సెల్‌ఫోన్‌ను తయారుచేసిన తొలి కంపెనీ ఏది?
1. కంప్యూటర్ అనేది ఒక ఎలక్ట్రానిక్ యంత్రం. కంప్యూటర్ అనే పదం Computerac అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. ఇది సాఫ్ట్వేర్, హార్డ్వేర్ల కలయిక. కంప్యూటర్లోని భౌతిక భాగాలను హార్డ్‌వేర్, దానిలో ప్రోగ్రాంను సెట్‌చేసే పద్ధతిని సాఫ్ట్వేర్ అంటారు. ఫాదర్ ఆఫ్ కంప్యూటర్ అని ఎవరిని పిలుస్తారు?
1) చార్లెస్ బాబేజ్ 2) అలెన్ ట్యూరింగ్
3) జాన్‌వాన్ న్యూమన్ 4) జేకే ఎక్కర్ట్
2. కంప్యూటర్ తరాలు, వాటి సాంకేతికతలను సరిగా జతపర్చండి.
కంప్యూటర్ తరం – సాంకేతికత
ఎ. మొదటి తరం (1946-1954) 1. వాక్యూమ్ నాళాలు
బి. రెండో తరం (1955-1964) 2. సెమీ కండక్టర్లు
సి. మూడో తరం (1965-1974) 3. IC (ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ విత్ LSI)
డి. నాలుగో తరం (1975-1985) 4. మైక్రో ప్రాసెసర్థ విత్ VLSI
ఇ. ఐదో తరం (1985- ఇప్పటివరకు) 5. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
1) ఎ-2, బి-3, సి-4, డి-5, ఇ-1
2) ఎ-1, బి-2, సి-3, డి-4, ఇ-5
3) ఎ-3, బి-4, సి-5, డి-1, ఇ-2
4) ఎ-4, బి-5, సి-1, డి-2, ఇ-3
3. కింది వాటిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేధస్సు) లక్షణాలు?
ఎ. సిలికాన్ కాకుండా ఇతర మూలకాలతో తయారవడం
బి. ఎక్కువ మెమొరి నిల్వ చేయడం
సి. మానవుని ఆదేశాలకు అనుగుణంగా స్పందించడం
డి. తప్పులు జరిగితే తనకు తానే సరిదిద్దుకోవడం
1) ఎ, బి 2) బి, సి 3) బి, సి, డి 4) పైవన్నీ
4. కింది వాటిలో సరైన అబ్రివేషన్ ఏది?
ఎ. BPS – బిట్స్ పర్ సెకడ్
బి. DBMS – డేటా బేస్ మేనేజ్మెంట్ సిస్టం
సి. EDP – ఎలక్ట్రానిక్ డాటా ప్రాసెసింగ్
డి. MAN – మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్
1) ఎ 2) బి 3) సి 4) పైవన్నీ
5. కింది వాటిలో సరికాని అబ్రివేషన్ ఏది?
ఎ. NOS – నెట్వర్క్ ఆపరేటింగ్ సిస్టం
బి. PAP – పాస్వర్డ్ అథెంటికేషన్ ప్రొటోకాల్
సి. ROM – రీడ్ అవుట్ మెమొరి
డి. VLSI – వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్
1) ఎ 2) బి 3) సి 4) పైవన్నీ
6. మొబైల్ ఫోన్ టెక్నాలజీకి సంబంధించి కింది వాటిలో సరైనవి?
ఎ. సెల్‌ఫోన్‌ను కనుగొన్నది- మార్టిన్ కూపర్ (1973)
బి. మొదట సెల్‌ఫోన్‌ను తయారు చేసిన కంపెనీ- ఎరిక్సన్
సి. దేశంలో మొబైల్సేవలు అందుబాటులోకి వచ్చిన ఏడాది- 1994
డి. దేశంలో అతిపెద్ద టెలికాం ఆపరేటర్- BSNL
ఇ. ప్రపంచంలో అతిపెద్ద సెల్ కంపెనీ- వొడాఫోన్
ఎఫ్. సెల్ టవర్ పరిధి- 26 చదరపు కిలోమీటర్లు
1) ఎ, బి, సి, డి 2) సి, డి, ఇ, ఎఫ్
3) ఎ, బి, ఇ, ఎఫ్ 4) పైవన్నీ
7. కింది వాటిలో ISDN కు సంబంధించి సరైనది?
ఎ. ISDN అంటే ఇంటిగ్రేటెడ్ సర్వీస్ డిజిటల్ నెట్వర్క్
బి. దీన్ని ఉపయోగించి ఇంటర్నెట్ ద్వారా మల్టిపుల్ డాటాను పంపవచ్చు
సి. బ్రాడ్‌బ్యాండ్ ISDN ద్వారా ఇంటర్నెట్ వేగం – 100 kbps
1) ఎ, బి 2) బి, సి 3) ఎ, సి 4) పైవన్నీ
8. దృశ్య తంతువుకు సంబంధించి కింది వాటిలో సరైన వాక్యం?
ఎ. ఇది సిలికా గ్లాసులో తయారుచేయబడ్డ పారదర్శకం
బి. వెంట్రుక కంటే కొంచెం మందంగా ఉంటుంది
సి. దీన్ని ఉపయోగించి హయ్యర్ బ్యాండ్ విడ్త్ వద్ద ఎక్కువ దూరాలకు సమాచారాన్ని పంపవచ్చు
డి. సంపూర్ణాంతర పరావర్తనంపై ఆధారపడి ఉంటుంది
1) ఎ 2) ఎ, బి 3) ఎ, బి, సి 4) పైవన్నీ
9. కింది వాటిలో వాట్సాప్‌కు సంబంధించి సరికానిది?
ఎ. దీని ద్వారా సమాచారాన్ని అక్షరాలు, ఫొటోలు, వీడియోలు, ఆడియోల రూపంలో పంపవచ్చు
బి. దీన్ని స్మార్ట్ ఫోన్లలో మాత్రమే ఉపయోగించవచ్చు
సి. ఇంటర్నెట్ లేకున్నా దీన్ని ఉపయోగించవచ్చు
1) ఎ 2) బి 3) సి 4) ఏదీకాదు
10. కింది వాటిలో మొబైల్ ఆపరేటింగ్ వ్యవస్థలు ఏవి?
ఎ. ఆండ్రాయిడ్ బి. బడా (Bada)
సి. IOS డి. సింబియన్
1) ఎ 2) బి 3) సి 4) పైవన్నీ
11. కింది వాటిలో సరైన వాక్యం ఏది?
ఎ. ఆప్టికల్ కంప్యూటర్.. గణన కోసం దృశ్యకాంతి లేదా పరారుణ కిరణాలను ఉపయోగించుకుంటుంది
బి. ఫోటాన్లు ఎలక్ట్రాన్ల కంటే తక్కువ ఉష్ణాన్ని ఉద్గారిస్తాయి
సి. ఆప్టికల్ కంప్యూటింగ్ విధానాన్ని ఉపయోగించి అధిక వేగంతో పనిచేసే కంప్యూటర్లను తయారు చేయవచ్చు
1) ఎ, బి 2) బి, సి 3) పైవన్నీ 4) ఏదీకాదు
12. కింది వాటిలో ERNET కు సంబంధించి సరికాని వాక్యం?
ఎ. ERNET అంటే ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ నెట్వర్క్
బి. ERNET ఇండియా అనేది భారత మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖలో స్వతంత్ర విభాగం
సి. ERNET ఇండియా.. ఆరోగ్యం, ఉన్నత విద్య, వ్యవసాయం, సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగాలకు సంబంధించిన సుమారు 1300 సంస్థలకు సేవలు అందిస్తున్నది
1) ఎ 2) బి 3) సి 4) పైవన్నీ
జవాబులు
1-1, 2-2, 3-4, 4-4, 5-3, 6-4, 7-1, 8-4, 9-3, 10-4, 11-3, 12-2
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు