ఆవేశం పెరిగితే.. శక్తి పెరుగుతుంది..!
ఆయనీకరణ శక్తి లేదా ఆయనీకరణ శక్మం
- వాయు స్థితిలోని ఒంటరి తటస్థ పరమాణువు బాహ్య ఆర్బిటాల్ నుంచి ఒక ఎలక్ట్రాన్‌ను తీసివేయడానికి కావలసిన కనీస శక్తిని అయనీకరణ శక్తి లేదా అయనీకరణ శక్మం అంటారు.
- Mg+IE1 M (g)+ + e- (M=పరమాణువు, I1= మొదటి అయనీకరణశక్తి)
- Mg+ (g) + IE2 M+2(g) + e- (M=ఏక మాత్ర ధనావేశిత అయాన్, I2= రెండో అయనీకరణ శక్తి)
ఆయనీకరణ శక్తి ఆధారపడే అంశాలు
1. కేంద్రక ఆవేశం: కేంద్రక ఆవేశం పెరిగితే అయనీకరణ శక్తి పెరుగుతుంది.
ఉదా: సోడియంతో పోలిస్తే క్లోరిన్ అయనీకరణ శక్తి ఎక్కువ.
2. స్క్రీనింగ్ లేదా షీల్డింగ్ ఫలితం: కేంద్రకానికి, వేలన్సీ ఎలక్ట్రాన్లకు మధ్య కక్ష్యల సంఖ్య పెరిగితే అవి తెరలలాగా పనిచేస్తాయి. అందువల్ల వేలన్సీ ఎలక్ట్రాన్లపై కేంద్రక ఆకర్షణను అడ్డుకుంటాయి. దీన్నే స్క్రీనింగ్ లేదా పరివేశక ఫలితం అంటారు.
ఈ ఫలితం పెరిగితే అయనీకరణ శక్తి విలువలు తగ్గుతాయి.
3. ఆర్బిటాళ్ల చొచ్చుకుపోయే సామర్థ్యం: ఒకే ప్రధాన కక్ష్యలో ఉండే ఆర్బిటాళ్లలో కేంద్రంకం వైపునకు చొచ్చుకొనే స్వభావం వేర్వేరుగా ఉంటుంది.
- నాలుగో కక్ష్యలో 4s > 4p > 4d > 4f గా ఉంటుంది. అందువల్ల 4s కంటే 4f నుంచి ఎలక్ట్రాన్‌ను సులభంగా తీసివేయవచ్చు.
- స్థిరమైన ఎలక్ట్రాన్ విన్యాసం: ఏదైనా పరమాణువులో ఆర్బిటాళ్లు పూర్తిగా లేదా సగం నిండితే వాటి
- ఎలక్ట్రాన్ విన్యాసాన్ని స్థిర ఎలక్ట్రాన్ విన్యాసం అంటారు.
- వీటి నుంచి ఎలక్ట్రాన్లను తీసివేయడానికి అధిక శక్తి అవసరం.
- ఆక్సిజన్ : 1s2 2s2 2p4
- నైట్రోజన్: 1s2 2s2 2p3
పరమాణు వ్యాసార్ధం
- ఆక్సిజన్ కంటే నైట్రోజన్ అయనీకరణ శక్తి ఎక్కువ.
- పరమాణు వ్యాసార్థం పెరిగేకొద్దీ అయనీకరణ శక్తి విలువలు తగ్గుతాయి. ఫ్లోరిన్ కంటే అయోడిన్ అయనీకరణ శక్తి తక్కువ.
- గ్రూపుల్లో పైనుంచి కిందికి వస్తే అయనీకరణ శక్తి తగ్గుతుంది.
- పీరియడ్లలో ఎడమ నుంచి కుడికి వెళ్లే కొద్దీ అయనీకరణ శక్తి పెరుగుతుంది.
- అయనీకరణ శక్మం ప్రమాణాలు
KJ/mol or K.J.mol-1
ఎలక్ట్రాన్ ఎఫినిటీ
- ఏదైనా మూలక పరమాణువు వాయుస్థితిలో ఒంటరిగా, తటస్థంగా ఉన్నప్పుడు అది ఒక ఎలక్ట్రాన్‌ను గ్రహిస్తే విడుదలయ్యే శక్తిని ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటారు.
- గ్రూపుల్లో పై నుంచి కిందికి వచ్చేకొద్దీ ఎలక్ట్రాన్ ఎఫినిటీ తగ్గుతుంది.
- పీరియడ్లలో ఎడమ నుంచి కుడికి ఎలక్ట్రాన్ ఎఫినిటీ పెరుగుతుంది.
- హాలోజన్ల ఎలక్ట్రాన్ ఎఫినిటీ విలువలు: Cl > F > Br > I > Al
- చాల్కోజన్ల ఎలక్ట్రాన్ ఎఫినిటీ విలువలు: S > Ge > Te > Po > O
రుణ విద్యుదాత్మకత
- ఎలక్ట్రాన్ ఎఫినిటీ విలువలు రుణాత్మకంగా ఉంటే శక్తి విడుదలవుతుంది. ధనాత్మకంగా ఉంటే శకి గ్రహించబడుతుంది.
- ఒక మూలక పరమాణువు వేరే మూలక పరమాణువుతో బంధంలో ఉన్నప్పుడు ఎలక్ట్రాన్లను తనవైపు ఆకర్షించే ప్రవృత్తిని ఆ మూలకం రుణ విద్యుదాత్మకత అంటారు.
- రుణ విద్యుదాత్మకత = అయనీకరణ శక్తి + ఎలక్ట్రాన్ ఎఫినిటీ/2
- పై సమీకరణాన్ని మిల్లికాన్ ప్రతిపాదించాడు.
- రుణ విద్యుదాత్మకతను కొలవడానికి లైనస్ ఫౌలింగ్, ఫౌలింగ్ స్కేలును తయారు చేశాడు.
- గ్రూపుల్లో పై నుంచి కిందకు వచ్చిన కొద్దీ రుణ విద్యుదాత్మక విలువలు క్రమంగా తగ్గుతాయి.
- పీరియడ్లలో ఎడమ నుంచి కుడికి వచ్చిన కొద్దీ రుణ విద్యుదాత్మకత పెరుగుతుంది.
- అత్యధిక రుణ విద్యుదాత్మకత గల మూలకం- ఫ్లోరిన్
- అత్యల్ప రుణ విద్యుదాత్మకత గల మూలకం – సీసియం
- పదార్థాలు ధనాత్మక అయాన్లుగా మారే స్వభావాన్ని ధన విద్యుదాత్మకత అంటారు.
- లోహాలు ధన విద్యుదాత్మక స్వభావాన్ని, అలోహాలు రుణ విద్యుదాత్మక స్వభావాన్ని కలిగి ఉంటాయి.
- పీరియడ్లలో ఎడమ నుంచి కుడికి పోయేకొద్దీ లోహ స్వభావం తగ్గుతూ, అలోహ స్వభావం క్రమంగా పెరుగుతూ ఉంటుంది.
- గ్రూపుల్లో పైనుంచి కిందిక వచ్చిన కొద్దీ లోహ స్వభావం క్రమంగా పెరుగుతూ, అలోహ స్వభావం క్రమంగా తగ్గుతూ ఉంటుంది.
- మూలకం అనే పదాన్ని ప్రవేశపెట్టిన వారు – రాబర్ట్ బాయిల్
ప్రాక్టీస్ బిట్స్
1. కింది వాటిలో అధిక పరమాణు సైజు కలిగిన మూలకం ఏది?
1) K 2) Ca 3) Mg 4) Na
2. ఏకామాత్ర ధనావేశమున్న అయాను నుంచి ఒక ఎలక్ట్రాన్‌ను తీసివేయడానికి కావలసిన శక్తి?
1) ప్రథమ అయనీకరణ శక్తి
2) రెండో అయనీకరణ శక్తి
3) పరమాణు శక్తి
4) కేంద్రక శక్తి
3. లాంథనైడ్లు, ఆక్టినైడ్లను కలిగి ఉండేది?
1) s-బ్లాక్ 2) p -బ్లాక్
3) d- బ్లాక్ 4) f- బ్లాక్
4. కింది వాటిలో p-బ్లాక్నకు చెందిన మూలకాలు ఏవి?
1) Na, Cs, Ra, Be, Rb
2) Mn, Ti, Fe, Co, Ni
3) Ce, Gd, Dy, Ho, Yb
4) As, Bi, Cl, Br, Sn
5. కింది వాటిలో s-బ్లాక్నకు చెందిన గ్రూపులు ఏవి?
1) IIA, IIIA 2) IA, IIA
3) IIIA నుంచి VIIIA
4) IIIA నుంచి VIIA
6. IA గ్రూపు మూలకాలను ఏమని పిలుస్తారు?
1) హాలోజన్ 2) వాయువులు
3) క్షార లోహాలు 4) జడ వాయువులు
7. పొటాషియం, కాల్షియంలను కలిగి ఉండేవి?
1) s-బ్లాక్ మూలకాలు
2) p-బ్లాక్ మూలకాలు
3) d- బ్లాక్ మూలకాలు
4) f- బ్లాక్ మూలకాలు
8. కింది వాటిలో లాంథనైడ్ శ్రేణి మూలకాలు ఏవి?
1) K నుంచి Kr వరకు
2) Cs నుంచి Lu వరకు
3) Ce నుంచి Lu వరకు
4) Th నుంచి Lr వరకు
9. మెండలీఫ్ ఎకా- సిలికాన్ ఏది?
1) గాలియం 2) జర్మేనియం
3) స్కాండియం 4) బోరాన్
10. మెండలీఫ్ ఆవర్తన పట్టిక ఉపయోగం ఏమిటి?
1) మూలకాలను ఒక వరుసలో అమర్చారు
2) కొత్త మూలకాలను కనుగొనడానికి అవకాశం కల్పించారు
3) పరమాణు భారాలను కొనుగొన్నారు
4) మూలకాల వర్గీకరణ తెలుసుకున్నారు
11. మెండలీఫ్ ఆవర్తన పట్టిక దోషం ఏది?
1) కొత్త మూలకాలను కనుగొనడానికి అవకాశం కల్పించారు
2) కొత్త మూలకాల పరమాణు భారాలు చేశారు
3) ఐసోటోపులకు స్థానం లేదు
4) మూలకాల వర్గీకరణ తెలుసుకున్నారు
12 పరమాణు భారానికి, దాని ధర్మాలకు సంబంధం ఉన్నదని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు?
1) మెండలీఫ్ 2) డాల్టన్
3) మోస్లే 4) డాబర్ నీర్
13. కింది వాటిలో త్రిక సిద్ధాంతం పాటించని మూలకాల సమూహం?
1) లిథియం, సోడియం, పొటాషియం
2) ఆక్సిజన్, ఫ్లోరిన్, క్లోరిన్
3) క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్
4) కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం
14. 1s2, 2s2, 2p6 ఎలక్ట్రాన్ విన్యాసం కలిగిన మూలకం?
1) క్షార లోహం 2) క్షార మృత్తిక లోహం
3) జడ వాయువులు 4) పరివర్తన లోహం
15. ఒకే నిలువు వరుసలోని మూలకాలను కలిగి ఉండేది?
1) ఒకే పరమాణు సంఖ్య
2) ఒకే వేలన్సీ ఎలక్ట్రాన్లు
3) ఒకే ఎలక్ట్రాన్ విన్యాసం
4) ఒకే సమస్థానీయాలు
16. ఆవర్తన పట్టికలో ఒక పీరియడ్‌లో ఒక చివరి నుంచి మరొక చివరికి రుణ విద్యుదాత్మకత, ధన విద్యుదాత్మకతలు వరుసగా
1) రుణ విద్యుదాత్మకత తగ్గుతుంది. ధన విద్యుదాత్మకత పెరుగుతుంది
2) రుణ విద్యుదాత్మకత పెరుగుతుంది. ధన విద్యుదాత్మకత తగ్గుతుంది
3) రుణ విద్యుదాత్మకత తగ్గుతుంది. ధన విద్యుదాత్మకత తగ్గుతుంది
4) రుణ విద్యుదాత్మకత పెరుగుతుంది. ధన విద్యుదాత్మకత పెరుగుతుంది
17. అల్యూమినియం మొదటి అయొనైజేషన్ పొటెన్షియల్ విలువ మెగ్నీషియం కంటే తక్కువ. ఎందువల్ల?
1) అల్యూమినియం అధిక విద్యుదావేశంతో ఉంటుంది
2) అల్యూమినియం పరమాణు పరిమాణం మెగ్నీషియం కంటే పెద్దది
3) అల్యూమినియం పరమాణు పరిమాణం మెగ్నీషియం కంటే తక్కువ
4) అల్యూమినియం p-ఆర్బిటాల్ ఒక ఎలక్ట్రాన్‌ను కలిగి ఉంది
18. ఫ్లోరిన్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ క్లోరిన్ కంటే తక్కువగా ఉండటానికి కారణం?
1) ఫ్లోరిన్ అధిక పరిమాణం
2) ఫ్లోరిన్ అధిక రుణ విద్యుదాత్మకత
3) ఫ్లోరిన్లో 2p ఎలక్ట్రాన్ల మధ్య వికర్షణ అధికంగా ఉంటాయి
4) ఫ్లోరిన్లో అధిక కేంద్రక ఆకర్షణ ఉంటుంది
సమాధానాలు
1. 1 2. 2 3. 4 4. 4 5. 2 6. 3 7. 1 8.3 9. 2 10.2 11.3 12.4
13.2 14.3 15.2 16.2 17.4 18.3 19.2
పీ ఢిల్లీ బాబు
ఏకేఆర్ స్టడీ సర్కిల్, వికారాబాద్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు