8 రాష్ట్రాలపై వాతావరణ ప్రతికూల ప్రభావం

మీకు తెలుసా?
# భారత శాస్త్ర సాంకేతిక విభాగం ‘వాతావరణ మార్పుల సర్దుబాట్లకు ఉమ్మడి ఫ్రేమ్ వర్క్ ఉపయోగించడం’ అనే నివేదికను 2021 ఏప్రిల్ 20వ తేదీన విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలోని వాతావరణ మార్పుల ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు, జిల్లాలను గుర్తించారు. నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా 8 రాష్ట్రాలు జార్ఖండ్ , మిజోరాం, ఒడిశా, ఛత్తీస్ గఢ్ , అసోం, బీహార్ , అరుణాచల్ ప్రదేశ్ , పశ్చిమబెంగాల్ పై వాతావరణ మార్పుల ప్రతికూల ప్రభావం ఉంటుందని తేలింది. ఈ రాష్ట్రాలు వాతావరణ మార్పులకు అనుగుణంగా తక్షణం సర్దుబాటు చేసుకోవాలని నివేదిక సూచించింది. అసోం, బీహార్ , జార్ఖండ్ రాష్ట్రాల్లో 60 శాతానికిపైగా జిల్లాలు ఈ అంశంలో బలహీనంగా ఉన్నాయి.
# అసోంలో అడవుల నరికివేత పెరిగిపోవడం వల్ల ఇలా జరుగుతోందని నివేదిక పేర్కొంది. అసోంలో ఇప్పటికే 42 శాతం అడవులు ఉన్నా గతం కంటే వీటి విస్తరణ బాగా తగ్గింది. బీహార్లో 36 జిల్లాల్లో ఆరోగ్య మౌలిక వసతులు దారుణంగా ఉండటం వల్ల ఆ రాష్ట్రం ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొంటుంది.
# జార్ఖండ్లో పంట బీమా పథకం లేకపోవడం, వర్షాధారంగా ఉన్న వ్యవసాయ రంగం వల్ల ప్రతికూల ప్రభావం ఉంది. హిమాచల్ ప్రదేశ్ , తెలంగాణ, సిక్కిం, పంజాబ్ లను మధ్యస్థాయి బలహీన రాష్టాలుగా నివేదిక వెల్లడించింది.
# ఉత్తరాఖండ్ , హర్యానా, తమిళనాడు, కేరళ, నాగాలాండ్ , గోవా, మహారాష్ట్ర తక్కువ బలహీనతలు గల లేదా తక్కువ ప్రతికూల ప్రభావం గల రాష్ట్రాలుగా నివేదిక గుర్తించింది.
Latest Updates
టీఎస్ ఎంసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
ఎస్ఐ ప్రిలిమ్స్ ‘కీ’ విడుదల.. అభ్యంతరాలకు గడువు ఆగస్టు 15
Chicken hearted fellow
భారత రాజ్యాంగ పరిణామం
‘మత నియోజకవర్గాల’ పితామహుడు?
సెంట్రల్ కమాండ్ హెడ్ క్వార్టర్స్లో గ్రూప్ సీ పోస్టులు
ఆర్టిఫిషియల్ లింబ్స్లో మేనేజర్ పోస్టులు
సీఆర్పీఎఫ్, ఢిల్లీ పోలీస్ శాఖలో 4300 ఎస్ఐ ఖాళీలు
Buzz in the tech sector
విమానం టైర్లలో ఉపయోగించే వాయువు ?