ఆ వ్యక్తి సునీల్‌కు ఏమవుతాడు?

1. Q, Rల తండ్రి P. R తల్లి S. T అనే వ్యక్తి తండ్రి P అయితే కిందివాటిలో ఏది కరెక్టు?
1) Q తండ్రి T 2) T తల్లి S
3) S భర్త T 4) T కుమారుడు Q
2. P కుమారుడు T, Q కుమారుడు S. P, Qలు భార్యాభర్తలు. Q కుమార్తె R. అయితే R Tకు ఏమవుతుంది?
1) అత్త 2) సోదరుడు
3) వదిన 4) సోదరి
3. A చెల్లెలు B. B అక్క C. C తండ్రి D. B తల్లి E. అయితే D, Eల మధ్య సంబంధం ఏమిటి?
1) భర్త, భార్య 2) అన్నాచెల్లెలు
3) మామాకోడలు 4) అక్కాతమ్ముడు
ఒక కుటుంబంలో A, B, C, D, E, F అనే ఆరుగురు సభ్యులు ఉన్నారు. వీరిలో A, C పెండ్లి అయిన జంట. C కుమారుడు B. కానీ C, Bకు తల్లి కాదు. C సోదరుడు E. A కూతురు D. B సోదరుడు F.
పై సమాచారం ఆధారంగా 4 నుంచి 10 వరకు గల ప్రశ్నలకు సమాధానాలు రాబట్టండి.
4. E భార్య ఎవరు?
1) A 2) B 3) చెప్పలేం 4) F
5. Dకు E ఏమగును?
1) సోదరుడు 2) చిన్నాన్న
3) చెప్పలేం 4) నాన్న
6. ఈ కుటుంబంలో ఎంతమంది పురుషులు ఉన్నారు?
1) 1 2) 2 3) 3 4) 4
7. Aకు ఎంతమంది పిల్లలు ఉన్నారు?
1) 3 2) 2) 3) 4 4) 1
8. కింది వాటిలో పెళ్లయిన జంట ఏది?
1) A, E 2) D, F
3) A, C 4) A, D
9. ఈ కుటుంబంలో ఎంతమంది స్త్రీలు ఉన్నారు?
1) 1 2) 2 3) 3 4) 4
10. B తల్లి ఎవరు?
1) A 2) D 3) E 4) F
11. A, Bల సోదరుడు C. A తల్లి E. C తండ్రి G. అయితే కింది వాటిలో కరెక్టు కానిది?
1) B సోదరుడు A 2) B తండ్రి C
3) G కుమారుడు C 4) G భార్య E
12. A, Bలు సోదరులు. A పెద్దవాడు. B A తమ్ముడు కాదు. అయితే B Aకు ఏమవుతుంది?
1) చెల్లెలు 2) చిన్నాన్న
3) బావ 4) తమ్ముడు
13. C పిల్లలు A, B. A తల్లి C. C కుమారుడు A. B C కుమార్తె కాదు. అయితే B Aకు ఏమవుతాడు?
1) సోదరి 2) సోదరుడు
3) చెప్పలేం 4) మేనల్లుడు
14. A, Bలు భార్యభర్తలు. X, Yలు సోదరులు. X A కుమారుడు. అయితే B Yకు ఏమవుతుంది?
1) నాన్న 2) సోదరుడు
3) చెప్పలేం 4) సోదరి
15. Y తండ్రి X. Y Z సోదరుడు. కానీ Z X కుమారుడు కాదు. అయితే Z Xకు ఏమవుతుంది?
1) వదిన 2) తల్లి 3) తండ్రి 4) కూతురు
16. రమేష్, సుధాకర్‌ను పరిచయం చేస్తూ.. అతడు నా తండ్రికి తండ్రి మనుమరాలి భర్త అని చెప్పాడు. అయితే సుధాకర్ రమేష్‌కు ఏమవుతాడు?
1) బావ లేదా బామ్మర్తి 2) కుమారుడు
3) సోదరుడు 4) అల్లుడు
17. పరమేష్ ఓ వ్యక్తిని చూపిస్తూ శ్రీలక్ష్మితో అతడి తల్లి నీ తండ్రి ఏకైక కుమార్తె అని చెప్పాడు. అయితే శ్రీలక్ష్మి ఆ వ్యక్తికి ఏమవుతుంది?
1) భార్య 2) చిన్నమ్మ
3) తల్లి 4) చెప్పలేం
18. శ్రీవాణి ఒకచోట నిలుచున్న మహిళను చూపిస్తూ ఆమె నా తల్లి కుమారుని తండ్రికి సోదరి అని చెప్పింది. అయితే ఆ మహిళ శ్రీవాణికి ఏమవుతుంది?
1) తల్లి 2) మేనత్త
3) సోదరి 4) మేనకోడలు
19. సునీల్ ఓ ముసలి వ్యక్తిని చూపిస్తూ అతడి కుమారుడు నా కుమారునికి చిన్నాన్న అని చెప్పాడు. అయితే ఆ వ్యక్తి సునీల్‌కు ఏమవుతాడు?
1) తండ్రి 2) చిన్నాన్న
3) తాత 4) సోదరుడు
20. ఓ వ్యక్తిని తన భర్తకు మీనా పరిచయం చేస్తూ.. అతడి సోదరుని తండ్రి మా తాతకు ఏకైక కుమారుడు అని చెప్పింది. అయితే మీనా ఆ వ్యక్తికి ఏమవుతుంది?
1) తల్లి 2) కుమార్తె
3) సోదరి 4) చిన్నమ్మ
21. ఓ మహిళను చూపిస్తూ కిరణ్ ఆమె నా తల్లి భర్త తల్లికి కుమార్తె అని చెప్పింది. అయితే ఆ మహిళ కిరణ్‌కు ఏమవుతుంది?
1) మనుమరాలు 2) కుమార్తె
3) సోదరి 4) మేనత్త
22. అరుగుమీద కూర్చున్న మహిళను చూపిస్తూ అజయ్ ఆమె నా మామ్మ ఏకైక కుమారుని కుమార్తె అని చెప్పాడు. అయితే అజయ్ ఆ మహిళకు ఏమవుతాడు?
1) తండ్రి 2) సోదరుడు
3) మామ 4) ఏమీకాదు
23. ఓ వ్యక్తి ఓస్త్రీతో మీ తల్లి భర్త సోదరి నాకు మేనత్త అని చెప్పాడు. ఆ స్త్రీ ఆ వ్యక్తికి ఏమవుతుంది?
1) సోదరి 2) చిన్నమ్మ 3) తల్లి 3) కుమార్తె
ఒక కుటుంబంలో P, Q, R, S, T, U అనే సభ్యులు ఉన్నారు. వీరిలో ముగ్గురు పురుషులు, ఇద్దరు వివాహమైనవారు ఉన్నారు. P, Qలకు R తండ్రి. Rకు T తల్లి. Qకు P మనుమరాలు. దీని ఆధారంగా కింది 24 నుంచి 28 వరకు గల ప్రశ్నలకు జవాబులు గుర్తించండి.
24. కింది వారిలో వివాహమైన జంట?
1) TU 2) QS 3) UP 4) TQ
25. Uకు Pతో గల సంబంధం…?
1) తమ్ముడు 2) కుమార్తె
3) చెల్లి 4) కొడుకు
26. T భర్త ఎవరు?
1) R 2) Q 3) P 4) U
27. కిందివారిలో పురుషులు ఎవరు?
1) Q, S, T 2) S, R, U
3) Q, R, U 4) P, U, Q
28. Q, Uలకు గల సంబంధమేమిటి?
1) తాత 2) కుమార్తె
3) తమ్ముడు 4) భర్త
సమాధానాలు
1-2, 2-4, 3-1, 4-3, 5-2, 6-4, 7-1, 8-3, 9-2, 10-1, 11-2, 12-1, 13-2, 14-3, 15-4, 16-1, 17-3, 18-2, 19-1, 20-3, 21-4, 22-2, 23-1, 24-4, 25-1, 26-2, 27-3, 28-1.
RELATED ARTICLES
-
GEOGRAPHY | పర్వతాల ఊయలగా వేటిని పేర్కొంటారు?
-
Telangana History & Culture | 1952 ముల్కీ ఉద్యమం మొదటిసారి ఎక్కడ ప్రారంభమైంది?
-
General Science Physics | సౌర విద్యుత్ ఘటాలను దేనితో తయారు చేస్తారు?
-
Indian Polity | ఉభయ సభల ప్రతిష్టంభన.. ఉమ్మడి సమావేశం
-
Telangana History & Culture | పూర్వపు హైదరాబాద్ సంస్థానంలో ఏ ప్రాంతాలు ఉండేవి?
-
Chemistry | ఒక ద్రావణపు pH విలువ 5 అయితే దాని [OH-] అయాన్ గాఢత?
Latest Updates
Current Affairs | SBI నాలుగో స్టార్టప్ బ్రాంచిని ఎక్కడ ఏర్పాటు చేశారు?
Indian Polity | జాతీయ బాలల పరిరక్షణ కమిషన్ ఎప్పుడు ఏర్పడింది?
Telangana Government Schemes | ప్రజల పాలిట వరాలు.. అభివృద్ధికి ప్రతీకలు
TS EAMCET | టీఎస్ ఎంసెట్ -2023 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
Current Affairs | దేశంలో అతిపెద్ద అక్వేరియం ఏ నగరంలో రానుంది?
MSTC Recruitment | ఎంఎస్టీసీ లిమిటెడ్‌లో 52 మేనేజర్ పోస్టులు
Telangana Current Affairs | షీ భరోసా సైబర్ ల్యాబ్‌ను ఎప్పుడు ఏర్పాటు చేశారు?
SSC CHSL Preparation 2023 | ఉమ్మడిగా చదివితే.. ఉద్యోగం మీదే!
ISRO Recruitment | ఇస్రోలో 303 సైంటిస్ట్ ఇంజినీర్ పోస్టులు
Indian Navy MR Recruitment 2023 | ఇండియన్ నేవీలో 100 అగ్నివీర్ పోస్టులు