైడ్ ) ఇంధనం
3) ప్లుటోనియం
4) యురేనియం
33. ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ (PFBR) లో ఉపయోగించే ఇంధనం ఏది?
1) మిక్స్డ్ కార్బైడ్
2) మిక్స్డ్ ఆక్సైడ్ ఇంధనం
3) ప్ల్లుటోనియం
4) యురేనియం
34. మొక్కల ప్రత్యుత్పత్తిలో రెండో పురుష సంయోగ బీజదం ద్వితీయ కేంద్రకంతో సంయోగం చెందిన తర్వాత ఏర్పడే నిర్మాణం, దాని కేంద్రక స్థితి తెలపండి?
1) అండాంతర: కణజాలం- 3n
2) సంయుక్త బీజం- 2n
3) పరిచ్ఛదం-2n
4) అంకురచ్ఛదం-3n
35. యాపిల్ లోని ఏ భాగాన్ని మనం ఆహారంగా తీసుకుంటాం?
1) అండాశయం 2) ఫలం
3) పుష్పాసనం 4) విత్తనం
36. చిక్కుడు గింజలు మాంసకృత్తులకు మంచి ఉదాహరణ. వాటిలో ముఖ్యంగా ఉండేవి?
1) సిట్రిక్ ఆమ్లం, మాలిక్ ఆమ్లం
2) సక్సినిక్ ఆమ్లం, సిట్రిక్ ఆమ్లం
3) సక్సినిక్ ఆమ్లం
4) మాలిక్ ఆమ్లం
37. మొక్కల్లో దారు కణజాలం దేనికి ఉపయోగపడుతుంది?
1) దృఢత్వాన్ని ఇవ్వడానికి
2) కిరణజన్య సంయోగక్రియకు
3) మొక్క వ్యాసార్థంగా పెరగడానికి
4) నీటి ప్రసరణకు
38. కింది ఏ కణాలు మొక్క భాగాలు వ్యాకోచం చెందడానికి ఉపయోగపడతాయి?
1) దృఢ కణజాలం
2) స్థూలకోణ కణజాలం
3) స్థిర కణజాలం
4) సంక్లిష్ట కణజాలం
39. ఒకటి కంటే ఎక్కువ అండాలను విడుదల చేసేటట్లు చేయడాన్ని సూపర్ ఓవ్యులేషన్ అంటారు. దీనికి ఉపయోగపడే హార్మోన్ ఏది?
1) సొమాటోట్రోపిన్ 2) వాసోప్రెసిన్
3) థైరాక్సిన్
4) సీరమ్ గొనాడోట్రోపిన్
40. వ్యవసాయ రంగంలో ఏ బ్యాక్టీరియాను జీవ కీటకనాశినిగా (బయో పెస్టిసైడ్ ) వాడుతున్నారు?
1) రైజోబియం
2) బాసిల్లస్ థురింజెనిసిస్
3) లాక్టోబాసిల్లస్
4) సూడోమోనాస్ ప్యుటిడా
41. కింది వాటిలో అధిక దిగుబడినిచ్చే టమాటా వంగడం ఏది?
1) అరుణ 2) బసంతి
3) షర్బతి సోనోరా 4) పుసాలాల్ మీరట్
సమాధానాలు
1. 3 2 4 3. 1 4. 2 5. 1 6. 4 7. 4 8. 4 9. 4 10. 1 11. 3 12. 2 13. 1 14. 2 15. 2 16. 4
17. 3 18. 4 19. 2 20. 3 21. 3 22. 3 23. 1 24.2 25. 1 26. 3 27. 1 28.1 29. 3 30. 1 31. 1 32. 1
33. 2 34. 4 35. 3 36.1 37. 4 38. 2 39. 4 40. 2 41. 4
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు