రాష్ట్రపతి ఎన్నికల్లో పార్లమెంటు సభ్యుని ఓటు విలువను ఎలా గణిస్తారు?
కేంద్ర ప్రభుత్వం కార్యనిర్వాహక వ్యవస్థ
1. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కింది వాటిలో సరైన రాజ్యాంగ వివరణను గుర్తించండి?
1) 5వ భాగం – ఆర్టికల్ 52 నుంచి 78- కేంద్ర కార్య నిర్వాహక వర్గం వివరణ
2) 5వ భాగం – ఆర్టికల్ 79నుంచి 122 – కేంద్ర శాసన వ్యవస్థ వివరణ
3) 5వ భాగం – ఆర్టికల్ 123 నుంచి 148 కేంద్ర న్యాయవ్యవస్థ వివరణ
4) 5వ భాగం – ఆర్టికల్ 124 నుంచి 147 – కేంద్ర న్యాయవ్యవస్థ వివరణ
ఎ) 1, 2, 3 సరైనవి బి) 1, 2, 4 సరైనవి
సి) 1, 3, 4 సరైనవి డి) 1, 2, 3, 4 సరైనవి
2. భారతదేశ పార్లమెంటరీ ప్రభుత్వ విధానానికి సంబంధించి సరైన జవాబును గుర్తించండి?
1) పార్లమెంటరీ విధానాన్ని బ్రిటన్ నుంచి గ్రహించారు
2) పార్లమెంటరీ విధానంలో దేశాధినేత నామమాత్రపు అధికారాలు కలిగి ఉంటారు
3) పార్లమెంటరీ విధానంలో ప్రభుత్వాధినేత వాస్తవ అధికారాలు కలిగి ఉంటారు
4) దిగువ సభ విశ్వాసం ఉన్నంత వరకు ప్రభుత్వం కొనసాగుతుంది
ఎ) 1, 2, 3, 4 సరైనవి
బి) 1, 2, 4 సరైనవి
సి) 1, 3, 4 సరైనవి డి) 1, 2, 3 సరైనవి
3. కేంద్ర కార్యనిర్వాహక వర్గంలో అంతర్భాగం కాని వారిని గుర్తించండి?
ఎ) రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి
బి) అటార్నీజనరల్ , అడ్వకేట్ జనరల్
సి) ప్రధాని నేతృత్వంలోని మంత్రి మండలి
డి) గవర్నర్
4. మనదేశ రాష్ట్రపతి పదవికి సంబంధించి సరైన జవాబును గుర్తించండి?
1) రాష్ట్రపతి పేరుమీదుగా దేశ పరిపాలనను నిర్వహించే విధానాన్ని అమెరికా నుంచి గ్రహించారు.
2) దేశం సర్వోన్నత కార్యనిర్వాహక అధిపతిగా రాష్ట్రపతి వ్యవహరిస్తారు
3) భారత రాష్ట్రపతి పదవిని ‘బ్రిటన్ రాజమకుటం’ పదవితో పోల్చవచ్చును
4) రాష్ట్రపతి దేశ ప్రథమపౌరుడు, సర్వసైన్యాధ్యక్షుడు, రాజ్యాంగ అధిపతిగా వ్యవహరిస్తారు
ఎ) 1, 2, 3, 4 సరైనవి
బి) 1, 2, 3 సరైనవి
సి) 1, 2, 4 సరైనవి డి) 1, 3, 4 సరైనవి
5, రాష్ట్రపతి పదవికి ఎన్నిక విధానం ఎలా ఉంటుంది?
ఎ) నైష్పత్తిక ప్రాతినిధ్య పరిమిత ఓటు బదిలీ విధానం ద్వారా రహస్య ఓటింగ్
బి) నైష్పత్తిక ప్రాతినిధ్య బళ ఓటు బదిలీ విధానం ద్వారా రహస్య ఓటింగ్
సి) నైష్పత్తిక ప్రాతినిధ్య ఏకఓటు బదిలీ విధానం ద్వారా రహస్య ఓటింగ్
డి) నైష్పత్తిక ప్రాతినిధ్య ఏకఓటు బదిలీ విధానం ద్వారా ప్రత్యక్ష ఓటింగ్
6. రాజ్యాంగంలో రాష్ట్రపతి పదవి గురించి ఎక్కడ వివరించారు?
ఎ) 5వ భాగం – ఆర్టికల్ 52 నుంచి 62 మధ్య
బి) 5వ భాగం – ఆర్టికల్ 54 నుంచి 63 మధ్య
సి) 5వ భాగం – ఆర్టికల్ 55 నుంచి 61 మధ్య
డి) 5వ భాగం – ఆర్టికల్ 51 నుంచి 60 మధ్య
7. రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి సరైన జవాబును గుర్తించండి?
1) రాష్ట్రపతి పదవికి ఎన్నికను కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది
2) రాష్ట్రపతి పదవికి పరోక్ష పద్ధతిలో ఎన్నిక జరుగుతుంది
3) ‘ఎలక్టోరల్ కాలేజ్ ’ సభ్యులు రాష్ట్రపతిని ఎన్నుకుంటారు
4) రాష్ట్రపతి పదవికి సంబంధించిన ఎన్నికల వివాదాలను పార్లమెంటు పరిష్కరిస్తుంది
ఎ) 1, 2, 3, 4 బి) 1, 3, 4
సి) 1, 2, 4 డి) 1, 2, 3
8. రాష్ట్రపతి పదవికి సంబంధించి వివిధ ఆర్టికల్స్‌లో పేర్కొన్న వివరణకు సంబంధించి తగిన జవాబును గుర్తించండి?
ఎ) ఆర్టికల్ 52 i) రాష్ట్రపతి ఎన్నిక
గురించి వివరిస్తుంది
బి) ఆర్టికల్ 53 ii) భారతదేశానికి ఒక
రాష్ట్రపతి ఉంటారు
సి) ఆర్టికల్ 54 iii) దేశ సర్వోన్నత
కార్యనిర్వాహణాధికారిగా
వ్యవహరించాలి
డి) ఆర్టికల్ 55 iv) రాష్ట్రపతి ఎన్నిక
విధానం గురించి
వివరిస్తుంది
ఎ) ఎ-iv, బి-ii, సి-i, డి-iii
బి) ఎ-i, బి-iv, సి-ii, డి-iii
సి) ఎ-ii, బి-iii, సి-i, డి-iv
డి) ఎ-iii, బి-ii, సి-i, డి-iv
9. రాష్ట్రపతిని ఎన్నుకునే ‘ఎలక్టోరల్ కాలేజ్ ’లో ఓటర్లుగా ఎవరుంటారు?
1) పార్లమెంటు ఉభయ సభల మొత్తం సభ్యులు
2) పార్లమెంటు ఉభయ సభలైన లోక్ సభ, రాజ్యసభలకు ఎన్నికైన సభ్యులు
3) రాష్ట్రల విధానసభలకు ఎన్నికైన ఎంఎల్ ఏలు
4) కేంద్ర పాలిత ప్రాంతాల విధాన సభలకు ఎన్నికైన ఎంఎల్ ఏలు
ఎ) 1, 2, 3 బి) 1, 3, 4
సి) 1, 2, 3, 4 డి) 2, 3, 4
10. పాండిచ్చేరి ఢిల్లీ విధానసభలకు ఎన్నికైన ఎమ్మెల్యేలకు రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజ్ లో ఓటర్లుగా ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా అవకాశం కల్పించారు?
ఎ) 52వ రాజ్యాంగ సవరణ చట్టం 1985
బి) 61వ రాజ్యాంగ సవరణ చట్టం 1988
సి) 70వ రాజ్యాంగ సవరణ చట్టం 1992
డి) 86వ రాజ్యాంగ సవరణ చట్టం 2002
11. రాష్ట్రపతిని ఎన్నుకునే ‘ఎలక్టోరల్ కాలేజ్ ’లో సభ్యులు కానిది ఎవరు?
1) రాష్ట్రాల విధాన పరిషత్ లకు ఎన్నికైన సభ్యులు
2) రాష్ట్రాల విధానసభలకు గవర్నర్ నామినేట్ చేసిన సభ్యులు
3) రాజ్యసభకు రాష్ట్రపతి నామినేట్ చేసిన సభ్యులు
4) రాష్ట్రాల విధాన సభలకు ఎన్నికైన సభ్యులు
ఎ) 1, 2, 3 బి) 1, 2, 4
సి) 1, 3, 4 డి) 1, 2, 3, 4
12. రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి కిందివాటిలో సరైన జవాబును గుర్తించండి?
1) రాష్ట్రపతి ఎన్నికల్లో ఎమ్మెల్యే ఓటు విలువను 1971 నాటి జనాభా లెక్కల ఆధారంగా లెక్కిస్తున్నారు
2) రాష్ట్రపతి ఎన్నికకు రిటర్నింగ్ అధికారిగా ఒకసారి లోక్ సభ సెక్రటరీ జనరల్ , మరొకసారి రాజ్యసభ సెక్రటరీ జనరల్ వ్యవహరిస్తారు
3) గెలుపొందే అభ్యర్థి ‘‘కోటా’’ ఓట్లను అనగా 50 శాతం కంటే ఎక్కువ ఓట్లు పొందాలి
4) రాష్ట్రపతి పదవికి ఎన్నిక పద్ధతిని ‘ఐర్లాండ్ ’ దేశ రాజ్యాంగం నుంచి గ్రహించారు
ఎ) 1, 3, 4 బి) 1, 2, 3
సి) 1, 2, 3, 4 డి) 2, 3, 4
13. రాష్ట్రపతి లోక్ సభకు ఇద్దరు ఆంగ్లో ఇండియన్లను నామినేట్ చేసే విధానాన్ని ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రద్దు చేశారు?
ఎ) 103వ రాజ్యాంగ సవరణ చట్టం 2019
బి) 104వ రాజ్యంగ సవరణ చట్టం 2020
సి) 105వ రాజ్యాంగ సవరణ చట్టం 2020
డి) 106వ రాజ్యాంగ సవరణ చట్టం 2021
14. 2017లో జరిగిన రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి కింద పేర్కొన్న అంశాల్లో సరైన జవాబును గుర్తించండి?
1) ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే ఓటు విలువ -159
2) తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్యే ఓటువిలువ -132
3) ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ఎమ్మెల్యే ఓటువిలువ-208
4) సిక్కిం రాష్ట్ర ఎమ్మెల్యే ఓటువిలువ -7
ఎ) 1, 2, 3 బి) 1, 2, 3, 4
సి) 2, 3, 4 డి) 1, 2, 4
15. రాష్ట్రపతి ఎన్నికల్లో పార్లమెంటు సభ్యుని ఓటు విలువను ఎలా గణిస్తారు?
ఎ) దేశం మొత్తం జనాభా / అన్ని రాష్ట్రాల మొత్తం ఎమ్మెల్యేల ఓటు విలువ
బి) పార్లమెంటుకి ఎన్నికైన మొత్తం ఎంపీల సంఖ్య / అన్ని రాష్ట్రాల మొత్తం ఎమ్మెల్యేల ఓటు విలువ
సి) అన్ని రాష్ట్రాల మొత్తం ఎమ్మెల్యేల ఓటు విలువ / పార్లమెంటుకి ఎన్నికైన ఎంపీల సంఖ్య
డి) దేశం మొత్తం జనాభా / అన్ని రాష్ట్రాల ఎమ్మెల్యేల సంఖ్య
16. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎమ్మెల్యేల ఓటు విలువను ఎలా లెక్కిస్తార్తు?
ఎ) (రాష్ట్రంలో మొత్తం జనాభా / రాష్ట్ర శాసన సభకు ఎన్నికైన ఎమ్మెల్యేల సంఖ్య) x 1/1000
బి) (రాష్ట్రం మొత్తం జనాభా / పార్లమెంటు సభ్యుల సంఖ్య) x 1/1000
సి) రాష్ట్ర శాసనసభకు ఎన్నికైన సభ్యుల సంఖ్య / రాష్ట్రం మొత్తం జనాభా
డి) రాష్ట్ర శాసన సభ్యుల సంఖ్య/పార్లమెంటు సభ్యుల సంఖ్య
17. 2017లో జరిగిన రాష్ట్రపతి ఎన్నికకు రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించిన లోక్ సభ సెక్రెటరీ జనరల్ ఎవరు?
ఎ) పి.సి. ఘోష్ బి) నవీన్ సిన్హా
సి) పి.డి.టి. ఆచారి డి) అనూప్ మిశ్రా
18. 2012లో జరిగిన రాష్ట్రపతి ఎన్నికకు రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించిన సెక్రటరీ జనరల్ ఎవరు?
ఎ) వి.ఎన్ .సిన్హా బి) వి.కె. అగ్నిహోత్రి
సి) కె.వి.వేణుగోపాల్ డి) పి.ఎం. కౌల్
19. భారత రాజ్యాంగంలోప్రాథమిక విధులను ఎక్కడ పేర్కొన్నారు?
ఎ) IV వ భాగం- ఆర్టికల్ 51
బి) IV వ భాగం – ఆర్టికల్ 51(A)
సి) IV -B భాగం – ఆర్టికల్ 51(B)
డి) V వ భాగం-ఆర్టికల్ 51(A)
20. ప్రాథమిక విధులకు సంబంధించి కిందివాటిలో సరైన జవాబును గుర్తించండి?
1) 1976లో 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 10 ప్రాథమిక విధులను రాజ్యాంగానికి చేర్చారు
2) 1977 జనవరి 3 నుంచి ప్రాథమిక విధులు అమల్లోకి వచ్చాయి
3) ప్రస్తుతం ప్రాథమిక విధుల సంఖ్య -11
4) ప్రాథమిక విధులపై అధ్యయనం కోసం 1998లో ఎ.ఎస్. ఆనంద్ కమిటీ ఏర్పడినది
1) 1, 3, 4 సరైనవి 2) 1, 2, 4 సరైనవి
3) 1, 2, 3, 4 సరైనవి4) 1, 2, 3 సరైనవి
21. ఆర్టికల్ 51(A)లో పేర్కొన్న ప్రాథమిక విధిని గుర్తించండి?
1) రాజ్యాంగానికి బద్దులై ఉండాలి, జాతీయపతాకాన్ని, గీతాన్ని గౌరవించాలి
2) స్వాంతంత్య్ర పోరాటానికి స్ఫూర్తినిచ్చిన ఉన్నత ఆదర్శాలను గౌరవించాలి
3) భారతదేశ సార్వభౌమత్వం సమగ్రతను సంరక్షించాలి
4) స్త్రీలను గౌరవించాలి, దేశ ప్రజల మధ్య సౌభ్రాతృత్వాన్ని పెంపొందించాలి
1) 1, 2, 3 2) 1, 3, 4
3) 1, 2, 3, 4 4) 2, 3, 4
22. రాజ్యాంగంలోని ఆర్టికల్ 51(A)లో పేర్కొన్న ప్రాథమిక విధిని గుర్తించండి?
ఎ) దేశ రక్షణకు అవసరమైనపుడు సైన్యంలో చేరాలి
బి) భారతదేశ సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించాలి
సి) అడవులు, వన్యప్రాణులు, నదులు, మొదలైన వాటిని సంరక్షించాలి
డి) శత్రుదేశాల పట్ల అప్రమత్తతతో వ్యవహరించాలి
1) 1, 2, 3 2) 1, 2, 3, 4
3) 1, 2, 4 4) 1, 3, 4
23. రాజ్యాంగంలోని ఆర్టికల్ 51(A)లో పేర్కొన్న ప్రాథమిక విధిని గుర్తించండి?
ఎ) ప్రతి భారతీయుడు శాస్త్రీయ దృక్పథాన్ని కలిగి ఉండాలి
బి) ప్రభుత్వ ఆస్తులను సంరక్షించాలి, హింస ను విడనాడాలి
సి) ఉన్నత విద్యాభ్యాసం కొనసాగాలి
డి) వ్యక్తిగతంగా, సమష్టిగా దేశాభివృద్ధికి కృషి చేయాలి
1) 2, 3, 4 2) 1, 2, 3
3) 1, 2, 3, 4 4) 1, 2, 4
24.అటల్ బిహారి వాజ్ పేయి ప్రభుత్వం రాజ్యాంగానికి 11వ ప్రాథమిక విధిని ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చింది?
ఎ) 85వ రాజ్యాంగ సవరణ చట్టం 2001
బి) 86వ రాజ్యాంగ సవరణ చట్టం 2002
సి) 87వ రాజ్యాంగ సవరణ చట్టం 2002
డి) 88వ రాజ్యాంగ సవరణ చట్టం 2003
25. రాజ్యాంగంలోని 11వ ప్రాథమిక విధి ప్రకారం ఏ వయస్సు గల బాలలు విద్యార్జన పొందేందుకు తల్లిదండ్రులు/ సంరక్షకులు కృషి చేయాలని పేర్కొంటుంది.
ఎ) 6 నుంచి 14 సంవత్సరాలు
బి) 5 నుంచి 12 సంవత్సరాలు
సి) 4 నుంచి 11 సంవత్సరాలు
డి) 5 నుంచి 18 సంవత్సరాలు
26. రాజ్యాంగంలో చేర్చిన 11వ ప్రాథమిక విధి ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది?
ఎ) 2004, ఏప్రిల్ 1
బి) 2003, డిసెంబర్ 3
సి) 2005, ఏప్రిల్ 12
డి) 2002, డిసెంబర్ 12
27. ప్రాథమిక విధులపై గల ప్రముఖుల వ్యాక్యానాలకు సంబంధించి సరైన జవాబును గుర్తించండి?
ఎ) ప్రాథమిక విధులు కేవలం అలంకార పూర్వకమైనవి – జస్టిస్ కె.పి. ముఖర్జీ
బి) ప్రాథమిక విధులు వ్యక్తి నైతిక జీవనానికి మార్గదర్శకాలు – డి.కె. బారువా
సి) ప్రాథమిక విధులు అసంబద్ధంగా గందరగోళంగా ఉన్నవి- నానీపాల్కీవాలా
డి) ప్రాథమిక విధులను రాజ్యాంగంలో పొందుపరచడం అనవసరం – సి.కె. దఫ్తారి
1) 1, 2, 3 2) 1, 2, 4
3) 1, 2, 3, 4 4) 1, 3, 4
28. స్వరణ్ సింగ్ కమిటీ ఎన్ని ప్రాథమిక విధులను సూచించింది?
ఎ) 6 బి) 8 సి) 10 డి) 11
29. కిందపేర్కొన్న అంశాల్లో సరైన జవాబును గుర్తించండి?
ఎ) ప్రాథమిక విధులపై అధ్యయనం కోసం 1998లో జె.ఎస్. వర్మ కమిటీని ఏర్పాటు చేశారు
బి) జె.ఎస్ వర్మ కమిటీ తన నివేదికను 1999లో సమర్పించింది
సి) ప్రాథమిక విధుల అమలు కోసం పార్లమెంటు చట్టాలను రూపొందించగలదు
డి) ప్రజాస్వామ్య దేశమైన జపాన్ రాజ్యాంగంలో ప్రాథమిక విధులను 9 రకాలుగా పేర్కొన్నారు?
1) 1, 2, 3, 4 2) 1, 3, 4
3) 1, 2, 4 4) 1, 2, 3
30. ప్రాథమిక విధులపై అధ్యయనం చేసిన జె.ఎస్.వర్మ కమిటీ చేసిన సిఫార్సులను గుర్తించండి?
ఎ) దేశంలోని అన్ని విద్యా సంస్థల్లో ప్రాథమిక పాఠ్యాంశాన్ని ప్రవేశ పెట్టాలి
బి) ఆకాశవాణి , దూరదర్శన్ వంటి ప్రసార సాధనాల్లో విస్తృత ప్రచారం చేయాలి.
సి) విద్యాసంస్థల్లో ఎన్ సీసీని తప్పనిసరి చేయాలి
డి) ప్రాథమిక విధులపై అవగాహన కల్పించేందుకు అంబుడ్స్‌మన్ వ్యవస్థను ఏర్పాటు చేయాలి
1) 1, 2, 3 2) 1, 2, 3, 4
3) 1, 2, 4 4) 1, 2, 4
జవాబులు
1-బి 2-ఎ 3-బి 4-ఎ 5-సి 6-ఎ 7-డి 8-సి 9-డి 10-సి 11-ఎ 12-సి 13-బి 14-బి 15-సి 16-సి
17-డి 18-బి 19-బి 20-డి 21-సి 22-ఎ 23-డి 24-బి 25-ఎ 26-డి 27-సి 28-బి 29-డి 30-డి
ఏకేఆర్ పబ్లికేషన్స్
వికారాబాద్ , 9441022571
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు