‘నా జైలు జ్ఞాపకాలు-అనుభవాలు’ గ్రంథ రచయిత ఎవరు?
గతతరువాయి…
51. ఏ మహాసభలకు రావి నారాయణరెడ్డి అధ్యక్షునిగా ఉన్నాడు?
ఎ. 1941 చిలుకూరు
బి. 1944 భువనగిరి
సి. 1945 ఖమ్మం
1) ఎ 2) ఎ, బి
3) బి 4) పైవన్నీ సరైనవే
52. కింది వారిలో ఎవరు ఆంధ్ర మహాసభకు అధ్యక్షునిగా వ్యవహరించినప్పుడు సభ్యత్వ రుసుమును తగ్గించారు?
1) కేవీ రంగారెడ్డి
2) మాడపాటి హనుమంతరావు
3) రావి నారాయణ రెడ్డి
4) బూర్గుల రామకృష్ణారావు
53. నిజామాంధ్ర జనసంఘం ఏ సమావేశంలో ఆంధ్రమహాసభగా ఏర్పడింది?
1) జోగిపేట సమావేశం
2) సూర్యాపేట సమావేశం
3) సిరిసిల్లా సమావేశం
4) హైదరాబాద్ సమావేశం
54. ఆంధ్రమహాసభలకు సంబంధించి సరికాని జత?
1) జోగిపేట సమావేశం- 1930
2) సిరిసిల్ల సమావేశం- 1936
3) భువనగిరి సమావేశం- 1944
4) హైదరాబాద్ సమావేశం- 1946
55. జతపర్చండి
1. జోగిపేట సమావేశం ఎ. సురవరం ప్రతాపరెడ్డి
2. భువనగిరి సమావేశం బి. రావి నారాయణ రెడ్డి
3. మల్కాపురం సమావేశం సి. మందుమల రామచంద్రరావు
4. నిజామాబాద్ సమావేశం డి. మందముల నర్సింగరావు
1) 1-ఎ, 2-బి, 3-సి,4-డి 2) 1-బి, 2-ఎ, 3-డి,4-సి
3) 1-డి, 2-బి, 3-ఎ,4-సి 4) 1-ఎ, 2-బి, 3-డి,4-సి
56. ‘శ్రీబాగ్ ఒప్పందం’ ఎప్పుడు జరిగింది?
1) 1937 నవంబర్ 6
2) 1937 నవంబర్ 16
3) 1937 నవంబర్ 17
4) 1937 నవంబర్ 15
57. ‘తెలంగాణ పీపుల్స్ స్ట్రగుల్ అండ్ ఇట్స్ లెసన్స్’ గ్రంథ రచయిత ఎవరు?
1) రావి నారాయణ రెడ్డి
2) పుచ్చలపల్లి సుందరయ్య
3) గద్దె లింగయ్య
4) దేవులపల్లి రామానుజరావు
58. తెలంగాణ మాండలికాలను జతపర్చండి
ఎ. లాడు 1. గారాబం
బి. పత్తా 2. పదికిలోలు
సి. కచ్చేరి 3. చిరునామా
డి. మడం 4. పోలీస్ స్టేషన్
1) ఎ-1, బి-3, సి-2, డి-4
2) ఎ-4, బి-3, సి-2, డి-1
3) ఎ-1, బి-3, సి-4, డి-2
4) ఎ-1, బి-4, సి-3, డి-2
59. ‘నా జైలు జ్ఞాపకాలు-అనుభవాలు’ గ్రంథ రచయిత ఎవరు?
1) సంగెం లక్ష్మీబాయి
2) రావి నారాయణరెడ్డి
3) దేవులపల్లి వేంకటేశ్వరరావు
4) స్వామి రామానందతీర్థ
60. నిజాం పాలనలోని అధికారులు, వారి అధికారాలు జతపర్చండి?
ఎ. దేశ్‌ముఖ్‌లు 1. రెవెన్యూ కాంట్రాక్టర్
బి. సర్బస్తదార్లు 2. రెవెన్యూ కలెక్టర్
సి. సదర్-ఉస్- సుదుర్ 3. సివిల్, క్రిమినల్ పరిపాలన
డి. ఖాజి ఎ-సుబాహ్ 4. ధర్మకత్వపు శాఖ
1) ఎ-2, బి-1, సి-4, డి-3 2) ఎ-2, బి-3, సి-1, డి-4
3) ఎ-2, బి-3, సి-4, డి-1 4) ఎ-1, బి-2, సి-3, డి-4
61. ‘తెలంగాణ సాయుధ పోరాట కమిటీ’ తన సాయుధ పోరాటాన్ని ఏ తేదీన విరమించుకొంది?
1) 21 అక్టోబర్ 1951
2) 4 ఆగస్టు 1951
3) 20 జనవరి 1951
4) ఫిబ్రవరి 1946
62. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్‌పై ఉన్న నిషేధాన్ని నిజాం ప్రభుత్వం ఎప్పుడు తొలగించింది?
1) మార్చి 1946 2) జూన్ 1946
3) జూలై 1946 4) ఫిబ్రవరి 1946
63. ఏ నిజాం కాలంలో మహాలకాబాయి చందా రాజ నర్తకిగా ఉంది?
1) నిజాం అప్జల్ ఉద్దౌలా
2) మీర్ మహబూబ్ అలీఖాన్
3) ఉస్మాన్ అలీఖాన్
4) నిజాం అలీఖాన్
64. నిజాం రాజ్యం అధికార రేడియో ఏది?
1) ఉస్మానియా రేడియో
2) దక్కన్ రేడియో
3) భాగ్యనగర్ రేడియో
4) గోల్కొండ రేడియో
65. నిజాం ప్రభుత్వం మొట్టమొదటిసారిగా యూఎన్వో సెక్యూరిటీ కౌన్సిల్ అధ్యక్షునిగా ఎప్పుడు ఫిర్యాదు చేసింది?
1) 1948 ఆగస్టు 19
2) 1948 ఆగస్టు 21
3) 1947 ఆగస్టు 21
4) 1948 సెప్టెంబర్ 2
66. 1952 ముల్కీ ఉద్యమం ప్రారంభం అయినప్పుడు వరంగల్ కలెక్టర్ ఎవరు?
1) వీడీ దేశ్‌పాండే
2) గోవిందరావు దేశ్‌పాండే
3) రామేశ్వర దేశ్‌పాండే
4) ఎవరూ కాదు
67. 1952 ఆగస్టు 27న హైదరాబాద్‌లో జరిగిన ముల్కీ సభకు అధ్యక్షుడిగా వ్యవహరించినది ఎవరు?
1) డా. తిమ్మరాజు
2) గోపాల్‌రావు ఎక్ఫోటె
3) కొండా వేంకటరంగారెడ్డి
4) బుచ్చయ్య
68. ధార్ కమిషన్‌కు సంబంధించి సరికానిది?
ఎ. 1948 జూన్ 16న ఏర్పాటు, నివేదిక 1948 డిసెంబర్ 13
బి. కమిషన్‌లో ఒకచైర్మన్, ఇద్దరు సభ్యులు
సి. భాషా ప్రాతిపదికన రాష్ట్రాల ఏర్పాటు సాధ్యమో కాదో పరిశీలించడానికి ఏర్పాటు చేశారు
డి. చైర్మన్, ఎస్కే ధార్, సభ్యులు డా. పన్నాలాల్, జగత్ నారాయణలాల్
1) ఎ 2) ఎ, బి
3) ఎ, బి, సి 4) పైవన్నీ సరైనవే
69. 2వ సాలార్జంగ్ పర్షియన్ భాష స్థానంలో ఉర్దూను అధికార భాషగా ఎప్పుడు ప్రవేశపెట్టాడు?
1) 1885 ఫిబ్రవరి 21
2) 1884 ఫిబ్రవరి 21
3) 1886 ఫిబ్రవరి 21
4) 1883 ఫిబ్రవరి 21
70. నిజాం కాలంలో ఉన్న భూ విధానాలు?
1) ఖాల్సాభూములు
2) కౌలు భూములు
3) జాగీర్దారుల భూములు
4) పైవన్నీ
71. 1919 ఫర్మానాలో ప్రభుత్వోద్యోగాల్లో స్థానికులకే ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్న పేరా?
1) 10వ 2) 11వ
3) 13వ 4) 12వ
72. జతపర్చండి?
1. జిల్లా బందీ వ్యవస్థ ఎ. 1864
2. సెక్రటేరియట్ బి. 1855
3. ప్రభుత్వ కేంద్ర టంకశాల సి. 1863
4. నిజాం కాలేజీ డి. 1887
1) 1-బి, 2-సి, 3-ఎ,4-సి
2) 1-ఎ, 2-బి, 3-సి,4-డి
3) 1-ఎ, 2-సి, 3-బి,4-డి
4) 1-ఎ, 2-సి, 3-డి,4-బి
73. మొదటి సాలార్జంగ్ సంస్కరణల ఫలితంగా సంభవించిన పరిణామాలకు సంబంధించి సరైనది?
1) లోటు బడ్జెట్లో ఉన్న నిజాం రాజ్యం మిగులు బడ్జెట్‌గా మారింది
2) రైతులకు, ప్రభుత్వానికి ప్రత్యక్ష సంబంధం ఏర్పడింది
3) పై రెండూ సరైనవే 4) ఏదీకాదు
74. 2వ సాలార్జంగ్ తర్వాత ప్రధాని బాధ్యతలు చేపట్టినది ఎవరు?
1) ఆస్మాన్ జా
2) మీర్ మహబూబ్ అలీఖాన్
3) మహరాజాకిషన్ పెర్షాద్
4) మీర్ లాయ్మలీ ఖాన్
75. నవాబ్ అలీ నవాజ్ జంగ్ ఆధ్వర్యంలో నిర్మించిన నిర్మాణాలకు సంబంధించి సరికానిది?
1) ఉస్మానియా జనరల్ హాస్పిటల్
2) హైదరాబాద్ హౌస్
3) ఉస్మానియా ఆర్ట్ కాలేజీ
4) ఘన్పూర్ ప్రాజెక్ట్
76. మొదటి సాలార్జంగ్ ఏ సంవత్సరంలో పాలనా బాధ్యతలు స్వీకరించాడు?
1) 1853 మే 30 2) 1853 మే 31
3) 1853 మే 26 4) 1853 మే 25
77. హైదరాబాద్ రాజ్యంలో ముల్కీల పక్షాన, నాన్ ముల్కీల పక్షాన ప్రచారం చేసిన పత్రికలు వరుసగా…?
1) హైదరాబాద్, హైదరాబాద్ రికార్డ్
2) ఇలాహీ బక్ష్, మీజాన్
3) దక్కన్ టైమ్స్, మీజాన్
4) రిసాలతబ్బి, హైదరాబాద్ టెలిగ్రాఫ్
78. హైదరాబాద్ నగర తొలి మేయర్ ఎవరు?
1) బూర్గుల రామకృష్ణారావు
2) మాడపాటి హన్మంతరావు
3) కేవీ రంగారెడ్డి 4) మరి చెన్నారెడ్డి
79. జతపర్చండి?
ఎ. ఆది-హిందూ సోషల్ 1. వామన నాయక్, సర్వీస్ లీగ్ (1911) కేశవరావు కొరాట్కర్
బి. హిందూ సోషల్ క్లబ్ 2. వామన్నాయక్ (1892) కేశవరావు కొరాట్కర్
సి. హైదరాబాద్ సోషల్ సర్వీస్ 3. రాజమురళి మనోహర్ లీగ్ (1915)
డి. హైదరాబాద్ స్టేట్ రీ ఫార్మ్ 4. భాగ్యరెడ్డి వర్మ అసోసియేషన్ (1918)
1) ఎ-4, బి-3, సి-1, డి-2 2) ఎ-3, బి-4, సి-2, డి-1
3) ఎ-1, బి-2, సి-3, డి-4 4) ఎ-1, బి-4, సి-3, డి-2
80. నిజాం రాజ్యంలో జాగీర్దారుల భూములకు సంబంధించి సరికానిది?
1) పాయిగా జాగీరు- ఈ జాగీర్లను ముస్లిం ప్రభువులకు నిజాం రక్తసంబంధీకులకు ఇస్తారు
2) జాగీరు- శిస్తు లేకుండా వంశపారంపర్యంగా అనుభవించే హక్కుగల జాగీరు లేకుండా
3) మరద్ మష్ జాగీరు- జీతభత్యాలకు బదులుగా ఇచ్చేది
4) మస్రూది- ‘మత లేదా సైనిక/ పౌరసంబంధ సేవచేసే షరతులపై ఇచ్చే జాగీరు
81. 1919 నవంబర్ 17న నిజాం జారీచేసిన ఫర్మానా 10వ పేరాకు సంబంధించి సరైనది?
ఎ. ప్రభుత్వ ఉద్యోగాల్లో నాన్ ముల్కీలకు బదులుగా ముల్కీలకే ప్రాధాన్యం ఇవ్వాలి
బి. ప్రత్యేక పరిస్థితుల్లో అర్హతలు అవసరమైన సందర్భాల్లో ఈ నిబంధన మినహాయించబడుతుంది
1) ఎ సరైనదే, బి సరికాదు
2) ఎ సరికాదు, బి సరైనదే
3) ఎ, బి సరైనవే
4) ఎ, బి, సరికాదు
82. 1950 జూన్‌లో హైదరాబాద్ పౌరప్రభుత్వం జారీ చేసిన ఫర్మానా ప్రకారం ఆర్టికల్ 39లోని ఏ నిబంధనలను తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం లేదని పేర్కొంది?
1) 1949 ముల్కీ రెగ్యులేషన్‌లోని 1 (ఎ), 1 (సి)
2) 1949 ముల్కీ రెగ్యులేషన్‌లోని 1 (బి), 1 (డి)
3) 1949 ముల్కీ రెగ్యులేషన్‌లోని 1 (బి), 1 (సి)
4) ఏదీకాదు
83. 1969 ఏప్రిల్‌లో ముల్కీ నిబంధన కొనసాగడానికి తగిన రాజ్యాంగ సవరణలను సిఫారసు చేయడానికి ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. ఆ కమిటీ అధ్యక్షుడు ఎవరు?
1) పింగళి జగన్ మోహన్ రెడ్డి
2) కుమార్ లలిత్
3) జీఎన్ వాఘ్రె
4) కేఎన్ వాంఛు
84. వల్లభాయ్ పటేల్ సూచన మేరకు హైదరాబాద్ సంస్థానంపై పోలీస్ చర్యను భారత ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభించింది?
1) 1948 సెప్టెంబర్ 10
2) 1948 సెప్టెంబర్ 12
3) 1948 సెప్టెంబర్ 13
4) 1948 సెప్టెంబర్ 15
85. జస్టిస్ జగన్మోహన్ రెడ్డి కమిషన్ తమ నివేదికను ప్రభుత్వానికి ఎప్పుడు సమర్పించింది?
1) 1952 డిసెంబర్ 28
2) 1953 డిసెంబర్ 28
3) 1954 డిసెంబర్ 28
4) 1955 డిసెంబర్ 28
86. 1884లో హైదరాబాద్‌లో ప్రభుత్వం ప్రారంభించిన సివిల్ సర్వీసెస్ తొలిజాబితా ప్రకారం నాన్ ముల్కీలు ఎంతమంది, వారి జీతాల శాతం ఎంత?
1) 230, 48శాతం 2) 230, 58శాతం
3) 246, 42శాతం 4) 246, 52శాతం
87. కింది ముల్కీ నియమాలకు సంబంధించి సరికానిది?
1) 1884-86 ముల్కీ నిబంధనల ప్రకారం స్థిరనివాసం 15 సంవత్సరాలు, 12 ఏండ్ల్లు సర్వీసు పూర్తి చేసుకున్న వారి పిల్లలు ముల్కీలు
2) 1919 ఫర్మానాలోని 10వ పేరాలో ముల్కీల గురించి స్పష్టంగా పేర్కొన్నారు
3) 1949 ఫర్మానా ప్రకారం 15 ఏండ్లు స్థిరనివాసం, సర్వీస్ చేసిన వారి పిల్లలు
4) పైవన్నీ సరైనవే
88. ముల్కీ లీగ్‌ను స్థాపించిన వారిలో హిందువులకు సంబంధించి సరికానివారు?
1) బూర్గుల రామకృష్ణారావు, మందముల నర్సింగరావు
2) వామన్ నాయక్, కాశీనాథ్ వైద్య
3) కొండా వెంకటరంగారెడ్డి, మరి చెన్నారెడ్డి
4) 1, 2
జవాబులు
51-4, 52-3, 53-1, 54-4, 55-1, 56-2, 57-2, 58-3, 59-1, 60-4, 61-1, 62-3, 63-4, 64-2, 65-2, 66-2, 67-1, 68-4, 69-2, 70-4, 71-1, 72-3, 73-3, 74-1, 75-4, 76-2, 77-1, 78-2, 79-1, 80-3, 81-3, 82-1, 83-4, 84-3, 85-1, 86-2, 87-4, 88-3,
టాపర్స్ ఇన్స్టిట్యూట్,
మేడిపల్లి, హైదరాబాద్
9652578639
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు