ద్విలోహ పట్టీలను ఎక్కువగా ఎక్కడ ఉపయోగిస్తారు?
జనరల్ సైన్స్
1. ఉష్ణం ప్రమాణం (CGS పద్ధతిలో)
1) ఆంపియర్ 2) సెంటీగ్రేడ్
3) జౌల్ 4) కెలోరి
2. విద్యుత్ ప్రవాహ తీవ్రతకు ప్రమాణం
1) ఓమ్ 2) వాట్
3) ఆంపియర్ 4) ఏదీకాదు
3. కింది వాటిలో సదిశరాశి?
1) శక్తి 2) పని
3) వడి 4) వేగం
4. ఒక వస్తువు తొలి స్థానం నుంచి చివరి స్థానం వరకు కొలవగలిగే అతి తక్కువ దూరాన్ని ఏమంటారు?
1) దూరం 2) స్థానభ్రంశం
3) 1, 2 4) ఏదీకాదు
5. త్వరణం ప్రమాణం?
1) సెం.మీ/సెకను2
2) సెం.మీ/సెకను
3) సెం.మీ2/సెకను2
4) సెం.మీ2/సెకను
6. ఇస్రో చంద్రయాన్ మిషన్ ప్రయోగం ఎప్పుడు చేపట్టాలని భావిస్తుంది?
1) ఆగస్టు 2022 2) ఆగస్టు 2023
3) జూన్ 2023 4) జూన్ 2022
7. సెకండ్ల లోలకం ఒక చివర నుంచి రెండవ చివరకు వెళ్లడానికి పట్టే కాలం?
1) 1 సెకను 2) 2 సెకన్లు
3) 3 సెకన్లు 4) 4 సెకన్లు
8. వాతావరణ పీడనాన్ని కొలిచే సాధనం?
1) హైడ్రోమీటర్ 2) బారో మీటర్
3) హైగ్రో మీటర్ 4) ఆల్టి మీటర్
9. హైగ్రోమీటర్ దేన్ని కొలవడానికి ఉపయోగిస్తారు?
1) ద్రవాల సాపేక్షసాంద్రత
2) పాల శుద్ధత
3) సాపేక్ష ఆర్ధత
4) వాతావరణ పీడనం
10. పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికిల్ సి-52 రాకెట్‌ను ఇస్రో ఏ తేదీన ప్రయోగించింది?
1) 10 ఫిబ్రవరి 2022
2) 14 ఫిబ్రవరి 2022
3) 16 ఫిబ్రవరి 2022
4) 18 ఫిబ్రవరి 2022
11. కింది వాటిలో ఏ రాష్ట్రం మొట్టమొదటి రాడార్ ఇమేజింగ్ EOS-4 ప్రయోగించింది?
1) బీహార్ 2) రాజస్థాన్
3) ఆంధ్రప్రదేశ్ 4) ఒడిశా
12. INS-2TD ఏ దేశాల ఉమ్మడి శాటిలైట్?
1) నేపాల్-భూటాన్
2) రష్యా-భారతదేశం
3) భూటాన్-భారతదేశం
4) జపాన్-భారతదేశం
13. అణుబాంబు ఏ సూత్రంపై పనిచేస్తుంది?
1) నియంత్రిత శృంఖల కేంద్రక విచ్ఛిన్న సూత్రం
2) అనియంత్రిత శృంఖల కేంద్రక విచ్ఛిన్న సూత్రం
3) కేంద్రక సంలీన సూత్రం
4) పైవన్నీ
14. భారతదేశంలో 5జీ సాంకేతిక పరిశోధనలో భాగంగా తొలిసారిగా స్వదేశి పరిజ్ఞానంతో కూడిన 5జీ వైర్లెస్ బ్రాడ్ బ్యాండ్ టెక్నాలజీని వైసిగ్ నెట్వర్క్ (WI SIG) అనే కంపెనీతో కలిసి ఏ ఐఐటీ సంయుక్తంగా అభివృద్ధి చేసింది?
1) ఐఐటీ మద్రాస్
2) ఐఐటీ ఖరగ్‌పూర్
3) ఐఐటీ బాంబే
4) ఐఐటీ హైదరాబాద్
15. ఒక వస్తువును భూమి నుంచి చంద్రునిపైకి తీసుకెళ్లినపుడు
1) ద్రవ్యరాశి మారుతుంది, బరువులో మార్పు ఉండదు
2) బరువు, ద్రవ్యరాశి రెండూ మారుతాయి
3) ద్రవ్యరాశి స్థిరంగా ఉండి, బరువు మారుతుంది
4) రెండూ మారవు
16. కాంక్రీట్ రోడ్డుపై కంటే, మంచు మీద నడవటం ఎందుకు కష్టం?
1) మంచు మృదువుగాను, కాంక్రీట్ కఠినంగా ఉంటాయి
2) మంచుకు పాదాలకు మధ్య ఉండే ఘర్షణ, కాంక్రీటుకు పాదాలకు మధ్య ఉండే ఘర్షణ కన్నా తక్కువ
3) మంచులో ఘర్షణ కాంక్రీటులో కన్నా ఎక్కువ
4) ఏదీకాదు
17. నిండా నీరు ఉన్నా, గ్లాసు కింద నుంచి కాగితాన్ని నీరు చిందకుండా లాగవచ్చు. ఇది దేనిని సూచిస్తుంది?
1) కాగితానికి, గ్లాసుకు మధ్య ఘర్షణ లేకపోవటం
2) న్యూటన్ 3వ గమన నియమం
3) జడత్వం 4) త్వరణం
18. PSLV C-52 రాకెట్ కాల వ్యవధి ఎన్ని సంవత్సరాలు ఉంటుంది?
1) 15 2) 10 3) 16 4) 8
19. కింది వాటిలో ఏది అదిశరాశి?
1) వేగం 2) ద్రవ్యవేగం
3) బలం 4) ద్రవ్యరాశి
20. ఒక ఉపగ్రహం భూమి చుట్టూ వృత్తాకార కక్ష్యలో పరిభ్రమిస్తుంటే అది దేన్ని కలిగి ఉంటుంది?
1) స్థిరవేగం 2) స్థిర త్వరణం
3) మారుతూ ఉండే త్వరణం
4) పైవేవీ కాదు
21. ఏ స్థానం దగ్గర గురుత్వ త్వరణం అత్యధికం?
1) భూమధ్యమంలో
2) భూ ఉపరితలంపైన
3) 2 మైళ్ల ఎత్తుపై ఉన్న విమానంలో
4) 2 మైళ్ల లోతున ఉన్న గనిలో
22. భూ ఉపరితలంపై ‘g’ విలువ దేనిపై ఆధారపడుతుంది?
1) వస్తువు ద్రవ్యరాశి
2) వస్తువు స్వభావంపై
3) భూ కేంద్రం నుంచి వస్తువు దూరం
4) భూ ద్రవ్యరాశి
23. స్విచ్ ఆపిన తరువాత కూడా ఫ్యాను కొంతసేపటి వరకు తిరుగుతూనే ఉండటానికి కారణం?
1) న్యూటన్ మొదటి సూత్రం ఆధారంగా
2) న్యూటన్ రెండవ సూత్రం ఆధారంగా
3) భ్రమణ చలనం కారణంగా
4) పైవన్నీ
24. స్వేచ్ఛగా కిందకు పడే వస్తువు బరువు
1) విరామంలో దాని బరువు కన్నా ఎక్కువ
2) విరామంలో దాని బరువు కన్నా తక్కువ
3) శూన్యం 4) మారుతూ ఉంటుంది
25. ఒక రాయి స్వేచ్ఛగా కిందకు పడుతున్నప్పుడు
1) నిరంతరంగా త్వరణాన్ని పొందుతుంది
2) స్థిర వేగంతో ప్రయాణిస్తుంది
3) స్థానభ్రంశంలో మార్పురేటు స్థిరంగా ఉంటుంది
4) గరిష్ఠ వేగాన్ని పొంది, అదే వేంగతో ప్రయాణిస్తుంది
26. న్యూటన్ రెండవ సూత్రం దేన్ని తెలియజేస్తుంది?
1) బలం నిర్వచనాన్ని
2) జడత్వం నిర్వచనాన్ని
3) ద్రవ్యవేగం నిర్వచనాన్ని
4) బలం పరిమాణాన్ని
27. ఇండియన్ నేవీ కార్యక్రమం ప్రాజెక్టు నేవీ-15Bలో భాగంగా 4th షిప్ INS సురత్ ఏ సంవత్సరంలో ప్రారంభించనుంది?
1) 2022 2) 2023
3) 2024 4) 2025
28. జెట్ ఇంజిన్ ఏ సూత్రం ప్రకారం పనిచేస్తుంది?
1) శక్తి నిత్యత్వం
2) ద్రవ్యరాశి నిత్యత్వం
3) ద్రవ్యవేగ నిత్యత్వం
4) కోణీయ ద్రవ్యవేగ నిత్యత్వం
29. అపకేంద్ర బలం దేన్ని కలిగి ఉంటుంది?
1) దిశాజడత్వం 2) గమన జడత్వం
3) విరామ జడత్వం 4) పైవన్నీ
30. కింది వాటిలో ‘g’ విలువలో మార్పునకు కారణం కానిది?
1) భూమి వ్యాసార్థం
2) భూమిపై వాతావరణం
3) భూమి తనచుట్టూ తాను తిరగడం
4) ఏదీకాదు
31. ఘర్షణ బలం ఎల్లప్పుడూ
1) వస్తువు గమన దిశలో పనిచేస్తుంది
2) గమన దిశకు వ్యతిరేక దిశలో
3) గమన దిశకు లంబంగా
4) ఏ దిశలో అయినా ఉండవచ్చు
32. చంద్రునిపై నడిచే అంతరిక్ష యాత్రికుని విషయంలో, కిందివాటిలో ఏది నిజం?
1) ద్రవ్యరాశి, బలం రెండూ తగ్గుతాయి
2) ద్రవ్యరాశి తగ్గుతుంది. బలంలో మార్పుండదు
3) ద్రవ్యరాశి మారదు. బలం తగ్గుతుంది
4) రెండూ మారవు
33. మలుపు తిరుగుతున్న బస్సులోని వ్యక్తి ఒక వైపునకు పడతాడు. ఇది దేనికి కారణం?
1) జడత్వం 2) విరామ జడత్వం
3) గమన జడత్వం 4) దిశా జడత్వం
34. ఒక వస్తువు ద్రవ్య వేగం శూన్యమైతే ?
1) గతిజశక్తిని కలిగి ఉంటుంది
2) స్థితిజశక్తిని కలిగి ఉంటుంది
3) రెండిటినీ కలిగి ఉంటుంది
4) రెండూ ఉండవు
35. ఏ యంత్రం అపకేంద్ర బలంపై ఆధారపడి పనిచేస్తుంది?
1) వేయింగ్ మిషన్ 2) ప్రింటర్
3) స్క్రూ 4) వాషింగ్ మెషిన్
36. అపకేంద్ర బలం ఒక
1) నిజమైన బలం 2) మిథ్యాబలం
3) రెండూ 4) ఏదీకాదు
37. ‘చర్యకు ప్రతి చర్య’ అనే సూత్రం
1) న్యూటన్ రెండవ గమన సూత్రం
2) న్యూటన్ మొదటి గమన సూత్రం
3) న్యూటన్ మూడవ గమన సూత్రం
4) ఏదీకాదు
38. వంట చేస్తుండగా ప్రెషర్ కుక్కర్లో
1) మరుగు ఉష్ణోగ్రత పెరుగుతుంది
2) పీడనం పెరుగుతుంది
3) ఘన పరిమాణం స్థిరం
4) అన్నీ సరైనవే
39. శీతలదేశాల్లో చలికాలంలో తటాకంలోని నీటి పై భాగం ఘనీభవిస్తుంది. కానీ కింది నీరు యదార్థంగా ఉంటుంది. కారణం
1) నీటి నిజ వ్యాకోచం
2) నీటి దృశ్య వ్యాకోచం
3) నీటి అసంగత వ్యాకోచం
4) నీటి గుప్తోష్ణం
40. కెల్విన్ స్కేల్లో పాదరస థర్మామీటర్ ఊర్థ స్థిర స్థానం, అధో స్థిర స్థానాలు
1) 273 K & 173 K
2) 273 K & 1 K
3) 373 K & 273 K
4) -173 K & -273 K
41. హైడ్రోమీటర్ దేన్ని కొలుస్తుంది?
1) పీడనం 2) సాంద్రత
3) ఉష్ణోగ్రత 4) ఆర్థత
42. శూన్యంలో 100 గ్రాముల బరువున్న బంగారం, వెండిలను ఒక ద్రవంలో ముంచినట్లెతే
1) బంగారం బరువు ఎక్కువవుతుంది
2) వెండి బరువు ఎక్కువవుతుంది
3) రెండూ సమాన బరువుని కలిగి ఉంటాయి
4) వాటి బరువు ద్రవపదార్థం సాంద్రతపై ఆధారపడి ఉంటుంది
43. ఒక సరస్సులో పడవ ప్రయాణిస్తుంది. పడవ సరస్సు మధ్యలో ఉన్నప్పుడు దానికి రంధ్రం పడి నీరు పడవలోకి ప్రవేశించటం మొదలు పెడుతుంది. పడవ మునగడానికి సిద్ధంగా ఉన్న సమయంలో నీటి మట్టం?
1) పెరుగుతుంది 2) తగ్గుతుంది
3) మార్పు ఉండదు
4) పడవ ఆకారంపై ఆధారపడి ఉంటుంది
44. రిఫ్రిజిరేటర్లో ఉపయోగించే వాయువు
1) నైట్రోజన్ 2) ఆక్సిజన్
3) అమ్మోనియా 4) ఏదీకాదు
45. మంట దగ్గర కూర్చున్నప్పుడు, ఏ ప్రక్రియ వల్ల మనకు ఉష్ణం అందుతుంది?
1) వాహనం, సంవహనం, వికిరణం
2) వాహనం, సంవహనం
3) సంవహనం, వికిరణం
4) సంవహనం మాత్రమే
46. స్ప్రింగ్ త్రాసు పనిచేసే సూత్రం ?
1) ఆర్కిమెడిస్ సూత్రం
2) ప్లవన సూత్రం
3) క్ సూత్రం
4) విశ్వ గురుత్వాకర్షణ సిద్ధాంతం
47. కింది వాటిలో వాస్తవం కానిది?
1) పని బలం చర్యారేఖ వెంబడి కదలిన దూరంతో గుణించబడిన బలం పరిమాణానికి సమానం
2) సూర్యుని లోపల, దాని ఉపరితలంపై జరిగే పరిమాణం, రసాయన శక్తి మార్పుల ఫలితమే సూర్యుని ఉష్ణశక్తి
3) పని ఒక రూపం నుంచి మరొక రూపానికి మారిన శక్తి పరిమాణాన్ని తెలియజేస్తుంది
4) గురుత్వాకర్షణ స్థితిజ శక్తి గతిజశక్తిగా రూపాంతరం చెందలేదు
48. ద్విలోహ పట్టీలను ఎక్కడ ఉపయోగిస్తారు?
1) రేడియో 2) టి.వి.
3) ఎలక్టానిక్ మోటార్లు 4) రిఫ్రిజిరేటర్లు
49. పీడనం వల్ల నీటి మరిగే స్థానంలో వచ్చే మార్పును దేనిలో ఉపయోగిస్తారు?
1) స్టీమ్ జనరేటర్ 2) థర్మాస్ ఫ్లాస్క్
3) ఆవిరి ఇంజిన్‌లోని బాయిలర్లు
4) ప్రెషర్ కుక్కర్
50. చెరువులోని నీరు ఎండాకాలంలో కూడా చల్లగా ఉండటానికి కారణం?
1) నీటి నిరంతర బాష్పీభవనం
2) నీరు వాతావరణం కంటే త్వరగా ఉష్ణాన్ని కోల్పోతుంది
3) నీరు వాతావరణం కంటే మెల్లగా ఉష్ణాన్ని గ్రహిస్తుంది 4) ఏదీకాదు
51. ఎత్తయిన ప్రదేశాల్లో ఆహారం ఉడకటానికి ఎక్కువ సమయం పడటానికి కారణం?
1) నీరు మరిగే ఉష్ణాగ్రత పెరగటం
2) నీరు మరిగే ఉష్ణోగ్రత తగ్గటం
3) నీరు మరిగే ఉష్ణోగ్రత మారదు
4) ఏదీకాదు
52. ఓడ నది నుంచి సముద్రంలోకి ప్రవేశించినప్పుడు ఓడ మట్టం
1) పెరుగుతుంది 2) తగ్గుతుంది
3) మారదు
4) ఓడ బరువు మీద ఆధారపడుతుంది
53. సముద్ర పవనాలు దేని వల్ల కలుగుతాయి?
1) బాష్పీభవనం 2) సంవహనం
3) గుప్తోష్ణం 4) అలల కదలిక
54. శృతి దండపు తరచుదనాన్ని ఏ పరికరంతో కొలుస్తారు?
1) విద్యుద్ఘటం 2) విద్యుదయస్కాంతం
3) సోనో మీటర్ 4) వోల్ట్‌మీటర్
55. థర్మామీటర్ల్లో పాదరసాన్ని ఉపయోగించడానికి కారణం?
1) అధిక సాంద్రత 2) అది ఒక ద్రవం
3) అధిక బాష్ప పీడనం
4) అది గాజును తడపదు
56. ఎయిర్ కూలర్ ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది?
1) గాలి వల్ల ఉష్ణోగ్రత తగ్గడం
2) నీటి పీడనం వల్ల ఉష్ణోగ్రత తగ్గడం
3) నీటి బాష్పీభవనం వల్ల ఉష్ణోగ్రత తగ్గడం
4) నీటి సాంద్రత తక్కువగా ఉండటం వల్ల ఉష్ణోగ్రత తగ్గడం
జవాబులు
1.4 2.3 3.4 4.2 5.1 6.2 7.1 8.2 9.3 10.2 11.3 12.3 13.2 14.4 15.3 16.2 17.3 18.4 19.4 20.2
21.2 22.3 23.1 24.3 25.1 26.1 27.4 28.3 29.1 30.2 31.2 32.3 33.4 34.2 35.4 36.2
37.3 38.4 39.3 40.3 41.2 42.1 43.3 44.3 45.3 46.3 47.4 48.4 49.4 50.1 51.2 52.1
53.2 54.3 55.1 56.1
విజేత కాంపిటీషన్స్
బతుకమ్మకుంట, హైదరాబాద్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు