విద్యార్థుల సైకాలజీ ఎలా ఉంటుందంటే..? (TET special)
1. రాజు అనే విద్యార్థి కోణాలను బట్టి త్రిభుజాలను అల్పకోణ, లంబకోణ, అధికకోణ త్రిభుజాలుగా వర్గీకరించాడు. ఆ విద్యార్థిలో నెరవేరే లక్ష్యం?
1) జ్ఞానం 2) అవగాహన
3) వినియోగం 4) నైపుణ్యం
2. స్పష్టీకరణలు అనేవి
1) పరివర్తనలు
2)ప్రవర్తనా పరివర్తనలు
3) ప్రవర్తనలో ఆశించే మార్పులు
4) ప్రవర్తనలో మార్పులు రాకపోవడం
3. క్రమభిన్నాల పాఠ్యాంశంలో జ్ఞాన లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ
1) భిన్నంలో లవహారాలు గుర్తించడం
2) భిన్నాలను వర్గీకరించడం
3) భిన్నాల సంకలన ఫలితాలు సరిచూడటం
4) భిన్నాలకు ఉదాహరణ ఇవ్వడం
4. ఇటీవల ఏలూరులో ‘వింత వ్యాధి’ బారిన పడిన బాధితులకు సహాయపడుతూ సేవ చేస్తున్న విద్యార్థి ప్రవర్తన ఏ రంగాన్ని అనుసరిస్తుంది?
1) జ్ఞాన రంగం
2) భావావేశ రంగం
3) మానసిక చలనాత్మక రంగం
4) సృజనాత్మక రంగం
5. కింది వాటిలో వినియోగ లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ
1) ఫలితాలు సరిచూడటం
2) ఫలితాలు అంచనా వేయడం
3) ఫలితాలు తెలపడం
4) ఫలితాలు ఆశించకపోవడం
6. మానసిక చలనాత్మక రంగానికి సంబంధించిన అంశం కానిది
1) సహజీవనం 2) సమన్వయం
3) సునిశితత్వం 4) లాక్షణీకరణం
7. కింది వాటిలో ఏ సందర్భం విద్యార్థి అభిరుచిని సూచిస్తుంది.
1) దేశ రాజధానిలో రైతుల దీక్షకు విద్యార్థి సంఘీభావం తెలుపుతున్నాడు
2) దేశ రాజధానిలో రైతుల దీక్షా విధానాన్ని విద్యార్థి అభినందిస్తున్నాడు
3) దేశ రాజధానిలో రైతుల దీక్షా కార్యక్రమంలో విద్యార్థి ఆసక్తిగా పాల్గొంటున్నాడు
4) దేశంలోని రైతుల పట్ల విద్యార్థి గౌరవభావాన్ని కలిగి ఉన్నాడు
8. గణితం ద్వారా పెంపొందే విలువలు
A. విచక్షణ, సృజనాత్మకత
B. సునిశితత్వం, సరళత
C. ఆత్మవిశ్వాసం, అనైతికత
D. భయాత్మక స్వభావం, ఆందోళన
1) A, C 2) B, D
3) B, A 4) D, C
9. విజ్ఞాన శాస్త్రాన్ని అభ్యసించిన విద్యార్థి నిర్ణీత సమయంలో పనులను పూర్తి చేయడం వంటి లక్షణాలను అలవర్చుకున్నాడు. ఈ చర్య ఏంటి?
1) బౌద్ధిక విలువ 2) క్రమశిక్షణ విలువ
3) నైతిక విలువ 4) సాంస్కృతిక విలువ
10. ఉపాధ్యాయుడు ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గోదావరి నది ఏయే జిల్లాల్లో ప్రవహిస్తుంది? బంగాళాఖాతం తీరంగా గల జిల్లాలు ఏవి? వంటి కృత్యాలు ఇచ్చినప్పుడు వారిలో అభివృద్ధి చేయగల నైపుణ్యం.
1) పటాన్ని గీయడంలో నైపుణ్యం
2) పటాన్ని చదవడంలో నైపుణ్యం
3) పటంలో గుర్తించే నైపుణ్యం
4) పటాన్ని చూపించే నైపుణ్యం
11. విద్యావంతులందరూ మోటారు వాహనాలకు బదులుగా సైకిళ్లు ఉపయోగించడం వల్ల కాలుష్యం గణనీయంగా తగ్గుతుందని ఊహించిన విద్యార్థిలో నెరవేరే లక్ష్యం
1) జ్ఞానం
2) అవగాహన
3) వినియోగం
4) నైపుణ్యం
12. విద్యార్థి పంటను నాశనం చేసే చీడపీడలకు సంబంధించిన సమాచార సేకరణకు వ్యవసాయ క్షేత్రాలను సందర్శించి తెలుసుకోవాలనే ఆసక్తి కనబరచడం ఏ లక్ష్యానికి సంబంధించినది.
1) ప్రతిస్పందన 2) విలువ కట్టడం
3) వ్యవస్థాపనం 4) శీలస్థాపనం
13. ఎ టాక్సానమీ ఫర్ లెర్నింగ్, టీచింగ్ అండ్ అసెస్సింగ్, ఎ రివిజన్ ఆఫ్ బ్లూమ్స్ టాక్సానమీ గ్రంథాల రచయితలు ఎవరు?
1) సింప్సన్, ధవే
2) క్రాత్హాల్, అండర్సన్
3) బ్లూమ్స్, ధవే
4) బైనింగ్, బైనింగ్
14. రాజు అనే విద్యార్థి ‘సంఖ్యలను ఆరోహణ, అవరోహణ క్రమంలో రాయడాన్ని జ్ఞప్తికి తెచ్చుకున్నాడు’ అయితే ఆ విద్యార్థిలో సాధించే లక్ష్యం?
1) జ్ఞానం
2) అవగాహన
3) వినియోగం
4) నైపుణ్యం
15. బి అనే విద్యార్థి జనాభా లెక్కల పట్టికను వ్యాఖ్యానించాడు. ఆర్ అనే విద్యార్థి సూర్యగ్రహణం, చంద్ర గ్రహణం గురించి వ్యాఖ్యానించాడు. ఆ విద్యార్థులు సాధించే లక్ష్యాలు వరుసగా..
1) బి జ్ఞానం, ఆర్ అవగాహన
2) బి అవగాహన, ఆర్ వినియోగం
3) బి వినియోగం, ఆర్ నైపుణ్యం
4) బి అవగాహన, ఆర్ అవగాహన
16. పరికరాలను ఉపయోగించి గాలికి బరువుందని నిరూపించే విధానాన్ని ప్రదర్శిస్తున్న విద్యార్థి మానసిక చలనాత్మక రంగంలో ఈ దశకు చెంది ఉంటాడు?
1) అనుకరణ 2) హస్తలాఘనం
3) సునిశితత్వం 4) సహజీకరణం
17. ఉపాధ్యాయుడి వల్ల ప్రేరణ పొందిన విద్యార్థి తన రాష్ట్రంలోని చారిత్రక కట్టడాల విషయాన్ని సేకరించి పాఠశాల బులిటెన్ బోర్డుపై ప్రదర్శించాడు. ఈ వాక్యం ఏంటి?
1) గమ్యం 2) ఉద్దేశం
3) లక్ష్యం 4) స్పష్టీకరణ
సమాధానాలు
1.2 2.2 3.1 4.2 5.3 6.4 7.3 8. 3 9.2 10.2 11.3 12.1
13.2 14.1 15.2 16.2 17.4
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు