మావి నుంచి కాదు.. మేధ నుంచి పుట్టింది
రోబోట్లకు సంబంధించి వాటి నమూనా, తయారీ, అనువర్తనం, నిర్మాణం అమరికకు సంబంధించిన సాంకేతిక శాస్ర్తాన్ని ‘రోబోటిక్స్’ అంటారు. ఇంజినీరింగ్ విభాగాలైన మెకానికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ మొదలైన వాటి పరస్పర ఆధారిత విభాగంగా రోబోటిక్స్ గుర్తింపు పొందింది. ఈ సాంకేతికతల ఆధారంగా రూపొందిన యంత్రాలు వివిధ కార్యకలాపాల్లో మానవుడికి ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతున్నాయి. ఈ యంత్రాల నియంత్రణ, పరిశీలన, సమాచార సంబంధ ప్రక్రియలను నిర్వర్తించడానికి ప్రధానంగా కంప్యూటర్లను వినియోగిస్తున్నారు.
రోబోటిక్స్
- రోబోలను ప్రస్తుతం ఎలాంటి పరిస్థితుల్లో అయినా, ఎటువంటి అవసరాలకైనా
ఉపయోగించుకొనేలా రూపొందిస్తున్నారు. ముఖ్యంగా మానవుడు పనిచేయలేని ప్రమాదకర పరిస్థితుల్లో సైతం వీటి సేవలు చెప్పుకోదగినవి. ఉదాహరణకు పేలుడు పదార్థాల ఉనికి గుర్తించడం, వాటిని నిర్వీర్యం చేయడం, అత్యంత వేడి వాతావరణం కలిగిన తయారీ పరిశ్రమల్లో ,
పారిశుద్ధ్య కార్మికులుగా, అంటువ్యాధులు సోకిన ప్రాంతాల్లో సైతం వీటి సేవలను
వినియోగిస్తున్నారు. - రోబోలను వివిధ అవసరాల రీత్యా ఏ రూపంలో అయినా రూపొందించవచ్చు. కొన్ని రకాల రోబోలు పూర్తిగా మానవ రూపాన్ని పోలి ఉంటున్నాయి. ఫలితంగా మానవులు చేసే కొన్ని రకాల పనులను అదే రీతిలో చేయగల సౌలభ్యం ఈ యంత్రాలకు చేకూరుతుంది. మానవుడి మాదిరిగానే నడవడం, వస్తువులను పైకి ఎత్తడం, మాట్లాడటం, జ్ఞాపకశక్తి కలిగిన రోబోటిక్ యంత్రాలు ప్రస్తుతం విరివిగా అందుబాటులోకి వస్తున్నాయి.
- ప్రకృతి నుంచి ప్రేరణ పొంది రూపొందించిన పలు రోబోలు తమ సేవలను అందిస్తున్నాయి. వీటిని జీవ-ప్రేరిత రోబోటిక్ యంత్రాలుగా పిలుస్తున్నారు.
- ప్రపంచంలో ప్రస్తుతం రోబోటిక్స్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగంగా ప్రసిద్ధి చెందింది. సాంకేతికాభివృద్ధి ఫలితంగా రోబోలకు చెందిన పరిశోధన, అభివృద్ధి వేగవంతమైనది. దీని
పర్యవసానంగా గృహావసరాలు, వాణిజ్య, మిలిటరీ అవసరాలకు దోహదపడే పలు రకాల రోబోల తయారీ సులభసాధ్యమైంది. - మానవుడు పనిచేయలేని భయానక పరిస్థితుల్లో తమ సేవలను అందించగల రోబోల తయారీ నేడు సాధ్యమైంది. పేలుడు పదార్థాలను నిర్వీర్యం చేయగల, అస్థిరపరిస్థితుల్లో ఉన్న వారిని కాపాడటం, గనుల అన్వేషణలో, సముద్రాల్లో మునిగిన నౌకల అన్వేషణలో సైతం రోబోలను వినియోగిస్తున్నారు. బోధనోపకరణంగా వినియోగించే రోబోలను STEM రోబోలుగా పరిగణిస్తున్నారు. ఈ ఉపకరణాన్ని Science, Technology, Engineering and Mathematics (STEM)ల బోధనలో వినియోగిస్తున్నారు.
- రోబోటా (robota) అనే స్లావిక్ పదం నుంచి రోబోట్ ఏర్పడింది. దీనిక శ్రామికుడు అని అర్థం.
- రోబోటిక్స్ అనే పదం రోబోట్ అనే పదం నుంచి ఉద్భవించింది. ఈ పదాన్ని Karel Eapek (Rossums Universal Robots) అనే నాటకంలో తొలిసారి వినియోగించారు.
- ఈ నాటకం ఒక కర్మాగారంలో ప్రారంభం అవుతుంది. ఈ కర్మాగారంలో కృత్రిమ ప్రజలుగా అభివర్ణించే రోబోలు తయారవుతాయి. ఈ ఆలోచన నేటి ఆధునిక ఆండ్రాయిడ్ రోబోలను పోలి ఉండటం గమనార్హం.
- ఆక్స్ఫర్డ్ ఆంగ్ల డిక్షనరీ ప్రకారం రోబోటిక్స్ అనే పదాన్ని ‘Issac Asimov’ అనే కాల్పనిక సైన్స్ సాహిత్యంలోని ‘Liar’ అనే చిన్న కథలో వినియోగించారు. ఈ కథ 1941 మే నెలలో Astounding Science Fictionలో ప్రచురితమైనది. ఈ రచయిత 1942లో రోబోటిక్స్ నిర్మాణంలో ఉపయోగించే మూడు నియమాలను రూపొందించాడు. ఇవి 1942లో రచించిన ‘RunAround’ అనే లఘు కథానికలో ప్రచురితం అయ్యాయి.
- ఈ మూడు సూత్రాలు Handbook of Robotics 56వ ఎడిషన్, 2058 ADలో ఉటంకించారు.
(ఎ) మొదటి నియమం
రోబోలు మానవులకు హాని చేయకూడదు. ఒకవేళ రోబోల పనితీరు దెబ్బతిన్నా (లేదా) చెడిపోయినా వాటిని మానవుడు తగిన చర్యల ద్వారా నిర్వీర్యం చేయవచ్చు.
(బి) రెండో నియమం
మానవుల వల్ల తనకు అందిన ఉనికిని ఆజ్ఞలను (లేదా) సూచనలను రోబోలు తప్పక పాటించాలి. ఈ క్రమంలో మొదటి నియమాన్ని ఉల్లంఘించరాదు.
(సి) మూడో నియమం
- ప్రతి రోబో తన ఉనికిని తానే కాపాడుకోవాలి. అయితే ఇందుకు మొదటి, రెండు నియమాలను ఉల్లంఘించరాదు.
- 1948లో Norbert Wiener అనే శాస్త్రవేత్త ప్రయోగాత్మక రోబోటిక్స్ నిర్మాణానికి అవసరమైన ప్రాథమిక సూత్రాలను Cybernetics పేరుతో ప్రతిపాదించాడు. అయితే పూర్తిస్థాయిలో స్వయంప్రతిపత్తితో పనిచేయగలిగే రోబోలు 20వ శతాబ్దం రెండో అర్ధభాగంలో మాత్రమే
రూపొందించారు.
రోబోటిక్స్ అనువర్తనాలు - ప్రత్యేక అవసరాల కోసం అధిక సంఖ్యలో రోబోలు రూపొందించబడ్డాయి. ఈ అవసరాల దృష్ట్యా రోబోలను వర్గీకరించారు.
- ఉదాహరణకు Assembly Robots అన్నీ అసెంబ్లింగ్ పనుల కోసం ఉద్దేశించి రూపొందించిన రోబోలు.
- ఇవి సాధారణంగా ఇతర అవసరాల కోసం వినియోగించబడవు. ఇదే కోవలోకి seam welding కోసం welding robots, భారీ బరువున్న వస్తువులుండే పరిశ్రమల్లో వినియోగించడానికి హెవీ డ్యూటీ రోబోలను రూపొందించి వినియోగిస్తున్నారు.
అవసరాల రీత్యా అందుబాటులో ఉన్న వివిధ రోబోలు…
మిలిటరీ రోబోలు
- వివిధ మిలిటరీ అవసరాల కోసం స్వయంప్రతిపత్తి కలిగిన రోబోలతో పాటు రిమోట్ కంట్రోల్డ్ మొబైల్ రోబోలు ప్రస్తుతం అభివృద్ధిచేస్తున్నారు. వీటిని రవాణా, శోధన, కాపాడే కార్యకలాపాల్లో, దాడి చేయడంలోనూ వినియోగిస్తున్నారు.
- Caterpillar Incorporation వారు రిమోట్ ఆధారంగా నియంత్రించే రోబోటిక్ మెషీన్లు రూపొందిస్తున్నారు. 2021 నాటికి పూర్తి స్వయంప్రతిపత్తితో పనిచేసే రోబోల రూపకల్పనలో ఈ సంస్థ ఉంది. ఇప్పటికే రిమోట్ కంట్రోల్డ్ క్రేన్స్ అందుబాటులో ఉన్నాయి.
- 1960 నుంచి తయారీ రంగంలో రోబోల వినియోగం గణనీయంగా పెరిగింది. ఆటోమొబైల్ పరిశ్రమలో సగంకంటే ఎక్కువమంది శ్రామికుల స్థానాన్ని రోబో యంత్రాలు ఆక్రమించాయి. టెక్సాస్‌లోని IBM కీబోర్డ్ తయారీ పరిశ్రమ 100 శాతం స్వయంచాలిత పరిశ్రమగా మారింది.
- OSPI వంటి రోబోలను ఆసుపత్రుల్లో కొరియర్ పనులకు ఉపయోగిస్తున్నారు. అదేవిధంగా రిసెప్షనిష్ట్లు, గైడ్లుగా, పోర్టర్లు, సహాయకులుగా కూడా రోబో యంత్రాలు తమ సేవలను అందిస్తున్నాయి.
- గృహ అవసరాల్లో, హోటళ్లలో వెయిటర్లుగా, వంట మనుషులుగా రోబోలు పనిచేస్తున్నాయి. ఈ కోవలోదే Boris అనే రోబో. ఇది పాత్రలు కడిగే యంత్రంలో కడగవలసిన పాత్రలను వేయగలదు. విషవ్యర్థాలు, అణువ్యర్థాలు విడుదలైన పరిసరాలు, అంటువ్యాధులు ప్రబలిన ప్రాంతాల్లో ఈ రోబో యంత్రాలు అందించే సేవలు ఎంతో అమూల్యమైనవి.
వ్యవసాయ రోబోలు (లేదా) అగ్ రోబోలు
- పండ్ల తోటల్లో డ్రైవర్లు లేని ట్రాక్టర్లు, స్ప్రేయర్లు, గొర్రెల వెంట్రుకలు తొలగించే పనుల్లో మానవుల స్థానాన్ని రోబోటిక్ యంత్రాలు భర్తీ చేస్తున్నాయి.
- ఉద్యానవన తోటల్లో మొక్కల కత్తిరింపు, కలుపు మొక్కలను తొలగించడం, పురుగు మందులను చల్లడం, గమనించడం వంటి పనులను రోబో యంత్రాల సహాయంతో చేస్తున్నారు.
- పశుసంపదకు సంబంధించి LiveStock robotics ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా పశువుల పాలు పితకడం, వాటిని శుభ్రపరచడం వాటి బీజగ్రంథులను తొలగించడం వంటి కార్యకలాపాల్లో రోబోలను వినియోగిస్తున్నారు.
- వ్యవసాయ అనుబంధ పరిశ్రమల్లో రోబోల వినియోగం వల్ల అధిక నాణ్యత, తాజాదనంకల వ్యవసాయోత్పత్తులను తక్కువ ఉత్పాదక వ్యయంతో, తక్కువ మానవ శ్రమతో అందించవచ్చు. ట్రాక్టర్ల వంటి మానవ ప్రమేయంతో నడిచే వాహనాల వినియోగం ప్రమాదకరమైన పరిస్థితుల్లో రోబోల వినియోగం మిక్కిలి ఉపయుక్తమైనది.
గృహ అవసరాల్లో రోబోలు
- Domestic (లేదా) Service robot లు ఇంటి పరిసరాలు శుభ్రపరచడం, పసిపిల్లలు, వయోవృద్ధుల సంరక్షణ చేపట్టేందుకు వినియోగిస్తున్నారు.
- రోబోటిక్ వ్యాక్యూమ్ క్లీనర్లు, ఫ్లోర్-వాషింగ్ రోబోలు గృహాల్లో, పరిసరాలను శుభ్రపరచడం వంటి కార్యక్రమాలను చేపడుతున్నాయి.
- Dressman అనే రోబో వేడిగాలి సహాయంతో చొక్కాలను ఇస్త్రీ చేయగలదు
- Somabar అనేది వంట ఇంటి అవసరాల కోసం ప్రత్యేకించిన కిచెన్ రోబో
- Cat litter Robots ఇవి పెంపుడు పిల్లులకు వినియోగించే లిట్టర్ బాక్స్‌లను స్వయంగా శుభ్రపరుచుకొనే సామర్థ్యం కలిగిన రోబోలు.
మెడికల్ రోబోలు
- వైద్యరంగంలో కొన్ని సందర్భాల్లో వైద్యులకు ప్రత్యామ్నాయంగా వినియోగించే రోబోలు అందుబాటులో ఉన్నాయి. అవి..
సర్జికల్ రోబోలు
- వైద్యుల పర్యవేక్షణలో ఆపరేషన్లు నిర్వహించే రోబోటిక్ యంత్రాలతో పాటు వైద్యుల పర్యవేక్షణ అవసరం లేకుండా స్వయంగా ఆపరేషన్లు నిర్వహించే సామర్థ్యం గల రోబోలు అభివృద్ధి
చేస్తున్నారు.
పునరావాస రోబోలు
- ఈ రకమైన రోబోలు, బలహీనులు, వయోవృద్ధులు (లేదా) శరీర భాగాలు పనిచేయకపోవడం వల్ల కదలలేని వారికి సైతం అవసరమైన సేవలు చేయగలవు.
బయో రోబోలు
- మానవులను, జంతువులను అనుకరిస్తూ రూపొందించిన రోబోలే బయో రోబోలు.
టెలీప్రెసెన్స్ రోబోలు
- దూరప్రాంతాల నుంచి నియంత్రించ గల నియంత్రించే off-site వైద్య నిపుణులుగా పనిచేసే రోబోలనే ‘Telepresence’ రోబోలుగా వ్యవహరిస్తారు. వీటిని Wireless network ద్వారా నియంత్రణ చేస్తూ
వినియోగిస్తారు.
తెలుగు అకాడమీ సౌజన్యంతో
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు