ప్రతిసృష్టి రూపం.. డాలీ
ఆధునిక ప్రపంచంలో జీవ సాంకేతికత దినదినాభివృద్ధి చెందుతుంది. దానికనుగుణంగా జీవశాస్త్రంలో అనేక నూతన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. జీవసాంకేతికతను ఉపయోగించుకొని మానవ అవసరాలను తీర్చగలిగే పదార్థాలు, జీవులను సృష్టిస్తున్నారు. పోటీ పరీక్షల్లో జీవ సాంకేతికత, దానిలో వచ్చే మార్పుల గురించి ప్రశ్నలు అడగటం తప్పనిసరి అయింది. ఈ నేపథ్యంలో కిణ్వప్రక్రియ, క్లోనింగ్ తదితర విషయాల గురించి తెలుసుకుందాం…
జీవ సాంకేతికత
జీవరాశుల వినియోగం ద్వారా మానవాళి అవసరాలను తీర్చగలిగే పదార్థాలను ఉత్పత్తి చేసే పరిజ్ఞానాన్ని జీవ సాంకేతిక పరిజ్ఞానం అంటారు.
ఈ పద్ధతి ద్వారా హార్మోనులు, ఎంజైములు, టీకాలు మొదలైన వాటిని ఉత్పత్తి చేయవచ్చు
జీవ సాంకేతికత అనే పదాన్ని తొలుత 1919లో కార్ల్ ఎరికే అనే హంగేరి శాస్త్రవేత్త ప్రతిపాదించారు.
- కిణ్వ ప్రక్రియ
- క్లోనింగ్
- కృత్రిమ ఫలదీకరణం
- కణజాల వర్ధనం (టిష్యూ కల్చర్)
- బయో రెమిడియేషన్
- బయో లీచింగ్
- జన్యు రూపాంతర మొక్కలు
- జన్యు రూపాంతర జంతువులు
- మూలకణ సాంకేతికత (స్టెమ్‌సెల్ టెక్నాలజీ)
కిణ్వ ప్రక్రియ
- సూక్ష్మజీవులు జరిపే జీవక్రియల ద్వారా మానవాళికి అవసరమయ్యే వివిధ పదార్థాలను తయారు చేసే ప్రక్రియనే కిణ్వ ప్రక్రియ అంటారు.
- దీని ద్వారా చక్కెరలను కర్బన ఆమ్లాలు, గ్యాస్, విటమిన్లు, యాంటీ బయాటిక్స్, ఆల్కహాల్‌గా మార్చవచ్చు.
- వాయు (ఆక్సిజన్) రహిత, వాయు సహిత పరిస్థితుల్లో ఈస్ట్, ఈ-కోలీ వంటి బ్యాక్టీరియాలు కిణ్వ ప్రక్రియలో పాల్గొంటాయి. మానవాళికి అవసరమైన సూక్ష్మజీవులను అధిక మొత్తంలో రూపొందించడమే కాకుండా మానవాళికి ఆహారం వంటి ఉపయోగకరమైన పదార్థాల ఉత్పత్తికి కారణమవుతాయి.
- కిణ్వ ప్రక్రియ జరగడానికి సూక్ష్మజీవులే కారణమని 1850-60లలో లూయీపాశ్చర్ వివరించారు.
- తరువాతి కాలంలో ఈస్ట్ వంటి సూక్ష్మజీవులు ఉత్పత్తి చేసే ఎంజైమ్‌ల ద్వారా కూడా కిణ్వప్రక్రియ జరుగుతుందని బుచ్నర్ అనే శాస్త్రవేత్త వెల్లడించారు.
- ప్రస్తుతం కిణ్వ ప్రక్రియకు r-DNA టెక్నాలజీని జోడించి ఇన్సులిన్, వృద్ధి హార్మోన్లు, ఇంటర్ఫెరాన్, రక్తస్కందన కారకాలను ఉత్పత్తి చేస్తున్నారు.
క్లోనింగ్
- క్లోనింగ్ అనే పదం గ్రీకు భాష నుంచి వచ్చింది. గ్రీకు భాషలో ఈ పదానికి అర్థం ‘రెమ్మ’.
- క్లోనింగ్ అనే పదాన్ని మొదట జేబీఎస్ హాల్డేన్ కనుగొన్నాడు.
- ఈ విధానంలో ఒకే విధమైన జన్యుక్రమం కలిగిన కణాలను గాని, డీఎన్ఏ భాగాలను గాని లేదా పూర్తి డీఎన్ఏను అధిక మొత్తంలో ఉత్పత్తి చేయవచ్చు.
- దీంతో మానవాళికి అవసరమైన బ్యాక్టీరియా, మొక్కలు, కీటకాల వంటివాటిని అలైంగిక విధానాల ద్వారా కృత్రిమంగా ఉత్పత్తి చేయవచ్చు.
క్లోనింగ్ ప్రక్రియలోని దశలు
1. ప్రాగ్మెంటేషన్ 2. లైగేషన్
3. ట్రాన్స్‌ఫెక్షన్ 4. స్క్రీనింగ్
క్లోనింగ్ ప్రక్రియలోని రకాలు
1. సెల్ క్లోనింగ్: ఒకే కణం నుంచి సామాన్య జన్యుక్రమం కలిగిన అనేక కణాలను రూపొందించవచ్చు.
2. మాలిక్యులార్ క్లోనింగ్: పూర్తి డీఎన్ఏను కానీ డీఎన్ఏ విడిభాగాలను కానీ అధిక మొత్తంలో ఉత్పత్తి చేయవచ్చు.
3. రీప్రొడక్టివ్ క్లోనింగ్: సమరూప కవలల పుట్టుకను రీప్రొడక్టివ్ క్లోనింగ్ అంటారు.
4. థెరాప్యుటిక్ క్లోనింగ్: క్లోనింగ్ ద్వారా అభివృద్ధి చేసిన మూలకణాలను పలు రోగాలను నయం చేయడంలో ఉపయోగించే ప్రక్రియ.
5. ఆర్గానిజం క్లోనింగ్: జీవులను క్లోనింగ్ చేసే ప్రక్రియ.
6. పార్థెనోజెనెసిస్: పురుషజీవి ప్రమేయం లేకుండా కొన్ని రకాలైన కీటక జాతులు (ఉదా: క్రస్టేషియన్స్, నెమటోడ్స్) తమ జనాభాను అభివృద్ధి చేసుకునే విధానం.
- క్లోనింగ్ చరిత్రలో మొదట ప్రతిసృష్టి చేసిన క్షీరదం ‘డాలీ’ అనే గొర్రెపిల్ల.
- దీన్ని సొమాటిక్ సెల్ న్యూక్లియర్ ట్రాన్స్ఫర్ విధానంలో సర్ ఇయాన్ విల్మట్, కీత్ క్యాంప్ బెల్ సృష్టించారు.
- ఫాదర్ ఆఫ్ క్లోనింగ్ అని ఇయాన్ విల్మట్ను పేర్కొంటారు.
క్లోనింగ్ జీవి – జాతి
కార్ప్ – చేప
మాషా – ఎలుక
మెగాన్, మొరాగ్ – గొర్రెపిల్ల
డాలీ – గొర్రెపిల్ల
టెట్రా – కోతి
గౌర్ – ఇండియన్ బైసన్
కాపీ క్యాట్, లిటిల్ నిక్కీ – పిల్లి
రాల్ఫ్ – చుంచెలుక
స్వప్ని – కుక్క
ఇదా హోజెమ్ – కంచర గాడిద
ప్రొమిటియా – గుర్రం
సంరూప – గేదె
ఫైరీనియన్ ఐబెక్స్ – కొండ గొర్రె
ఇంజాజ్ – ఒంటె
సూరి – పాశ్మినా జాతి మేక
కిణ్వ ప్రక్రియలో వెలువడే ఉత్పన్నం – వినియోగించే సూక్ష్మజీవి
సిట్రిక్ ఆమ్లం – ఆస్పర్జిల్లస్ నైగర్
ఎసిటోన్, బ్యూటనాల్ – క్లాస్ట్రీడియం ఎసిటోబ్యూటిలికం
లాక్టిక్ ఆమ్లం – రైజోపస్ మ్యూకార్ లక్టోబాసిల్లస్
ఫార్మిక్ ఆమ్లం – రైజోపస్ మ్యూకార్
పెన్సిలిన్ – పెన్సీలియం క్రైసోజినం
రైబోఫ్లేవిన్ – ఆష్బియా గాసిపి
ఎరిత్రోమైసిన్ – స్ట్రైప్టోమైసిన్ ఎరిత్రియాన్
గ్లూటామిక్ ఆమ్లం – బ్రెవీ బ్యాక్టీరియం ఫ్లావం
ఇథనాల్ – సారోమైసిన్ సెర్వీసియే
టెట్రాసైక్లిన్ – స్ట్రెప్టోమైసిన్ రియోనస్
విటమిన్ బీ 12 – సూడోమోనాస్ డీనైట్రిఫికన్స్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు