1 నుంచి పాలిసెట్ తుది విడత కౌన్సెలింగ్
ఆగస్టు 1 నుంచి పాలిసెట్ తుది విడత కౌన్సెలింగ్ ప్రారంభిస్తామని కన్వీనర్ నవీన్ మిట్టల్ తెలిపారు. 1న స్లాట్ బుకింగ్, 2న ధ్రువపత్రాల పరిశీలన ఉంటుందన్నారు. 1 నుంచి 3 వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. 6న సీట్లు కేటాయిస్తామని, 17 నుంచి తరగతులు ప్రారంభిస్తామని నవీన్ మిట్టల్ వెల్లడించారు.
ఇప్పటివరకు టీఎస్ పాలిసెట్-2022లో తొలివిడత కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తయింది. 79,051 మంది విద్యార్థులు పాలిసెట్‌కు అర్హత సాధించారు. మొత్తం 28,083 సీట్లు ఉండగా తొలివిడతగా 20,695 సీట్లు భర్తీ అయ్యాయి. ఈడబ్ల్యూఎస్ కోటా కింద మరో 393 సీట్లు కేటాయించారు. విద్యార్థులు 31లోపు తమకు కేటాయించిన కాలేజీల్లో ఆన్లైన్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. డిప్లొమా కంప్యూటర్ కోర్సులో చేరేందుకు విద్యార్థులు క్యూ కట్టారు. మొత్తం 4,100 సీట్లు ఉండగా, వందశాతం భర్తీ అయ్యాయి. ఎలక్టానిక్స్ అండ్ కమ్యూనికేషన్‌కు సైతం పోటీ పడ్డారు. 5,235 సీట్లు ఉండగా, 4,909 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించారు. సివిల్ ఇంజినీరింగ్‌లో 4,969 సీట్లుండగా, 3,364 సీట్లు భర్తీ అయ్యాయి.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు