‘సాగు’తోనే సకలం సుభిక్షం వ్యవసాయం
అగ్రికల్చర్ అనే ఆంగ్లపదం లాటిన్ భాష నుంచి వచ్చింది. అగ్రి అంటే లాటిన్లో మిట్టి, కల్టివేషన్ అంటే సాగు చేయడం అని అర్థం. దేశంలో వ్యవసాయ పరిశోధనా కేంద్రం ICAR (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఆగ్రికల్చర్ రిసెర్చ్) న్యూఢిల్లీలో ఉంది.
-దేశంలో వ్యవసాయం రుతుపవనాలపై ఆధారపడి ఉంటుంది. అందువల్ల వ్యవసాయాన్ని రుతుపవనాలతో జూదం ఆడటం అంటారు.
-మనదేశంలో వ్యవసాయాన్ని 6 భాగాలుగా విభజించారు.
1) విస్థాపన వ్యవసాయం/పోడు వ్యవసాయం
2) జీవనాధార వ్యవసాయం
3) విస్తృత వ్యవసాయం
4) సాంద్ర వ్యవసాయం
5) తోట వ్యవసాయం
6) మిశ్రమ వ్యవసాయం
జీవానాధార వ్యవసాయం
-రైతు కుటుంబం పూర్తిగా వ్యవసాయంపైనే ఆధారపడి ఉంటుంది.
-ఇది ఒక ప్రాంతంలో స్థిరపడి చేసే వ్యవసాయం.
-ఈ వ్యవసాయం వల్ల లాభం ఉండదు. ప్రచ్ఛన్న నిరుద్యోగానికి దారితీస్తుంది.
-ఈ వ్యవసాయం రుతుపవనాలపై ఆధారపడి ఉంటుంది.
-ఇండియాలో ఈ వ్యవసాయాన్ని రుతుపవనాలతో జూదం అంటారు.
విస్తృత వ్యవసాయం/ఆధునిక వ్యవసాయం
-వ్యవసాయ భూమి ఎక్కువ, జనసాంద్రత తక్కువగా ఉన్నచోట యంత్రాలను ఎక్కువగా ఉపయోగించి చేసే వ్యవసాయాన్ని విస్తృత/ఆధునిక వ్యవసాయం అంటారు.
-ఇండియాలో ఈ వ్యవసాయం లేదు.
ఉదా: రాంచీలు (ఆస్ట్రేలియా)
సాంద్ర వ్యవసాయం
-పురాతన పద్ధతులు ఉపయోగిస్తారు.
-జనసాంద్రత ఎక్కువ, కమతాల పరిమాణం తక్కువ.
-నీటిపారుదల వసతులు తక్కువ, క్రిమిసంహార మందుల వాడకం ఎక్కువ
ఉదా: ఇండియా
తోట వ్యవసాయం (వాణిజ్య వ్యవసాయం)
-దీన్ని బ్రిటీష్‌వారు ప్రవేశపెట్టారు.
-ఈ వ్యవసాయానికి ఎక్కువ పెట్టుబడి, సాంకేతిక పరిజ్ఞానం అవసరం (దిగుబడి నిచ్చే విత్తనాలు)
-సాధారణంగా ఈ వ్యవసాయాన్ని ఎత్తయిన ప్రదేశాల్లో చేస్తారు.
ఉదా: పశ్చిమకనుమలు, ఈశాన్య భారత్
మిశ్రమ వ్యవసాయం
-వ్యవసాయంతోపాటు పశుపోషణ, కోళ్ల పెంపకం, సెరికల్చర్, ఎపికల్చర్ వంటి కార్యక్రమాలు చేపడితే మిశ్రమ వ్యవసాయం అంటారు.
-మిశ్రమ అంటే-పంటలతోపాటు పశువుల పెంపకం.
-ఇంద్రధనస్సు విప్లవంలో మిశ్రమ వ్యవసాయం ఒక భాగం.
దేశంలో పంటకాలాలు-రకాలు
-మనదేశంలో వ్యవసాయం 3 కాలాల్లో జరుపుతున్నారు. ఇవి రుతుపవనాలకు అనుసంధానంగా ఉన్నాయి.
-ఖరీఫ్: జూన్-సెప్టెంబర్/అక్టోబర్
-ఇది ముఖ్యంగా నైరుతి రుతుపవన పంటకాలం
-ముఖ్య పంటలు.. వరి, మొక్కజొన్న, జొన్న, రాగి, సజ్జ, చెరకు, నూనెగింజలు
-రబీ: అక్టోబర్-మార్చి/ఏప్రిల్
-ఇది ముఖ్యంగా ఈశాన్యరుతుపవన పంటకాలం
-గోధుమ, బార్లీ, పప్పు ధాన్యాలు ముఖ్యమైన పంటలు.
-జయాద్: ఏప్రిల్-జూన్
-ఇది వేసవి కాలం పంట
-ముఖ్య పంటలు కూరగాయలు, మక్కజొన్న, పుచ్చకాయలు
-నీటి పారుదల సౌకర్యాలు ఉన్నచోట జయాద్ పంటకాలంలో అన్ని రకాల పంటలు పండించవచ్చు.
పంట రకాలు
-దేశంలో పంటలను 4 రకాలుగా విభజించవచ్చు.
1. ఆహార పంటలు: వరి, గోధుమ, మొక్కజొన్న, సజ్జలు, రాగులు, బార్లీ, పప్పుదినుసులు. ఇవి 2 రకాలు
-ప్రధాన ధాన్యాలు: వరి, గోధుమ, మొక్కజొన్న
-తృణ ధాన్యాలు: జొన్న, సజ్జ, రాగులు, బార్లీ
2. నగదు పంటలు: పొగాకు, పత్తి, జనుము, చెరకు, నూనెగింజల పంటలు (వేరుశనగ, ఆముదం, పొద్దు తిరుగుడు)
3. తోట పంటలు: కాఫీ, తేయాకు, రబ్బరు, కొబ్బరి, సుగంధ ద్రవ్యాలు
4. ఉద్యాన పంటలు: పండ్లు, పూలు, కూరగాయలు
ఆహార పంటలు
-ఆహార పంటలు మనదేశంలో విస్తీర్ణపరంగా 3/4 వంతు, ఉత్పత్తి పరంగా 1/2 వంతు స్థానాన్ని ఆక్రమిస్తున్నాయి.
వరి
-2004ను అంతర్జాతీయ వరి సంవత్సరంగా ప్రకటించారు.
-ఇది ఉష్ణమండల పంట.
-దీని నినాదం రైస్ ఈజ్ లైఫ్.
-వాతావరణ పరిస్థితి (ఉష్ణోగ్రత) 240c-320c,
-వర్షపాతం 150 – 200 సెం.మీ.
-వరి సాగును Hoe culture అంటారు.
-ప్రపంచ వరి ఉత్పత్తిలో.. చైనా మొదటి స్థానంలో ఉండగా, భారత్ రెండో స్థానంలో ఉంది.
-దేశంలో.. పశ్చిమబెంగాల్-1 (16 శాతం), ఉత్తరప్రదేశ్-2, ఆంధప్రదేశ్-3, పంజాబ్-4, బీహార్-5, తమిళనాడు-6వ స్థానాన్ని ఆక్రమిస్తున్నాయి.
-తెలంగాణలో.. కరీంనగర్ మొదటి స్థానంలో (కరీంనగర్‌ను రైస్ బౌల్ ఆఫ్ తెలంగాణ అంటారు), వరంగల్ రెండో (2014-15 ప్రకారం నల్లగొండ) స్థానంలో ఉన్నాయి.
-వరి ఖరీఫ్ కాలంలో ఎక్కువగా పండుతుంది.
-ఈ పంటకు ఒండ్రు నేలలు అనుకూలం.
-దేశంలో వరిని అధికంగా ఉత్పత్తి చేసే జిల్లాలు: కేజీ బేసిన్ జిల్లాలు (ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా), తంజావూరు (తమిళనాడు).
-రైస్ బైల్ ఆఫ్ ఇండియా- కేజీ డెల్టా
-అంతర్జాతీయ వరి పరిశోధానా కేంద్రం- మనీలా (ఫిలిప్పీన్స్)
-అభివృద్ధి చేసిన హైబ్రిడ్ వరి వంగడం- మిరాకల్ రైస్
-జాతీయ వరి పరిశోధనా కేంద్రం- కటక్ (ఒడిశా)
-ఇక్కడ అభివృద్ధి చేసిన హైబ్రిడ్ రకం- తానిశ్రీ
-చైనా అభివృద్ధి చేసిన వరి వంగడం- గోల్డెన్ రైస్ (విటమిన్ -ఏ అధికం)
-నార్వేలోని స్వాల్బర్డ్ విత్తనకేంద్రంలో భారత్ డిపాజిట్ చేసిన వరి వంగడాలు.. ఆర్-36, ఐఆర్-64
-ప్రపంచంలో వరిని ఎక్కువగా ఎగుమతి చేసే దేశాలు-థాయ్‌లాండ్, మయన్మార్.
-వర్షాభావ ప్రాంతాల్లో ఆరుతడుల మీద వరిని సాగుచేయడానికి రూపొందించిన సాంకేతిక విధానం- శ్రీ (ఎస్ఆర్ఐ-సిస్టం ఆఫ్ రైస్ ఇంటెన్సిఫికేషన్)
గోధుమ
-ఇది సమశీతోష్ణ మండల పంట.
-ఉష్ణోగ్రత 150c – 210c, వర్షపాతం 75 -100 సెం.మీ.
-ప్రపంచ గోధుమల ఉత్పత్తిలో.. చైనా మొదటి స్థానంలో ఉండగా, భారత్, అమెరికా తరువాతి స్థానాల్లో ఉన్నాయి.
-దేశంలో.. ఉత్తరప్రదేశ్-1 (34 శాతం), పంజాబ్-2 (19 శాతం), హర్యానా-3, మధ్యప్రదేశ్-4, రాజస్థాన్-5వ స్థానాన్ని ఆక్రమిస్తున్నాయి.
-తెలంగాణలో.. ఆదిలాబాద్ మొదటి స్థానంలో, మెదక్ రెండో స్థానంలో ఉన్నాయి.
-ఇది రబీ కాలపు పంట
-ఈ పంటకు ఒండ్రు, లోమ్ నేలలు అనుకూలం.
-గోధుమ దిగుబడి అధికంగా గల రాష్ట్రం- పంజాబ్
-ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా రాష్ర్టాలను భారతదేశ గోధుమ ధాన్యాగారాలు అంటారు.
-ఉక్రెయిన్ను ప్రపంచ రొట్టెల గంప అంటారు.
-నార్వేలోని స్వాల్బర్డ్ విత్తనకేంద్రంలో డిపాజిట్ చేసిన గోధమ రకాలు రిడ్లీ, లెర్మారోజా, సోనారో-64.
-దేశంలో ఎక్కువగా ఉత్పత్తి అయ్యే గోధుమ రకాలు.. సొనాలికా, కళ్యాణ్ సోనా, షర్బతి
-హరితవిప్లవం (1960) ద్వారా ఎక్కువగా ప్రయోజనం పొందిన పంటలు.. గోధుమ, వరి, జొన్న, మక్కజొన్న.
-తక్కువ ప్రయోజనం పొందిన పంటలు.. పప్పు ధన్యాలు, నూనె గింజలు
-హరిత విప్లవం అనే పదాన్ని మొదటగా వాడిన వ్యక్తి-విలియం గాండ్.
-హరిత విప్లవాన్ని మొదటిసారిగా ప్రపంచంలో వ్యాప్తి చేసిన వ్యక్తి – నార్మన్ బోర్లాంగ్ (మెక్సికో)
-దేశంలో హరితవిప్లవాన్ని అధికంగా వ్యాప్తి చేసిన వ్యక్తి-ఎంఎస్ స్వామినాథన్
జొన్న
-ఇదీ రబీకాలం పంట
-ఈ పంటకు అనుకూలమైన వాతావరణ పరిస్థితులు- 200c-320c ఉష్ణోగ్రత, 30-100 సెం.మీ. వర్షపాతం.
-ప్రపంచ జొన్న ఉత్పత్తిలో భారత్ ప్రథమ స్థానంలో, అమెరికా, చైనా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి.
-దేశంలో జొన్న ఉత్పత్తిలో.. మహారాష్ట్ర (19 శాతం), కర్ణాటక, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లు వరుస స్థానాల్లో ఉన్నాయి.
-రాష్ట్రంలో.. జొన్న ఉత్పత్తిలో మహబూబ్‌నగర్ మొదటిస్థానంలో (2014-15), ఆదిలాబాద్ రెండోస్థానంలో ఉన్నాయి.
-ఈ పంటకు నల్ల జంబాల మృత్తికలు (పొర మాదిరి మృత్తికలు) చాలా అనుకూలం.
-దీనికి పేదల ఆహారం అని పేరు.
మక్కజొన్న
-ప్రపంచ మక్కజొన్న ఉత్పత్తిలో.. అమెరికా, చైనాలు తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి.
-దేశంలో.. తెలంగాణ మొదటి స్థానంలో, కర్ణాటక రెండో స్థానంలో ఉన్నాయి.
-తెలంగాణలో.. మెదక్ (2012-13), నిజామాబాద్‌లు మక్కజొన్నను అత్యధికంగా పండిస్తున్నాయి.
రాగులు
-ఈ పంట ముఖ్యంగా దక్షిణ భారతదేశంలోనే పండుతుంది.
-దీనికి ఫింగర్ మిల్లెట్, బుక్ వీట్ అనే పేర్లున్నాయి.
-ప్రపంచ రాగులు ఉత్పత్తిలో.. ప్రథమస్థానంలో భారత్, రెండో స్థానంలో బ్రెజిల్ ఉన్నాయి.
-దేశంలో.. కర్ణాటక మొదటి స్థానంలో, తమిళనాడు, కేరళ, తెలంగాణ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
-తెలంగాణలో.. మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలు తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి.
విస్థాపన వ్యవసాయం (సంచార వ్యవసాయం)
-ఈ వ్యవసాయంలో అడవుల్లో చెట్లను కాల్చి పంట భూములుగా మార్చుతారు.
-నిర్ధిష్ట కాలం తర్వాత అంటే భూసారం తగ్గిన తర్వాత ఆ భూమిని వదిలి వేరే చోటుకు వెళ్తారు. అంటే వేరే భూమికి మారిపోయే ప్రక్రియను విస్థాపక వ్యవసాయం అంటారు.
-ఈ వ్యవసాయాన్ని దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లతో పిలిస్తారు.
రాష్ట్రం/ప్రాంతం పేరు-మారుపేరు
తెలంగాణ – పోడు
అసోం, ఈశాన్య రాష్ర్టాలు – జూమ్
హిమాలయాలు – ఖిల్
మధ్యప్రదేశ్ – బేవార్, పెండ
జార్ఖండ్ – కురువా, పెండ
కేరళ – పోనమ్
పశ్చిమ కనుమలు – కమ్రి
ఒడిశా – పామిగాబి, బ్రింగా
రాజస్థాన్ – వాత్రా
ప్రపంచస్థాయి పేర్లు – దేశం మారుపేరు
శ్రీలంక – చినా
ఇండోనేషియా – లడంగ్
థాయ్‌లాండ్ – తమారి
వియాత్నాం – రే
బ్రెజిల్ – రోకా
వెనుజులా – కొనుకో
మధ్య అమెరికా – మిల్ఫా
మధ్య ఆఫ్రికా – మసోలి
-2000 సంవత్సరం తర్వాత కేంద్ర ప్రభుత్వం మిశ్రమ వ్యవసాయాన్ని ప్రారంభించింది.
-2014ను యూఎన్ఓ అంతర్జాతీయ కుటుంబ వ్యవసాయ సంవత్సరంగా ప్రకటించింది.
-2016ను యూఎప్ఓ పప్పు దినుసుల సంవత్సరంగా ప్రకటించింది.
Latest Updates
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
Betriviera : dépôts, paiements et gestion de la caisse
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
Corgibet : méthodes, limites et règles de retrait
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు






